Hin

15th april 2024 soul sustenance telugu

April 15, 2024

సులభంగా అంగీకరించండి మరియు అపేక్షలకు దూరంగా ఉండండి

అంగీకరించే కళ ప్రశాంతంగా ఉండి జీవితంతో సాగిపోయే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది తేలికగా జీవించడానికి సహాయపడుతుంది. ఈ కళ అంచనాలు, ఆందోళనలు మరియు ఆపేక్షల నుండి మనల్ని విముక్తి చేస్తూ మన ప్రయాణాన్ని తేలికగా ఉంచుతుంది. మనం వ్యక్తులను మరియు పరిస్థితులను ప్రతిఘటించడం లేదా వాటిని ఒప్పు లేదా తప్పు అని నిర్ధారించడం కంటే వాటికి అనుగుణంగా ఉండడం నేర్చుకుంటాము. మన భావోద్వేగాలకు కూడా మనం వారిని బాధ్యులను చేయము. అంగీకారం అంటే ప్రశంసలు, ప్రేరణ, ప్రేమ మరియు గౌరవం యొక్క ఛాయలను కూడా కలిగి ఉంటుంది. మనం అంగీకారాన్ని అనుభవం చేసుకుంటూ ఆచరిస్తున్నప్పుడు, ఇతరుల నుండి మరింత అంగీకారాన్ని అనుభవం చేసుకుంటాము. అలాగే, మనం అంగీకరించి, ఆపై వ్యవహరిస్తాము. ప్రస్తుత క్షణంలో ఏది ఉంటె, దానిని మనం ఎంచుకున్నట్లుగా అంగీకరించమని అది మనకు బోధిస్తుంది.

అంగీకారం అంటే అంతా పర్ఫెక్ట్ అని కాదు, మన మానసిక స్థితి పరిపూర్ణంగా ఉందని అర్థం. అంగీకారం అంటే విషయాలు ఎలా ఉంటె అలాగే ఉండనివ్వడం కాదు, మన మనస్సును స్థిరంగా ఉంచి పరిస్థితిపై పని చేయడం. ఏమి జరిగిందో అంగీకరించడం అనేది పరిష్కారం దిశగా పని చేయడం ప్రారంభించటానికి వేసే మొదటి అడుగు. మనం మొదట మన తప్పులు లేదా కఠినమైన సంస్కారాలతో పాటు స్వయాన్ని అంగీకరించాలి, ఆపై మాత్రమే దిద్దుబాట్లపై దృష్టి పెట్టాలి. లేకుంటే మనము అపరాధభావానికి లోనవుతాము మరియు పశ్చాత్తాపపడతాము. ఇవి ఆత్మ శక్తిని క్షీణింపజేస్తాయి. అంగీకారం మనల్ని పరివర్తన వైపు నడిపిస్తుంది. నిరాకరణ సంకెళ్ల నుంచి విముక్తి పొంది కొత్త మార్గాన్ని సృష్టించుకుంటూ ముందుకు సాగేందుకు వీలు కల్పిస్తుంది. ఇతరులను అంగీకరించడం అంటే వారు మనకు భిన్నంగా ఉన్నారని మనం అంగీకరిస్తాము. మనం వారితో ఏకీభవిస్తున్నామని దీని అర్థం కాదు. మనం ఇతరుల ప్రతికూల సంస్కారాలను అంగీకరించి వారు ఏ విధంగా ఉంటె  ఆలా ఉండనివ్వడమని కూడా దీని అర్థం కాదు. దీని అర్థం మన మనస్సు కలవరపడకుండా వారి సంస్కారం నుండి వేరుగా ఉండటం. పరిస్థితులను అంగీకరించే కళ అంటే, ఇది ఏమిటి అని ప్రశ్నిస్తూ, ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే దాని లోకి వెళ్లడం కంటే, ఇక ఇది ఇంతే అని అర్థం చేసుకోవటం. మనం పరిస్థితిని అంగీకరించినప్పుడు, మన మనస్సు నిశ్శబ్దంగా,  స్థిరంగా ఉంటుంది. మన సామర్థ్యం మరియు నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది. మన దృష్టి సమస్య నుండి పరిష్కారం వైపు మళ్లుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »
15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »