Search for a command to run...
26 Mar 1970
మహారథితనము యొక్క గుణము మరియు కర్తవ్యము
26 March 1970 · తెలుగు
ఈ రోజు మాట్లాడాలా లేక మాట్లాడటము నుండి అతీతముగా వెళ్ళాలా? మాట్లాడటము నుండి అతీతముగా వెళ్ళే స్థితి మంచిగా అనిపిస్తుందా లేక మాట్లాడటము మంచిగా అనిపిస్తుందా? (రెండూ) ఎక్కువగా ఏది మంచిగా అనిపిస్తుంది? మాట్లాడుతూ కూడా మాటల నుండి అతీతముగా అయ్యే స్థితి ఉండగలదా? రెండూ కలిసి ఉండగలవా? లేక ఎప్పుడైతే మాట్లాడరో అప్పుడు అతీతముగా ఉండే స్థితి ఉండగలదా? ఉండగలదంటే ఎప్పుడు ఉంటుంది? ఈ స్థితిలో స్థితులయ్యేందుకు ఎంత సమయం కావాలి? ఇప్పుడు అవ్వగలదా? కొన్ని నెలలు లేక కొన్ని సంవత్సరాలు కావాలా? ప్రాక్టీసు ఇప్పుడు మొదలు పెట్టగలరా లేక కార్యవ్యవహారములలో ఉన్నారు కాబట్టి వీలవ్వదా? ఒకవేళ అవ్వగలదంటే ఇప్పటినుండే అవ్వగలదా? ఎవరైతే మహారథులు అని ఎవరైతే పిలవబడతున్నారో వారి ప్రాక్టీసు మరియు ప్రాక్టికల్ రెండూ కలిసి జరగాలి. మహారథులు మరియు గుర్రపు సవారీలలో తేడా ఇదే. ప్రాక్టీసు చేయగానే ప్రాక్టికల్‌గా అయిపోవడమే మహారథుల గుర్తు. గుర్రపు సవారీవారు ప్రాక్టీసు చేసిన తరువాత ప్రాక్టికల్లోకి వస్తారు. ఇక కాల్బలము వారు ప్లాన్లను ఆలోచిస్తూనే ఉంటారు. ఇదే తేడా. అటెన్షన్ ఉంది, ప్రాక్టీసు చేస్తాము అన్న మాటలను కూడా పిల్లలు తమ నోటినుండి మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ స్థితి కూడా దాటిపోయింది. ఇప్పుడైతే సంకల్పమేదో కర్మ కూడా అదే కావాలి. సంకల్పము మరియు కర్మలో తేడా ఉండకూడదు. అవి చిన్ననాటి విషయాలు. సంకల్పము చెయ్యటము, ప్లాన్లు తయారుచేయటము, తర్వాత వాటిపైన నడవటము, ఇప్పుడు ఆ రోజులు కాదు. ఇప్పుడు చదువు ఎంతవరకు చేరుకుంది? ఇప్పుడైతే అంతిమ దశలో ఉంది. మహారథితనములో ఏ గుణాలు మరియు కర్తవ్యములు ఉంటాయో వాటిపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు దానినే వినిపించేందుకు మరియు అంతిమ స్థితి స్వరూపపు సాక్షాత్కారమును చేయించేందుకు వచ్చాము. సర్వీసబుల్ పిల్లలు ఏమి చెయ్యవచ్చు, ఏమి చెయ్యకూడదు, ఏమి అనవచ్చు, ఏమి అనకూడదు? ఇప్పటినుండి ధారణ చెయ్యటం ద్వారానే అంతిమ మూర్తిగా అవుతారు. సాకార నిదర్శనమును చూసారు కదా, ప్రాక్టీసు మరియు ప్రాక్టికల్ ఒకే విధంగా ఉండేదా లేక వేరువేరుగా ఉండేదా? ఏ సంకల్పమో అదే కర్మ ఉండేది. ఫాలో చెయ్యటమే పిల్లల కర్తవ్యము. అడుగుపై అడుగు. ఫుట్ స్టెప్ (అడుగుజాడల)పై నడవడమంటేనే అర్ధము - అడుగులో అడుగు. ఎలా ఉందో అలాగే ఫాలో చేస్తారు. ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది? మహారథుల నోటినుండి ఎప్పుడు అన్న మాట కూడా వెలువడదు. ఎప్పుడో చేస్తారా లేక ఇప్పుడు చేస్తారా? ఎప్పుడు అన్న మాట శోభించదు. ఎప్పుడు అన్న మాట బలహీనతను నిరూపిస్తుంది. చేసే చూపిస్తాము అన్నది ఒకటి, చేద్దాము, ఆలోచిద్దాము అనడం మరొకటి. ధైర్యము ఉంది కానీ విశ్వాసమే లేదు. విశ్వాసముతో కూడిన మాటలు ఇలా ఉండవు. విశ్వాసము అన్నదాని అర్థమే నిశ్చయబుద్ధి. మనసు, వచనము, కర్మ అన్ని విషయాలలో నిశ్చయబుద్ధి. కేవలం జ్ఞానము మరియు తండ్రి పరిచయము వరకే నిశ్చయము కాదు. వారి సంకల్పము కూడా నిశ్చయబుద్ధిగా, వాణిలో కూడా నిశ్చయము ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ మాటలూ ధైర్యవిహీనముగా ఉండవు. వారినే మహారథి అని అంటారు. మహారథి అర్థమే మహానత.
పరస్పరములో ఏయే ప్లాన్లను తయారుచేసారు? ఎటువంటి ప్లానును తయారు చేయాలంటే ఆ ప్లాను ద్వారా నూతన ప్రపంచపు ప్లాను ప్రాక్టికల్ అయిపోవాలి. నూతన ప్రపంచపు ప్లాను ప్రాక్టికల్లోకి రావటము అనగా పాత ప్రపంచపు ఏ విషయమూ తిరిగి ప్రాక్టికల్‌లో రాకూడదు. ప్లానులైతే చాలా తయారవుతాయి, ఇప్పుడు ప్రాక్టికల్‌లో ఎంత అవుతుందో చూద్దాము అని అందరూ అంటారు, అయితే కొందరు మనసులో అంటారు, కొందరు నోటితో అంటారు. కానీ ఈ సంకల్పమును కూడా సదా కోసం తొలగించటము, ఇది మహారథుల పని. అందరి దృష్టి ఇప్పుడు విశేషంగా మధువనములోని ముఖ్య రత్నాలపై ఉంది. మీలో పరివర్తన అయిన దృష్టియే వారి దృష్టికి చూపించండి. ఇప్పుడు ఆ పాత దృష్టి లేదు, పాత వృత్తి లేదు. అప్పుడే అంతిమ నగారా మ్రోగుతుంది. ఈ సంగఠన సామాన్యమైనది కాదు, ఈ సంగఠన అద్భుతమైనది. ఈ సంగఠన నుండి ఎటువంటి స్వరూపులుగా అయ్యి వెలువడాలంటే అందరికీ సాక్షాత్తు బాప్‌దాదా మాటలుగానే అనుభవమవ్వాలి. బాప్‌దాదా సంస్కారాలు అందరి సంస్కారాలలో కనిపించాలి, మీ సంస్కారాలు కనిపించకూడదు. అన్ని సంస్కారాలను తొలగించి ఏ సంస్కారమును నింపుకోవాలి? బాప్‌దాదా సంస్కారమును నింపాలి. వీరు సాక్షాత్తు బాప్‌దాదా లాగానే అయ్యి వెలువడ్డారని అందరికీ సాక్షాత్కారమవ్వాలి. ఇలా అందరికీ అనుభవం చేయించాలి. ఎటువంటి పాత సంకల్పము గానీ సంస్కారము గానీ ఎదురుగా రానేకూడదు. ఇది బాప్‌దాదా సంస్కారమేనా అని మొదట పోల్చి చూసుకోండి. ఒకవేళ అది బాప్‌దాదా సంస్కారము కానట్లయితే దానిని తాకను కూడా తాకవద్దు. బుద్ధిలో సంకల్పరూపంలో కూడా తాకకూడదు. ఏవిధంగా క్రిమినల్(అశుద్ధ) వస్తువును తాకరో అలాగే అది ఒకవేళ బాప్‌దాదా సమానమైన సంస్కారము కానట్లయితే ఆ సంస్కారమును తాకనే తాకకూడదు. దీనిని చెయ్యకూడదు అని నియమాన్ని పెట్టుకున్నప్పుడు, ఆ తరువాత ఇక ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ దానిని మీరు చేయరు కదా! పరిస్థితులను ఎదిరిస్తారు, ఎందుకంటే ఇది చెయ్యాలి అన్న లక్ష్యము ఉంది. అలాగే మీ సంస్కారము ఏదైతే బాప్‌దాదా సమానమైన సంస్కారము కాదో దానిని అస్సలు తాకకూడదు. అలా భావించండి. దేహము మరియు దేహ సంబంధాలు అనే ఈ నిచ్చెననైతే ఎక్కేసారు, కానీ ఇప్పుడు బుద్ధిలో కూడా సంస్కారము ఇమర్జ్ కాకూడదు. ఎటువంటి సంస్కారము ఉంటే అటువంటి స్వరూపము కలుగుతుంది. ఎవరి సంస్కారమైతే సరళంగా, మధురంగా ఉంటుందో ఆ సంస్కారము స్వరూపములోకి వస్తుంది.
సంస్కారములు బాప్‌దాదా సమానంగా తయారైపోయినట్లయితే బాప్‌దాదా స్వరూపము అందరికీ కనిపిస్తుంది. బాప్‌దాదా ఎలాగో పూర్తిగా అలాగే అదే గుణము, అదే కర్తవ్యము, అదే మాట, అదే సంకల్పము ఉండాలి, అప్పుడు అందరి నోటి నుండి వీరు వారిలాగే అనిపిస్తున్నారు అనే మాట వెలువడుతుంది. ముఖము వేరుగా ఉంటుంది, కానీ గుణము అదేగా ఉంటుంది. కానీ ముఖముపైకి గుణాలు రావాలి. ఇప్పుడు బాప్‌దాదా పిల్లల నుండి ఇదే ఆశను ఉంచుతారు. అందరూ స్నేహీ, సఫలతా సితారలుగా, పురుషార్ధీ సితారలుగా అయితే ఉండనే ఉన్నారు. సర్వీసబుల్ పిల్లల పురుషార్థము సఫలత సహితంగా ఉంటుంది. నిమిత్తంగా పురుషార్థము చేస్తారు, కానీ సఫలత అయితే ఉండనే ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థమైందా? ఏది ఆలోచిస్తామో, ఏది అంటామో దానినే చేస్తాము. ఆలోచిస్తాను, చూస్తాను, అలా అనుకుంటున్నాను... ఇలాంటి మాటలు విన్నప్పుడు నవ్వు వస్తుంది, ఇప్పటివరకు కూడా ఇలా ఎందుకు ఉన్నారు? ఇప్పుడు ఈ మాటలు ఎలా అనిపిస్తున్నాయంటే, ఎవరైనా ముసలి వాళ్ళయిన తరువాత బొమ్మలతో ఆడుకుంటుంటే ఏమనిపిస్తుంది? అందుకే బాప్‌దాదా కూడా చిరునవ్వు నవ్వుతారు - ముసలివాళ్ళు అయినాగానీ అప్పుడప్పుడు చిన్ననాటి ఆటలు ఆడుతూ ఉంటారు. బొమ్మలాట ఏమిటో తెలుసా? వారి(బొమ్మల) పూర్తి జీవితాన్ని తయారు చేస్తారు, చిన్నప్పటి నుండి పెద్దయ్యేవరకు పెంచుతారు, తరువాత స్వయంవరం (వివాహము) చేస్తారు... అలాగే పిల్లలు కూడా అనేక విషయాలను తయారు చేస్తారు, సంకల్పాల రచనను చేస్తారు, వాటి పాలన చేస్తారు, వాటిని పెద్దగా చేస్తారు మళ్ళీ వాటితో స్వయమే విసిగిపోతారు. మరి ఇది బొమ్మలాట కాదా? స్వయాన్ని చూసి స్వయమే ఆశ్చర్యపోతారు కూడా. ఇప్పుడు అటువంటి రచనను రచించవద్దు. బాప్‌దాదా వ్యర్ధ రచనను రచించరు. పిల్లలేమో వ్యర్థ రచనను రచించి మళ్ళీ వాటినుండి దూరమయ్యేందుకు మరియు తొలగించేందుకు పురుషార్థము చేస్తారు. కావున అటువంటి రచనను రచించవద్దు. క్షణకాలంలో మంచి రచనను కూడా రచిస్తారు, చెడు రచనను కూడా అంతే త్వరగా రచిస్తారు. ఒక్క క్షణంలో ఎన్ని సంకల్పాలు వస్తాయి! రచనను రచించి, సమయాన్ని ఇచ్చి, మళ్ళీ వాటిని సమాప్తము చేసే ప్రయత్నము చేయడం అవసరమా? ఇప్పుడు ఈ రచనకు బ్రేకు వెయ్యాలి.
వారు కుటుంబ నియంత్రణను చేస్తారు కదా! ఇక్కడ కూడా సంకల్పాల ఉత్పత్తి జరుగుతుంది. కావున ఇది కూడా బర్త్ (జన్మ). అక్కడ జనసంఖ్య అతిలోకి వెళ్తే ఇక్కడ సంకల్పాల సంఖ్య అతి అవుతుంది. ఇప్పుడు వీటిని కంట్రోల్ (అదుపు) చెయ్యాలి. పురుషార్ధములోని బలహీనత కారణంగా సంకల్పాల రచన జరుగుతుంది, కావున ఇప్పుడు దీనిని నామరూపాలు లేకుండా సమాప్తము చేసేయ్యాలి. పాత మాటలు, పాత సంస్కారాలు ఎలా అనుభవమవ్వాలంటే అసలు అవి ఎప్పటి పాత విషయాలో తెలియనుకూడా తెలియదు అని అనిపించాలి. అలా నామరూపాలు కూడా లేకుండా సమాప్తమైపోవాలి. ఇప్పుడు భాష మారాలి. సంపూర్ణతా స్టేజ్ అనుసారంగా లేని చాలా మాటలు ఇప్పటివరకు కూడా కొందరి నుండి వెలువడుతున్నాయి. కావున ఇప్పటి నుండి సంకల్పము కూడా అదే చెయ్యాలి, మాట కూడా అదే మాట్లాడాలి, కర్మ కూడా అదే చెయ్యాలి. ఈ భట్టీ తరువాత అందరి ముఖాలలో సంపూర్ణత యొక్క ప్రకాశము కనిపించాలి. మీరు ఇప్పటినుండే సంపూర్ణతను సమీపంగా తీసుకువచ్చినట్లయితే అప్పుడు నంబరువారీగా మరింత సమీపంగా తీసుకురాగలరు. ఒకవేళ మీరే అంతిమంలో తీసుకువచ్చినట్లయితే ఇతరులు ఏంచేస్తారు? సాకార రూపుడు సంపూర్ణతను సాకారములోకి తీసుకువచ్చారు. సాకార రూపములో సంపూర్ణత సంపన్నంగా కనిపించేది. సంపూర్ణత మరియు సాకారుడు రెండూ వేరుగా కనిపించేవి కావు. అలాగే మీ సాకార స్వరూపము వేరుగా కనిపించకూడదు. సాకార రూపుడిలో ఏ ముఖ్యమైన గుణం స్పష్టంగా కనిపించింది? ఏ గుణము ద్వారా సంపూర్ణత సమీపంగా కనిపించింది? అది ఏ గుణము? ఆ గుణాన్ని చూసే సాకారములో ఉన్నాగానీ అవ్యక్తముగా అనుభవమయ్యేది అని అందరూ అనేవారు. అది ఏ గుణము? (ప్రతిఒక్కరూ వినిపించారు) అన్ని విషయాల రహస్యమైతే ఒక్కటే. కానీ ఇటువంటి స్థితిని ఉపరామ(అతీత) స్థితి అని అంటారు. తమ దేహమునుండి కూడా ఉపరామము. ఉపరామము మరియు ద్రష్ట.
ఎవరైతే సాక్షిగా అవుతారో వారి ఉదాహరణనే ఇవ్వటం జరుగుతుంది. కావున సాక్షీద్రష్ట యొక్క ప్రమాణమును ద్రష్టాంతరూపములో ఎదురుగా ఉంచుకోవాలి. ఒకటేమో మీ బుద్ధి నుండి ఉపరామము, సంస్కారాల నుండి కూడా ఉపరామము. నా సంస్కారము - ఈ నాది అన్న భావము నుండి కూడా ఉపరామముగా ఉండాలి. నేను ఇలా అనుకుంటున్నాను, ఈ నాది అన్న భావము నుండి కూడా ఉపరామముగా ఉండండి. నేను ఇలా అనుకుంటున్నాను, వద్దు. బాప్‌దాదా శ్రీమతము ఇదే అని భావించండి. జ్ఞాన బుద్ధి తరువాత నాది అన్నది వచ్చినట్లయితే ఆ భావము కూడా నష్టపరుస్తుంది. ఒకటేమో నేను శరీరాన్ని అన్న దానిని వదలాలి, రెండవది నేను అనుకుంటున్నాను, నేను జ్ఞానీ అత్మను, నేను తెలివైనవాడిని - ఈ నేను అన్నదానిని కూడా తొలగించాలి. ఎక్కడైతే నేను అన్న మాట వస్తుందో అక్కడ బాప్‌దాదా స్మృతి రావాలి. ఎక్కడైతే నాది అన్నది వస్తుందో అక్కడ శ్రీమతము గుర్తుకు రావాలి. ఒకటేమో నేను అన్నదానిని తొలగించటము, రెండవది నాది అన్నది, ఇది కూడా పడేస్తుంది. ఈ నేను-నాది, నువ్వు-నీది ఈ నాలుగు మాటలేవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి. ఈ నాలుగు మాటలే సంపూర్ణత నుండి దూరము చేసాయి. ఈ నాలుగు మాటలను సంపూర్ణంగా తొలగించాలి. సాకారుని అంతిమ మాటలను పరిశీలించినట్లయితే ప్రతి మాటలో ఏం వినిపించారు? బాబా -బాబా. సేవలో సఫలత లేనిదాని కరెక్షన్ కూడా ఏ విషయంలో ఉంది? ప్రతి మాటలో బాబా, బాబా అని అంటూ మాట్లాడినట్లయితే ఎవరికైనా గురి తగులుతుంది అని అర్థం చేయించేవారు. బాబా గుర్తుకు వచ్చినప్పుడు నేను-నాది, నువ్వు-నీది అన్నవి సమాప్తమైపోతాయి. అప్పుడిక ఏ స్థితి ఏర్పడుతుంది? అన్ని విషయాలు ప్లెయిన్(స్పష్టము) అయిపోతాయి, ప్లెయిన్ (స్పష్టమైన) స్మృతిలో నిలవగలరు.
ఇప్పుడు బిందురూపములో స్థితి అవ్వడంలో కష్టమనిపిస్తుంది కదా! ఎందుకని? పూర్తి రోజంతటి స్థితి ప్లెయిన్‌గా లేని కారణంగా ప్లెయిన్ స్మృతి నిలవటం లేదు. ఎక్కడో అక్కడ నేను (మై), నాది(మేరాపన్), నువ్వు, నీది వస్తాయి. బంగారు సంకెళ్ళు కూడా తక్కువేమీ కాదని మొదట్లో వినిపించాము కదా! ఆ సంకెళ్ళు తమవైపుకు లాగుతాయి. ప్రతి ఒక్కరూ తమను పరిశీలించుకోవాలి. పూర్తి ఉపరామ స్థితి, పూర్తి ప్లెయిన్. ఒకవేళ దారి స్పష్టంగా ఉన్నట్లయితే చేరుకోవటానికి ఎంత సమయం పడ్తుంది? అదే ఆ దారిలో అడ్డంకులు ఉన్నట్లయితే చేరుకోవటానికి కూడా సమయము పడ్తుంది. అడ్డంకులు ఉన్నప్పుడు ప్లెయిన్ స్మృతిలో కూడా అడ్డంకి ఉంటుంది, ఇప్పుడు దానిని తొలగించాలి. ఎప్పుడైతే మీరు చేస్తారో మిమ్మల్ని చూసి అందరూ చేస్తారు. నంబరువారీగా స్టేజీపైకి చేరుకోవాలి. మీరు చేరుకుంటే అప్పుడు ఇతరులు కూడా చేరుకుంటారు, అంతటి బాధ్యత ఉంది. సంకల్పములో, వాణిలో, కర్మలో, సంబంధములో లేక సేవలో ఒకవేళ ఏదైనా హద్దు ఉండిపోయినట్లయితే ఆ బౌండరీ(హద్దు)లు బాండేజ్(బంధనాల)లో బంధించివేస్తాయి. అనంతమైన స్థితిలో ఉండటం వలననే అనంతమైన రూపంలో స్థితి అయిపోతారు. ఇప్పుడు చెత్త ఏదైతే ఉందో దానిని తొలగించాలి. చెత్తను తొలగించేందుకే ఈ భట్టీ. సంగఠన ఉన్నప్పుడు అది సాక్షాత్తు బాప్‌దాదా స్వరూపపు సంగఠనగా ఉండాలి. ఇప్పుడు ఈ సంపూర్ణతా ముద్రను వెయ్యాలి. సంపూర్ణ అవస్థ వర్తమాన సమయము నుండే అవుతుంది. ఇదే మహారథుల కర్తవ్యము. ఇప్పుడు ఇంకేమి చెయ్యాలి? స్కాలర్షిప్ను ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు స్కాలర్షిప్ తీసుకొనేవారి ప్రత్యక్ష సాక్షాత్కారము జరుగుతూ ఉంటుంది. బాప్‌దాదా గుప్తంగా ఉన్నారు కాబట్టి పిల్లలమైన మేము కూడా గుప్తంగా ఉండాలనైతే కాదు. అలా కాదు, పిల్లలు స్టేజ్ పై ప్రత్యక్షమవ్వాలి.
పిల్లల ప్రత్యక్షత జరగాలి. సేవా స్టేజ్‌పైన కూడా ఎవరు ప్రత్యక్షమవుతారు? కావున సంపూర్ణతా ప్రత్యక్షతను కూడా స్టేజ్ పైకి తీసుకురావాలి. అంతిమము వరకు గుప్తంగానే ఉంటామనైతే భావించకండి. బాప్దాదాది గుప్తమైన పాత్ర, పిల్లలది కాదు. కావున ఇప్పుడు దానిని ప్రత్యక్ష రూపంలోకి తీసుకురండి. ఎటువంటి సేవ చెయ్యాలో ఇప్పుడు అర్ధమైందా? సమ్మేళన చేసారు, చాలు, ఇంతేనా సేవ అంటే? దీనితో పాటు ఇంకే ఇతర శ్రేష్ఠమైన సేవ చెయ్యాలి?
ఇప్పుడున్న ముఖ్యమైన సేవ - మీ వృత్తి మరియు దృష్టిని పరివర్తన చెయ్యడము. నజర్ సే నిహాల్ (దృష్టితో తృప్తి పరచడం) అన్న గాయనము ఉంది కదా! కావున దృష్టి మరియు వృత్తుల సేవను ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. వాచ అన్నది ఒక సాధనము, కానీ ఎవరినైనా సంపూర్ణ స్నేహము మరియు సంబంధములోకి తీసుకురావాలంటే వృత్తి మరియు దృష్టిల సేవ జరగాలి. ఇటువంటి సేవను ఒక స్థానంలో కూర్చునే ఒక్క క్షణములో అనేకులకు చెయ్యగలరు. దీని ప్రత్యక్ష ప్రమాణమును చూస్తాము. ఏవిధంగా మొదట్లో బాప్‌దాదా సాక్షాత్కారము ఇంట్లో కూర్చునే జరిగింది కదా! అలాగే ఇప్పుడు, దూరంగా కూర్చునే మీ శక్తిశాలీ వృత్తి ఎటువంటి కార్యమును చేస్తుందంటే, ఎవరో చేయి పట్టుకొని తీసుకువస్తున్నట్లుగా వారికి అనిపిస్తుంది. చూడటానికి వారు నాస్తికులైనా, తమోగుణీలైనా మారిపోతారు. ఇప్పుడు ఈ సేవను చెయ్యాలి. కానీ ఎప్పుడైతే వృత్తి మరియు విషయాలలో స్పష్టంగా ఉంటారో అప్పుడే సేవలో సఫలతను పొందగలరు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగానైతే భావిస్తున్నారు. ప్రతిఒక్కరికీ తమతమ సేవ ఉన్నప్పటికీ కూడా యజ్ఞ బాధ్యతను కూడా తమ సెంటరు బాధ్యతతో సమానంగా భావించాలి, స్వయమే ఆఫర్ చెయ్యాలి. ఎవరి సంస్కారాలనైనా చాలా తక్కువ సమయంలో మార్చగలిగేంతటి శక్తి వాణితో పాటుగా వృత్తి మరియు దృష్టిలో ఉండాలి. వాణితో పాటు దృష్టి మరియు వృత్తి కలవకపోతే సఫలత ఉండనే ఉండదు. ఇది ముఖ్యమైన సేవ. ఇప్పటినుండే అనంతమైన సేవలో అనంతమైన ఆత్మలను ఆకర్షితము చెయ్యాలి. ప్రజలను తయారుచేసే ఏ సేవనైతే మీరు సేవగా భావిస్తున్నారో, వారైతే మీ ప్రజలకు ప్రజలుగా స్వయమే తయారవుతారు, వారైతే ప్రదర్శినీలలో తయారవుతున్నారు. ఇప్పుడైతే మీరు మనుష్యులకు అనంతముగా సుఖమును ఇవ్వాలి, అప్పుడే మొత్తము విశ్వము మిమ్మల్ని సుఖదాతలుగా భావిస్తుంది. విశ్వమహారాజును విశ్వదాత అని అంటారు కదా! మరి మీరు కూడా ఇప్పుడు అందరికీ సుఖమును ఇచ్చినట్లయితే అందరూ మిమ్మల్ని సుఖదాతలుగా గౌరవిస్తారు. విశ్వ మహారాజును విశ్వ దాత అంటారు కదా. మరి ఇప్పుడు మీరు కూడా అందరికీ సుఖాన్నిచ్చినప్పుడే మిమ్మల్ని సుఖదాతలుగా అంగీకరిస్తారు. సుఖమిస్తేనే అంగీకరిస్తారు కదా. కావున ఇప్పుడు ముందుకు వెళ్ళండి. ఒక్క క్షణములో అనేకుల సేవను చెయ్యగలరు. ఏ విషయములోనైనా ఫీల్ అవటము ఫెయిల్ అయ్యేందుకు గుర్తు. ఏ విషయములోనైనా ఫీల్ అయితే, ఎవరి సంస్కారాలలోనైనా, సంపర్కములోనైనా, ఎవరి సేవలోనైనా ఫీల్ అయ్యారంటే ఫెయిల్. అది ఫెయిల్‌లో జమ అయిపోతుంది. ప్రతి మూడు నెలలకు పరీక్ష జరగటం ఈ రోజుల్లో రివాజు ఉన్నట్లుగా, ఫెయిల్ లేక పాస్ మార్కులను ఫైనల్లో కలుపుతారు. ఎవరైతే పదే పదే ఫెయిల్ అవుతారో వారు ఫైనల్లో ఫెయిల్ అవ్వవలసి ఉంటుంది. కావున పూర్తిగా ఫ్లాలెస్ (మచ్చలేనివారి)గా అవ్వాలి. ఎప్పుడైతే ఫ్లాలెస్‌గా అవుతారో అప్పుడు ఫుల్ పాస్ అయినట్లుగా భావించండి. ఏ విధమైన మచ్చ ఉన్నా ఫుల్ పాస్ అవ్వరు. ఓం శాంతి.