Hin

16th april 2024 soul sustenance telugu

April 16, 2024

ప్యూర్ బైట్స్ – స్వచ్ఛమైన ఆహారం కోసం 5 చిట్కాలు

మీరు ఏమిటో మీరు తీసుకునే ఆహారమే చెప్తుంది – అని చెప్పబడింది. అంటే మీరు తినే ఆహారం యొక్క శక్తి మీ మనస్సు మరియు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన ఆహారం కోసం 5 చిట్కాలు క్రింద ఇవ్వబడ్డాయి:

 

  1. మీ కడుపుని పోషించడానికి స్వచ్ఛమైన, సాత్విక ఆహారాన్ని మాత్రమే ఎంచుకోండి. మాంసాహార ఆహారాన్ని మానుకోండి. ఇది కోపం, బాధ, నొప్పి, భయం వంటి వైబ్రేషన్లను కలిగి ఉంటుంది. దానిని మాంసంగా తినడానికి చంపినప్పుడు, ఆ జంతువు తన శరీరంలో వాటిని స్రవిస్తుంది.
  2. ఆహారాన్ని వండేటప్పుడు, భగవంతుడిని స్మరించుకుంటూ, ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడిన మాటలను వింటూ లేదా ఆ నేపథ్యంలో ప్రశాంతమైన మెడిటేషన్ మ్యూజిక్ లేదా ఆధ్యాత్మిక పాటలను ప్లే చేయడం ద్వారా స్వచ్ఛమైన, సానుకూల స్పృహను కలిగి ఉండండి.
  3. మీరు ఆహారాన్ని వండడం పూర్తి చేసిన తర్వాత, భగవంతునికి ఆహారాన్ని సమర్పించండి. మెడిటేషన్ లో వారి సానుకూల శక్తిని గ్రహించండి. ఆహారాన్ని ఇచ్చినందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలుపుతూ భగవంతుని శక్తితో ఆహారాన్ని నింపండి.
  4. తినడానికి ముందు, సుమారు 10-15 సెకన్ల పాటు మీ మనస్సులో ఆరోగ్యం, ఆనందం యొక్క సానుకూల సంకల్పాలను సృష్టించండి మరియు మీ కళ్ళ ద్వారా ఆహారంలో స్వచ్ఛమైన, శాంతియుత వైబ్రేషన్లను ప్రసరింపజేయండి. మీకు అనగా ఆత్మకు మరియు మీ భౌతిక శరీరానికి ఆహారం మరియు పోషణకు, తినడానికి మంచి ఆరోగ్యకరమైనదాన్ని ఇచ్చినందుకు ప్రకృతికి ధన్యవాదాలు చెప్పండి.
  5. ఆహారం తినే సమయంలో, తక్కువగా మాట్లాడండి, ఇతరులతో మీ సంభాషణలు చిన్నగా, మధురంగా, సానుకూలంగా మరియు ఎటువంటి ప్రతికూల శక్తి లేకుండా ఉండేలా చూసుకోండి. భోజనం చేస్తున్నప్పుడు టీవీ ఆన్‌ చేయకండి. అలాగే, భోజన సమయంలో వార్తాపత్రిక చదవవద్దు, మీ ఫోన్‌ను ఉపయోగించవద్దు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »
17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »