
భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 2)
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన
March 29, 2024
మన మనస్సులో మానసిక పరిమితిని ఏర్పరచుకున్నప్పుడు, చేయవలసిన మొదటి పని అంతర్గతంగా చెక్ చేసుకోవటం. మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తి సహాయంతో దానిని మార్చడం తదుపరి దశ. ఇది లేకుండా పరిమితి మన వ్యక్తిత్వాన్ని ఆధిపత్యం చేస్తూనే ఉంటుంది. ఈ ప్రక్రియను చెక్ అండ్ చేంజ్ (check and change) అంటారు. అంటే పరిశీలించుకుని మార్చుకోవటం. బలహీన ఆలోచన మనకు మానసిక అవరోధం అవుతుంది. కాబట్టి, మన ఆలోచనా విధానాలను ప్రభావితం చేసే బలహీనమైన ఆలోచనను మొదట చెక్ చేసుకోవాలి. ఆ తరువాత దానిని తొలగించుకోవటము లేదా పరిమితిపై ఆధిపత్యం చెలాయించి దానిని తగ్గించగల శక్తివంతమైన సంకల్పంగా మార్చుకోవాలి. అలాగే, మనం బలహీనమైన ఆలోచనా విధానాల నుండి వెనుతిరిగి కాసేపు ఆగి, వాటిని గమనించాలి మరియు వాటి దిశను ప్రతికూల ఆలోచనల నుండి సానుకూలంగా మార్చుకోవాలి. అడ్డంకిని గెలవడానికి లేదా తొలగించడానికి ఇది మరొక పద్ధతి. అపజయం గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండే వ్యక్తి ఆ వ్యక్తిత్వ లక్షణాన్ని చెక్ చేసుకోవాలి. అలాగే, ఒక నిర్దిష్ట రోజులో, వారు తన జీవితంలో విఫలమయ్యే అవకాశంపై దృష్టి సారించిన ఆలోచనల సంఖ్యను చెక్ చేసుకొని వాటిని విజయం యొక్క సానుకూల ఆలోచనలకు మార్చుకోవాలి. బలహీనమైన ఆలోచనలు మరియు వైఫల్యం యొక్క గుర్తులు వారి మనస్సులోకి ప్రవేశించే అవకాశం లేకుండా రోజంతటిలో విజయాన్ని పదేపదే విజువలైజ్ చేయడంతో పాటు ఈ ఆలోచనలు ఉండాలి.
3 రకాల వ్యక్తులు ఉన్నారు – మొదటి రకం చెక్ చేసుకోలేరు ఫలితంగా వారు మార్చుకోలేరు. రెండవ రకం చెక్ చేసుకునేంత సున్నితంగా ఉంటారు కానీ ఆలోచనా విధానాలను మార్చుకునే లేదా పరివర్తనా శక్తి వారికి లేదు. ఇది నిశ్చయ శక్తి లేకపోవటం వల్ల లేదా వారు నిశ్చయించుకుంటారు కానీ అలా చేయగల మానసిక బలం లేకపోవడం. మూడవ రకం వారు రెండూ, చెక్ చేసుకోగలరు మరియు మార్చుకోగలరు. తమ మానసిక శక్తితో పరిమితిని మరియు మానసిక అవరోధాన్ని అధిగమిస్తారు. మానసిక శక్తిని పెంచుకోవ డానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. వాటిలో కొన్ని – శాంతి, ప్రేమ, సంతోషం, ఆనందం, స్వచ్ఛత, శక్తి మరియు సత్యం యొక్క సద్గుణాలకు సంబంధించిన సానుకూల శక్తివంతమైన ఆలోచనలను సృష్టించడం. అలాగే, ఉదయం విన్న లేదా చదివిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోతుగా విశ్లేషించడం లేదా మథనం చేయడం. మరొక పద్ధతి మెడిటేషన్. ఆత్మ మరియు పరమాత్మ లేదా భగవంతుని మధ్య అనుసంధానమే మెడిటేషన్.
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఉదయం మనం రోజును ప్రారంభించినప్పుడు, వివిధ చర్యలను చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా లేదా మన ఆఫీసులో ఉన్నా
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మనది వినాలని లేదా మనమంటే ఆసక్తికరంగా అనిపించాలని అందరితో మాట్లాడుతూ ఉండాలి అని భావిస్తాము. ఈ ఆత్రుత
Start your day with a breeze of positivity and stay motivated with these daily affirmations
After Clicking on Join, You will be redirected to Whatsapp Community to receive daily message. Your identitiy will be secured and no group member will know about another group member who have joined.