9th feb soul sustenance - telugu

ఇతరుల నుండి నొప్పిని గ్రహించవద్దు...ఆనందాన్ని ప్రసరింప చేయండి

మనకి ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వద్దని నేర్పిస్తూ ఉంటారు. అది తప్పుడు కర్మ. అందుకే మనము మన పనులలో, వ్యక్తులతో వ్యవహరించడంలో జాగ్రత్తగా ఉంటాము. కానీ దాని సమానంగా నైపుణ్యం గల కళ ఏంటంటే, మనము ఇతరుల నుండి దుఃఖాన్ని తీసుకోకుండా ఉండటం. ఇతరుల బాధను గ్రహించడం దానిని ఇవ్వడంతో సమానంగా నష్టపరుస్తుంది. మీరు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతారు. మీరు ఉద్దేశపూర్వకంగా ఇతరులకు బాధ కలిగించలేదు. కానీ, మీకు తెలియకుండానే ఇతరుల నుండి బాధను తీసుకున్నారా? దాని అర్థం ఏంటంటే, ఎవరైనా దుఃఖంగా ఉండటం చూసి మీకు కూడా బాధ కలుగుతుందా? లేదా మీరు ఆమోదించని విధంగా ఎవరైనా ప్రవర్తించనప్పుడు మీకు అసౌకర్యంగా అనిపిస్తుందా? ఎవరికి బాధ కలిగించకుండా ఉండటం చాలా ముఖ్యం , కానీ ఎవరి బాధను తీసుకోకుండా ఉండటం కూడా అంతే ముఖ్యము. మన చుట్టూ ఉన్నవారు మానసిక వేదనకు గురవుతున్నారు. వారు అసురక్షిత, అసూయ, కోపం లేదా భయంతో ఉన్నారు. వారు తమ బాధను తగ్గించుకోనందువలన, వారు తమ ప్రవర్తనలతో ఈ శక్తిని మనకు ప్రసరింప చేస్తారు. వారు బాధలో ఉన్నారు మరియు ఉద్దేశపూర్వకంగా మనకు హాని చేయరు. వారు దుఃఖపడటం చూసి మనము దుఃఖ పడితే, మనం బాధను తీసుకున్న వారము అవుతాము . మనము వారి ప్రవర్తనలను ప్రశ్నించినట్లయితే మరియు ప్రతిఘటిస్తే, మనము మళ్లీ బాధను తీసుకున్న వారము అవుతాము . మానసికంగా అతీతంగా ఉండటం, స్థిరంగా ఉండటం మరియు వాటిని అర్థం చేసుకోవడం మన బాధ్యత. మనము అంగీకారాన్ని ప్రసరింపజేస్తూ వారికి సహాయపడుదాము. దుఃఖంతో బాధపడుతున్న వ్యక్తులకు వారి భావోద్వేగ సంక్రమణను పట్టుకునే బదులు బలమైన సంరక్షకుడిగా ఉండండి.
మీరు ఆనంద స్వరూపమైన ఆత్మ అని ప్రతి రోజు గుర్తు చేసుకోండి. ప్రతిరోజు ప్రతి సన్నివేశంలో ప్రశాంతంగా మరియు తేలికగా ఉండండి. ఎవరి నుండి ఆశించకుండా మరియు ఆనందాన్ని వెతకే వారీగా సంతోషం మరియు ఆనందం అందరికీ ప్రసారింపచేసే వారీగా అవ్వండి. మీ ప్రతి మాట మరియు ప్రవర్తన అందరికీ ఆశీర్వాదంలా ఉండాలి. ప్రతి వ్యక్తి తన స్వభావం ఆధారంగా తన పాత్రను పోషిస్తారు . కొందరు గతంలో కలిగిన గాయాల కారణంగా మానసిక బాధ తో ఉన్నారు, కొందరు అనారోగ్యంతో ఉన్నారు, కొందరు సంబంధాలలో సమస్యలతో ఉన్నారు, కొందరు ఉద్యోగంలో సమస్యలతో ఉన్నారు. వారందరూ బాధలో ఉన్నారు, వారి ప్రవర్తన వారి బాధను ప్రతిబింబిస్తుంది. నిర్లిప్త పరిశీలకుడిగా వారి చర్యలకు సాక్షిగా ఉండండి. వారి బాధను మీలోకి గ్రహించి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి మరియు ప్రశ్నించకండి. వారికి బాధ కలిగించవద్దు లేక వారి బాధను తీసుకోవద్దు. వారి ఆలోచనా విధానాన్ని, వారి దృష్టి కోణాన్ని, వారి బాధను అర్థం చేసుకోండి. వారిని అర్థం చేసుకోండి, అంగీకరించండి, స్థిరంగా ఉండండి మరియు ప్రతి సన్నివేశంలో సంతోషంగా ఉండండి. మీ ఆనంద ప్రకంపనలు వారికి ప్రవహిస్తూ ఉంటే , మీ శక్తి వారిని నయం చేస్తుంది. వారి భావోద్వేగాలకు లోనవ్వకుండా ఉండటం ద్వారా, మీ స్థిరత్వం వారిని నయం చేస్తుంది

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »