Hin

21st mar 2024 soul sustenance telugu

March 21, 2024

రోజువారీ జీవితంలో ఆచరణాత్మక ఆధ్యాత్మికత

తరచూ మన చర్చలు వ్యక్తుల చుట్టూనే తిరిగుతుంటాయి. ఇతరుల అలవాట్లు, ప్రవర్తనల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, అవి సరైనవి కావు అని మనం నమ్మినప్పుడు, వారి నెగిటివ్ శక్తిని మనం మన సత్తా క్షేత్రంలోకి తీసుకుంటున్నామని అర్థం. గాలి కబుర్లు చాలా సులభంగా మన శక్తిని హరించేసి, వాతావరణాన్ని పాడు చేస్తాయి. ఇతరుల గురించిన రసవత్తరమైన కథను చెప్పడానికి మీరు తహతహలాడారా? మీకు తెలిసిన విషయాన్ని మీకు తెలిసినవారికి చెప్పకుండా ఉండలేకపోతున్నారా? అంటే, మీరు గాలి కబుర్లు చెప్తున్నారా? ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని ఎంతో అందంగా, తెలివిగా పదాలతో పాలిష్ చేసి చెప్పినంత మాత్రాన గాలి కబుర్లు బంగారం అయిపోవు. అనవసర చర్చలు ఇతరుల గౌరవాన్ని దెబ్బ తీయడమే కాకుండా మన నైతిక స్థాయిని కూడా దిగజారుస్తాయి.  ఎవరి గురించైనా, నిజంగా మనం ఏదైనా చెప్పాలంటే, వారిలో ఉన్న అనేక మంచి విషయాలను కూడా చెప్పవచ్చు. నేను సామాజిక అవగాహనతో ఉన్నానని చూపించుకోవడానికి ఇతరుల వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పడం ఎంతవరకు నైతికము? ఇతరుల గురించి మంచిగా మాట్లాడినప్పుడు మన దృష్టిలో మనం మంచివారిగా ఉంటాము.

గుర్తుంచుకోండి నేను ఇతరుల భావాలను, గోప్యతను గౌరవిస్తాను. నేను గాలి కబుర్లు, ఇతరులను నిర్ణయించడం, అనవసర చర్చను తిరస్కరిస్తాను. ఇతరుల గురించి మంచే మాట్లాడాలి, అనవసర చర్చ చేయకూడదు అని మీ మనసుకు చెప్పండి. ఆత్మ నియంత్రణను, ఆత్మ బలాన్ని పెంచండి.  ఇతరుల నెగిటివ్ ప్రవర్తనలు, శక్తుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అందుకోసం కేవలం వారి గురించి ఆలోచించకండి, మాట్లాడకండి. ప్రతి గంట ఇలా అనుకోండి – నేను శక్తి స్వరూపాన్ని. నేను కేవలం వ్యక్తులలోని మంచినే గమనిస్తాను, వారిలోని మంచి గురించే మాట్లాడుతాను. కేవలం శుద్ధమైన ఆలోచనలే చేయండి, పవిత్రమైన మాటలే మాట్లాడండి. మిమ్మల్ని , మీ వాతావరణాన్ని సంరక్షించండి. ఇతరుల పట్ల మీకున్న పాజిటివ్ ఆలోచనలు, మాటలు మీ శక్తిని పెంచుతాయి మరియు మీ చుట్టూ ఉన్నవారి శక్తిని కూడా పెంచుతాయి. మీ ప్రతి ఆలోచన మరియు మాట ఒక దీవెనగా అవ్వాలి, మీ తరంగాలు అత్యుత్తమ స్థాయిలో ఉండాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th april 2025 soul sustenance telugu

సంతుష్టత – ధారణ చేసి రేడియేట్ చేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడమే మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం. నా జీవితంలో అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత,

Read More »
24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »