HI

30th mar 2024 soul sustenance telugu

March 30, 2024

సంబంధాలలో ప్రేమ ప్రవాహాన్ని తిరిగి మార్చడం

జీవితంలో తమకు చాలా దుఃఖం కలిగించినది ఎవరని మనం ఎవరినైనా అడిగితే, చాలా మంది వారు ప్రేమిస్తున్న లేదా చాలా ఇష్టపడిన వారనే చెప్తారు. ఎందుకు అలా? ప్రేమ అనే శక్తి బయటి నుంచి వచ్చి ఆంతరికంగా మనల్ని నింపుతుందని నమ్మడం వల్ల అలా జరుగుతుంది. మరొకరి నుండి వచ్చే  ప్రేమ యొక్క శక్తి  మరియు అనుభూతి  మన అంతర్గత కోరికను నెరవేరుస్తుంది. మన అవసరం కారణంగా, మనం చాలా ఇష్టపడే ఒక నిర్దిష్ట వ్యక్తితో మోహము ఏర్పరచుకుంటాము. వారు తమ ప్రేమతో మనల్ని నింపుతారని, అది మనల్ని బలంగా, నిండుగా మరియు మరింత సంతుష్టంగా చేస్తుందని నమ్ముతాము. కాబట్టి మనం ఈ అవసరం కోసం అవతలి వ్యక్తిపై ఆధారపడటం ప్రారంభిస్తాము. వారు   మనల్ని నింపలేని ప్రతి సారీ మనం దుఃఖాన్ని అనుభవిస్తాము. ప్రేమ అనేది ఒక శక్తి, అది మనలోనే ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ లోపలి నుండి బయటికి వస్తూ మరొకరికి చేరుకుని వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది బయటి నుండి లోపలికి రాదు.

 

మనం ప్రేమ ప్రవాహం  యొక్క దిశను మార్చటానికి ప్రయత్నిస్తే, అంటే ప్రేమ యొక్క శక్తిని బయటి నుండి వచ్చేలా చేస్తే, ప్రేమ కోసం బయటి వైపు ఆధారపడటం ప్రారంభిస్తాము, దీని ఫలితంగా లోపల  ఖాళీగా అనిపిస్తుంది. మీరు మీ గదిని శుభ్రం చేయడానికి వాక్యూమ్ చేసినప్పుడు, అది మంచి మరియు చెడులను గ్రహిస్తుంది. మీరు మీ కార్పెట్‌పై చాలా చిన్నది, కానీ మీకు అత్యంత విలువైనది ఏదైనా పడిపోయినట్లయితే, వాక్యూమ్ క్లీనర్ దానిని గ్రహిస్తుంది లేదా దానిని ఇంట్లో వద్దనుకునే ఎటువంటి విలువలేని, పనికిరాని  దుమ్ముతో కలిపి తీసుకుంటుంది. మీరు భావోద్వేగ స్థాయిలో వాక్యూమింగ్ ప్రభావంతో జీవిస్తున్నప్పుడు, మీరు ఇష్టపడే వ్యక్తి యొక్క ప్రేమ, సంరక్షణ, శ్రద్ధ, గుణాలు, శక్తులు, ప్రత్యేకతలు, శక్తి మొదలైనవాటిని మీరు గ్రహిస్తారు, కానీ మీరు వారి బలహీనతలను, ఆందోళనలను, భయాలను మొదలైనవాటిని కూడా గ్రహిస్తూ ఉంటారు. ఆ విధంగా, ఉత్పాదకతను తగ్గిస్తూ భావోద్వేగ బాధను కలిగించటానికి ఒక ఆధారం  ఏర్పడుతుంది. మనం చల్లబడిపోయినట్టుగా మారి ఇతరుల నుండి ప్రేమను అంగీకరించడం మానేయాలని దీని అర్థం కాదు, కానీ మన అంతర్గత శ్రేయస్సు, సంతోషం కోసం మనం ఇకనుండి దానిపై ఆధారపడకూడదని అర్థం. అలాగే, మరోవైపు, మనం ప్రేమను ఇస్తూ ఉంటాము. మనం ప్రేమను ఇచ్చినప్పుడు, ముందు  మనం దానిని అనుభవం చేసుకుంటాము. మనకు కావాల్సిందీ ప్రేమ యొక్క అనుభవమే  కదా.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 2)

ఒక నిమిషం పాటు మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆపివేసి, మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంబంధాలను కోల్పోవడాన్ని మీరు పట్టించుకోనంతగా లక్ష్యం ముఖ్యమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అలాగే, ఈ ప్రక్రియలో నేను

Read More »
17th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 1)

మనమందరం ఉదయం నుండి రాత్రి వరకు చేసే వివిధ చర్యలతో నిండిన జీవితాన్ని గడుపుతున్నాము. వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక లేదా ఆర్థిక రంగాలలో ప్రతి చర్య నేను ఆశించిన దానిని సాధించాలనే ఉద్దేశ్యం లేదా

Read More »
16th april 2024 soul sustenance telugu

ప్యూర్ బైట్స్ – స్వచ్ఛమైన ఆహారం కోసం 5 చిట్కాలు

మీరు ఏమిటో మీరు తీసుకునే ఆహారమే చెప్తుంది – అని చెప్పబడింది. అంటే మీరు తినే ఆహారం యొక్క శక్తి మీ మనస్సు మరియు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన ఆహారం కోసం 5

Read More »