HI

17th april 2024 soul sustenance telugu

April 17, 2024

విజయానికి 8 మెట్లు (పార్ట్ 1)

మనమందరం ఉదయం నుండి రాత్రి వరకు చేసే వివిధ చర్యలతో నిండిన జీవితాన్ని గడుపుతున్నాము. వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక లేదా ఆర్థిక రంగాలలో ప్రతి చర్య నేను ఆశించిన దానిని సాధించాలనే ఉద్దేశ్యం లేదా స్వచ్ఛమైన కోరికతో నిండి ఉంటుంది. కానీ ఆశయం ఒక మితిమీరిన కోరికగా మారినప్పుడు, అది మన సంబంధాలు, ఆరోగ్యం మరియు మనస్సును కొన్నిసార్లు ఒక్కొక్క దానిని, కొన్నిసార్లు అన్నిటిని కలిపి ప్రభావితం చేస్తే విషయాలు తప్పుగా జరుగుతాయి. కొంతమందిలో, విజయం సాధించాలనే కోరిక చాలా తీవ్రంగా ఉండి మితిమీరిపోయి అది వారి ఆలోచనలను అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ లక్ష్యం నుండి వారిని దూరం చేసే ఏదైనా చర్య పట్ల వారు ఆసక్తిని కోల్పోతారు.

కొందరికి విజయం ఒక ధరకు వస్తుందని అంటారు – విరిగిన మనసు, ఒత్తిడితో కూడిన మనస్సు, అనారోగ్యకరమైన శరీరం మరియు హానికరమైన సంబంధాలు. కొందరికి జీవితం ఒక నిరంతర సవాలు లాంటిది. సవాళ్లు మంచివి; అవి ఆంతరిక శక్తులను బయటకు తీసుకువస్తాయి మరియు మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని తడుతూ సహాయపడతాయి. కానీ అదే సమయంలో,  తింటూ, నిద్రపోతూ మరియు ప్రతి శ్వాసలో సవాళ్లు మరియు లక్ష్యాల కోసం తపించే జీవితం విజయానికి తప్పుడు మార్గం. చిన్నవయసులో వృత్తి పరంగా బాగా అలసిపోవడానికి ప్రధాన కారణం చాలా గొప్పగా సాధించాలనే కలలు కనటం మరియు మితిమీరన కోరికను పెట్టుకోవటం. ఇది చాలా మంది వ్యక్తులు తమ కెరీర్‌లు, కుటుంబ జీవితాల్లో కొంత కాలం తర్వాత తీవ్ర నిరాశకు, ఉత్సాహాన్ని మరియు ఆసక్తిని కోల్పోయేలా చేస్తోంది. చాలా మంది వ్యక్తులు మెడిటేషన్, సేద దీరే పద్ధతులను నేర్చుకుంటున్నారు ఎందుకంటే వారు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సమతుల్యతను కోల్పోయారు. విజయ గమ్యం తమ వైపుకు రాకుండా వారికి దూరంగా ఉండడంతో వారు విజయానికి సరైన మార్గాన్ని వదిలేసారు.

తరువాతి రెండు రోజుల సందేశాలలో, విజయం సాధించడానికి భావోద్వేగ స్థాయిలో తీసుకోవలసిన 8 విభిన్న దశలను వివరిస్తాము. అదే సమయంలో సంబంధాలలో ప్రేమను కోల్పోయే, శారీరక, మానసిక రోగాల రూపంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సాధించే విజయం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 3)

మీ మనస్సును శాంతియుతమైన ఆధ్యాత్మిక శక్తితో అనుసంధానించడం మీ రోజువారీ జీవితంలో చాలా మంచి అభ్యాసం. భగవంతుడు ఆధ్యాత్మిక శక్తికి మూలాధారం, వారు ఒక వ్యక్తి కారు. వారు  భౌతిక కళ్ళకు కనిపించని, మనస్సుతో

Read More »
27th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 2)

మనమందరం మన జీవితంలో అనేక ఉద్ధేశ్యాలు, లక్ష్యాలతో జీవిస్తాము. కొన్నిసార్లు ఈ జీవిత లక్ష్యాలు మనస్సు మరియు దాని ఆలోచనల పై ఆధిపత్యం చెలాయిస్తాయి. కాబట్టి జీవితంలోని విభిన్న పరిస్థితుల ప్రభావాన్ని నిర్వీర్యం చేయడానికి

Read More »
26th april 2024 soul sustenance telugu

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 1)

మన ఆలోచనలు మరియు భావాలను మనకు  అనుగుణంగా నిర్వహించడం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన సవాలు. మన మనస్సు తరచుగా చెల్లాచెదురైన ఆలోచనలతో నిండి ఉంటుంది, వీటిని మనం తగ్గించుకొని నిర్దిష్ట పనిపై

Read More »