Soul sustenance 17th january telugu

భగవంతుడు ప్రపంచాన్ని పావనంగా ఎలా చేస్తాడు (భాగం - 1) ?

మనం 8 బిలియన్ల మనుష్యులు, పెద్ద సంఖ్యలో వివిధ జాతుల జంతువులు, పక్షులు మరియు ఇతర జీవులు ప్రపంచంలో నివసిస్తున్నాము. అలాగే, ప్రపంచం పంచతత్త్వాలు అనగా – భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశంతో తయారు చేయబడినధి . భగవంతుడు చెప్పినట్లుగా ఈ వరల్డ్ డ్రామా యొక్క నియమం ఏమిటంటే ఈ సృష్టి చక్రం, మానవులతో సహా ప్రపంచంలోని అన్ని జాతుల ఆత్మలు మరియు ప్రకృతి శాశ్వతమైనవి. ఈ మూడింటితో కూడిన 5000 సంవత్సరాల అనంతమైన నాటకం భూమిపై మళ్లీ మళ్లీ పునరావృతం అవుతుంది. ఈ సృష్టి నాటకంలో ఆత్మలు అనేక జన్మలలో తమ తమ పాత్రలను కలిగి ఉంటారు . ఈ సృష్టి నాటకం రిపీట్ అయినప్పుడల్లా వారు అవే పాత్రలను మళ్లీ మళ్లీ పోషిస్తారు. సృష్టి నాటకం ప్రారంభంలో, ఆత్మలందరూ పవిత్రమైన వారు. వారు జన్మలు తీసుకుంటూ అపవిత్రం అవుతారు. తిరిగి ప్రపంచ నాటకం ముగింపులో భగవంతుని సహాయంతో మళ్లీ పవిత్రంగా మారతారు.

భగవంతుడు సర్వశక్తివంతుడు. ఈ ప్రపంచ నాటకంలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన శక్తి భగవంతుడిది . మానవ ఆత్మల ఆధ్యాత్మిక శక్తి రెండవ అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైనది. ఆ తరువాత వివిధ జాతుల, ఇతర జీవుల ఆత్మల శక్తి. ఇది ఒక క్రమం లాంటిది – భగవంతుడు క్రమంలో అగ్రస్థానంలో ఉన్నాడు, భగవంతుని క్రింద మానవ ఆత్మలు ఉన్నారు , మానవ ఆత్మల క్రింద అనేక విభిన్న జీవుల యొక్క ఆత్మలు. ఈ క్రమంలో దిగువన పంచతత్త్వాలు. పంచతత్త్వాలు అనగా మొక్కలు, చెట్లు,భూమి, సముద్రాలు, నదులు, పర్వతాలు మొదలైనవి ఉన్నాయి, ఇవి ఆత్మలు కలిగి ఉండవు.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

కృతజ్ఞతా డైరీ రాయడం

5th Jun – జీవన విలువలు

కృతజ్ఞతా డైరీ రాయడం మనందరం మన జీవితంలో చాలా విజయాలతో ఆశీర్వదించబడ్డాము. ఈ విజయాలను కలిగి ఉన్నందుకు మనం సంతోషంగా ఉన్నాము. విశ్వం మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులతో వారు మనల్ని ఆశీర్వదించినందుకు

Read More »
నిర్భయంగా మారడానికి 5 మార్గాలు

4th Jun – జీవన విలువలు

నిర్భయంగా మారడానికి 5 మార్గాలు ఆత్మగౌరవం యొక్క శక్తివంతమైన స్థితిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించడానికి మొదటి మరియు అతి ముఖ్యమైన మార్గం మన ఆత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. జ్ఞానం, గుణాలు,

Read More »
మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

3rd Jun – జీవన విలువలు

మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి జీవితంలో, మనం నియంత్రించగలిగేవి కొన్ని ఉంటాయి మరియు నియంత్రించలేనివి కొన్ని ఉంటాయి. అయినప్పటికీ, మన జీవితం ఎలా సాగాలి అనే దాని గురించి మనము అంచనాలను

Read More »