ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం
మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ
October 8, 2023
ఒత్తిడి వంటి అసౌకర్య ఎమోషన్స్ ని సహజమైనది లేదా సాధారణమైనదిగా పిలువబడే కాలంలో మనం జీవిస్తున్నాము. ఒక విద్యార్థి పరీక్షలు మరియు ఫలితాల గురించి ఒత్తిడిని సృష్టిస్తాడు, ఒక ప్రొఫెషనల్ కుటుంబం మరియు వృత్తిపరమైన లక్ష్యాలను మేనేజ్ చేయడానికి ఆందోళన చెందుతాడు, రిటైర్ అయిన వ్యక్తి ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాల గురించి ఆత్రుతగా ఉంటాడు. మనం తప్పుడు ఆలోచనలు సృష్టించడం వల్ల ఒత్తిడి వస్తుంది. నేను మేనేజర్‌గా పదోన్నతి పొందేందుకు రెండేళ్లు పడుతుందని తెలిసిన ఉద్యోగిని చూస్తే , నేను దాని కోసం సిన్సియర్‌గా పనిచేస్తున్నాను. కానీ నా స్వంత కండిషన్డ్ (షరతులతో కూడిన) ఆలోచనలు తరచుగా ప్రేరేపించబడతాయి – మేనేజర్‌గా నాకు ఈ ప్రమోషన్ ఖచ్చితంగా అవసరం కానీ అది జరుగుతుందా… అలా జరగకపోతే? కాబట్టి నేను ఈ రోజు మాత్రమే కాదు, మరో రెండు సంవత్సరాలు అశాంతి మరియు ఆందోళనతో ఉంటాను. ఒకరోజు నా ప్రమోషన్ ఏ కారణం చేతనైనా జరగదని నేను భావిస్తే, దాన్ని పొందడానికి నేను అనుచిత మార్గాలను కూడా ఆశ్రయిస్తాను. ఈ విధంగా నేను నా ప్రస్తుత ఒత్తిడి స్థాయిలకు ఆందోళన, నెగిటివిటీ మరియు పశ్చాత్తాపం యొక్క మరిన్ని పొరలను జోడిస్తాను. ఈ స్థితిలో నాకు పదోన్నతి లభిస్తే, నేను మేనేజర్ పాత్రను బాగా చేయగలనా? నేను చేయలేను ఎందుకంటే ఇప్పటికి నేను నా శాంతి మరియు సంతోష స్వభావాన్ని మరచిపోయాను. ఉన్నతమైన బాధ్యతలను నిర్వహించడం గురించి నేను ఒత్తిడికి గురవుతాను. నా సామర్థ్యం తగ్గి నేను బలహీనంగా అవుతాను. పాత్రకు న్యాయం చేయలేను.
మన మొదటి బాధ్యత మనం చేసే పాత్రలో అంతర్గత శక్తిని పెంచుకోవడం ద్వారా మన మనస్సు యొక్క స్థితిని స్థిర పరుచుకోవడం. విజయం లేదా వైఫల్యంలో స్థిరంగా ఉండటానికి ఇది మనకు శక్తిని ఇస్తుంది. పై ఉదాహరణలో ఒత్తిడి అనేది నైతికతపై రాజీ పడినందుకు ఫలితం ఆందోళన, భయం మరియు పశ్చాత్తాపం. నన్ను నేను మేనేజర్ అనే పాత్రతో గుర్తించుకున్నాను. నా ఆనందం మరియు విజయానికి ఇది చాలా ముఖ్యమైనదని నమ్మాను. కానీ నిజంగా నేను మేనేజర్ నా? ఒత్తిడికి ముఖ్యమైన కారణం నేను పాత్ర అనే మన భ్రమ. మనల్ని మనం ఒక చైతన్య శక్తిగా కాకుండా శరీరంగా పరిగణించుకున్నప్పుడు, మన పాత్రలు, విజయాలు మరియు సంపదలతో మనల్ని మనం గుర్తిస్తాము, అవి మన బాహ్య గుర్తింపులు. ఈ ప్రపంచ నాటకంలో మనం నటులం. మన జీవితంలో ఎన్నో పాత్రలను అభినయిస్తాము. మన పాత్రలతో మనం గుర్తించబడకుండా మరియు అంతర్గత స్వయం యొక్క అందమైన గుణాలను మరవకుండా ఉందాము. సరైన స్పృహ ఏమిటంటే, నేను విభిన్న పాత్రలు పోషిస్తున్న అందమైన మరియు సద్గుణవంతుడిని. పాత్ర తాత్కాలికం, అంతర్గత స్వయం శాశ్వతమైనది అనే ఈ అవగాహన పాత్రను అభినయిస్తున్నప్పుడు మన ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ప్రతి పాత్రలోనూ అంతర్గత స్వయం యొక్క విలువలైన శాంతి, ప్రేమ మరియు ఆనందం పై దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది.
మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ
స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని
స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో
Start your day with a breeze of positivity and stay motivated with these daily affirmations
After Clicking on Join, You will be redirected to Whatsapp Community to receive daily message. Your identitiy will be secured and no group member will know about another group member who have joined.