Hin

10th april 2024 soul sustenance telugu

April 10, 2024

సత్యత యొక్క వ్యక్తిత్వాన్ని సృష్టించడం (పార్ట్ 1)

మన జీవితంలోని ఒక అందమైన అంశం మాటలు మరియు చర్యల యొక్క నిజాయితి. దీనికి కొన్నిసార్లు తగినంత ప్రాముఖ్యత ఇవ్వబడదు. చాలా తరచుగా మన ఆలోచనలలో తప్పుడు ఉద్దేశాలు దాగి ఉంటాయి, అవి మనం వ్యక్తపరిచే మాటలు, చేతలకు వేరుగా ఉంటాయి. అలాగే, కొన్ని సమయాల్లో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వేరే వ్యక్తిని లేదా భిన్నమైన స్వభావాన్ని బయటి ప్రపంచానికి చూపవచ్చు మరియు లోపల విభిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వ్యక్తులను తమను తాముగా ఉండకుండా ఆపేది ఏమిటి? ఇది బాహ్య ప్రపంచం యొక్క భయమా లేదా వ్యక్తిత్వ లక్షణమా – లోపల మరియు వెలుపల భిన్నంగా ఉండటం? అలాగే, ఇది ఆశ్చర్యంగా ఉంటుంది, ప్రపంచానికి తన యొక్క భిన్నమైన ముఖాన్ని చూపించే అలాంటి వ్యక్తిని చుట్టుపక్కల వారు ఎక్కువ గౌరవిస్తారా లేదా తక్కువా? తక్కువ, మనకు అనిపిస్తుంది మరియు అనుభవం కలిగింది కూడా. ఎందుకు? మనం అబద్ధం చెబుతున్నామని లేదా అనేక విషయాల గురించి అందరికి తప్పుడు అభిప్రాయాన్ని ఇస్తున్నామని ముందో వెనుకో అందరు గ్రహించి, నిర్ణయించుకుంటారు. అలాంటి వ్యక్తి విశ్వసనీయత మరియు గౌరవాన్ని కోల్పోతాడు.

కాబట్టి, తప్పుడు స్వభావంతో ఉండకుండా సత్యతతో ఉండటం మంచిది. అలాగే, ఇతరులను మెప్పించడం కొరకు ప్రపంచానికి బాహ్యంగా చూపించే లక్షణాలు కృత్రిమ ఆభరణాల లాంటివి, ఇవి చూడటానికి బాగుంటాయి కానీ ఎటువంటి విలువను కలిగి ఉండవు. కాబట్టి, సద్గుణాలను మీ హృదయంలో ఉంచుకోండి, తలపై కాదు. అంటే, లోపల అంత మంచి వ్యక్తిగా లేకపోయినా, మీరు మంచి వ్యక్తి అని ప్రపంచానికి చూపించడానికి సద్గుణవంతులుగా మారవద్దు. దీనికి భిన్నంగా, లోపల ఎంత మంచిగా ఉండాలంటే మీ సుగుణాల వల్ల అందరూ మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు,  మీరు కృత్రిమంగా మంచి వారా లేక నిజంగానే మంచి వారా అని తెలుసుకోవడంలో చాలా చురుకుగా ఉంటారు. కాబట్టి, కృత్రిమ గుణాలతో అందరినీ మోసం చేసే బదులు, మీ మంచితనాన్ని హృదయపూర్వకంగా వ్యక్తపరచండి అప్పుడు అందరూ మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »