నిర్భయంగా మారడానికి 5 మార్గాలు

నిర్భయంగా మారడానికి 5 మార్గాలు

  1. ఆత్మగౌరవం యొక్క శక్తివంతమైన స్థితిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించడానికి మొదటి మరియు అతి ముఖ్యమైన మార్గం మన ఆత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. జ్ఞానం, గుణాలు, నైపుణ్యాల పరంగా మనకు ఉన్న మన ప్రత్యేకతలతో పాటు ఏదైనా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను కూడా అనుభూతి చెందడం.అలాగే, జీవితంలోని విభిన్న పరిస్థితులను నిర్లిప్తంగా చూసే అలవాటును అలవర్చుకోండి మరియు మన విభిన్న ఆంతరిక  శక్తుల యొక్క ప్రాప్తితో వాటిని సులభంగా అధిగమించగలమని భావించండి.
  2. పరమాత్ముని స్మరిస్తూ వారి సహాయం మరియు శక్తిని అనుభూతి చెందండి  – ఏదైన  పరిస్థితి వచ్చినపుడు , మనల్ని మనం ఒంటరిగా భావించి మనం ఆ పరిస్థితికి భయపడి  మనం ఒంటరిగా  దానిని పరిష్కరించలేమని అనుకుంటాము. అటువంటి పరిస్థితులలో, భగవంతుడిని మీకు సన్నిహితంగా విజ్యువలైజ్  చేసుకొని వారి తోడుని అనుభూతి చేసుకోండి.  వారి సహాయాన్ని మరియు పరమ శక్తిని స్వీకరించండి. అలాగే, పరమాత్ముని  ఆ  పరిస్థితికి  మార్గనిర్దేశం చేయనివ్వండి. మీరు వారిపై బాధ్యతను వదిలివేసి, ఆ పరిస్థితికి ఉత్తమ పరిష్కారాన్ని చేయనివ్వండి. ఇది మిమ్మల్ని నిరంతరం నిర్భయంగా మారుస్తుంది.
  3. పరిస్థితిని తేలికతనంతో ఎదుర్కోండి, దాని ఒత్తిడి వలన బలహీనపడకండి – మీరు ఏదైనా పరిస్థితికి భయపడినప్పుడు, అది మీపై ఆధిపత్యం చెలాయిస్తుంది. మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యలు బలహీనమవుతాయి. అటువంటి పరిస్థితులలో ఆధ్యాత్మిక శక్తి యొక్క రెండు అంశాలను మీ మనస్సులో మాటిమాటికి గుర్తు చేసుకోండి – నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని , పరమాత్ముని సంతన్నాన్ని మరియు నేను విజ్ఞవినాశకుడిని . ఈ సంకల్పాలు  పరిస్థితులపై పాజిటివ్గా పనిచేసి, పరిస్థితులను  మీకు అనుకూలంగా, ప్రయోజనకరంగా మారుస్తాయి.
  4. మనన చింతన చేసి మీ విజయాన్ని విజువలైజ్ చేయండి – మన మనస్సులో ఎటువంటి సందేహం లేకుండా పరిస్థితి ఇప్పటికే అధిగమించబడిందని మనం ముందుగానే విజువలైజ్ చేసినప్పుడు నిర్భయత వస్తుంది. ఏ పరిస్థితిలోనైనా మనం దీన్ని ఎంత ఎక్కువగా ఆచరిస్తే, కఠిన  పరిస్థితులను సులభంగా అధిగమించడం అలవాటు చేసుకుంటాము మరియు ఎటువంటి చింత లేకుండా ధైర్యంగా, దృఢంగా ఉంటాము.
  5. భయం మీకు మంచిది కాదని మీకు మీరే చెప్పుకోండి – భయం అనేది నెగెటివ్ శక్తి అని మరియు అది మీ మానసిక ఆరోగ్యానికి , మీ శారీరక ఆరోగ్యానికి, మీ సంబంధాలకు మరియు మీరు చేసే పనుల విజయానికి హానికరం అని ఎల్లప్పుడూ మీకు మీరు గుర్తుచేసుకోండి. . భయం అనేది తప్పు మార్గం అని, అది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది అని  మీరు ఎంత ఎక్కువగా గ్రహిస్తారో అంత అంతర్ మనసును తాకడానికి మీరు అనుమతించరు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »