7th march soul sustenance telugu

క్లిష్టమైన పరిస్థితులకు కృతజ్ఞతలు

మనం సాధారణంగా జీవితంలో అన్ని మంచి విషయాల కోసం కృతజ్ఞతలు తెలియజేస్తాము, కాని సవాలు చేసే పరిస్థితులకు మనం చాలా అరుదుగా కృతజ్ఞతా భావంతో ఉంటాము. కష్టతరమైన పోరాటం మరియు లోతైన దుఃఖానికి కృతజ్ఞతతో ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ కష్టమైన అనుభవాలు ప్రయోజనకరంగా ఉంటాయి – అవి మంచి వాటికి కారణమవుతాయి, లేదా అవి మనల్ని ఆంతరికంగా శక్తివంతంగా చేస్తాయి. మీరు నిజంగా ఎదుర్కోవటానికి కష్టపడిన పరిస్థితిని మీరు గుర్తుచేసుకోగలరా? ఆ సవాలు దశలో వెళుతున్నప్పుడు, మీకు కోపం, విమర్శలు , ఆత్రుత, చేదు భావాలు లేదా బాధపడ్డారా? మీరు ఆ సమస్యను విజయవంతంగా దాటిన తర్వాత, మీలో ఉన్న ఉత్తమమైన గుణాలను  బయటకు తెచ్చినందుకు మీరు ఆ అలజడికి కృతజ్ఞతలు తెలిపారా?.  సవాళ్లను అంగీకరించడానికి బదులుగా, బాధపడటం, కలత చెందడం, విధిని నిందించడం లేదా వేరొకరిని నిందించడం సాధారణమని మనం భావిస్తాం . ఈ రియాక్షన్స్ మన శక్తిని మరింత క్షీణింప చేసి పరిస్థితిని ఎదుర్కోవటానికి మన శక్తిని లాక్కుంటాయి. మన బలహీనతలు సమస్యను వాస్తవం కంటే పెద్దదిగా కనిపించేలా చేస్తాయి. మన నిజమైన సామర్థ్యాన్ని చూపించినందుకు సవాళ్లకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనల్ని కంఫర్ట్ జోన్ నుండి బయటకు నెట్టివేసినప్పుడు, మనకు తెలియని కొన్ని లక్షణాలను ఉద్భవిస్తాము. ఎదుర్కునే  శక్తి, సహన శక్తి, సర్దుకునే శక్తి యాక్టివేట్ అవుతాయి. కృతజ్ఞతా భావం మనల్ని ఆంతరికంగా శక్తివంతం చేస్తుంది, మన సామర్థ్యాన్ని పెంచుతుంది, నెగెటివ్ ఎనర్జీ నుండి మనల్ని రక్షించి మన అత్యున్నత శక్తిని ఆ పరిస్థితికి ప్రసరిస్తుంది. కృతజ్ఞతలు చూపిస్తూ సవాళ్లను అంగీకరించండి మరియు గౌరవించండి. మీ శక్తి వాటిని ప్రభావితం చేసి,  వాటిని స్థిరత్వంతో దాటడానికి మీకు సహాయపడుతుంది.

మీ ఆంతరిక సామర్థ్యాన్ని చూపించినందుకు జీవితంలో కష్టాలకు కృతజ్ఞతా భావం తో ఉండటం మీ మనస్సుకు నేర్పించడం ప్రారంభించండి. సంతృప్తితో, మీరు ఎవరో మరియు మీ వద్ద ఉన్న వాటి కోసం భగవంతునికి ధన్యవాదాలు తెలపండి. మీ జీవితంలో ప్రతి పరిస్థితికి ధన్యవాదాలు తెలపండి. ప్రతి సన్నివేశం పర్ఫెక్ట్ గా, ఉండాల్సినట్లుగా ఉందని గుర్తుంచుకోండి. అది మీకు తీసుకొని వచ్సిన దానికి ధన్యవాదాలు. ప్రతి పరిస్థితిని మీరు ఎంచుకున్నట్లుగా అంగీకరించండి. ఇది మీ గత కర్మ యొక్క ఫలితం అని అర్థం చేసుకోండి. ఒక విషాదం, విపత్తు, సంక్షోభం నేపథ్యంలో కూడా సన్నివేశాన్ని ప్రశ్నించవద్దు. ఇది పర్ఫెక్ట్ అయినది మరియు కళ్యాణకారి అని అర్థం చేసుకోండి. పరిస్థితులు ఇంపెర్ఫెక్ట్ గా ఉంటాయి, కానీ మీ మనస్సు పర్ఫెక్ట్ గా  ఉండాలి. ఒత్తిడి, నొప్పి లేదా భయాన్ని సృష్టించవద్దు. మీ కృతజ్ఞత పరిస్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది, మీ అంగీకారం మీ మనస్సును నిశ్శబ్దం చేస్తుంది. సరైన ఆలోచనలను ఎంచుకోండి, మీ అంతర్ దృష్టిని యాక్టివేట్ చేయండి మరియు మీ అంతరాత్మ ఎం చెప్తుందో అది వినండి. ఇప్పుడే సరైన కర్మ చేసి స్థిరత్వం మరియు గౌరవంతో పరిస్థితిని దాటండి. మీ గత కర్మలను పరిష్కరించే అవకాశానికి కృతజ్ఞతతో ఉండండి. మీ ఆంతరిక శక్తిని పెంచడానికి, ఆ పరిస్థితి నుండి బయటకు రావడానికి మరియు పాఠాలను నేర్చుకోవడానికి అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతతో ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th march soul sustenance telugu

24th March – జీవన విలువలు

కర్మ సిద్ధాంతం ఎలా పని చేస్తుంది? మనమందరం ఆధ్యాత్మిక శక్తులం  లేదా ఆత్మలం . ప్రపంచ నాటకంలో వివిధ రకాల కర్మలను చేస్తాము. మనమందరం ప్రపంచ నాటకంలో శరీర బ్రాంతిలో కొన్ని మంచి కర్మలు

Read More »
23rd march soul sustenance telugu

23rd March – జీవన విలువలు

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి మనమందరం గొప్ప వక్తలు కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణమైన సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను

Read More »
22nd march soul sustenance telugu

22nd March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 3) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే మిగిలిన అంశాలు: శుభ భావన, శుభ కామన, ఇతరులపై సంపూర్ణ

Read More »