8th feb soul sustenance telugu

అంగీకరించడం శక్తి కానీ బలహీనత కాదు

మనం కష్టాలను ఎదర్కుంటున్నప్పుడు, పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించు అని మనకు కొంతమంది సలహా ఇస్తుంటారు. కానీ అలా అంగీకరించడాన్ని మనం బలహీనతగా, అణచివేతగా, చేతకానితనంగా భావిస్తుంటాము. ఎలాంటి పరిస్థితిలోనైనా మనకు రెండు దారులు ఉంటాయి: స్వీకరించడం లేక తిరస్కరించడం. తిరస్కరించడము అంటే జీవిత దృశ్యాలను మనసు ప్రశ్నిస్తూ ఉంటుంది. స్వీకరించడం అంటే ఆ క్షణం ఎలా ఉందో, ఆ ప్రవాహాన్ని అంగీకరించి దానికి తగ్గట్లుగా మరుసటి దృశ్యాన్ని మల్చుకోవడము.
1. మీ అంతర్గత మానసిక స్థితికి రచయిత మీరే. ప్రతిరోజూ ఉదయం మెడిటేషన్ చేసి మీ మనసును జ్ఞానంతో నింపుకోండి. మీరు ప్రశాంతంగా ఉండేందుకు ఇది దోహదపడుతుంది, అంగీకరించడం సులభమవుతుంది.
2. మిమ్మల్ని మీరు అంగీకరించడాన్ని ప్రారంభించండి – మీరు ఎవరు, మీకు ఉన్నదేమిటి అన్న విషయంలో తీర్పులు, అపరాధ భావము, విమర్శలు లేకుండా మిమ్మల్ని మీరు అంగీకరించండి. మీరు ఇఫ్పుడు ఎలా ఉన్నారో ఆ స్థితిని అంగీకరించండి, మార్పుకు సిద్ధం కండి.
3. ఇతరులు ఎలా ఉన్నారో అలా అంగీకరించడంలో మొదటి అడుగు – నేను పవిత్ర ఆత్మను, మరో పవిత్ర ఆత్మతో మాట్లాడుతున్నాను అని గుర్తుంచుకోండి. అప్పుడు, లింగ భేధాలు, లింగ అహంభావాలు, బంధాలు, హోదా, వయస్సు, విజయాలు ఏవీ అడ్డు అవ్వవు. రెండవ అడుగు – ప్రతి వ్యక్తి వైవిధ్యంతో ఉన్నారు , వారు వారి విధం గా ఉంటారు, ఒక హద్దు దాటాక నేను వారిని మార్చలేను, నేను కేవలం వారిపై పాజిటివుగా ప్రభావం చూపగలను అని అర్థం చేసుకోండి.
4. పరిస్థితులను అంగీకరించడం అంటే, మనసుకు ఇలా నేర్పండి – ఇది ఇంతే, తర్వాత ఏమిటి, ఏమి చేయాలి అని ఆలోచించండి అంతేగీనీ ఇలా ఎందుకు అని అనకండి. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలలోకి వెళితే మనసులో వ్యర్థ ఆలోచనల ప్రవాహం మొదలవుతుంది. ఫుల్‌స్టాప్ పెడితే పరిస్థితిని ఎదుర్కునే సమర్థత వస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »