Hin

29th january - sst

విజయం మరియు దాని సరైన సారాంశం (భాగం-3)

మీరు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడల్లా, ఆ పని గురించి మీ మనస్సులోని ఆలోచనలను గమనించండి. ఆలోచనలలో ఆందోళన కలిగి ఉంటే, దృఢత లేకపోవటం లేదా ఇది కష్టం అనే భావన లేదా మీరు నెగిటివ్ దృష్టి కోణం కలిగి ఉంటే – మీరు ఆంతరికంగా సంతోషంగా లేరని అర్థం. ఈ రకమైన మనస్తత్వం ద్వారా ఆ పని నెగిటివ్గా ప్రారంభించి నట్టు అవుతుంది మరియు ఆ కార్యంలో విజయం పొందకుండా నిరోధిస్తుంది. పాజిటివ్ , శక్తివంతమైన మరియు సంతోషకరమైన ఆలోచనయే ఆ కార్యం సాధించడానికి శాశ్వత విజయానికి ఇంధనం. దృఢత విజయాన్ని ఆకర్షిస్తుంది మరియు ఆశ మరియు పాజిటివిటీ లేకపోవడం వైఫల్యానికి విత్తనాలను నాటడం వంటిది . అలాగే, చాలా మంది వ్యక్తులు వేగంగా మరియు తక్కువ వ్యవధిలో విజయం సాధించాలని చూస్తున్నారు, కానీ వారు మానిసిక స్థాయిలో వైఫల్యాన్ని పొందుతారు. వారు అసంతృప్తితో ఉండటమే కాకుండా వారు ఎవరిని సంతృప్తి పరచలేరు. కాబట్టి, ఎల్లప్పుడూ విజయం కోసం వెతకండి, కానీ మీరు మీ జీవితంలో చేరుకోవాలనుకొనే ముఖ్యమైన మైలురాళ్లను చేరుకోవడానికి ముందు, అడుగడుగునా ఆనందం మరియు సంతృప్తి కోసం వెతకండి. లేకపోతే, ఆ ప్రియమైన వారందరితోపాటు మీరు వారితో పంచుకునే అందమైన అనుబంధాలు మరియు మీరు గర్వించే స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు కూడా మిమ్మల్ని వదిలివేస్తాయి. ఎందుకంటే, చాలా సార్లు, అతి వేగంగా మరియు అతి ఎక్కువగా విజయం సాధించాలనే తపనతో తప్పుడు దారిలో ప్రయాణిస్తాము. విజయం ఎంతో విలువైనది అనే నానుడి ఉంది . ఇది చాలా మంది యువ సాధకులకు వర్తిస్తుంది. వారు విజయం కోసం చాలా చేసి ఉండవచ్చు మరియు అది మంచి అయి ఉండవచ్చు , కానీ వారు ఈ సందేశంలో చెప్పినట్లు విజయం యొక్క నిజమైన అర్థాన్ని అనుసరించలేదు. అందువలన విజయానికి సరైన మార్గాన్ని తీసుకోలేదు.

ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మనం మానవ యంత్రాలము కాదు మనము జీవం ఉన్న ఆత్మలము అంటే ఈ శరీరంలో నివసించే ఆత్మలము. ఎల్లప్పుడూ కర్మ చేసే ముందు ఆ జీవాత్మను గురించి ఆలోచించండి. విజయం ప్రతి నిమిషం మీ వద్ద ఉంటుంది. మీరు భౌతిక స్థాయిలో కొంచెం తక్కువ సాధించినా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి నుండి ప్రేమ మరియు గౌరవం పరంగా మీరు చాలా ఎక్కువ సాధిస్తారు. అలాగే, సంతోషం యొక్క నిజమైన సంపద మీ జీవితమంతా మీతో ఉంటుంది మరియు మీరు జీవితాన్ని మరింత బలంగా మరియు ప్రశాంతంగా జీవిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »