Search for a command to run...
17 Apr 1969
పురుషార్థంపై స్నేహం ఉన్నవారే అందరికీ స్నేహితులుగా అవ్వగలరు
17 April 1969 · తెలుగు
(ఆబూ ‘ఆధ్యాత్మిక సంగ్రహాలయం’ యొక్క ఉద్ఘాటన)
సర్వ స్నేహి పిల్లలకు తండ్రి యొక్క నమస్తే. మీ స్నేహము ఎవరితో ఉంది? (కొందరు బాబాతో అన్నారు, కొందరు సేవతో అన్నారు). ఇంకా ఎవరి పైనైనా స్నేహము ఉందా? ఇంకా ఒక విషయం మిగిలిపోయింది. బాప్దాదాతో అయితే స్నేహము ఉంది, కానీ దానితోపాటు పురుషార్థంతో కూడా స్నేహము ఉండాలి. దైవీ పరివారంతో స్నేహము, సేవతో స్నేహము, బాప్దాదాతో స్నేహము, ఇవైతే ఉండనే ఉన్నాయి. కానీ వర్తమాన సమయంలో పురుషార్థంపై ఎక్కువ స్నేహాన్ని పెట్టుకోవాలి. ఎవరైతే పురుషార్థంతో స్నేహిగా ఉంటారో వారు అందరికీ స్నేహిగా అవుతారు. పురుషార్థంపై అందరికీ ఎంత స్నేహము ఉంది అన్న విషయాన్ని అందరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. బాప్దాదా మీద కూడా స్నేహము ఎందుకు ఉందంటే వారు పురుషార్థం చేయిస్తారు కాబట్టి. ముందు పురుషార్థం మీద స్నేహం ఉంటేనే ప్రాలబ్ధం మీద కూడా స్నేహము ఉంటుంది. పురుషార్థం మీద స్నేహం లేనంత వరకు దైవీ పరివారపు స్నేహాన్ని తీసుకోలేరు, ఇవ్వలేరు. ఒకవేళ పురుషార్థంతో స్నేహం ఉన్నట్లయితే వారు ఇతరుల స్నేహానికి పాత్రులుగా అవుతారు. స్నేహం కారణంగానే ఇక్కడకు వచ్చారు, బాప్దాదా స్నేహంలో ఉంటున్నారు. ఇప్పుడు పురుషార్థం మీద కూడా స్నేహం ఉండాలి. ఎందుకంటే ఈ పురుషార్థమే పిల్లలైన మీకు పూర్తి కల్పానికి ప్రాలబ్ధాన్ని తయారు చేయిస్తుంది.
ఎంతగా పిల్లలకు స్నేహము ఉందో అంతకన్నా ఎంతో ఎక్కువ స్నేహము బాప్దాదాకు కూడా ఉంది. ఎవరు ఎంత స్నేహిగా ఉంటారో అంతగా వారికి స్నేహానికి రెస్పాండ్ లభిస్తుంది. అవ్యక్త రూపంతో స్నేహాన్ని తీసుకోవాలి. అవ్యక్త స్నేహం యొక్క పాఠాన్ని ఎంత చదువుకున్నారు? వర్తమాన సమయం యొక్క పాఠము ఇదే. అవ్యక్త రూపంతో స్నేహాన్ని తీసుకోవాలి మరియు స్నేహంతో సేవకు రుజువును ఇవ్వాలి. ఈ అవ్యక్త స్నేహపు పాఠాన్ని ఎంత పక్కా చేసుకున్నారు? ఇప్పుడు రిజల్టు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? సగం వరకు చేరుకున్నారా? మెజారిటీ రిజల్టును అడుగుతున్నాము. (కొందరు 25 శాతం అన్నారు, కొందరు 75 శాతం అన్నారు) 25 మరియు 75కి ఎంత తేడా ఉంది? మెజారిటీ 25 అనుకుంటున్నారు, ఇలాంటి రిజల్టు ఎందుకు ఉంది? ఇందుకు కారణం ఏమిటి? 25 శాతం అవ్యక్త స్నేహము ఉంటే మిగతా 75 శాతం ఏ స్నేహము ఉంది? మెజారిటీమందికి 25 శాతము రిజల్టు ఉంటే భవిష్య సమయములో పాస్ మార్కులు ఎలా వస్తాయి? ఇప్పుడైతే అవ్యక్త స్నేహమే ముఖ్యము. అవ్యక్త స్నేహమే స్మృతి యాత్రకు బలాన్ని ఇస్తుంది. అవ్యక్త స్నేహమే అవ్యక్త స్థితిని తయారు చేసుకోవడంలో సహాయం చేస్తుంది. 25 శాతం – ఈ రిజల్టు ఎందుకు ఉంది? కారణం ఆలోచించారా? సమయానుసారంగా ఇప్పటి వరకు ఈ రిజల్టు ఉండకూడదు. సమయానుసారంగా 75 శాతం ఉండాలి. ఇటువంటి రిజల్టు రావాలంటే ఏమి చేయాలి? అందుకు పద్ధతి ఏమిటి? (అంతర్ముఖత) అంతర్ముఖంగా ఉండాలి అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కానీ అలా ఉండకపోవడానికి కారణం ఏమిటి?
బాప్దాదాతో, సేవతో స్నేహమైతే ఉంది. కానీ పురుషార్థంపై తక్కువ స్నేహం ఉంది. ఇందుకు కారణము ఏమి చూసామంటే, చాలావరకు పరిస్థితులను చూసి కలవరపడుతూ ఉంటారు. పరిస్థితులను ఆధారం చేసుకుని స్థితిని తయారు చేసుకుంటారు. స్థితితో పరిస్థితిని మార్చరు. పరిస్థితి మారితే స్థితి బాగుంటుంది అని అనుకుంటారు. కానీ స్వ స్థితి ఉండాలి, దీని ద్వారానే పరిస్థితులు మారుతాయి. అది పర స్థితి, ఇది స్వ స్థితి. పరిస్థితిలోకి వచ్చిన కారణంగానే బలహీనతలోకి వచ్చేస్తున్నారు. స్వ స్థితిలోకి వస్తే శక్తి వస్తుంది. కనుక, పరిస్థితులను చూసి ఆగిపోకండి. స్వ స్థితికి ఎంత శక్తి ఉందంటే అది ఎటువంటి పరిస్థితినైనా పరివర్తన చేయగలదు. స్వ స్థితి బలహీనంగా ఉన్న కారణంగా ఒక్కోసారి పరిస్థితి ప్రబలమవుతుంది. బాబా, ఈ విషయాన్ని సరి చేయండి అప్పుడు మేము ఇలా అవుతాము, ఈ విషయం ఆటంకంగా ఉంది అని మెజారిటీ పిల్లలు అంటూ ఉంటారు. తమ ధైర్యముతో పరిస్థితిని దాటి చూపిస్తాము అని అనేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. అర్జీ పెడతారు, ఇది కూడా మంచిదే, కానీ అర్జీతో పాటు ఏదైతే శిక్షణ లభించిందో, దానిని స్వరూపంలోకి తీసుకురావడం లేదు. అందరి అర్జీల ఫైళ్ళు చాలా జమ అయ్యాయి, ధర్మరాజు పుస్తకాల వలె. వర్తమాన సమయంలో బాప్దాదా వద్ద పిల్లల అర్జీలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఫైలు ఉంది. ముఖ్యమైన విషయాన్ని వినిపించాము కదా -పురుషార్థంతో స్నేహాన్ని పెట్టుకోవాలి. స్వయాన్ని ఏమని అంటారు? (పురుషార్థీ) మీరు పురుషార్థీలు కానీ పురుషార్థం గురించి తెలియదు, మీ ఫైలు గురించి తెలుసా? మీ పురుషార్థం ఎలా ఉందో తెలుసా? సాకార రూపంలో ఫైనల్ స్థితిని చూసారు కదా. మరి సాకార రూపంలో కర్మ చేసి చూపించారు, దాని వలన ఫైనల్ స్థితి గురించి తెలిసింది కదా. ఫైనల్ స్థితి అనుసారంగా ఏ లోపమైతే కనిపిస్తుందో, ఆ లోపాన్ని త్వరగా తీసివేయడమే పురుషార్థంపై ప్రేమ అంటే. నెమ్మది-నెమ్మదిగా చేయకండి. సాకారుడిలోని ఒక ముఖ్యమైన గుణాన్ని చూసారు కదా, వారు ఏ విషయాన్నీ తర్వాత చేద్దాములే అని వదలలేదు. ఇప్పుడే చేయాలి. ఎలా అయితే వారు ‘ఇప్పుడే చేసేవారు’ కదా, అలాగే మీరు కూడా ఇప్పుడే చేయాలి. తర్వాత చేద్దాములే, 10-15 రోజుల తర్వాత చేద్దాములే అని కాదు. మధుబన్ నుండి వెళ్ళిన తర్వాత అభ్యాసం చేద్దాము, ఇలా చాలా వేచి ఉంటారు. ఏర్పాట్లను చేయడం లేదు. విషయాల కోసం చాలా వేచి ఉంటారు. వేచి ఉండటాన్ని తీసివేసి ఏర్పాట్లలో ఉంటే 75 శాతం రిజల్టు వచ్చేస్తుంది.
వర్తమాన సమయం మెజారిటీ పురుషార్థం యొక్క రిజల్టు 75కన్నా తక్కువ ఉండకూడదు. కారణం కూడా వినిపిస్తున్నాము, కొందరు సమయం కోసం వేచి ఉన్నారు, కొందరు సమస్యలు, కొందరు సంబంధాలు, కొందరు తమ శరీరం విషయంలో వేచి ఉంటున్నారు. కానీ ఎలా ఉన్నామో, ఎదురుగా ఏమి ఉన్నాయో అలాంటి పరిస్థితులలోనే, ఈ శరీరంలో ఉంటూనే సంపూర్ణంగా కావాలి, ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆధారం ఉన్న కారణంగా అధీనంగా అవుతున్నారు. విషయాలకు అధీనులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ కథను అమృతవేళ వినిపిస్తుంటారు. శరీర రోగం లేకపోతే మేము చాలా బాగా పురషార్థం చేసేవారిమి అని కొందరు అంటారు, కొందరేమో బంధనాలను తొలగించండి అంటారు. కానీ ఒక బంధనం పోతే మరో బంధనం వస్తూనే ఉంటుంది కదా, తనువు బంధనం తొలగితే, మనసు బంధనం వస్తుంది, ధనం వస్తుంది, సంబంధాలది వస్తుంది, అప్పుడు ఏమి చేస్తారు? ఇవి వాటంతట అవే పోవు. మీ శక్తితోటే తొలగించాలి. కొందరు, బాప్దాదా తొలగిస్తారు లేక సమయం వచ్చినప్పుడు అవి తొలగిపోతాయి అని అనుకుంటారు. కానీ ఇలా అనుకోకండి. ఇప్పుడైతే సమయం సమీపంగా చేరుకుంది. ఇప్పుడు ఢీలా పురుషార్థం ఉన్నట్లయితే పురుషార్థం చేసే సమయం చేతినుండి పోగొట్టుకుంటారు. ఇప్పుడైతే ఒక్కొక్క సెకండు, ఒక్కొక్క శ్వాస, ఎన్ని శ్వాసలు తీసుకుంటారో తెలుసా? లెక్కలేనన్ని కదా. మరి ఒక్కొక్క శ్వాస, ఒక్కొక్క సెకండు సఫలం అవ్వాలి. ఇది ఇటువంటి సమయము. ఒకవేళ కొంతైనా నిర్లక్ష్యము ఉంటే, ఎలా అయితే కొంతమంది పిల్లలు సాకార మధుర మిలనపు సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నారు కదా, అలాగే ఈ పురుషార్థపు సౌభాగ్య సమయం కూడా మీ చేతి నుండి జారిపోతుంది. అందుకే ముందే వినిపిస్తున్నాము. పురుషార్థంపై స్నేహాన్ని పెట్టుకుని పురుషార్థాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. పైనుండి అన్ని ఆటలను చూస్తూనే ఉంటాము. మీరు కూడా వచ్చి చూడండి, చాలా మజా వస్తుంది. పిల్లల చాలా రమణీయమైన ఆటలను చూస్తాము. మీరు కూడా చూడవచ్చు. మీరు మీ ఉన్నత స్థితిలో స్థితులై చూస్తే మీతో పాటు ఇతరుల ఆటను కూడా చూడవచ్చు. బాప్దాదా అయితే చూస్తూ ఉంటారు. నవ్వు తెప్పించే ఆట ఇది. పెద్ద పెద్ద మహారథులు పులితో భయపడరు కానీ చీమను చూసి భయపడతారు. పులిని చాలా సహజంగా ఎదుర్కుంటారు, కానీ చీమను నలిపే పద్ధతి తెలియదు. ఇది మహారథుల ఆట. గుర్రపు సవారీ వారు ఏమి చేస్తారో తెలుసా? (గాలప్ చేస్తారు, దౌడు తీస్తారు) గుర్రపు సవారీల ఆటను కూడా చూస్తాము. మహారథులదైతే వినిపించాము కదా. గుర్రపు సవారీలు – వారికి ధైర్యము, ఉత్సాహము చాలా ఉన్నాయి. పురుషార్థంలో అడుగులు కూడా ముందుకు వేస్తారు, కానీ గాలప్ చేస్తూ చేస్తూ (జారిపడతాము) జారి పడరు, కింద పడరు, అలసిపోరు కూడా. అవిశ్రాంతంగా ఉంటారు, చాలా బాగా నడుస్తారు కానీ మార్గంలో వచ్చే దృశ్యాలకు ఆకర్షితమవుతారు. తమ పురుషార్థాన్ని నడిపిస్తూ కూడా ఉంటారు కానీ చూసే సంస్కారం కూడా ఉంటుంది. వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎలా చేస్తున్నారు, మేము కూడా చేస్తాము. పోటీ పడుతూ ఉంటారు. గుర్రపు సవారీ పిల్లలలో చూసే ఆకర్షణ ఎక్కువగా ఉంది. కాలి నడకన ఉండేవారిదైతే చాలా నవ్వు తెప్పించే విషయము ఉంది. ఆట వినిపిస్తున్నాము కదా. వారు ఏమి చేస్తారు? ఉండేది చిన్న విషయము కానీ దానిని ఇంత పెద్ద పర్వతంలా చేస్తారు. పర్వతాన్ని ఆవగింజగా కాదు, ఆవగింజను పర్వతంలా చేసి దానిలో వారే కలవరపడుతూ ఉంటారు. అసలు అక్కడ ఏమీ ఉండదు, వారే అంతా చేస్తారు. పెద్దగా చూసి ధైర్యహీనులుగా అవుతారు. అయినా కానీ వర్తమాన సమయంలో ఈ ముగ్గురిలో సగం క్వాలిటీ స్వయాన్ని పరివర్తన చేసుకుంటున్నారు. అందుకని వారి ధైర్యము, ఉల్లాసము, అడుగులు ముందుకు పడటాన్ని చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. మీలో ఎవరు మహారథి, ఎవరు గుర్రపు సవారీ మరియు ఎవరు కాల్బంటు అని ప్రతి ఒక్కరినీ అడిగితే చెప్పగలరా? అచ్ఛా!
ఓంశాంతి
17-04-1969
బ్రాహ్మణుల ముఖ్య సంస్కారము – సర్వస్వ త్యాగి
మీ అందరి సంగఠనను ప్రత్యేకంగా ఎందుకు పిలిపించాము? సంగఠన కోసం ముఖ్యంగా నాలుగు విషయాలు అవసరము – 1. పరస్పర స్నేహము 2. సమీప సంబంధము 3. సేవా బాధ్యత మరియు 4. జ్ఞాన యోగాల ధారణకు రుజువు. ఈ నాలుగు విషయాలలో తయారుగా ఉన్నారా? పరస్పరం ఒకరితో ఒకరు స్నేహంతో ఎలా ఉండాలి? స్నేహిగా అయ్యేందుకు సాధనము ఏమిటి? ఒకరితో ఒకరు దూరమవుతూ ఉంటారు కదా, ఇందుకు ముఖ్య కారణము ఉంది. ఎందుకంటే ఒకరి సంస్కారాలు, సంకల్పాలు మరొకరితో కలవవు. అందరి సంకల్పాలు, సంస్కారాలు ఒకేలా ఎలా ఉంటాయి? (సంస్కారాలు అయితే అందరికీ వేరువేరుగా ఉంటాయి) సంగమయుగ బ్రాహ్మణుల ముఖ్య సంస్కారము ఏమిటి? సాకార రూపంలో ముఖ్య సంస్కారం ఏమి ఉండినది? బ్రహ్మా సంస్కారమే బ్రాహ్మణుల సంస్కారము. సాకార బ్రహ్మాలో ఉన్న ముఖ్య సంస్కారము ఏమిటి? బ్రహ్మాలో ఆ సంస్కారాన్ని సంపూర్ణ రూపంలో చూసాము. కానీ బ్రాహ్మణులలో యథా యోగము, యథా శక్తి. వారిలోని ముఖ్య సంస్కారము – సర్వస్వ త్యాగి. నిరహంకారి అంటేనే అర్థం సర్వస్వ త్యాగము. తమదంతా త్యాగం చేసేస్తారు. సర్వస్వ త్యాగి అయినందువలన సర్వ గుణాలు వచ్చేస్తాయి. ఇతరుల అవగుణాలను చూడకుండా ఉండటము కూడా త్యాగమే. త్యాగం చేసే అభ్యాసం ఉంటే ఇది కూడా త్యాగం చేయగలరు. సర్వస్వ త్యాగి అంటే దేహ భానాన్ని కూడా త్యాగం చేయడము. కనుక, బ్రాహ్మణుల ముఖ్య సంస్కారము – సర్వస్వ త్యాగము. ఈ త్యాగము వలన ముఖ్యమైన ఏ గుణాలు వస్తాయి? సరళత మరియు సహనశీలత. ఎవరిలో అయితే సరళత మరియు సహనశీలత ఉంటాయో వారు ఇతరులను కూడా తప్పకుండా ఆకర్షిస్తారు. ఇతరులకు స్నేహిగా కూడా అవుతారు. ఒకవేళ సరళత లేకపోతే స్నేహము కూడా ఉండదు. పరస్పరం స్నేహిగా అవ్వాలంటే ఇదే పద్ధతి. ఒకటి సర్వస్వ త్యాగిగా అవ్వాలి దేహ సహితంగా. ఈ సర్వస్వ త్యాగముతో సరళత, సహనశీలత వాటంతటవే వచ్చేస్తాయి. సర్వస్వ త్యాగికి గుర్తు – సరళత మరియు సహనశీలత. సాకార రూపంలో కూడా చూసాము కదా. ఎంత నాలెజ్ఫుల్ ఉన్నారో అంతే సరళ స్వభావము ఉండినది. దీనినే బాల్య సంస్కారము అంటారు. పెద్దవారికి పెద్దవాడు అలాగే పిల్లలకు పిల్లవాడు.
మీ అందరి నడవడిక ఎలా ఉండాలంటే మీ నడవడికతో బాబా మరియు దాదా చిత్రము కనిపించాలి. చెప్పడం వలన కాదు. నడవడికతో చిత్రము కనిపిస్తుంది. ఇటువంటి నడవడిక ఇప్పుడు ఉందా? మీ నడవడికతో బాప్దాదా చిత్రము కనిపిస్తుందా? కనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు. ఆ స్థితిలో ఉండి ఎప్పుడైతే సేవ చేస్తారో అప్పుడు మీ వాణి ద్వారా, ముఖం ద్వారా, వీరికి జ్ఞానాన్ని ఇచ్చేవారు ఉన్నతమైనవారు అని అర్థం అవుతుంది. మీ నడవడికతో బాప్దాదా చిత్రము కనిపిస్తుంది అని అంటారు కదా. కానీ అప్పుడప్పుడు. మీరు కూడా ఒక కెమరా వంటివారు. మీ కెమరాలో బాప్దాదా చిత్రము ముద్రింపబడి ఉంది. దానిని అప్పుడప్పుడు చూపిస్తున్నారు, ఎందుకని? సదా ఆ చిత్రాన్ని మీ నడవడికతో ఎందుకు చూపించడం లేదు? (పురుషార్థం చేస్తున్నాము). ఈ పురుషార్థము అన్న మాటను ఎప్పటివరకు ఉపయోగిస్తారు? ఇప్పుడు ఎంత సమయం పురుషార్థం చేస్తారు? నేను పురుషార్థిని అని చివరి వరకు ఇలాగే చెప్తూ ఉంటారా? ఇప్పుడు చెప్తున్నట్లుగా చివరి వరకు చెప్తుంటారా? పురుషార్థం మాటను ఇప్పుడు మార్చండి. పురుషార్థీలుగా చివరి వరకు ఉంటారు అయినా కానీ ఆ పురుషార్థము ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా ఉండదు. ఒకసారి తప్పు జరిగితే అది మళ్ళీ జరగకుండా ఉండేలా చూసుకోవడాన్నే పురుషార్థము అంటారు. ఇటువంటి పురుషార్థము ఉందా? పురుషార్థము యొక్క అర్థము ఏదైతే ఉందో దాని ప్రాక్టికల్ రూపంలోకి రావాలి. ఒకటే పొరపాటు పదే పదే జరుగుతూ ఉంటే దానిని పురుషార్థం అని ఎలా చెప్పగలము? పురుషార్థం యొక్క లక్ష్యము ఏదైతే ఉందో, అది పురుషార్థీగా అయిన తర్వాత కూడా పురుషార్థం చేయాలి. కనుక, ఈ విధంగా పురుషార్థం మాటను ఉపయోగించడం కూడా విడిచిపెట్టండి. ఒకరికొకరు స్నేహిగా ఎలా అవ్వగలరు? కేవలం ఉత్తరాలు వ్రాసుకోవడము, సంగఠన చాలా? దీనితో అవ్వరు. ఇదైతే స్థూల విషయము. సంస్కారాలు మరియు సంకల్పాలు పరస్పరం కలుపుకున్నప్పుడే స్నేహిగా అవుతారు. అందుకు విధానము కూడా వినిపించాము (సర్వస్వ త్యాగి) సర్వస్వ త్యాగికి గుర్తు ఏమిటి? (సరళత, సహనశీలత). ఈ విషయాలను ధారణ చేసుకున్నప్పుడే స్నేహిగా అవుతారు. సరళతను తీసుకురావడానికి వర్తమాన సమయంలో కేవలం ఒక్క విషయంపై శ్రద్ధ వహించండి. వర్తమాన సమయం ఏమి చూసామంటే – ఈరోజుల్లో స్థితి స్తుతిపై ఆధారపడి ఉంది. స్తుతి మరియు నింద రెండు మాటలు ఉన్నాయి. వర్తమాన సమయంలో స్తుతి ఆధారంగా స్థితి ఉంది అనగా ఏ కర్మను అయితే చేస్తారో దాని ఫలాపేక్షను లేక లోభాన్ని పెట్టుకుంటున్నారు. చేసిన కర్తవ్యానికి ఫలితాన్ని ఎక్కువ ఆశిస్తున్నారు. స్తుతి లభించకపోతే స్థితి ఉండటం లేదు. స్తుతి జరిగితే స్థితి కూడా బాగా ఉంటుంది. ఒకవేళ నింద జరిగితే అనాథలుగా అవుతున్నారు. మీ స్థితిని విడిచిపెడ్తున్నారు, నాథుడిని కూడా మర్చిపోతున్నారు. కనుక, నా స్తుతి జరగాలి అని ఎప్పుడూ భావించకండి. స్తుతి ఆధారంగా స్థితిని పెట్టుకోకండి. స్తుతి ఆధారంగా స్థితి ఉంటే స్థితి అలజడిలోకి వస్తుంది. అనన్యుల ప్రభావము రోజురోజకూ దానంతటదే పెరుగుతుంది. కానీ ప్రభావానికి స్వయమే ప్రభావితులవ్వకండి. ఇక్కడే ఫలితాన్ని స్వీకరిస్తే భవిష్య ఫలితాన్ని సమాప్తం చేసుకున్నట్లే. ఎంతగా గుప్త పురుషార్థం ఉంటుందో, అంతగా గుప్తమైన సహయోగము, అంతగా గుప్తమైన పదవి లభిస్తాయి. ఇతరులు ఎంత మహిమ చేసినా కానీ వారి మహిమ యొక్క ప్రభావంలో ప్రభావితులవ్వకండి.
ఏ కార్యం చేయాలన్నా సంగమంలో నిల్చుని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే అందరూ సంగమయుగ వాసులము అంటారు కదా. అందుకని ఏ విషయం జరిగినా కానీ రెండు వైపుల ఉంటుంది. రెండు వైపులకు మధ్యన సంగమంలో నిల్చుని నిర్ణయం తీసుకోండి. అటు ఎక్కువ వద్దు, ఇటు ఎక్కువ వద్దు. సంగమంలో (మధ్యలో) నిల్చోండి. సంగమయుగ బ్రాహ్మణులైన మీరు చేసే కర్తవ్యాలు సంగమంలో నిలవవు, అటైనా, ఇటైనా వెళ్తాయి. ఎలా అయితే మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ సేవలో కూడా సహయోగిగా ఉంటారు కదా, అందుకు రెండు వైపులను సంభాళించుకోవడం కోసం మధ్యస్థంలో నిల్చుంటారు కదా. రెండింటి మధ్య స్థితిలో ఉండాలి. సంగమంలో ఉంటే రెండిటిని సరి చేయగలము. మీ ఆహార పానీయాలు, ధరించడము అన్నీ మధ్యస్థంగానే ఉంటాయి. ఇలాగే మీ నిర్ణయం కూడా మధ్య స్థితిలో స్థితి అయ్యి రెండు వైపులను పరిశీలించి తర్వాత తీసుకోండి. కొన్ని విషయాలలో, అయితే అటు లేకపోతే ఇటు ఎక్కువగా ఉండటాన్ని చూసాము. కానీ ఉండాలి మధ్యలో. మధ్య స్థితి బీజము. బిందువు. బీజము సూక్ష్మంగా ఉంటుంది కదా, అలాగే మధ్య స్థితి కూడా సూక్ష్మమైనది. దాని పైన నిల్చునే ధైర్యము, విధానము రావాలి.
ఈ లక్ష్యము కూడా ఇచ్చాము – ఎక్కడ బాలకుడిగా అయి నడుచుకోవాలి, ఎక్కడ యజమానిగా అయి నడుచుకోవాలి. యజమానిగా ఉండాల్సిన చోట బాలకుడిగా ఉండకండి. ఎక్కడ బాలకుడిగా ఉండాలో అక్కడ యజమానిగా అవ్వకండి. ఈ విషయాన్ని కూడా చాలామంది మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఈ చెకింగ్ కూడా చాలా చేసుకోవాలి. బాలకతనము కూడా పూర్తిగా ఉండాలి, యజమానితనము కూడా పూర్తిగా ఉండాలి. అందుకే సంగమంలో ఉండమని చెప్పాము. కేవలం బాలకుడిగానే అవ్వకండి, అలాగే కేవలం యజమానిగా కూడా అవ్వకండి. రెండు గుణాలు ఉంటేనే అన్నింటినీ సరిగ్గా నడిపించగలరు. బాలకతనము అంటే నిస్సంకల్ప స్థితి. ఏ ఆజ్ఞ లభిస్తే, ఏ డైరెక్షన్ లభిస్తే దానిపై నడవాలి. యజమానితనము అంటే మీ సలహాను ఇవ్వడము. ఎక్కడ యజమానిగా అవ్వాలి అని స్థానాన్ని, విషయాన్ని చూడాలి. అన్నిచోట్ల యజమానిగా అవ్వద్దు. ఎక్కడ బాలకుడిగా అవ్వాలో అక్కడ ఒకవేళ యజమానిగా అయితే సంస్కారాల ఘర్షణ జరుగుతుంది. కనుక పరస్పరం సహయోగిగా అయ్యేందుకు రెండు విషయాలను ధారణ చేయండి. లేకపోతే సంస్కారాల ఘర్షణ జరుగుతుంది. ఎక్కడ బాలకుడిగా అవ్వాలో అక్కడ యజమానిగా అయిపోతున్నారు, ఇద్దరు యజమానులు అయిపోయిన కారణంగా సంస్కారాల ఘర్షణ వస్తుంది. యజమానిగా కూడా అవ్వాలి, బాలకుడిగా కూడా అవ్వాలి. యజమానిగా అయ్యి సలహా ఇవ్వండి. ఫైనల్ అయిన తర్వాత బాలకునిగా అయిపోవాలి. ఎప్పుడు బాలకుడిగా అవ్వాలి ఎప్పుడు యజమానిగా అవ్వాలి అన్నది కూడా బుద్ధి యొక్క నిర్ణయం. ఏ సమయంలో ఏ స్వరూపాన్ని ధారణ చేయాలో కూడా ఆలోచించండి. బహురూపిగా అవ్వాలి కదా. సదా ఒకే రూపంలో కాదు. సమయాన్ని బట్టి రూపము. వంకరరూపంలో బహురూపిగా అవ్వకండి, సక్రమమైన రూపంలో అవ్వండి. అచ్ఛా!
ఓంశాంతి