
విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు, ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి గర్వపడతాము. కొన్నిసార్లు ఈ
March 28, 2024
కఠిన పరిస్థితుల నుండి బయటపడటంలో మనం తికమక పడుతూ ఉంటాము లేదా సానుకూల దృఢవిశ్వాసాన్ని కోల్పోతాము. దీని వలన మనం విజయం పొందేది గణనీయంగా తగ్గుతుంది. నిశ్చయ శక్తికి హానికరమైన మన రకరకాల మానసిక స్థితులు సానుకూలతలో లోపం ఏర్పడేలా చేస్తాయి. మనకు ఒక ఏనుగు కధ తెలుసు. అందులో ఆ ఏనుగు చిన్నప్పటినుండి, దాని కాలుని ఒక చిన్న తాడుతో కట్టేసి ఉంచినప్పుడు, అది కోరుకున్నట్లుగా కదిలే స్వేచ్ఛ లేదని భావించేది. ఆ వయసులో ఏనుగును కట్టేయడానికి చిన్న తాడు సరిపోయేది. ఏనుగు పెరిగి పెద్దదవుతున్న కొద్దీ, తాడును విరగగొట్టి, స్వేచ్ఛగా తిరిగేంత శారీరక బలాన్ని కలిగి ఉంటుంది. తాడును విరిచేందుకు తన బలాన్ని ఉపయోగించవచ్చు కానీ అది అలా చేయదు. మానసిక పరిమితికి ఉదాహరణగా చెప్పుకునే తాడును ఛేదించలేనన్న కండిషన్‌తో దాని మనసు కట్టుదిట్టంగా చిన్న ప్రాంతానికే పరిమితమవుతుంది. అదే విధంగా, మన మనస్సు యొక్క అంతర్గత ప్రాంతంలో చిన్నప్పుడు మనం ఆశావాదం లేదా సానుకూలత లేకపోవడం అనే వివిధ రకాల తాళ్లతో కట్టేసి ఉన్నదానికి అలవాటు పడ్డాము. ఉదా. నేను బాగా చేయలేను లేదా నేను తగినంతగా రాణించలేను లేదా నేను ఇతరుల వలె విజయవంతం కాను లేదా నేను ఆత్మవిశ్వాసంలో తక్కువగా ఉన్నాను లేదా నేను తక్కువ సాధించే వాడిని. చాలా మందిలో ఈ తాళ్లు చాలా బలంగా ఉంటాయి. ఎంత బలంగా ఉంటాయంటే, వారు పెద్దయ్యాక ఒక సమయం వస్తుంది, వారి జీవితంలో వివిధ రూపాల్లో విజయాల పరిస్థితులు రావటంతో వారు జీవితంలోని వివిధ రంగాలలో సంతృప్తికరంగా బాగానే సాధించిగలుగుతారు. ఆ సమయంలో వారు ఈ విభిన్న తాళ్లను సులభంగా తెంచి ఉండవచ్చు, కానీ వారు ఇప్పటికీ ఆశావాదంలో తక్కువగా ఉంటారు. ఈ ఆశావాదం లేకపోవడం వారి విజయం సాధించే స్వేచ్ఛను, వారి శక్తికి తగినట్లుగా గొప్పగా సాధించగల సామర్థ్యాన్ని, వారి స్నేహితులు మరియు వారు సన్నిహితంగా ఉన్న వ్యక్తులచే ఆశించిన విధంగా సాధించగల సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది.
మనలో దాగివున్న సంభావ్యత చాలా సందర్భాలలో ఉపయోగించబడకుండా ఉండటానికి కారణం బలహీనమైన స్పృహ. సంవత్సరాలుగా బలహీనమైన ఆలోచనలు మరియు భావాల రూపంలో భావోద్వేగ పరిమితుల వల్ల ఈ బలహీనత ఏర్పడుతుంది. ప్రతి బలహీనమైన ఆలోచన మరియు భావం మన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఎలా శక్తివంతమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయో కొన్ని సార్లు మనకు తెలియకుండానే వ్యక్తపరుస్తాము. అలాగే అవి దీర్ఘకాలంలో మనకు ప్రతికూలంగా తిరిగి వస్తూ ఉంటాయి. పరిమితులు స్వయం సృష్టించబడినవి. మనలో కొందరికి మన జీవిత ప్రయాణంలో అనుభవించామని అనిపించినట్లుగా అవి సమాజం లేదా పరిస్థితుల ద్వారా మనపై విధించబడవు. ఫలానా వ్యక్తి నా జీవితమంతా నాపై ఆధిపత్యం చెలాయించినందున నేను బలహీనంగా ఉన్నానని మనం తరచుగా చెబుతాము. ఆధిపత్యం వహించే వ్యక్తి మన ఆత్మగౌరవానికి కారణం కాదు. మనం అతనితో ఉన్నప్పటి నుండి మన మనస్సులలో అతని మాటలకు, చేతలకు ఎలాంటి రూపాన్ని ఇచ్చామో, మనల్ని మనం తక్కువగా చూసుకోవటం మరియు ఆత్మవిశ్వాసం కోల్పోవడమే కారణం.
(సశేషం…)
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు, ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి గర్వపడతాము. కొన్నిసార్లు ఈ
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు జరిగినా, మంచి మరియు సానుకూల విషయాలకు బదులుగా మన ఆరోగ్యం, ఆర్థిక, సంబంధాలు మరియు
Start your day with a breeze of positivity and stay motivated with these daily affirmations
After Clicking on Join, You will be redirected to Whatsapp Community to receive daily message. Your identitiy will be secured and no group member will know about another group member who have joined.