20th feb soul sustenance telugu

వ్యవస్థిత జీవనశైలిని అవలంబించడం

మనలో ప్రతి ఒక్కరూ ఒక పద్ధతైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాము.స్వచ్ఛత , క్రమబద్ధత మన ఆసలైన సంస్కారాలు. కనుక మన ఇల్లు, ఆఫీసు, వర్క్-డెస్క్, మన కంప్యూటర్ లేదా ఫోన్‌లోని ఫైల్‌లు, మన అల్మారా, తోట మొదలైనవన్నీ – మన చుట్టూ ఉన్న ప్రతిదీ చక్కగా ఉండాలని మనం కోరుకుంటాము. కొందరు శుభ్రపరిచే షెడ్యూల్‌ను నిర్దిష్టంగా పెట్టుకుంటారు. అలా కాకున్నా మనం చుట్టూ, అస్తవ్యస్తంగా పడి ఉన్న వస్తువులను చూసినప్పుడు, వాటిని వెంటనే క్రమంలో ఉంచడానికి ఇష్టపడతాము. కానీ మనం ఎంత తరచుగా లోపలికి చూసుకొని మన ఆంతరిక చెత్తను తొలగిస్తున్నాము? మనం ఉపయోగించాలనుకుంటున్న ఆలోచన లేదా ఎమోషన్ ను వెంటనే ఉపయోగించే విధంగా చివరిగా ఎప్పుడు తయారు చేసుకున్నాము?మన మనస్సు సరైన మరియు తప్పు ఆలోచనల యొక్క పెద్ద స్టోర్ హౌస్ . కొన్నిసార్లు మనం ఒక పని చేస్తున్నప్పుడు, మనస్సు సంచరిస్తూ చాలా ఆలోచనలను సృష్టిస్తుంది. అవి ప్రస్తుత పని గురించి, అదే విధమైన పని యొక్క గత అనుభవాల గురించి, పనికి సంబంధించిన వ్యక్తుల గురించి లేదా పూర్తిగా సంబంధం లేని పని గురించి అయి ఉండొచ్చు. ఆ పని యొక్క ఫలితం నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా మారవచ్చు. మనం పని చేస్తున్నప్పుడు ఆత్మ యొక్క స్థితిపై శ్రద్ధ చూపనప్పుడు, మనం ఎందుకు అలసిపోతున్నామో లేదా ఒక పనిని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం ఎందుకు తీసుకున్నామో మనకు అర్థం కాకపోవచ్చు.
చాలా మంది నిపుణులు తమ కార్యాలయంలో రోజుకు 8-10 గంటలు గడుపుతారు. మనము ఆగి అసలు ప్రొడక్షన్ గంటల వాస్తవ సంఖ్యను గమనించాలి. ఇది మనసు మరియు బుద్ధి పరంగా మన మానసిక స్థితికి మంచి సూచిక. మనలో కొందరికి సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో మెస్సేజ్ లను చదవడానికి ప్రతి కొన్ని నిమిషాలకు మన ఫోన్లు లేదా కంప్యూటర్లు (ఇంటర్నెట్) చెక్ చేయడం అలవాటు. మన గాడ్జెట్‌లే కాదు, మన మనస్సు కూడా సమాచారంతో నిండిపోతుంది. సమాచారం ఆలోచనలకు మూలం, కాబట్టి మనసు అదే నాణ్యతతో కూడిన అనేక ఆలోచనలను సృష్టించడం ప్రారంభిస్తుంది మరియు అది మన ఆంతరిక శక్తిని క్షీణింపజేస్తుంది. రోజులో క్రమమైన వ్యవధిలో పాజిటివ్ సమాచారం మరియు రోజంతటిలో అనవసరమైన సమాచారం నుండి దూరంగా ఉండడం మనకి మరింత ఏకాగ్రతను ఇస్తుంది. మానసికంగా అలసిపోకుండా మరియు అడుగడుగునా చురుకుగా ఉంచుతుంది, కర్మలలో సమర్థతను తీసుకువస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »