Search for a command to run...
23 Jan 1970
సేవలో సఫలతను పొందేందుకు యుక్తులు
23 January 1970 · తెలుగు
సేవ కారణంగా తప్పక మాట్లాడవలసి వస్తుంది అని అనిపిస్తుందా? సేవ సమాప్తమయ్యాక ధ్వని స్థితి కూడా సమాప్తమవుతుంది (ముంబయి పార్టీ బాప్‌దాదాతో ముంబయిలో జరగబోయే సమ్మేళనం గురించి డైరెక్షన్లు తీసుకుంటున్నారు) ఈరోజుల్లో మీరు చేసే సేవలో ఏ విశేషత ఉండాలి? భాషణ అయితే సంవత్సరాల నుండి చేస్తున్నారు కానీ ఇప్పుడు భాషణలో కూడా ఎటువంటి అవ్యక్త స్థితిని నింపాలి? మాట్లాడుతున్నాగానీ వినేవారికి వీరు అశరీరిగా, శబ్దం నుండి అతీతంగా ఉండి మాట్లాడుతున్నారు అనిపించాలి. ఇప్పుడు ఈ సమ్మేళనంలో ఈ నవీనత ఉండాలి. ఆ వక్తలు మరియు బ్రాహ్మణ వక్తలలో దూరం నుండే ఈ తేడా కనిపించాలి. అప్పుడు సమ్మేళనము సఫలత పొందింది అని అంటాము. కొత్తవారైనా సభలో ప్రవేశిస్తే ఎవరో విశిష్టమైనవారు మాట్లాడుతున్నారు అని వారికి అనిపించాలి. వాణి బలం కేవలం కర్ణరసం వరకే ఉంటుంది. అదే అవ్యక్త స్థితిలో స్థితి అయ్యి మాట్లాడితే అది కేవలం కర్ణరసం వరకే కాదు మనోరసం కూడా ఉంటుంది. చెవులకు ఇంపుగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు కానీ మనోరసాన్ని ఇవ్వగలిగినవారు ఇప్పటివరకు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. బాబా అయితే మీ ఎదుట ప్రత్యక్షమయ్యారు కానీ పిల్లలైన మీరు బయట ప్రత్యక్షమవ్వాలి. కావున ఈ సమ్మేళనము సాధారణంగా జరగకూడదు. చిత్రాలలో కూడా చైతన్యత ఉండాలి అని మీటింగులో చెప్పండి. చైతన్యము వ్యక్త భావాన్ని స్పష్టం చేసినట్లుగా చిత్రము చైతన్యంగా అయ్యి సాక్షాత్కారము చేయించాలి. చిత్రంలో చైతన్యతా భావం ప్రత్యక్షమైతే ఆ చిత్రమే మంచిగా అనిపిస్తుంది. బాహ్య కళ గురించి చెప్పడం లేదు, బయటతో పాటు లోపల కూడా అలాగే ఉండాలి. బాప్‌దాదా ఈ నవీనతనే చూడాలని ఆశిస్తున్నారు. తక్కువ మాట్లాడండి, ఎక్కువ కర్తవ్యములు చేసి చూపించండి. ఇదే బ్రాహ్మణుల రీతి, పద్ధతి. ఈ సమ్మేళనము విశిష్ట రీతిలో ఎలా చేయాలి అన్న ఆలోచన ఉండాలి. చిత్రాలలో కూడా అవ్యక్త చైతన్యత ఉండాలి, అది దూరంనుండే అనిపించాలి. లేకపోతే ఇంతమంది ప్రజలు ఎలా తయారవుతారు. కేవలం నోటితోనే కాకుండా ఆంతరిక స్థితితో ఏ ప్రజలైతే తయారవుతారో వారికే ఆంతరిక సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది. మీరు రిజల్టును చూసారు కదా, ఎవరైతే అవ్యక్త స్థితి యొక్క అనుభవంతో వచ్చారో వారు ఆది నుండి సహజంగా నడుస్తున్నారు, నిర్విఘ్నంగా ఉన్నారు. ఎవరైతే అవ్యక్త స్థితితో పాటు ఇతర ఆధారాలతో కూడా నడుస్తున్నారో వారికి మధ్యలో విఘ్నాలు, కష్టాలు మొదలైన కఠిన పురుషార్థాన్ని చూడవలసి వచ్చింది. అవ్యక్త స్థితి యొక్క పునాదితో చాలా కొద్ది సమయంలో మరియు సహజంగా తమ లక్ష్యాన్ని పొందేటువంటి ప్రజలను ఇప్పుడు తయారు చేయండి. ఎంతగా స్వయం సహజ పురుషార్థీగా ఉంటారో, అవ్యక్త శక్తిలో ఉంటారో అంతగా ఇతరులను కూడా తమ సమానంగా చేయగలరు. మరి ఈ సమ్మేళనము యొక్క రిజల్టును చూస్తాము. టాపిక్ ఏదైనా పెట్టండి, స్థితి టాప్‌గా ఉండాలి. టాప్ స్థితి ఉంటే టాపిక్స్‌ను ఎలా అయినా తిప్పవచ్చు. ఇప్పుడు భాషణపై కాదు, స్థితిపై సఫలత యొక్క ఆధారం ఉంది అంటాము. ఎందుకంటే భాషణ అంటే భాషలో ప్రావీణ్యమైతే ప్రపంచంలో చాలామందికి ఉంది. కానీ ఆత్మలో శక్తిని అనుభవం చేయించేవారైతే మీరే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ నవీనతనే తీసుకురావాలి. ఎప్పుడు ఏ కార్యం చేస్తున్నా ముందుగా వాతావరణాన్ని అవ్యక్తంగా చేయడం చాలా అవసరం. ఇతర అలంకరణలపై శ్రద్ధ పెడ్తారు కదా, అలాగే ఇది ముఖ్యమైన అలంకరణ. కానీ ఏమి జరుగుతుంది? నడుస్తూ-నడుస్తూ ఆ సమయంలో బాహ్యముఖతలోకి అధికంగా వచ్చేస్తున్నారు, ఆ వాయుమండలం ఉన్న కారణంగా రిజల్టు అనుకున్నట్లుగా రావడం లేదు. ఇలా చేయాలి, ఇది చేయాలి అని చాలా ఆలోచిస్తారు. కానీ చివరలో కర్తవ్యాలు ఎక్కువగా ఉండటం వలన బాహ్యముఖతలోకి వచ్చేస్తున్నారు. విన్నవారు కూడా ఆ సమయంలో చాలా బాగుంది అని అంటారు కానీ వెంటనే బాహ్యముఖతలోకి వచ్చేస్తారు. ఎవరు వచ్చినా కానీ ముందుగా వారికి అవ్యక్త ప్రభావము అనుభవమయ్యేలా ప్రోగ్రామును చేయండి. సమ్మేళనము సఫలతను పొందడానికి ఇదే సాధనము. కొన్ని రోజుల ముందు నుండే ఈ వాతావరణాన్ని తయారు చేయాలి. కేవలం ఆ రోజు మాత్రమే చేయడం కాదు. వాయుమండలాన్ని శుద్ధంగా చేస్తే అప్పుడు ఏదైనా నవీనత కనిపిస్తుంది. సాకారుడి శరీరంలో కూడా దూరం నుండే అలౌకికత కనిపించేది కదా. మరి పిల్లల వ్యక్త శరీరాల నుండి కూడా అలౌకికత కనిపించాలి.
ప్రెస్ కాన్ఫెరెన్సు రిజల్టు ఒకవేళ బాగుంటే అది చేయడంలో ఏమీ ఇబ్బంది లేదు. కానీ ముందుగా వారిని కలిసి వారిని సహయోగులుగా చేయండి – ఇది చాలా అవసరము. సరిగ్గా సమయానికి వెళ్ళి వారితో పని చేయించుకోవడంలో, సమయంకన్నా ముందు నుండే వారి వద్దకు వెళుతూ వారిని సహయోగులుగా చేసుకోవడంలో తేడా ఉంది. చాలాసార్లు సమయంపై అటెన్షన్ వెళ్తుంది. ఇప్పుడు మీ బుద్ధి లైన్ క్లియరుగా చేసుకుంటే అన్నీ స్పష్టమవుతూ ఉంటాయి. మీ ప్రదర్శనిలో ఉంది కదా – స్విచ్ ఆన్ చేస్తే జవాబు లభిస్తుంది అని, అలాగే పురుషార్థం లైన్ క్లియరుగా ఉంటే సంకల్పం స్విచ్ నొక్కగానే పని జరుగుతుంది. ఇలా అనుభవం చేసుకుంటారు. కేవలం వ్యర్థ సంకల్పాల కంట్రోలింగ్ పావర్ కావాలి. వ్యర్థ సంకల్పాలు వచ్చిన కారణంగా ఒరిజినల్‌గా బాప్‌దాదా ద్వారా ప్రేరణ అనండి లేక శుద్ధ రెస్పాన్స్ అనండి అది మిక్స్ అయిపోతుంది ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు అధికంగా ఉన్నాయి. ఒకవేళ వ్యర్థ సంకల్పాలను నియంత్రించే శక్తి ఉంటే అందులో కేవలం ఒక్క బాబా రెస్పాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. బుద్ధిని ట్రాన్స్లైట్ అనుకుంటే అందులో ప్రతి విషయం యొక్క రెస్పాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది మరియు యథార్థంగా ఉంటుంది. మిక్స్ ఉండదు. ఎవరికైతే వ్యర్థ సంకల్పాలు రావో వారు తమ అవ్యక్త స్థితిని ఎక్కువగా పెంచుకోవచ్చు. శుద్ధ సంకల్పాలు కూడా రావాలి. కానీ వాటిని (వ్యర్థ సంకల్పాలు) కూడా కంట్రోల్ చేయడం రావాలి. వ్యర్థ సంకల్పాల తూఫాను మెజారిటీలో ఎక్కువగా ఉంది.
ఏదైనా పనిని ప్రారంభించే ముందు దాని శాంపుల్‌ను మంచిగా తయారు చేయడం జరుగుతుంది, ఈ సమ్మేళనం కూడా అందరి ఎదుట ఒక శాంపుల్‌గా నిలవాలి.
అవ్యక్త స్థితి అంటే ఏమిటి, ఈ అనుభవాన్ని చేయించండి. మీ కర్మలతో అందరూ సమయం యొక్క గడియారాన్ని చూడాలి. సమయం యొక్క గడియారంగా అయ్యి ఇక్కడినుండి వెళ్తున్నారు. సాకారుడు కూడా సమయం యొక్క గడియారంగా అయ్యారు కదా. అలాగే శరీరంలో ఉంటూ అవ్యక్త స్థితి యొక్క గంటలను మ్రోగించే గడియారంగా అవ్వండి. ఈ సేవ అన్నిటికన్నా మంచి సేవ. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితిలో ఉండటం అంటే ఏమిటి,ఈ పాఠాన్ని అందరికీ ప్రాక్టికల్‌గా చెప్పండి. అచ్ఛా.
బాప్‌దాదా మరియు దైవీ పరివారం అందరి స్నేహ సూత్రంలో పూసగా అయి ఉండండి. స్నేహ సూత్రంలో బంధింపబడి ఉన్న పూసను నేను – ఈ నషా ఉండాలి. పూసలను ఎక్కడ ఉంచుతారు? మాలలోని పూసలను ఎంతో పవిత్రంగా ఉంచుతారు. చేతిలోకి తీసుకున్నా ఎంతో శుద్ధితో తీసుకుంటారు. మనం కూడా అంతటి శుద్ధి నిండిన వాళ్ళం. మనం కూడా అంతటి విలువైన పూసలం అని భావించండి. (సేవ కోసం ఒకరు సలహా అడిగారు). వారి సేవ వాణితో ఉండదు. చరిత్ర ప్రభావశాలిగా ఉన్నప్పుడు, పరివర్తన చూసినప్పుడు వారే స్వయంగా ఆకర్షితులవుతారు. కొందరికి తమ అహంకారం కూడా ఉంటుంది కదా. అప్పుడు వాణితో వాణికి అహంకారపు ఘర్షణ జరుగుతుంది. కానీ ప్రాక్టికల్ లైఫ్‌తో తలపడరు. కనుక ఇటువంటి వారికి అర్థం చేయించడానికి ఇదే సాధనము. వాయుమండలాన్ని అవ్యక్తంగా చేయండి. సేవాకేంద్రాల వాతావరణం ఆకర్షణీయంగా అవ్వాలి, అందులో వారికి అవ్యక్త వతనం కనిపించాలి. దూరంనుండి ఎవరు చూసినా, వీరైతే ఈ ఇంటికి దీపంవంటి వారు అనిపించాలి. దీపం దూరం నుండే ప్రకాశాన్నిస్తుంది. తన వైపుకు ఆకర్షిస్తుంది. కనుక దీపంవలె మెరుస్తూ కనిపించాలి, అప్పుడే సఫలత.
