Hin

27th march soul sustenance telugu

సంతుష్ట మణిగా ఉండటం (పార్ట్ 1)

మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం సంతృప్తి మరియు ఆంతరిక ఆనందంతో నిండిన జీవితాన్ని గడపడం. మనమందరం ఈ రెండు ఎమోషన్స్ ను ఎల్లప్పుడూ కోరుకుంటాము. ఈ రెండు ఎమోషన్స్ లోపలి నుండి వచ్చేవి అయినప్పటికీ, కొన్ని సమయాల్లో జీవితంలోని పరిస్థితులు మన స్థిరత్వం మరియు బలాన్ని కదిలిస్తాయి, దానితో నిండుతనాన్ని మరియు ఆనందాన్ని మనం కోల్పోతాము. అలాగే, నేను జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తున్నాను, జీవితం నుండి నేను కోరుకునేది ఇంకేమీ లేదు అనే పాజిటివ్ అనుభూతిని కోల్పోతాము. జీవితంలో ఎటువంటి ఫిర్యాదులు లేవు అనే ఈ అనుభూతిని ఆంతరిక కృతజ్ఞత అని అంటారు. జీవితం మీకు ఇచ్చిన ప్రతిదానికి  ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పండి మరియు జీవిత పరిస్థితులు మీరు ఆశించిన దానికంటే కొద్దిగా భిన్నంగా ఉన్నప్పుడు చింతించకండి.

ఆంతరిక సంతృప్తి ఆంతరిక శక్తుల నుండి వస్తుంది. మనస్సులో వ్యర్థం  మరియు నెగెటివ్ ఆలోచనలు మరియు భావాలు లేని చోట ఆంతరిక సంతృప్తి వస్తుంది. అష్టశక్తులలో అనగా సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, సర్దుకునే శక్తి, పరిశీలన  శక్తి, నిర్ణయ శక్తి, సంకీర్ణ  శక్తి మరియు సహయోగ శక్తి, ఏదైనా లోపిస్తే  సంతృప్తి లేకపోవడం మరియు ఆనందం తగ్గడం జరుగుతాయి. అలాగే, ఏదైనా నిర్దిష్ట ఆలోచనా విధానాల వల్ల, ఏదైనా నిర్దిష్ట లోతైన సంస్కారం వల్ల మానసిక బలహీనత ఉంటే, మనస్సు నెగెటివ్ పరిస్థితులకు చాలా కట్టుబడి ఉంటుంది. ఆ నెగెటివ్ పరిస్థితులకు మానసిక శక్తిని ఇవ్వడం ఆపదు. దీని వల్ల మనస్సు చెదిరిపోయి స్పష్టత మరియు దృష్టిని కోల్పోతుంది. ఇది అసంతృప్తికి దారి తీస్తుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »
2nd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 1)

మనం అనూహ్యమైన జీవితాన్ని గడుపుతున్నాము. మన జీవితంలో తరచూ ఊహించని పరిస్థితులు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఏమిటి? ఈ రోజు మన జీవితాలలో క్లిష్ట పరిస్థితులు ఎందుకు పెరుగుతున్నాయి? భగవంతుడు వెల్లడించిన ప్రపంచ నాటకం

Read More »
1st dec 2024 soul sustenance telugu

దివ్యమైన ఆత్మ యొక్క 12 లక్షణాలు (పార్ట్  2)

స్వయంలోని బలహీనతలను, లోపాలను సులభంగా పరిశీలించుకోగలిగే అద్దం లాంటి వారు దివ్యమైన ఆత్మ. వారిలో భగవంతుని మంచితనాన్ని, శక్తులను చూడగలుగుతాము. వారు భగవంతునితో స్వచ్ఛంగా, సత్యంగా ఉంటారు. వారు ప్రతిదీ ఎలా ఆచరణలోకి తీసుకురావాలనే

Read More »