బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత, బ్రహ్మా కుమారీల యొక్క 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం మరియు దాని 4 యుగాల గురుంచి బోధిస్తుంది – స్వర్ణయుగం లేదా సత్యయుగం, వెండి యుగం లేదా త్రేతాయుగం, రాగి యుగం లేదా ద్వాపరయుగం మరియు ఇనుప యుగం లేదా కలియుగం మరియు మనందరికీ వాటిలో వేర్వేరు జన్మలు ఉంటాయి. ప్రపంచ నాటకం యొక్క వ్యవధి 5000 సంవత్సరాలు మరియు 4 యుగాలలో ప్రతి యుగం యొక్క  వ్యవధి 1250 సంవత్సరాలు అని భగవంతుడు వెల్లడించారు. 5000 సంవత్సరాల ఈ ప్రపంచ నాటకం భూమిపై ఈ భౌతిక ప్రపంచంలో అనగా సాకార ప్రపంచంలో దానంతట అదే సదా పునరావృతమవుతుంది. 5000 సంవత్సరాలలో, మానవ ఆత్మలు సాకార ప్రపంచంలో వారి విభిన్న పాత్రలు పోషించడానికి వారి స్వచ్ఛతను బట్టి వివిధ సమయాల్లో పరంధామం నుండి సాకార ప్రపంచానికి వస్తారు. పవిత్రమైన ఆత్మలు ముందుగా భూమిపైకి వస్తారు. ప్రతి 5000 సంవత్సరాల ప్రపంచ నాటకం ముగింపులో, భగవంతుడు ఆత్మలందిరినీ పవిత్రంగా చేస్తారు. వారందరు పవిత్రంగా అయిన తరువాత తిరిగి పరంధామానికి వెళ్తారు. పరంధామంలో కొంత కాలం విశ్రాంతి మరియు నిశ్శబ్ధత తరువాత, ప్రపంచ నాటకం దానంతట అదే పునరావృతం అయినప్పుడు, ఆత్మలందరూ వారి నిర్ణీత సమయానికి ఈ సాకార ప్రపంచంలోకి మళ్ళి క్రిందికి వస్తారు. 

ప్రపంచ నాటకం యొక్క మొదటి 2 యుగాలు, అంటే మొదటి 2500 సంవత్సరాలు, పాజిటివిటీ మరియు పవిత్రతతో నిండి ఉంటాయి మరియు ఈ సమయంలో ఎటువంటి దుఃఖం మరియు అశాంతి ఉండవు. అకాల మరణం లేకుండా పూర్తి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు, చాలా స్వచ్ఛమైన మరియు దివ్యమైన భౌతిక సౌందర్యం, సమృద్ధిగా సంపద, అందమైన మరియు ఆనందకరమైన సంబంధాలు మరియు అందారూ దైవీ లక్షణాలు మరియు దివ్యత్వంతో నిండి ఉంటారు. స్త్రీ పురుషుల మధ్య ఆధ్యాత్మిక కలయిక మరియు పవిత్రమైన  సంకల్ప శక్తి ద్వారా పిల్లలు జన్మిస్తారు అంతే కానీ ఈనాడు ఉన్నట్లుగా భౌతిక కలయిక ద్వారా కాదు.  పిల్లలకు జన్మనిచ్చే ఈ రకమైన ఆధ్యాత్మిక మరియు పవిత్రమైన పద్ధతి మొదటి 2500 సంవత్సరాల తర్వాత రాగి యుగంలో వ్రాయబడిన మన ధార్మిక పుస్తకాలు మరియు పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఈ మొదటి 2500 సంవత్సరాలను స్వర్గం అని అంటారు మరియు స్వర్గంలో నివసించే వారిని దేవతలు లేదా దేవీ దేవతలు అని అంటారు, వారు ఈనాటికీ ప్రపంచంలో ఎక్కువగా ఆరాధించబడతారు. 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

30th May – జీవన విలువలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ

Read More »
వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

29th May – జీవన విలువలు

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ

Read More »
మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

28th May – జీవన విలువలు

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత

Read More »