Search for a command to run...
31 Dec 2007
నూతన సంవత్సరంలో అఖండ మహాదానిగా, అఖండ నిర్విఘ్నంగా, అఖండ యోగిగా మరియు సదా సఫలతామూర్తులుగా తయారుకావాలి
31 December 2007 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా తమ ఎదురుగా డబల్ సభను చూస్తున్నారు. ఒకటి - సాకారంలో సమ్ముఖంలో కూర్చుని ఉన్న సభ. రెండవది - దూరంగా కూర్చుని కూడా హృదయానికి సమీపంగా కనిపిస్తున్న వారి సభ. రెండు సభలలోని శ్రేష్ఠ ఆత్మల మస్తకంపై ఆత్మ దీపము మెరుస్తుంది. ఎంతటి సుందరమైన మెరిసే దృశ్యము ఇది. ఇంతమంది ఒకే సంకల్పం, ఏకరస స్థితిలో స్థితి అయి, పరమాత్మ ప్రేమలో లవ్లీన్ అయి, ఏకాగ్ర బుద్ధితో, స్నేహంలో ఇమిడి ఉన్న మీరు ఎంత ప్రియంగా ఉన్నారు. మీరందరూ కూడా ఈ రోజు విశేషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి చేరుకున్నారు. బాప్‌దాదా కూడా పిల్లలందరి ఉల్లాస ఉత్సాహాలను చూసి, మెరుస్తున్న ఆత్మిక దీపాలను చూసి హర్షితమవుతున్నారు.
ఈరోజు సంగమం రోజు. పాత సంవత్సరానికి వీడ్కోలు మరియు నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు జరిగేదుంది. నూతన సంవత్సరం అనగా నూతన ఉల్లాస ఉత్సాహము, స్వ పరివర్తన కొరకు ఉల్లాసము, సర్వ ప్రాప్తులు స్వయంలో ప్రాప్తి అయి ఉన్న కారణంగా హృదయంలో ఉత్సాహము. ప్రపంచంవారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. వారికైతే ఇది ఒక్క రోజు యొక్క ఉత్సవము మాత్రమే. మరి లక్కీ, లవ్లీ పిల్లలైన మీకు సంగమ యుగంలోని ప్రతి రోజూ ఉత్సవమే. ఎందుకంటే సంతోషము నిండిన ఉత్సాహము. ప్రపంచంవారు ఆరిపోయి ఉన్న దీపాలను వెలిగించి నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. బాప్‌దాదా మరియు మీరు, నలు వైపులలోని వెలుగుతున్న జ్యోతులతో కలిసి నూతన సంవత్సర ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చాము. ఈ రీతులు మరియు పద్ధతులు నిమిత్తమాత్రంగా చేస్తారు. కానీ మీరందరూ వెలిగి ఉన్న దీపాలు. మెరుస్తున్న మీ దీపము కనిపిస్తుంది కదా? అది అవినాశి దీపము.
మరి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ హృదయంలో స్వయం కోసం మరియు విశ్వంలోని ఆత్మల కోసం ఏదైనా క్రొత్త ప్లానును తయారు చేసారా? 12 గంటల తర్వాత నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఈ సంవత్సరాన్ని విశేషంగా ఏ రూపంలో జరుపుకుంటారు? ఈ పాత సంవత్సరం వీడ్కోలు తీసుకుంటుంది. మరి మీరందరూ కూడా పాత సంకల్పాలు, పాత సంస్కారాలకు వీడ్కోలు చెప్పాలని సంకల్పం చేసారా? సంవత్సరానికే కాక మీరు పాతవాటికి కూడా వీడ్కోలు చెప్పి నూతన ఉల్లాస ఉత్సాహాల సంకల్పాలను ప్రాక్టికల్లోకి తీసుకువస్తారు కదా! మరి ఆలోచించండి. మీలో ఎటువంటి నవీనతను తీసుకు వస్తారు? ఎటువంటి నూతన ఉల్లాస ఉత్సాహాల అలను వ్యాపింపజేస్తారు? ఎటువంటి విశేష సంకల్పాల వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు? ఆలోచించారా? ఎందుకంటే బ్రాహ్మణులైన మీరందరూ పూర్తి విశ్వాత్మల పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు. విశ్వానికి పునాది మీరు, పూర్వజులు, పూజ్యులు మీరు. మరి ఈ సంవత్సరం మీ శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు? ప్రకృతి నలు వైపుల ఒకసారి వేడి, ఒకసారి చలి, ఒకసారి వసంతం యొక్క వైబ్రేషన్లు వ్యాప్తి చేస్తుంది. మరి ప్రకృతికి యజమానులు, ప్రకృతిజీతులైన మీరు ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు? దీని ద్వారా ఆత్మలకు కొద్ది సమయం కోసమైనా సుఖశాంతులను అనుభవం చేయించగలగాలి. ఇందుకోసం బాప్‌దాదా ఇచ్చే సూచన - ఏ ఖజానాలు అయితే ప్రాప్తి అయ్యాయో, ఆ ఖజానాలను సఫలం చేయండి మరియు సఫలత స్వరూపులుగా కండి. విశేషంగా సమయం యొక్క ఖజానా ఎప్పుడు కూడా వ్యర్థంగా పోకూడదు. ఒక్క క్షణం కూడా వ్యర్థాన్ని కార్యంలో వినియోగించకండి. సమయాన్ని సఫలం చేయండి. ప్రతి శ్వాసను సఫలం చేయండి. ప్రతి సంకల్పాన్ని సఫలం చేయండి. ప్రతి శక్తిని సఫలం చేయండి. ప్రతి గుణాన్ని సఫలం చేయండి. ఈ సంవత్సరాన్ని విశేషంగా సఫలతామూర్తులుగా అయ్యేందుకు జరుపుకోండి. ఎందుకంటే సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. ఆ అధికారాన్ని తమ కార్యంలో వినియోగించి సఫలతామూర్తులుగా కండి. ఎందుకంటే ఇప్పటి మీ సఫలత అనేక జన్మలు మీకు తోడుగా నిలువనుంది. సఫలత యొక్క ప్రాలబ్ధ సమయము అనగా పూర్తిగా అర్థకల్పము సఫలత యొక్క ఫలితము ప్రాప్తిస్తుంది. శ్వాసను సఫలం చేయడం ద్వారా భవిష్యత్తులో మీ శ్వాస యొక్క పరిణామంగా సర్వ ఆత్మలు పూర్తి సమయము స్వస్థతతో ఉంటారు. అనారోగ్యము యొక్క పేరు ఉండదు. డాక్టర్ల డిపార్టుమెంటే ఉండదు ఎందుకంటే డాక్టర్లు రాజులుగా అయి ఉంటారు కదా. రాజులుగా అవుతారు కదా! విశ్వ యజమానులుగా అవుతారు కదా! మీరు శ్వాసను సఫలం చేస్తారు మరియు సర్వాత్మలకు స్వస్థతతో ఉండే ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేయిస్తున్నారు. అలాగే జ్ఞాన ఖజానా. దీని ఫలస్వరూపముగా స్వర్గంలో మీ రాజ్యంలో మీరు ఎంత తెలివైనవారిగా, శక్తిమంతులుగా అవుతారంటే అక్కడ మంత్రులతో సలహా తీసుకోవలసిన అవసరం ఉండదు. స్వయమే శక్తిమంతులుగా ఉంటారు. శక్తులను సఫలం చేస్తారు, అందుకు ప్రాలబ్ధముగా అక్కడ సర్వ శక్తులు, విశేషంగా ధర్మ సత్తా, రాజ్య సత్తా రెండు శక్తులు, సత్తాలు అక్కడ ప్రాప్తిస్తాయి. గుణాల ఖజానాను సఫలం చేస్తారు, ఇందుకు ప్రాలబ్ధముగా దేవతా పదవి యొక్క అర్థమే దివ్యగుణధారి అని. దీనితో పాటు ఇప్పుడు అంతిమ జన్మలో కూడా మీ జడ మూర్తికి పూజ జరుగుతుంది. ఏమని మహిమ చేస్తారు? సర్వ గుణ సంపన్నులు. మరి ఈ సమయం యొక్క సఫలతా ప్రాలబ్ధము స్వతహాగానే ప్రాప్తిస్తుంది. కావున, పరిశీలించుకోండి. ఖజానాలు లభించాయి. ఖజానాలతో సంపన్నంగా అయ్యారు. కానీ స్వయం మరియు విశ్వం కోసం ఎంత సఫలం చేసారు? పాత సంవత్సరానికి వీడ్కోలు చెబితే మరి పాత సంవత్సరంలో జమా ఖజానాను సఫలం చేసారా? ఎంత సఫలం చేసారు? ఇది పరిశీలించుకోండి మరియు రాబోవు సంవత్సరంలో కూడా ఈ ఖజానాలను వ్యర్థానికి బదులుగా సఫలం చెయ్యవలసిందే. ఒక్క క్షణం కూడా, ఏ ఖజానా కూడా వ్యర్థంగా పోకూడదు. ముందుగా వినిపించి ఉన్నాము - సంగమ సమయం యొక్క సెకండు, ఒక సెకండు కాదు, ఒక సంవత్సరంతో సమానము. అంతేకానీ ఒక్క క్షణము, ఒక్క నిమిషమే కదా పోయింది అని అనుకోకండి. వ్యర్థంగా పోవడాన్నే నిర్లక్ష్యము అని అంటారు. బ్రహ్మా బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా కావాలన్నది మీ అందరి లక్ష్యము. బ్రహ్మా బాబా సర్వ ఖజానాలను ఆది నుండి అంతిమ రోజు వరకు సఫలం చేసారు. ఇందుకు ప్రత్యక్ష ప్రమాణమును చూసారు - సంపూర్ణ ఫరిశ్తాగా అయ్యారు. మీ ప్రియమైన దాదీని కూడా చూసారు కదా. సఫలం చేసారు మరియు ఇతరులలో కూడా సఫలం చెయ్యడానికి కావలసిన ఉల్లాస ఉత్సాహాన్ని నింపారు. మరి డ్రామా అనుసారంగా విశేషంగా విశ్వ సేవ కోసం అలౌకిక పాత్రకు నిమిత్తమయ్యారు.
ఈ సంవత్సరం, రేపటి నుండి, ప్రతి రోజూ మీ చార్టును పెట్టుకోండి - సఫలము మరియు వ్యర్థము - ఏమైంది, ఎంత అయింది? అమృతవేళనే దృఢ సంకల్పం చేయండి, స్మృతి స్వరూపులుగా కండి - సఫలత నా జన్మ సిద్ధ అధికారము. సఫలత నా మెడలోని హారము. సఫలత స్వరూపంగా కావడమే సమానంగా కావడము. బ్రహ్మా బాబాపై ప్రేమ ఉంది కదా. మరి బ్రహ్మా బాబాకు అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమ దేనిపై ఉండేది? తెలుసా? దేనిపై ప్రేమ ఉండేది? మురళిపై. చివరి రోజు కూడా మురళి యొక్క పాత్రను మిస్ చెయ్యలేదు. మరి సమానంగా కావడంలో ఇది పరిశీలించుకోండి - బ్రహ్మా బాబాకు దేనిపై అయితే ప్రేమ ఉందో, బ్రహ్మా బాబాపై ఉన్న ప్రేమకు ఋజువు, దేనిపై బాబాకు ప్రేమ ఉందో దానిపై నా ప్రేమ ఉండాలి. స్వతహాగా మరియు సహజంగా ఉండాలి. బ్రహ్మా బాబా యొక్క మరో విశేషత ఏమిటి? సదా అలర్ట్. నిర్లక్ష్యము లేదు. చివరి రోజు కూడా ఎంతటి అలర్ట్ రూపంలో తమ సేవా పాత్రను వహించారు! శరీరం బలహీనంగా ఉన్నా కానీ అలర్ట్‌గా ఉండి, ఎటువంటి ఆధారము తీస్కుని కూర్చోకుండా అలర్ట్‌గా చేసి వెళ్ళారు. మూడు విషయాల మంత్రాన్ని ఇచ్చి వెళ్ళారు. అందరికీ గుర్తుంది కదా? మరి ఎంతగా అలర్ట్ అయి ఉంటారో, ఫాలో చేస్తారో అంతగా నిర్లక్ష్యము సమాప్తం అవుతుంది. నిర్లక్ష్యముతో నిండిన మాటలు బాప్‌దాదా చాలా వింటూ ఉంటారు. తెలుసు కదా? ఒకవేళ ఈ మూడు విషయాలను (నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి) సదా మీ మనసులో రివైజ్ మరియు రియలైజ్ చేస్తూ వెళ్ళండి అప్పుడు ఆటోమేటిక్‌గా, సహజంగా మరియు స్వతహాగా సమానంగా అయిపోతారు. కావున ఒక విషయము - సఫలం చెయ్యండి, సఫలతామూర్తులుగా కండి.
పిల్లల సంవత్సర రిజల్టును బాప్‌దాదా చూసారు. ఏమి చూసారు? మహాదానిగా అయ్యారు కానీ అఖండ మహాదాని, అఖండ అన్న పదాన్ని అండర్లైన్ చేయండి. అఖండ మహాదాని, అఖండ యోగి, అఖండ నిర్విఘ్నము ఇప్పుడు వీటి ఆవశ్యకత ఉంది. అఖండంగా కావడము వీలవుతుందా? మొదటి లైనువారు చెప్పండి, అఖండముగా కావడము వీలవుతుందా? వీలవుతుంది అని అనుకుంటే చేతులెత్తండి? చేయగలరా? వీలవుతుందా? చేయగలము అని అనుకున్నవారు చేతులెత్తండి. బాప్‌దాదా మధువనంవారిని ముందుగా చూస్తారు. మధుబన్పై ప్రేమ ఉంది కదా. శాంతివన్, పాండవ భవన్ లేక ఎవరెవరైతే దాదీకు భుజాలుగా ఉన్నారో వారందరినీ బాప్‌దాదా శ్రద్ధతో చూస్తారు. ఒకవేళ అఖండంగా అయినట్లయితే, మనసుతో శక్తిని వ్యాపింపజేసే సేవలో బిజీగా ఉండండి, వాచతో జ్ఞాన సేవ మరియు కర్మతో గుణ దానాన్ని లేక గుణ సహయోగాన్ని ఇవ్వండి.
ఈరోజుల్లో అజ్ఞాని ఆత్మలు కావచ్చు, బ్రాహ్మణ ఆత్మలు కావచ్చు, అందరికీ గుణాల దానము, గుణాల సహయోగమును ఇవ్వడము చాలా అవసరము. ఒకవేళ స్వయం సహజంగా, సింపుల్ రూపంలో సాంపుల్‌గా అయి ఉంటే అప్పుడు ఆటోమేటిక్‌గా మీ గుణమూర్తి యొక్క సహకారము స్వతహాగానే లభిస్తుంది. ఈరోజుల్లో బ్రాహ్మణ ఆత్మలు కూడా సాంపుల్‌ను చూడాలనుకుంటున్నారు. వినాలనుకోవడం లేదు. పరస్పరంలో కూడా ఏమని చెప్తారు? ఎవరు అయ్యారు? కావున, ప్రత్యక్ష రూపంలో గుణమూర్తిగా చూడాలని ఆశిస్తున్నారు. మరి కర్మలతో విశేషంగా గుణాల సహయోగాన్ని, గుణాల దానమును చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎవ్వరూ వినాలని అనుకోవట్లేదు, చూడాలని ఆశిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ విషయంపై శ్రద్ధ పెట్టండి - జ్ఞానంతో, వాచతో అయితే సేవను చేస్తూనే ఉంటారు, వదిలి పెట్టేది లేదు. కానీ ఇప్పుడు మనసా మరియు కర్మలు, మనసు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేయండి. శక్తిని వ్యాపింపజేయండి. వైబ్రేషన్లను మరియు శక్తిని దూరంగా కూర్చుని కూడా అందించవచ్చు. శుభ భావన, శుభ కామన ద్వారా ఏ ఆత్మకైనా మనసా సేవ ద్వారా వైబ్రేషన్లు మరియు శక్తిని ఇవ్వవచ్చు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం మనసా శక్తుల వైబ్రేషన్లు, శక్తుల ద్వారా సకాశ్ను మరియు కర్మల ద్వారా గుణాల సహయోగాన్ని మరియు అజ్ఞాని ఆత్మలకు గుణ దానాన్ని ఇవ్వండి.
నూతన సంవత్సరంలో బహుమతిని కూడా ఇస్తారు కదా. మరి ఈ సంవత్సరం స్వయం గుణమూర్తులుగా అయి గుణాల బహుమతిని ఇవ్వండి. గుణాల టోలీని తినిపిస్తారు కదా. కలిసినప్పుడు టోలీ తినిపిస్తారు కదా. టోలీతో సంతోషపడతారు కదా. కొంతమంది, ఇక్కడ నుండి వెళ్ళిపోయినవారు కూడా టోలీని గుర్తు పెట్టుకుంటారు. అన్నీటినీ మర్చిపోయినా కానీ టోలీ గుర్తుంటుంది. మరి ఈ సంవత్సరం ఏ టోలీను తినిపిస్తారు? గుణాల టోలీ. గుణాల పిక్నిక్‌ను చెయ్యండి. ఎందుకంటే బాబా సమానంగా సమయం యొక్క సమీపత ప్రమాణంగా మరియు దాదీ యొక్క సూచన అనుసారంగా సమయం యొక్క సమీపత అకస్మాత్తుగా, ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. అందుకే బాబా సమానంగా కావాలి మరియు దాదీకు ప్రేమ యొక్క రిటర్ను ఇవ్వాలి అంటే మనసా మరియు కర్మల ద్వారా సహయోగిగా అవ్వడము చాలా అవసరము. ఎవరు ఎటువంటివారైనా కానీ, వీరు తయారైతే నేను అవుతాను అని ఎప్పుడూ అనుకోకండి. అప్పుడు అలా తయారయ్యేవారే మొదటి నంబరు తీసుకుంటారు. మీరైతే రెండవ నంబరులోకి వచ్చేస్తారు. రెండవ నంబరులోకి రావాలనుందా లేక మొదటి నంబరులోకే వస్తారా? రెండవ నంబరు తీసుకోండి అని అంటే మీరు ఒప్పుకుంటారా? మొదటి నంబరు తీసుకుంటాము అని అందరూ చెప్తారు. ముందుగా స్వయం నిమిత్తం కావాలి. ఇతరులను నిమిత్తంగా ఎందుకు చేస్తారు? స్వయాన్ని నిమిత్తం చేసుకోండి. బ్రహ్మా బాబా ఏమన్నారు? ప్రతి విషయంలో ముందుగా స్వయాన్ని నిమిత్తం చేసుకుని తర్వాత నిమిత్తం చేసారు. అర్జునుడిగా అయి పాత్రను వహించారు. నేను నిమిత్తం కావాలి. నేను చెయ్యాలి. నన్ను చూసి ఇతరులు చేస్తారు అని అనుకున్నారు కానీ ఇతరులు చేస్తే నేను చేస్తాను అని అనుకోలేదు. ఇది బ్రహ్మా బాబా యొక్క మొదటి పాఠము. మరి విన్నారా ఏమి చెయ్యాలో? సఫలతామూర్తులు, సఫలమైన సఫలతామూర్తులు, అఖండ దాని. అప్పుడు మాయకు రావడానికి ధైర్యమే సరిపోదు. ఎప్పుడైతే అఖండ మహాదానిగా అయిపోతారో, నిరంతర సేవాధారిగా ఉంటారో, బిజీగా ఉంటారో, మనసు, బుద్ధి మీ సేవధారిగా ఉంటాయో అప్పుడు మాయ ఎలా రాగలదు? మరి ఈ సంవత్సరం ఎలా తయారవుతారు? అందరి హృదయాల నుండి ఒకే మాట రావాలి, అది ఏమిటి? నో ప్రాబ్లల్, కంప్లీట్. ప్రాబ్లమ్‌గా కాదు, కంప్లీట్‌గా కావాలి. దృఢ నిశ్చయ బుద్ధి, విజయ మాలలోని సమీప పూసగా కావలసిందే. సరేనా! కావలసిందే కదా! మధుబన్ వారు, కావలసిందేనా? నో కంప్లెయింట్? నో కంప్లెయింట్? నో ప్రాబ్లమ్? నో ప్రాబ్లమ్? వాహ్! అభినందనలు, అభినందనలు, అభినందనలు.
చూడండి, నిశ్చయానికి ప్రత్యక్ష ప్రమాణము - ఆత్మిక నషా. ఒకవేళ ఆత్మిక నషా లేకపోతే నిశ్చయము కూడా ఉండదు. పూర్తి నిశ్చయము లేదు, కొద్దిగా ఉంది. అయితే నషా పెట్టుకోండి. ఎన్ని కల్పములు మీరే తండ్రి సమానంగా అయ్యారు, గుర్తుందా? లెక్కలేనన్ని సార్లు అయ్యారు. మేమే అయ్యాము, మేమే అవుతున్నాము మరియు మేమే మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటాము అన్న నషా ఉండాలి. ఈ నషా సదా కర్మలలో కనిపించాలి. సంకల్పంలో కాదు, మాటలలో కాదు, కానీ కర్మలో. కర్మలో అనగా నడవడికలో కనిపించాలి, ముఖముపై కనిపించాలి. మరి హోమ్‌వర్కు లభించిందా? లభించింది కదా? ఇప్పుడు నంబరువారీగా వస్తారా లేక నంబరువన్‌గా వస్తారా చూస్తాము. అచ్ఛా.
బాప్‌దాదా వద్దకు కార్డులు, ఉత్తరాలు, ఈ-మెయిల్స్, ప్రియస్మృతులు, కంప్యూటర్ ద్వారా కూడా చాలా వచ్చాయి. బాప్‌దాదా దూరంగా కూర్చుని ఉన్న హృదయ సింహాసనాధికారి పిల్లలకు, ప్రతి ఒక్కరికీ పేరు సహితంగా, విశేషత సహితంగా ప్రియ స్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను సమ్ముఖంగా ఇమర్జ్ చేసుకుని ఇస్తున్నారు. ప్రియస్మృతులు, ప్రేమ అయితే అందరికీ ఉంది అని బాప్‌దాదాకు తెలుసు. బాప్‌దాదా సదా అమృతవేళ విశేషంగా బ్రాహ్మణ ఆత్మలకు ప్రియస్మృతుల యొక్క రెస్పాన్స్‌ను ఇస్తారు. కార్డులు చాలా బాగా చేసారు. బాప్‌దాదా వద్ద అయితే వతనంలో, ఇక్కడ పెడ్తారు కానీ ముందుగా వతనంలోకి చేరుకుంటాయి. అచ్ఛా.
సేవ టర్న్ యు.పి మరియు పశ్చిమ నేపాల్ జోన్ వారిది:- ఏ జోన్ వారి టర్ను ఉంటుందో సగం గ్రూపు వారే ఉండటం బాప్‌దాదా చూసారు. ఇప్పుడు మీరు కూర్చోండి. ఇప్పుడు ఈ జోన్‌కు సంబంధించినవారు కాకుండా ఎవరైతే ఉన్నారో వారు లేవండి. ఈ జోన్ కాకుండా, అచ్ఛా. సగం సగం ఉన్నారు. కూర్చోండి. మీ సేవా టర్నులో ఎంతమందినైనా తీసుకు వచ్చేందుకు ఆహ్వానం లభిస్తుంది. ఒకటి మిలనము యొక్క ఛాన్సు మరియు ఇంకొకటి సేవా ఛాన్సు. డబల్ ఛాన్సు తీసుకునేవారు. యు.పి విశేషత ఏమిటి? తెలుసా? యు.పి. అతి ప్రియమైనది. ఎందుకని? మమ్మా, బాబాలు చాలా సార్లు అక్కడకు వచ్చారు. బాంబే, ఢిల్లీలాగా ఇక్కడకు కూడా వచ్చారు. యు.పిలో బ్రహ్మా యొక్క స్మృతిచిహ్నం ఉంది కదా. ఎలా అయితే రాజస్థాన్ పుష్కరాలలో బ్రహ్మా యొక్క స్మృతి చిహ్నము ఉందో అలాగే యు.పిలో కూడా బ్రహ్మకుండము ఉంది. ప్రాక్టికల్‌గా కూడా బ్రహ్మా బాబా యు.పిలో సేవ చేసారు. పిల్లలను ఎంతో ప్రేమ చేసారు. ఆ సమయంవారు ఎంతో ప్రేమను పొందారు. అచ్ఛా. ఇప్పుడు యు.పి క్రొత్తగా ఏమి చేస్తుంది? లాస్ట్ మురళిలో కూడా బాప్‌దాదా ఏదైనా కొత్త ప్లాన్‌ను ఆలోచించండి అని చెప్పారు. ఈ ప్రదర్శనలు, కాన్ఫరెన్సులు, మేళాలు అన్నీ ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఎక్కడైనా మేళాగానీ, ప్రదర్శనికానీ పెట్టి ఎవరినైనా పిలిస్తే మేము అది చూసి ఉన్నాము అని అంటారు. అర్థమైనా కాకపోయినా కానీ చూసారు. ఇప్పుడు కొత్త ఇన్వెన్షన్ ఏదైనా ఆలోచించండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖ్యాతి వచ్చే విధంగా ఆలోచించండి. ఆ ప్లానును చిన్న సెంటరు కూడా చెయ్యగలగాలి, పెద్ద సెంటరు కూడా చెయ్యగలగాలి. చూద్దాం, ఎవరు క్రొత్త ఇన్వెన్షన్‌కు నిమిత్తమవుతారో! యు.పిలో తెలివైనవారు చాలా మంది ఉన్నారు. మీరు తయారు చెయ్యగలరు. యు.పి యొక్క మరో విశేషత ఏమిటంటే యు.పి. యొక్క సేవా ఆరంభంలో వారసులు తయారయ్యారు. అలాగే ఢిల్లీలో కూడా తయారయ్యారు. బాంబేలోకూడా తయారయ్యారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా స్వర్ణిమ కర్ణాటక చేస్తున్నారు. ఎంతమంది వారసులు తయారయ్యారు, ఎంతమంది మైకులు తయారయ్యారు అని బాప్‌దాదా రిజల్టును చూస్తారు. సందేశమైతే అందింది, అందుకు అభినందనలు. యు.పిలో భక్తి యొక్క స్మృతిచిహ్నాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భక్తుల క్వాలిటీగా చాలామంది ఉన్నారు. అంధశ్రద్ధ వారు కూడా ఉన్నారు మరియు భావన వారు కూడా ఉన్నారు, ఇద్దరూ ఉన్నారు. ఇప్పుడు యు.పి.వారు అద్భుతం చేసి చూపించండి. అందరికంటే మొదటి నంబరు వారసుడిని మీరు తయారు చేసి లాస్ట్ టర్నులో లిస్టును పంపండి. తర్వాత ఇక్కడ నుండి తారీఖు వస్తుంది, అప్పుడు వారిని తీసుకురండి. వారసులను తయారు చేసేందుకు విధి ఏమిటో తెలుసు కదా. ఎవరైతే స్వయం ప్రతి విషయము అనుభవపూర్వకంగా అయి ఇతరులకు తమ హృదయ అనుభవాన్ని వినిపించరు కానీ తమ అనుభవ స్వరూపమే ఇతరులకు అనుభవం చేయిస్తుంది. అటువంటి వారసులను తయారు చెయ్యగలరు. ఎవరైతే కేవలం జ్ఞానం చెప్తారో, వారు మంచిగా చేస్తారు, కానీ చాలా మంచిగా చెయ్యలేరు. మరి లాస్ట్ టర్నుకల్లా ఏదైనా లిస్టు వస్తుందేమో చూద్దాం. ఎవరు చేసినా కానీ, నిమిత్తం యు.పి. కానీ ఏ జోన్ అయినా వారసుల లిస్టును పంపండి. యజ్ఞ సేవ యొక్క పాత్రను చాలా బాగా నిర్వహించారు అని బాప్‌దాదా విన్నారు. అచ్ఛా. యు.పి.వారికి అభినందనలు. కావున సేవకు కూడా అభినందనలు మరియు దీనితో పాటు జీ హాజరు అనే పాఠాన్ని మంచిగా నిర్వర్తించారు. ఇందుకు కూడా అభినందనలు. అచ్ఛా.
డబల్ విదేశీయులు - 60 దేశాల నుండి 800మంది సోదరసోదరీలు వచ్చారు:- (చిన్న పిల్లలు మరియు యూథ్ యొక్క రిట్రీట్ జరుగుతుంది) అచ్ఛా, పిల్లలు సింబల్ పెట్టుకున్నారు, బాగున్నారు. పిల్లలకు చాక్లెట్ల టోలీను ఇచ్చారా? ఇచ్చారా? ఎవరు ఇందుకు నిమిత్తం? పిల్లలకు చాక్లెట్లు ఇష్టం కదా? ఎగిరేందుకు విధిని చెప్పారా? ఎవరు నిమిత్తము? పిల్లలకు ఎవరు నిమిత్తము, చేతులెత్తండి. వచ్చే సంవత్సరము ఈ పిల్లలు వచ్చినప్పుడు వీరిలో మరింత పరివర్తన కనిపిస్తుంది. పిల్లలూ, ముందుకు రండి. (పిల్లలు పాట పాడారు – బాబా, ఆప్ కితనే అచ్చే హో - బాబా మీరు ఎంత మంచివారు, ఎంత ప్రియమైనవారు...) బాగా కృషి చేసారు. వచ్చే సంవత్సరం మీరు ఇక్కడకు వచ్చేసరికి మరింత పైకి ఎగిరే ఫరిశ్తాలుగా అయి రండి. సరేనా! వచ్చే సంవత్సరం మరింత ఉన్నతిని తీసుకు వస్తారు. అచ్ఛా - వినండి, రేపు బాప్‌దాదా తరఫున పిల్లలకు విశేషంగా చాక్లెట్లను చేసి పెట్టండి. అచ్ఛా, డబల్ విదేశీయులు - డబల్ విదేశీయులు ఇప్పుటి నుండి డబల్ పురుషార్థీలు అని బాప్‌దాదా చెప్పారు. డబల్ అయ్యారా? బాప్‌దాదాకు గతంలో చెప్పిన ఒక విషయం గుర్తుంది – డబల్ విదేశీయులు అప్పుడప్పుడు వాహ్ వాహ్కు బదులుగా వై, వై, అంటూ ఉంటారు. వై మరియు ఐ (ఎందుకు మరియు నేను). మీరు వై అని అనేవారా లేక వాహ్! అని అనేవారా? ఎప్పుడూ ఏ విషయంలోనూ వై(ఎందుకు) అనవద్దు. ఏది జరుగుతుందో అది చాలా మంచిది, ఏదైతే జరిగిపోయిందో అది చాలా చాలా మంచిది, ఏదైతే జరుగనుందో అది మహా మంచిది. ఇది డబల్ పురుషార్థీల లక్షణము. నో ప్రాబ్లమ్వారు కదా. నో ప్రాబ్లమ్వారేనా లేక కొంచెం కొంచెం ప్రాబ్లమ్ ఉన్నవారా? ఏ విషయంలోనూ వై వద్దు. వై అంటే హాయ్(అయ్యో) అని అన్నట్లే. అచ్ఛా, ప్రాబ్లమ్‌ను ఇక్కడ వదిలి వెళ్ళండి, విమానంలో తీసుకువెళ్ళకండి. ఎందుకంటే బాబా వద్దకు వచ్చారు అంటే బాబాకు ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించాలి కదా. మరి ఈ అద్భుతాన్ని చూపించండి. అప్పుడప్పుడూ కాదు, కొంచెం కొంచెం కాదు. సదా ఆత్మిక గులాబీలు. విరబూసిన గులాబీలు. ఎందుకంటే భారతవాసులందరికీ, బాబాకు మరియు దాదీలకు విదేశీయులు చాలా గారాల పిల్లలు, ప్రియమైనవారు. విదేశీయులను చూసి సంతోషిస్తారు. మరి మీరు కూడా సదా సంతోషంగా ఉంటారు కదా? సదా అన్న మాటను గుర్తు పెట్టుకోండి. ఈ సంవత్సరం సదా అన్న బహుమతిని తీసుకువెళ్ళండి. సదా అన్న మాటను ఎప్పుడూ మర్చిపోవద్దు. విఘ్నం రావడంలో సదా కాకండి, నిర్విఘ్నంగా కావడంలో సదా కండి. అచ్ఛా. మధువనం యొక్క అలంకారము. డబల్ విదేశీయులు మధువనానికి అలంకారము. అలంకారానికి చాలా విలువ ఉంటుంది. కనుక మీరు విలువైనవారు. అచ్ఛా. ప్రతి గ్రూపు అంతర్జాతీయ గ్రూపు అవుతుంది, ఇది చాలా బాగా చేసారు. ఇప్పుడు ఎన్ని దేశాల నుండి వచ్చారు? (60 దేశాల నుండి). మరి చూడండి ఎంత అందం వచ్చిందో! 60 దేశాల నుండి పరుగు పరుగున వచ్చారు. మరి బాప్‌దాదా తరఫున, మధుబన్ తరఫున మీకు పదమాపదమ్ రెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
ఇంటర్నేషనల్ యూథ్ గ్రూపు:- ఇంత పెద్ద గ్రూపు ఉంది. యూథ్ గ్రూపు కూడా పెద్దగా ఉంది. బాప్‌దాదా యూథ్ గ్రూపు యొక్క సమాచారాన్ని విన్నారు. పరస్పరం కలిసి ఏదైతే ప్లానును తయారు చేసారో అది బాగుంది కానీ ముందుగా ప్లానును ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఎందుకంటే యూథ్ గ్రూపును ప్రపంచం కూడా అద్భుతం చేసేదిగా చూస్తుంది. ప్రోగ్రాము అయితే బాగా చేసారు. సిస్టమ్ కూడా బాగా చేసారు. తయారు చేసినవారికి అభినందనలు చెప్తున్నాము. ఇప్పుడు ప్రతి సమయము మీ రిజల్టును నిమిత్తమైనవారికి పంపుతూ ఉండండి ఎందుకంటే చెకింగ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఛేంజ్ అవుతారు. చెకింగ్ చేసుకోవడంలో నిర్లక్ష్యము వస్తే ఛేంజ్ కూడా కాలేరు. కాబట్టి ఏ డైరెక్షన్ అయితే లభించిందో అలాగే తమ రిపోర్టును, రిపోర్టు చెడు కాదు, మంచి రిపోర్టును, మీ చార్టును ఇస్తూ ఉండండి. ఇందులో అలసిపోవద్దు. నిర్లక్ష్యులుగా కావద్దు. అప్పుడు ఫారెన్ యూథ్ను ఇండియాలో చూపిస్తాము, ప్రభుత్వంతో కలిపిస్తాము మరియు ఇండియా గ్రూపును ఫారెన్ ప్రభుత్వంతో కలిపిస్తాము. మరి తయారుగా ఉండండి. వీరు ఎలా తమ పురుషార్థాన్ని చేస్తున్నారు, ఎలా పరివర్తన అవుతున్నారు, ఎలా సఫలతను పొందుతున్నారు అని వారికి చూపిస్తాము. సరేనా, చాలా బాగా చేసారు, చేస్తూ ఉండండి. అచ్ఛా.
జ్యూరిస్ట్ మరియు కల్చరల్ వింగ్:- బాగుంది. బాప్‌దాదా వద్దకైతే సమాచారమంతా అందుతూ ఉంటుంది. రెండు వర్గాలు ఏదో ఒక ప్లానును తయారు చేస్తూ ఉంటారు మరియు మంచి ఉన్నతి కూడా జరుగుతూ ఉంది. ఏదైతే స్పార్క్ వింగ్ ఉందో, అందులో ఏమి రిసెర్చు చేసారు? పరిశోధన తర్వాత ఎవరైనా ప్రాక్టికల్‌గా ఫ్రూఫ్‌గా అయ్యారా, హార్ట్ పేషంట్లు నిరోగులుగా అయ్యారా, ఆ ఋజువు ఉందా, యూథ్ యొక్క సమాచారము కూడా విన్నాము. ప్రభుత్వం వరకు ఋజువు వెళ్తుంది. చాలా మంచిది. అలాగే గ్రామ సేవలో కూడా ప్రత్యక్షంగా సెంటర్లు, గీతా పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈ రికార్డు చాలా బాగుంది. అలాగే స్పార్క్వారు ఉన్నారు, కల్చరల్వారు ఉన్నారు. రిసర్చు ద్వారా పరివర్తనకు వీరు సాంపుల్ అని విశేషంగా ఏదైనా ఉదాహరణ తయారైందా? బాప్‌దాదా అటువంటి సాంపుల్‌ను చూడాలనుకుంటున్నారు, వినాలనుకుంటున్నారు కూడా. ఏమి రిసర్చు చేసారు మరియు ఎంతమంది ఆ రిసర్చు ద్వారా ప్రాక్టికల్‌గా లాభాన్ని పొందారు. ఇది చూడాలని ఆశిస్తున్నాము. కల్చరల్వారు కల్చరల్ డిపార్టుమెంటులో, ఎవరైనా ప్రత్యక్ష రూపంలో మేము ఆధ్యాత్మిక కల్చర్ ద్వారా ఇది అనుభవం చేసాము అని అన్నారా? మన డిపార్టుమెంటులన్నీ పరివర్తన అయ్యాయి. అలాగే అన్ని వర్గాలకు, అన్ని వర్గాల వారికి బాప్‌దాదా ఏమని చెప్తున్నారంటే ఇలా 7-8, 10-12 ఉదాహరణలు తయారు చెయ్యండి. వర్గీకరణ ఏమి చేస్తుంది అని ప్రభుత్వానికి ఉదాహరణ చూపించవచ్చు. అప్పుడు ప్రభుత్వం యొక్క సహయోగం కూడా లభిస్తుంది. ఒక డిపార్టుమెంటువారు అయితే డబ్బులు మా వద్ద ఉన్నాయి, పని మీ వద్ద ఉంది అని అనడం బాప్‌దాదా విన్నారు. కావున పని యొక్క ప్రత్యక్ష రూపాన్ని ఇవ్వడంతో వారిది కూడా సఫలం చెయ్యండి. లేకపోతే పాపం అలాగే వారి ఖజానా ఖాళీ అయిపోతుంది. వారికి ఉపయోగించడం రాదు, మీరు సఫలం చేయించవచ్చు, ప్రభావంతో. కావున అన్ని వర్గాలవారూ కలిసి ప్రాక్టికల్‌లో ప్రతి వర్గానికి ప్రత్యక్ష ఋజువు వచ్చే ప్లానును ఆలోచించండి. (ఉష అక్కయ్య చంద్రపూర్ మరియు భోపాల్ సేవా సమాచారాన్ని వినిపించారు). ప్రోగ్రాము బాగా చేసారు, అందుకు అభినందనలు, ఇప్పుడు మంచిగా తయారు చేసి చూపించండి.
అందరికీ మైండ్ డ్యాన్సు వచ్చా? మనసు యొక్క డ్యాన్సు వచ్చా? మరి రోజంతటిలో ఎంత సమయం మనసులో సంతోషము యొక్క డ్యాన్సు చేస్తారు? ఇందులో అలసిపోయే విషయము లేదు. నొప్పి వచ్చే విషయము కూడా లేదు. బిజీగా ఉన్నాము అని కూడా చెప్పలేరు. సమయం ఇవ్వవలసి ఉంటుంది అని కూడా కాదు. ఖర్చు కూడా లేదు. మరి ఏమి చెయ్యాలి? బాప్‌దాదా ఎప్పుడు టి.వి ఆన్ చేసినా ఏమి కనిపించాలి? పిల్లలు ప్రతి ఒక్కరూ మనసు యొక్క డ్యాన్సులో బిజీగా కనిపించాలి. సదా బిజీగా ఉండండి. బాప్‌దాదా అకస్మాత్తుగా టి.వి ఆన్ చేస్తారు, అప్పుడు ఎవరెవరు డ్యాన్సు చేస్తున్నారో చూస్తాము. సదా డ్యాన్సు చేస్తూ ఉండండి. అచ్ఛా - ఇప్పుడు ఏమి చెయ్యాలి? బాప్‌దాదా అయితే మిలనం జరుపుకోవడంలోనే బిజీ అయిపోయారు. అచ్ఛా.
నలు వైపుల మెరుస్తున్న ఆత్మిక దీపాలకు, సదా సఫలం చేసే సఫలత స్వరూప పిలల్లకు, సదా అఖండ మహాదాని, అఖండ నిర్విఘ్న, అఖండ జ్ఞాన మరియు యోగయుక్తులు, సదా ఒకే సమయంలో మూడు సేవలను చేసేవారు, మనసా వైబ్రేషన్ల ద్వారా, వాయుమండలం ద్వారా, వాచా వాణి ద్వారా మరియు నడవడిక మరియు ముఖము, కర్మల ద్వారా మూడు సేవలనూ ఒకే సమయంలో ఒకేసారి జరగాలి. అప్పుడు మీ ప్రభావము ఉంటుంది. బాగుంది అని అనేవారు కాదు, బాగా తయారయ్యేవారి మీద మీ ప్రభావము పడుతుంది. ఇటువంటి అనుభవీమూర్తుల ద్వారా అనుభవం చేయించే పిల్లలకు బాప్‌దాదా యొక్క నూతన సంవత్సరానికి పదమారెట్లు ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు. హృదయ సింహాసనము సదా సింహాసనాధికారులుగా చేస్తుంది. కావున, నలు వైపుల ఉన్న పిల్లలకు, సమ్ముఖంలో ఉన్నవారు, దూరంగా ఉన్నా కానీ హృదయ సింహాసనంపై ఉన్న వారికి అందరికీ పేరు సహితంగా మరియు విశేషత సహితంగా ప్రియస్మృతులు మరియు నమస్తే.
అచ్ఛా, మొదటిసారి వచ్చినవారు లేవండి. చేతులు ఊపండి. చూడండి. సగం క్లాసు మొదటిసారి వచ్చినవారే ఉన్నారు. వెనుక ఉన్నవారు చేతులు ఊపండి. టి.విలో కనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు. మొదటిసారి వచ్చినవారికి బాప్‌దాదా నుండి చాలా చాలా హృదయపూర్వక అభినందనలు కూడా మరియు హృదయపూర్వక ప్రియస్మృతులు కూడా. ఇప్పుడు ఎలా అయితే వచ్చారో, ఇప్పుడు వచ్చినవారికి బాప్‌దాదా అమర భవ అని వరదానమును ఇస్తున్నారు.
దాదీ జానకితో:- బాగా సంభాళిస్తున్నారు. మీరు సంతుష్టంగా ఉన్నారా? (అందరినీ అడిగారు). బీజము సంతుష్టంగా ఉంటే అందరూ సంతుష్టంగా ఉంటారు. వారి (దాదీ ) ఛత్రఛాయ కూడా ఉంది. వారి దృష్టి కూడా ఉంది. వారిని కేవలం సేవ కోసం పిలవడం జరిగింది, సేవలోనే ఉన్నారు.
దాదీ మనోహర్‌తో:- మంచి పాత్రను నిర్వహిస్తున్నారు. క్లాసులో హాజరు ఇస్తున్నారు. ఇది చాలా మంచిది. స్వయం కూడా రిఫ్రెష్ మరియు ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తున్నారు. దీనిని వదలకండి. డాక్టరు లేకుండా బాగైపోతాను అని వీరు సంకల్పం చేసారు. అయిపోతుంది.
ముగ్గురు అన్నయ్యలతో:- అచ్ఛా, త్రిమూర్తులు, బాగున్నారా. త్రిమూర్తులు కదా. ఇప్పుడు ఎలా అయితే బాబా త్రిమూర్తి రూపంలో ప్రసిద్ధమై ఉన్నారో, అలాగే మీరు ముగ్గురు కూడా ఎంతటి విశాల కార్యాన్ని చేసి చూపించండి అంటే అందరూ వాహ్! వాహ్! అనే గీతాన్ని పాడాలి. స్వయం పట్ల మరియు సేవ పట్ల రెండూ. స్వయం పట్ల కూడా ముగ్గురు కాదు, ఒక్కరే. ఒకరు చెబితే మరొకరు వినడము. ఆలోచించారు, సంతుష్టపరిచారు. ఇది అందరూ చూడాలని ఆశిస్తున్నారు. చెయ్యవలసిందే కదా. ఎవరైనా ఒకరు నిమిత్తం కండి. నేను నిమిత్తం కావాలి. నేను నిమిత్తం కావాలి అని ప్రతి ఒక్కరూ భావించాలి. బహుమతి లభిస్తుంది. హృదయపూర్వక ప్రేమ అనేది అన్నిటికన్నా పెద్ద బహుమతి. ఈ విషయంలో ప్రేమ. ప్రేమ ఉంది కానీ ఈ విషయంలో ప్రేమను ఎవరు తీసుకు వస్తారు వారికి ప్రేమ బహుమతి రూపంలో, సరేనా! అచ్ఛా.
2008 ఆగమనం సందర్భంగా బాప్‌దాదా ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు (రాత్రి 12 గంటల తర్వాత)
నలు వైపుల ఉన్నటువంటి సర్వ లక్కీ మరియు లవ్లీ పిల్లలకు నూతన సంవత్సరానికి చాలా, చాలా శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలు. నూతన సంవత్సరంలో సదా నూతన ఉల్లాస ఉత్సాహాలలో ఉండండి మరియు నూతన సంకల్పం సేవ యొక్క వృద్ధి మరియు స్వయంలో తీవ్ర పురుషార్థం యొక్క సిద్ధిని చేసుకుంటూ ఎగురుతూ ఉండండి మరియు ఎగిరింపజేస్తూ ఉండండి. ఇప్పటికి గుడ్ నైట్ మరియు రేపటి కోసం, ఇప్పుడిప్పుడే మొదలైంది కదా, గుడ్ మార్నింగ్ మరియు గుడ్ నైట్ కూడా. అచ్ఛా!
ఓంశాంతి