HI

22nd mar 2024 soul sustenance telugu

March 22, 2024

మీ సౌరభాన్ని శుభ్రంగా మరియు స్పష్టంగా ఉంచండి

మన భౌతిక శరీరం యొక్క రక్షణను మరియు ఆరోగ్యాన్ని మనం నిర్ధారించుకున్నట్లే, మన సౌరభం గురించి కూడా మనం శ్రద్ధ వహించాలి. మన ఉద్దేశాలు, ఆలోచనలు, మాటలు, వైఖరులు మరియు ప్రవర్తనల శక్తి మన సౌరభాన్ని సృష్టిస్తుంది. మన సౌరభం ఒక లెన్స్ లాంటిది, దీని ద్వారా మన ప్రపంచాన్ని మనం గ్రహిస్తాము. ఇది కూడా మనం ధరించే పరిమళంలా మన చుట్టూ ఉన్నవారికి ప్రసరిస్తుంది. మన స్వంత ప్రతికూలతను మనలో ఉంచుకోవడం లేదా వ్యక్తులు మరియు పరిస్థితుల నుండి ప్రతికూలతను గ్రహించడం, మన సౌరభాన్ని మురికి చేస్తుంది. వాటిని వదిలి పెట్టడం వల్ల అది శుభ్రమవుతుంది. మీ సౌరభం తెల్లగా, శుభ్రంగా ఉంటుంది. అది మీ చుట్టూ ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది మరియు మీ దివ్యత యొక్క చిహ్నమును కలిగి ఉంటుంది. వ్యక్తులు మరియు పరిస్థితుల నుండి వచ్చే భావనలు మీకు హాని కలిగించి, మీ సౌరభం పై వాటి మరకను పడనివ్వకూడదు. మీ శక్తి క్షేత్రం అన్ని ఇతర శక్తుల కంటే బలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా ధ్యానం మరియు ఆధ్యాత్మిక అధ్యయనంతో, మీరు మీ శక్తి క్షేత్రాన్ని శక్తివంతం చేసుకోవచ్చు. మీ సంతోషం, శాంతి మరియు శక్తి దాని చుట్టూ రక్షణ కవచాలు. కోపం, భయం, ఒత్తిడి మరియు నొప్పి యొక్క తక్కువ ఎనర్జీతో ఉన్న వాటిని మీ సౌరభాన్ని తాకకుండా ఉంచండి. వాటిని దాటి ఎదగండి. ఇతరుల సౌరభాలలో చిక్కుకోవద్దు. వారు గతంలో చేసినవి లేదా ఈరోజు చేస్తున్నవి మీ శక్తి క్షేత్రాన్ని ప్రభావితం చేయనివ్వకండి. ఇది వారిలోని  భాగం, మీలో భాగం కాదు.

 

ఎవరైనా మీపై కోపంగా ఉన్నప్పుడు, మీరు మీ శక్తిని కాపాడుకుంటూ ప్రశాంతంగా ఉంటారా? లేదా మీరు ప్రతిస్పందించి, మీ శక్తిని తగ్గించుకొని, మీ సౌరభాన్ని మరక చేసుకుంటారా? మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నట్లే, మన సౌరభాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. మన పరస్పర చర్యలన్నింటిలో, స్థిరత్వంతో ఆలోచించి స్పందించే వారిగా ఉందాం. ఇతరులలోని మంచితనాన్ని చూద్దాం, మన మంచితనాన్ని ప్రసరింప చేద్దాం. మన సౌరభాన్ని రక్షించుకోవడానికి, ఆరోగ్యం, ఆనందం మరియు సామరస్యాన్ని అనుభవం చేసుకోవడానికి ఇది సులభమైన మార్గం. అవాంఛిత ఆలోచనలు, ప్రతికూల భావోద్వేగాలు, అప్రియమైన జ్ఞాపకాలు, క్షమించలేని వైఖరులు మరియు పరిమిత నమ్మకాల యొక్క భావోద్వేగ అస్తవ్యస్తం మన సౌరభాన్ని మరక చేస్తుంది. దానిని శుభ్రపరచడానికి మనం వాటిని క్రమం తప్పకుండా వదిలేయాలి. ప్రతిరోజూ మీకు మీరు గుర్తు చేసుకోండి – నా సౌరభం పూర్తిగా తెల్లగా ఉంది. నేను దానిని ప్రతిరోజూ శుభ్రపరుస్తాను మరియు బలపరుస్తాను. నేను శక్తిశాలీ ఆత్మను. నా స్వచ్ఛమైన సౌరభం నాకు శాశ్వతమైన శాంతి మరియు ఆనందాన్ని అనుభవించడంలో సహాయపడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 3)

మీ మనస్సును శాంతియుతమైన ఆధ్యాత్మిక శక్తితో అనుసంధానించడం మీ రోజువారీ జీవితంలో చాలా మంచి అభ్యాసం. భగవంతుడు ఆధ్యాత్మిక శక్తికి మూలాధారం, వారు ఒక వ్యక్తి కారు. వారు  భౌతిక కళ్ళకు కనిపించని, మనస్సుతో

Read More »
27th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 2)

మనమందరం మన జీవితంలో అనేక ఉద్ధేశ్యాలు, లక్ష్యాలతో జీవిస్తాము. కొన్నిసార్లు ఈ జీవిత లక్ష్యాలు మనస్సు మరియు దాని ఆలోచనల పై ఆధిపత్యం చెలాయిస్తాయి. కాబట్టి జీవితంలోని విభిన్న పరిస్థితుల ప్రభావాన్ని నిర్వీర్యం చేయడానికి

Read More »
26th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 1)

మన ఆలోచనలు మరియు భావాలను మనకు  అనుగుణంగా నిర్వహించడం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన సవాలు. మన మనస్సు తరచుగా చెల్లాచెదురైన ఆలోచనలతో నిండి ఉంటుంది, వీటిని మనం తగ్గించుకొని నిర్దిష్ట పనిపై

Read More »