19th jan soul sustenance - telugu

భగవంతుడు ప్రపంచాన్ని ఎలా పవిత్రం చేస్తాడు (పార్ట్ 3)?

మనం నిన్నటి సందేశంలో చర్చించినట్లుగా, ప్రపంచంలోని అన్ని ఆత్మలు రాగియుగం మరియు ఇనుపయుగంలో అనేక నెగెటివ్ మరియు అపవిత్రమైన కర్మలను చేస్తారు . ఫలితంగా, సృష్టి నాటకం యొక్క ఈ చివరి రెండు దశలలో ప్రపంచంలోని ప్రతి ఆత్మ నెగెటివ్ మరియు అపవిత్రమైన సంస్కారాలతో నిండి ఉంటారు. అలాగే, పరంధామం అనగా ఆత్మల ప్రపంచం అన్ని మానవ ఆత్మలకు నిజమైన ఇల్లు, వారు ఈ భౌతిక ప్రపంచంలోకి వివిధ జన్మలలో వివిధ భౌతిక శరీరాల ద్వారా తమ పాత్రలను పోషించడానికి ఆ పరంధామం నుండే వచ్చారు. మానవ ఆత్మలందరూ ఆత్మల ప్రపంచమైన పరంధామంలో ఉన్నప్పుడు, మరియు ఈ స్థూల ప్రపంచంలో తమ పాత్రలను ప్రారంభించిన క్రొత్తలో పూర్తిగా పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు, ఇనుప యుగం ముగింపులో, మానవ ఆత్మలందరూ తమను తాము పూర్తిగా శుద్ధి చేసుకొని తిరిగి ఆత్మల ప్రపంచమైన పరంధామానికి తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. పరంధామానికి వెళ్ళేందుకు రెండు మార్గాల ఉన్నాయి. అవి -1. భగవంతునితో కనెక్ట్ అవడం ద్వారా మరియు నిన్నటి సందేశంలో చర్చించబడిన నాలుగు అంశాలు – ఆధ్యాత్మిక జ్ఞానం, మెడిటేషన్, దైవిక గుణాలను నింపుకోవడం మరియు ఆత్మిక సేవ. 2. పూర్వ జన్మలలో చేసిన చెడు కర్మల ఫలంగా ఈ రోజుల్లో ఏవైతే అనారోగ్యాలు, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, ఆర్థిక సమస్యలు, సంబంధాలలో విభేదాలు, దేశాల మధ్య వైరాలు వంటి ప్రతికూల పరిస్థితులు మరియు వాటి ప్రభావాలను ఈ జీవితంలో అనుభవిస్తూ ఆ పూర్వ కర్మల లెక్కలను క్లియర్ చేసుకోవడం అనేది రెండవ పద్ధతి.

ఈ పరివర్తన ప్రక్రియ జరిగిన తర్వాత, ప్రపంచంలోని మానవ ఆత్మలందరూ తిరిగి ఆత్మల ప్రపంచమైన పరంధామం తిరిగి వెళ్ళే సమయం వస్తుంది. అలాగే, ఇతర జీవ రాశుల ఆత్మలు వివిధ రకాల ప్రతికూల పరిస్థితుల ద్వారా శుద్ధి అవుతాయి . వారు మానవ ఆత్మల పవిత్రమైన ప్రకంపనల ద్వారా కూడా ప్రభావితమవుతారు. వారు భగవంతుడునితో కనెక్ట్ కాలేరు లేదా అతని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. కనుక మానవ ఆత్మలు మరియు ఇతర జీవరాశుల ఆత్మల శుద్ధీకరణ ఫలితంగా, పంచ తత్త్వాలు శుద్ధి చేయబడతాయి. ఈ విధంగా మానవ ఆత్మలు పరంధామం నుండి ఈ ప్రపంచానికి తిరిగి వచ్చిన తరువాత, మిగిలిన వారు అక్కడ కొంత కాలం శాంతిలో ఉంటారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత, వారి పవిత్రతను బట్టి వారు తమ పాత్రలను పోషించడానికి ఆ ఆ వేర్వేరు సమయాల్లో భూమిపైకి వస్తారు. పవిత్రమైన ఆత్మలు ముందుగా భూమిపైకి వస్తాయి. పవిత్రమైన రెండు దశలు అనగా సత్య,త్రేతా యుగాలు భూమిపై మళ్లీ జరుగుతాయి మరియు అపవిత్రత మరియు నెగెటివ్ ప్రకంపనలు యొక్క రెండు దశలు అనగా ద్వాపర,కలి యుగాలు కూడా మరోసారి జరుగుతాయి. 5000 సంవత్సరాల ప్రపంచ నాటకం ఈ విధంగా పునరావృతమవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో, భగవంతుడు శాశ్వతమైన వారు. వారు ఎల్లప్పుడూ ఆత్మికంగా , గుణాలు , శక్తులలో నిండుగా ఉంటారు. సృష్టి అపవిత్రంగా మారినపుడల్లా పవిత్రము చేస్తారు . ఈ పరివర్తన ప్రక్రియ కూడా సృష్టిచక్రము వలె శాశ్వతమైనది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

1st april soul sustenance telugu

1st Apr- జీవన విలువలు

సుప్రీమ్ స్టార్ మనపై ప్రకాశిస్తున్నారు (పార్ట్ 1) జీవితం ఒక అందమైన ప్రయాణం, దీనిలో మనం ఎల్లప్పుడూ ఎందరో వ్యక్తుల చుట్టూ ఉంటాము.  మనం ఇతరులకు,  మనకు మంచి విషయాలను కోరుకుంటున్నాము. కొన్నిసార్లు, అందరి

Read More »
31st march soul sustenance telugu

31st March – జీవన విలువలు

ఇతర వ్యక్తుల స్క్రిప్ట్‌ను వ్రాయడం అనే నెగెటివ్ అలవాటు ఈ జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలు పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్‌ను వ్రాసి అమలు చేయమని కోరుతుంది. కానీ,

Read More »
30th march

30th March – జీవన విలువలు

సోషల్ మీడియాలో గాసిప్‌ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి వ్యక్తుల ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను గురించి  నెగెటివ్ గా మాట్లాడకూడదని మనం ఆచరించినట్లే, ఇప్పుడు మనం

Read More »