Hin

15th march soul sustenance telugu

బ్రహ్మకుమారీస్ సంస్థలో బోధించే జ్ఞానము ఎవరు ఇస్తున్నారు? (భాగం 3)

గత రెండు రోజుల నుండి మనం, బ్రహ్మకుమారీస్  సంస్థలో బోధించే జ్ఞానానికి మూలాధారుడు భగవంతుడు, పరమాత్మయే గానీ మానవాత్మ కాదు అని తెలుసుకున్నాము. తర్వాత వచ్చే ప్రశ్న, పరమాత్మ చెప్పే సత్యాలను విశ్వసిస్తూ ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న నమ్మకాలను ఎందుకు పక్కన పెట్టాలి? ఆత్మ, పరమాత్మ, సృష్టి నాటక రంగం, దాని వ్యవధి,సృష్టి ఆరంభము, గతంలో ఏదైనా లభిస్తే దాని వయస్సు ఎంత అనేవి కొన్ని అంశాలు. ఈ నమ్మకాలు భగవంతుడు చెప్పే వాటికి ఎందుకు భిన్నంగా ఉన్నాయి? రండి, అర్థం చేసుకుందాం –

  1. ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికీ ఆధ్యాత్మిక అంశాల పట్ల 100% ఖచ్చితమైన అవగాహన ఉండదు. ఇందుకు కారణం సృష్టి నియమం – ఈ శరీరమనే భౌతిక వస్త్రాన్ని ఆత్మ విడిచి కొత్త జన్మ తీసుకున్నప్పుడు ఆ ఆత్మకు గత జన్మ గుర్తుండదు, గత జన్మలోని అంశాలూ గుర్తుండవు. కేవలం పరమాత్మ మాత్రమే జననమరణాలలోకి రారు, ఆత్మల ప్రపంచం నుండి పరమాత్మ ఈ సృష్టిని చూస్తూ ఉంటారు. పరమాత్మకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యములు తెలుసు. కాలము చక్రాకారము అని, సృష్టి నాటకము పునరావృత్తము అవుతుంది అని పరమాత్మకు మాత్రమే తెలుసు. సృష్టిలో అనేకమంది కాల సిద్ధాంతం గురించి అనేక రకాలుగా వివరించి ఉన్నారు, అన్నిటికన్నా ప్రాచుర్యం పొందినది రేఖా సమయ సిద్ధాంతము. కాలము చక్రము వంటిదని, అది రిపీట్ అవుతూ ఉంటుందని, ఆదిమధ్యాంత రహితమని కాలచక్ర సిద్ధాంతం చెప్తుంది అంటే సమయము ఒక క్షణం నుండి మరో క్షణానికి శాశ్వతంగా ప్రయాణిస్తూ ఉంటుంది అని అర్థం.  మరో ప్రక్క, రేఖా సమయ సిద్ధాంతము ప్రకారంగా చూస్తే, కాలము సరళ రేఖ వంటిదని, ఆది అంతములు ఉంటాయని చెప్తుంది. అయితే పరమాత్మ మనకు కాలము చక్రము వంటిదని స్పష్టంగా తెలియజేసారు. ఈ సృష్టి పవిత్ర దశ నుండి అపవిత్ర దశకు ఎలా మారుతుంది, సుఖశాంతులు నిండిన దశ నుండి అంటే పగలు(స్వర్గము) నుండి అపవిత్రత, అశాంతి, దుఃఖము నిండిన రాత్రి (నరకము)గా ఎలా మారుతుంది అని వివరించారు. సృష్టికే రాత్రి అయిన ఈ సమయాన్ని పరమాత్మ పగలులోకి ఎలా మారుస్తారో, అజ్ఞాన చీకటిని జ్ఞాన వెలుగులోకి ఎలా తీసుకువస్తారో పరమాత్మయే వివరిస్తారు. వారిచ్చే జ్ఞానముతో ఈ పరివర్తన సంభివిస్తుంది. ఈ స్వర్గ నరకములు మళ్ళీ రిపీట్ అవుతాయి, ప్రతిరోజూ రాత్రి పగలు వచ్చినట్లుగా సృష్టిలో కూడా పగలు (స్వర్గము) మరియు రాత్రి (నరకము) రిపీట్ అవుతూ ఉంటాయి. ఈరోజు ప్రపంచం నమ్మే రేఖా సమయ సిద్ధాంతానికి కాలచక్ర సిద్ధాంతానికి తేడా ఉంది. భగవంతుడు వివరించేదే సత్యమైన జ్ఞానము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

13th july 2024 soul sustenance telugu

ఆకర్షణ సిద్ధాంతం (లా ఆఫ్ అట్రాక్షన్) – మనమేమిటో మనం అదే పొందుతాము

కుటుంబం లేదా స్నేహితుల నుండి అంగీకారం పొందడానికి చాలా కష్టపడి ప్రయత్నించినప్పటికీ, ప్రేమ మరియు ఆప్యాయతను అందని కొంతమంది వ్యక్తులను (లేదా మనల్ని కూడా) మనం చూస్తూ ఉంటాము. వారు అందరినీ చూసుకుంటారు కానీ

Read More »
10th july 2024 soul sustenance telugu

భగవంతుడు ప్రపంచాన్ని ఎలా శుద్ధి చేస్తాడు? (పార్ట్ 2)

భగవంతుడు మార్పులకు అతీతుడు. వారు స్వచ్ఛత, గుణాలు మరియు శక్తులలో స్థిరమైన వారు. భగవంతుడు తన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వెల్లడించినట్లుగా, భూమిపై 5000 సంవత్సరాల ప్రపంచ నాటకం నాలుగు సమాన దశలగా నడుస్తుంది

Read More »
9th july 2024 soul sustenance telugu

భగవంతుడు ప్రపంచాన్ని ఎలా శుద్ధి చేస్తాడు? (పార్ట్ 1)

800 కోట్లమంది, ఎన్నో రకాల జీవ జంతువులు ఉన్న ప్రపంచంలో మనం నివసిస్తున్నాము. అలాగే, ఈ ప్రపంచం పంచ తత్వాలతో రూపొందించబడింది – భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. భగవంతుడు చెప్పినట్లుగా, 

Read More »