HI

25th mar 2024 soul sustenance telugu

March 25, 2024

హోలీ యొక్క ఆధ్యాత్మిక అర్థం (పార్ట్ 2)

శుభ్రమైన తెల్లని బట్టలు ధరించడం హోలీ యొక్క సారాంశాన్ని తెలియచేస్తుంది. ఇది ఆత్మలమైన మనం శుభ్రంగా మరియు స్వచ్ఛంగా ఉన్నామని సూచిస్తుంది. సర్వోన్నత శక్తి యొక్క స్మరణ అగ్నిలో తన దుర్గుణాలను కాల్చిన (హోలికా దహనం) తర్వాత ఆత్మ పూర్తిగా శుద్ధి అవుతుంది. హోలీ రంగులు ఆత్మ అసలైన  సుగుణాలను – శాంతి, సంతోషం, ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, జ్ఞానం మరియు శక్తులను సూచిస్తాయి. ఆత్మలమైన మనం మొదట భగవంతుని బేషరతు ప్రేమ మరియు స్వచ్ఛతకు అనుసంధానం అవుతూ ఆత్మకు రంగు వేసుకోవాలి. అప్పుడు మన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తన ద్వారా అందరిపై వాటిని స్ప్రే చేయడానికి మనం సిద్ధంగా ఉంటాము. రంగులతో ఆడుకోవడం మరియు వాటిని ఇతరులపై చల్లడం అనేది మన శాశ్వత రంగులయిన శాంతి, ప్రేమ మరియు సామరస్యాలను  ప్రతి ఆత్మకు అందించడాన్ని సూచిస్తుంది. మనలో ఉన్న విభేదాలను దూరం చేసుకుంటూ; ఒకరినొకరు క్షమించుకుంటూ అందరం కలిసి ప్రేమ మరియు ఆనందం యొక్క రంగులలో ఐక్యంగా ఉంటాము.

 

హో లి అంటే చెందినవాడిని అని అర్ధం . పరమాత్మ అయిన భగవంతునికి పూర్తిగా చెందిన ఆనందాన్ని మనం హోలిగా జరుపుకుంటాము. హో లీ అంటే ఇంకొక అర్థం గతం గతః, గతం ఎప్పటికీ తిరిగి రాదు. కాబట్టి, మనం గతంలో ఉండటం,  బాధాకరమైన జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకోవటం లేదా వ్యక్తుల తప్పులను మరవకుండా ఉండటం మానేయాలి. హో లి (Holy) యొక్క అనువాదం ఆధ్యాత్మిక స్వచ్ఛత. అంటే మన ప్రతి కర్మ పవిత్రంగా మరియు దివ్యంగా ఉండాలి. మనం కేవలం జరుపుకోవడమే కాకుండా ప్రతిరోజు హోలి యొక్క అర్థాన్ని జీవితంలో ఆచరిద్దాం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 3)

మీ మనస్సును శాంతియుతమైన ఆధ్యాత్మిక శక్తితో అనుసంధానించడం మీ రోజువారీ జీవితంలో చాలా మంచి అభ్యాసం. భగవంతుడు ఆధ్యాత్మిక శక్తికి మూలాధారం, వారు ఒక వ్యక్తి కారు. వారు  భౌతిక కళ్ళకు కనిపించని, మనస్సుతో

Read More »
27th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 2)

మనమందరం మన జీవితంలో అనేక ఉద్ధేశ్యాలు, లక్ష్యాలతో జీవిస్తాము. కొన్నిసార్లు ఈ జీవిత లక్ష్యాలు మనస్సు మరియు దాని ఆలోచనల పై ఆధిపత్యం చెలాయిస్తాయి. కాబట్టి జీవితంలోని విభిన్న పరిస్థితుల ప్రభావాన్ని నిర్వీర్యం చేయడానికి

Read More »
26th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 1)

మన ఆలోచనలు మరియు భావాలను మనకు  అనుగుణంగా నిర్వహించడం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన సవాలు. మన మనస్సు తరచుగా చెల్లాచెదురైన ఆలోచనలతో నిండి ఉంటుంది, వీటిని మనం తగ్గించుకొని నిర్దిష్ట పనిపై

Read More »