HI

9th april 2024 soul sustenance telugu

April 9, 2024

ఆలోచన మరియు భావన యొక్క అదృశ్య శక్తి

అనేక ఇతర శక్తుల వలె – ధ్వని శక్తి, కాంతి శక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి మొదలైనవి భౌతిక ప్రపంచంలోని శక్తి యొక్క ప్రాథమిక అదృశ్య రూపాలు. అలాగే ఆలోచన మరియు భావన యొక్క శక్తి కూడా అదృశ్య శక్తి యొక్క ఒక రూపం. ఒకే తేడా ఏమిటంటే ఇది ప్రకృతిలోని పంచ తత్వాల యొక్క శక్తి కాదు, చాలా సూక్ష్మమైనది. ఇది చైతన్యమైన ఆత్మ నుండి వెలువడే శక్తి. కానీ అదే సమయంలో, ఇది భౌతిక శరీరంతో దగ్గరి సంబంధం కలిగి ఉందని, భౌతిక శరీరం ద్వారా మాత్రమే వ్యక్తీకరించబడుతుందని మర్చిపోకూడదు. ఇతర శక్తులు వాటంతటవే వ్యక్తపరచబడవు ఎందుకంటే అవి చైతన్యమైన వాటి నుండి వెలువడవు. అలాగే, మనం భౌతిక శరీరం లోపల ఉన్నప్పుడు మాత్రమే ఆలోచనల మరియు భావాల శక్తిని గ్రహిస్తాము.

 

ఈ శక్తే మనం జీవించినంత కాలం నుండి, జన్మజన్మలుగా మనల్ని నడిపిస్తూ, చాలా సార్లు తప్పు దిశలలో కూడా కొనసాగుతూ వచ్చింది. ఈ శక్తిని మనం దారిలో పెట్టడం, నియంత్రించడం, నిర్వహించడం, క్రమశిక్షణతో ఉంచడం నేర్చుకోవాలి. ఎందుకంటే, అలా చేయడంతో మన అసలైన సుగుణాలను అనగా శాంతి, ప్రేమ, సంతోషం, శక్తులను అనుభవం చేసుకుంటాము. ఇదే మనకున్న ఒకే ఒక్క కోరిక. దీని కోసమే వివిధ పద్ధతులను ఉపయోగించాము. కానీ చాలా సార్లు ఈ కోరిక నెరవేరలేదు, ఎందుకంటే మనం ఈ ప్రాథమిక  అతి ముఖ్యమైన పద్ధతిని మరచిపోతాము. దీనినే మనం చాలా కాలం నుండి చేయలేకపోయాము.  చాలా మంది వేల సంవత్సరాల నుండి సాధించాలనుకుంటున్నది కూడా ఇదే. మెడిటేషన్ యొక్క టెక్నిక్ మనకు శక్తిని దారిలో పెట్టేందుకు సహాయపడే ఒక టెక్నిక్. ఈ శక్తిని ఛానలైజ్ చేయటం (మార్గంలో నడిపించడం)  మన భౌతిక శరీరం యొక్క స్థితిని కూడా మెరుగుపరుస్తుంది, ఎందుకంటే ఇది వివిధ శరీర వ్యవస్థలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మనం పోషించే అన్ని పాత్రల నాణ్యతను మెరుగుపరుస్తుంది. వాటిని పోషించేటప్పుడు మరింత విజయాన్ని పొందుతాము. చాలా ముఖ్యంగా మన సంబంధాలు మెరుగుపడతాయి – ఇతరులతో మన సంబంధాలు మాత్రమే కాకుండా  స్వయం మరియు  భగవంతునితో కూడా.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

27th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 2)

మనమందరం మన జీవితంలో అనేక ఉద్ధేశ్యాలు, లక్ష్యాలతో జీవిస్తాము. కొన్నిసార్లు ఈ జీవిత లక్ష్యాలు మనస్సు మరియు దాని ఆలోచనల పై ఆధిపత్యం చెలాయిస్తాయి. కాబట్టి జీవితంలోని విభిన్న పరిస్థితుల ప్రభావాన్ని నిర్వీర్యం చేయడానికి

Read More »
26th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 1)

మన ఆలోచనలు మరియు భావాలను మనకు  అనుగుణంగా నిర్వహించడం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన సవాలు. మన మనస్సు తరచుగా చెల్లాచెదురైన ఆలోచనలతో నిండి ఉంటుంది, వీటిని మనం తగ్గించుకొని నిర్దిష్ట పనిపై

Read More »
25th april 2024 soul sustenance telugu

మీరు భగవంతుడిని నమ్ముతారా? మీరు వారి ఉనికిని అనుభవం చేసుకుంటున్నారా?

భగవంతుడు మన ఆధ్యాత్మిక తల్లి-తండ్రి మరియు విశ్వంలో అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి. అనేక శతాబ్దాలుగా, భగవంతుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిచే ప్రేమించబడ్డారు, గౌరవించబడ్డారు. అయినప్పటికీ, భగవంతుడు మానవ రచన మరియు వారి ఊహ అని

Read More »