Hin

27th mar 2024 soul sustenance telugu

March 27, 2024

పరిమితులు మరియు మానసిక అవరోధాలను మించి ఎదగడం  (పార్ట్ 1)

మన జీవిత ప్రయాణంలో మన జీవిత లక్ష్యాల వైపు మన పురోగతిని మందగించేలా మానసిక పరిమితులు మనకు అడ్డంకులు. వాటిని దాటి ఎదగడం అనేది మనం శిక్షణ పొందవలసిన ముఖ్యమైన ఆధ్యాత్మిక నైపుణ్యం. పరిమితి లేదా అవరోధం అనేది మనం సృష్టించుకున్న ఆలోచనే. అది మన నిశ్చయ శక్తిని, జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించే శక్తిని తగ్గిస్తుంది. మన సంబంధీకులలో ప్రియమైన వ్యక్తితో నాకు విచ్ఛిన్నమైన సంబంధం ఉందని అనుకుందాం. ఇది సంబంధాన్ని చక్కగా నిర్వహించడంలో నేను విఫలమయ్యాను అనే నమ్మకం నా మనస్సులో ఏర్పడేలా చేస్తుంది. ఈ నమ్మకం అన్ని సంబంధాలు దుఃఖాన్ని ఇస్తాయని ప్రతికూల దృష్టికోణానికి  దారి తీస్తుంది. ఆ దృష్టికోణం మన చేతల్లో కనిపించినప్పుడు, మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మన నుండి పొందాల్సిన సానుకూల శక్తిని పొందరు. అప్పుడు అది సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది.

అలాగే, ఒక వ్యక్తి పట్ల మన మాటలు, చేతలు వారు ఆశించినట్లుగా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి మన నుండి ఎందుకు దూరం అవుతున్నాడో కొన్నిసార్లు మనకు తెలియదు? ఈ సందర్భాలలో, పైన పంచుకున్నట్లుగా మన మనస్సు ఒక తప్పుడు నమ్మకంతో ఖైదు చేయబడింది. అది అవతలి వ్యక్తి పట్ల మన దృష్టికోణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ఆ దృష్టికోణం యొక్క శక్తి నిరంతరం అవతలి వ్యక్తికి చేరి వారిని  తాకుతుంది, దీని వలన అవతలి వ్యక్తి మనం కోరుకునే దానికి భిన్నంగా మనకు ప్రతిస్పందించేలా చేస్తుంది. కాబట్టి, ఈ సందర్భాలలో మానసిక పరిమితి నేపథ్యంలో ఉంటుంది. మనం నిరంతరం స్పృహతో లేదా ఉపచేతనంగా సృష్టిస్తున్న ఆలోచన లేదా ఆలోచనల శ్రేణి స్వయాన్ని పరిమితం చేస్తుంది. ఒక సంవత్సరం పాఠశాల పరీక్షలో నేను ఘోరంగా వ్రాసాను అని అనుకుందాం. తత్ఫలితంగా, నేను నా మనస్సులో మానసిక అవరోధాల శ్రేణిని ఏర్పరచుకున్నాను – నేను అంత చురుకైనవాడిని లేదా పోటీదారుడిని కాదు లేదా నేను భయపడుతూ పరీక్షను ఇచ్చేవాడిని లేదా నేను అంత తెలివైనవాడిని కాను లేదా నేను విజయం సాధించలేను. అలాంటి అడ్డంకులు మన మనస్సు, వ్యక్తిత్వంపై సుత్తులతో కొట్టే బలమైన మానసిక దెబ్బలు వంటివి. ఇది అలాంటి భవిష్యత్తు సంఘటనలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది, ఈ సందర్భంలో పాఠశాలలో మరొక పరీక్షను ఇవ్వడం.

 

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »
17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »