26th march soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల శక్తి మరియు ప్రకంపనలు – దురదృష్టాన్ని తెస్తాయని నమ్మి భయంతో బాధితులలా జీవిస్తాము. కాబట్టి, మనం వారి నెగెటివ్ ప్రభావానికి లోనయ్యి మన జీవితంలో నెగెటివ్ పరిస్థితులను ఆకర్షిస్తాము. చెడు శకునాలను మరియు మూఢనమ్మకాలపై నమ్మకం మన మనస్సులలో చాలా లోతుగా పాతుకుపోయింది. కొన్ని వస్తువులు లేదా సంఘటనలను మంచి లేదా దురదృష్టంతో కనెక్ట్ చేయడం వల్ల మన పరిస్థితుల కంటే అది మనల్ని బలహీనంగా చేస్తుంది.

  1. మీ మూఢనమ్మకాలను సవాలు చేస్తే అది మీ మనస్సులో ఉందని మీరు గ్రహిస్తారు. గ్రహ కదలికలు, వస్తువులు, పరిస్థితులు, వ్యక్తులు తమ శక్తిని ప్రసరింపజేస్తాయి . కానీ ఇతర బాహ్య ప్రభావం కంటే మీ జీవితంపై మీ మనస్సు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
  2. మీ ఆలోచనలు మీ భావాలుగా మారుతాయి. మీ భావాలు మీ వైఖరిని ఏర్పరుస్తాయి. మీ వైఖరి కార్యరూపం దాల్చుతుంది. పదే పదే చేసే కర్మలు అలవాటుగా మారతాయి. మీ అలవాట్లన్నీ కలిసి, మీ వ్యక్తిత్వం గా  తయారు అవుతుంది . మీ వ్యక్తిత్వం మీ అదృష్టాన్ని  సృష్టిస్తుంది. కాబట్టి, మీ ఆలోచనలు మీ అదృష్టాన్ని సృష్టిస్తాయి.
  3. మీ ఆలోచనలు నెగెటివ్ గా, బలహీనంగా ఉంటే, బాహ్య శక్తులు మీ ఆలోచనలను మరియు ఫలితంగా మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి. మీ ఆలోచనలు స్వచ్ఛంగా, పాజిటివ్ గా , శక్తిశాలి వైబ్రేషన్స్  కలిగి ఉంటే, బాహ్య అంశాలు మీ అదృష్టం పై  ప్రభావం చూపవు.
  4. మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి మరియు ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆలోచనలు మరియు పదాలతో మీ పనులను ఆశీర్వదించండి. మీ స్వంత భావోద్వేగ ఫిట్‌నెస్, సంకల్పం, క్రమశిక్షణ మరియు పాజిటివ్  ఆధ్యాత్మిక ప్రయత్నాలు కావలసిన అదృష్టాన్ని సృష్టిస్తాయి.
  5. మెడిటేషన్ ద్వారా భగవంతునికి కనెక్ట్ అవ్వండి మరియు మీ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. శక్తిశాలి వైబ్రేషన్స్ తో , మీరు మీ మనస్సుకు యజమానిగా, మీ జీవితం మరియు పరిస్థితులపై మాస్టర్ అవుతారు.చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల భయాన్ని అధిగమిస్తారు

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »