2nd april soul sustenance telugu

సుప్రీమ్ స్టార్ మనపై ప్రకాశిస్తున్నారు (పార్ట్ 2)

మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ, ఈ ప్రపంచం నా కుటుంబం అనే స్వచ్ఛమైన, పాజిటివ్ ఆలోచనను మీ మనస్సులో రచించండి. ప్రపంచానికి సేవ చేయాలనే కర్తవ్యాన్ని మీ చిత్తంలో ఉంచుకోండి. మానవులందరూ పరస్పరం సోదర బంధంతో ముడిపడి ఉన్నారు. మనం మన కోసం మంచి విషయాలను కోరుకున్నట్లే, మీ మనస్సు మరియు హృదయంలో మీకున్న గుప్తమైన సంపదను ఇతరులతో పంచుకోవడానికి కొంత సమయం ఇవ్వండి. ఎవరైనా మీ ముందుకు వచ్చినప్పుడల్లా, మీ మనస్సును  ఉపయోగించి ఇతరుల కోరుకునే ఏ గుణం లేదా శక్తిని కోరుకుంటున్నారో తెలుసుకోండి.   ఎవరైనా మిమ్మల్ని వీధిలో కలుసుకున్నట్లయితే, ఆ వ్యక్తికి ఆనందంగా లేరని మీకు అనిపిస్తే , మీ హృదయంలో ఆ గుణాన్ని వెలికితీయండి. మీ చిరునవ్వు,  ఆహ్లాదకరమైన ప్రవర్తన మరియు మీ ఆంతరిక ఆనందకరమైన మానసిక స్థితి ద్వారా వారికి ఆ గుణాన్ని అందించండి. మీరు మీ ఆఫీస్ లో , కలత చెంది అశాంతిగా  ఉన్న సహోద్యోగిని కలుసుకున్నట్లయితే, మీ దృష్టి మరియు మంచి మాటల ద్వారా ఆ  వ్యక్తికి  శాంతి మరియు ప్రశాంతతను పంచండి. అదే విధంగా , మీ ఇంట్లో ఎవరికైనా నెగెటివ్ పరిస్థితులను తట్టుకునే శక్తి లేకుంటే, మీ ఆంతరిక  స్థిరమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితి ద్వారా ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వండి. వారినే అందరి కోరికలను తీర్చేవారు లేదా నిరంతర దాతగా అవ్వటం అంటారు.  

వాస్తవానికి, మీరు భగవంతుడిని మీ నిరంతరం  సహచరునిగా చేసుకున్నప్పుడు ఈ గుణాలు మరియు శక్తులన్నీ మీలో అపారంగా వస్తాయి. భగవంతుడు మార్గం చూపే నక్షత్రం, మనమందరం వారి నీడలో జీవిస్తున్నాము.  మన కోసం మరియు ఇతరుల కోసం మనం కోరుకునేవన్నీ భగవంతునితో మనసును నిలపడం వలన మనకు అవి కలుగుతాయి. ఎందుకంటే మనం భగవంతుడుని ఎంతగా ప్రేమిస్తామో, అంత ఎక్కువగా వారి గుణాలు మరియు శక్తులు మనం నింపుకొని ఇతరులకు కూడా నింపుతాము. ప్రతి ఒక్కరూ ఆంతరికంగా ఎంత నిండుగా ఉంటారో,  వారి ఆరోగ్యం, సంపద, సంబంధాలు మెరుగుపడతాయి.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »