31st march soul sustenance telugu

ఇతర వ్యక్తుల స్క్రిప్ట్‌ను వ్రాయడం అనే నెగెటివ్ అలవాటు

ఈ జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలు పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్‌ను వ్రాసి అమలు చేయమని కోరుతుంది. కానీ, తరచుగా మనం మన  స్క్రిప్ట్‌లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మన మనసులో ఇతరుల స్క్రిప్ట్‌ను వ్రాయడంలో బిజీగా ఉంటాము – వారు ఏమి చెప్పాలి, వారు ఎలా ప్రవర్తించాలి, వారు ఎప్పుడు స్పందించాలి … మనం వారి పాత్రలలో చిక్కుకుపోయి మన పాత్రను మరచిపోతాము. మనుష్యులు వారి స్వంత స్క్రిప్ట్‌లను వ్రాస్తారు, వారు మన అంచనాల ప్రకారం ఉండలేరు. 

  1. మీరు తరచుగా ఇతర వ్యక్తులను అంచనా వేస్తూ , వారు ఎలా ఉండాలి,  వారు ఏమి చేయాలి అని మనసులో స్క్రిప్ట్‌ను వ్రాస్తున్నారా? వారు మీ స్క్రిప్ట్‌ను అనుసరించనప్పుడు ఇది వ్యర్థమని మీరు గ్రహించారా? ఇతరులపై దృష్టి పెట్టడం ద్వారా మీ సమయం మరియు శక్తి క్షీణిస్తుంది కాబట్టి ఆ అలవాటు మీ స్వంత ఎదుగుదల మరియు అభివృద్ధిని తగ్గించిందా ?
  2. మనమందరం ఈ ప్రపంచ నాటకంలో నటులం, మన జీవితంలో అనేక పాత్రలు పోషిస్తున్నాము. ప్రతి సీన్ లోనూ మనమే నటులం, దర్శకులం , స్క్రిప్ట్ రైటర్లం. కానీ తోటి నటీనటులతో పాత్రను పోషిస్తున్నప్పుడు, మనం వారి పనితీరుపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తాము, మనసులో వారి స్క్రిప్ట్‌ను వ్రాసి వారు దానిని అనుసరించాలని ఆశిస్తాము. కానీ ఇతర వ్యక్తులు ఆ స్క్రిప్ట్‌ను అనుసరించలేరు.
  3. మన దృష్టి మన పనితీరుపై ఉండాలి. పాత్ర ఏదైనా కావచ్చు, శాంతి, ప్రేమ, వివేకం అనే మన వ్యక్తిత్వం ప్రతి పాత్రలోనూ ప్రతిబింబించాలి. ఇతర నటీనటులు సరైన పనితీరును కనబరచకపోయినా, మన నటన వారికి తమను తాము సరిదిద్దుకునే మార్గాన్ని చూపాలి .
  4. ఇతరుల స్క్రిప్ట్‌ను కాకుండా మీ స్వంత స్క్రిప్ట్‌ను పర్ఫెక్ట్ గా చేయడం గురించి ఆలోచించండి.  ప్రశాంతంగా, రిలాక్స్‌గా,  మీ సహ-నటులను శక్తివంతం చేస్తూ ప్రతి సన్నివేశాన్ని చక్కగా దాటండి. నా సహనటుల నటన ప్రభావంలోకి రాకుండా నేను ప్రతి పాత్రలో శాంతి మరియు కరుణతో కూడిన నా వ్యక్తిత్వాన్ని వెలికితీస్తాను అని మీకు మీరే గుర్తు చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »
23rd-sept-2023-soul-sustenance-telugu

మిమ్మల్ని మీరు నెగిటివ్ గా లేబుల్ చేసుకోకండి

అందరూ తమ వ్యక్తిత్వం మరియు అవగాహనల ఫిల్టర్ ద్వారా మనల్ని చూసినట్లే, మనం స్వయంపై పెట్టుకొనే కొన్ని లేబుల్‌ల ద్వారా కూడా మనల్ని మనం చూసుకుంటాము. నేను సోమరిని, నాకు అజాగ్రత్త ఉంది వంటి

Read More »
22nd-sept-2023-soul-sustenance-telugu

ట్రాఫిక్ జామ్ – రోడ్డుపైనా లేక మనసులోనా?

మనలో చాలా మందికి, ట్రాఫిక్ రద్దీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో  జాప్యం, ఫ్లైట్ మిస్ అవ్వటం లేదా క్యూలలో వేచి ఉండటం నిరాశ, ఒత్తిడి మరియు ఆందోళనకు మూలాలు. ఇవి రొటీన్ కావచ్చు, కావున

Read More »