అవ్యక్త భట్టీకి వచ్చి అవ్యక్త స్థితి యొక్క అనుభూతి జరుగుతుందా? ఇక్కడ లభించిన అనుభవాన్ని ఏమి చేస్తారు? మీతో పాటు తీసుకువెళ్తారా లేక ఇక్కడే విడిచి పెడ్తారా! దీనిని మీరు ఎంత తోడుగా పెట్టుకోవాలంటే ఎవరు ఎంతగా మిమ్మల్ని ఈ అవ్యక్త ఆకర్షణ నుండి దూరం చేయాలని ప్రయత్నించినా గానీ దూరం చేయలేకపోవాలి. లౌకిక పరివారాన్ని అలౌకిక పరివారంగా చేసారు. కొద్దిగా కూడా లౌకికతనం ఉండకూడదు. ఎలా అయితే ఒక శరీరం విడిచి మరో శరీరం తీసుకుంటే పూర్వ జన్మ విషయాలేవీ గుర్తు ఉండవో, అలాగే ఇది కూడా మరుజీవగా అయ్యారు కదా. మరి గత జన్మ యొక్క స్మృతి మరియు దృష్టి అలాగే సమాప్తమవ్వాలి. లౌకికంలో అలౌకికతను నింపడం వలనే అలౌకిక సేవ జరుగుతుంది. ఎటువంటి అలౌకిక సేవను చేస్తారు? ఆత్మ యొక్క కనెక్షన్‌ను పవర్ హౌస్‌తో జోడించే సేవను చేయండి. ఒక వైరును మరో వైరుతో జోడించాలంటే పైన ఉన్న రబ్బరును తీసేస్తారు, అలాగే మీ మొదటి కర్తవ్యము – స్వయాన్ని ఆత్మగా భావించి శరీర భానం నుండి వేరవ్వడము మరియు ఇతరులను కూడా శరీర భానం నుండి వేరు చేయడము. ఇక్కడ ఉన్న ముఖ్యమైన సబ్జెక్టులు ఏమిటి మరియు అవి ఏవి? ముఖ్యమైన సబ్జెక్టులు నాలుగు. జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవ. వీటిలో ముఖ్యమైనది ఏమిటి? ఇక్కడినుండే శాంతి స్టాకును జమ చేసుకున్నారా? ఆశీర్వాదాలు ఎలా లభిస్తాయో తెలుసా? ఎంతెంతగా ఆత్మ అభిమానిగా అవుతారో అంతంతగా ఆశీర్వాదాలు వద్దన్నా లభిస్తూ ఉంటాయి. ఇక్కడ స్థూలంగా ఎటువంటి ఆశీర్వాదాలు లభించవు. ఇక్కడ స్వతహాగా లభిస్తాయి. బాప్‌దాదా ఆశీర్వాదాలు లేకపోతే ఇక్కడి వరకు ఎలా వస్తారు? ప్రతి సెకండు బాప్‌దాదా పిల్లలకు ఆశీర్వాదాలు ఇస్తుంటారు. కానీ తీసుకునేవారు ఎంత తీసుకుంటారో అంతగా వారి వద్ద ఉంటాయి.
మీకు మరో యుగళ్ కూడా ఉన్నారా? సదా మీకు తోడుగా ఉండే యుగళ్ ఎవరు? ఇక్కడ సదా యుగళ్తో ఉంటే అక్కడ కూడా యుగళ రూపంలో రాజ్యం చేస్తారు. కావున మీ యుగళ్ను ఎప్పుడూ వేరు చేయకండి. ఎలా అయితే చతుర్భుజుడు కంబైండుగా ఉంటారో అలాగే మీరు కూడా కంబైండ్. శివబాబాను ఎప్పుడూ మీ నుండి దూరం చేయకండి. ఇటువంటి యుగళ్ను ఎప్పుడైనా చూసారా? 84 జన్మలలో 84 యుగళులలో ఇటువంటి యుగళ్ ఎప్పుడైనా లభించారా? మరి కల్పంలో ఒక్కసారి లభించే ఈ యుగళ్ను పూర్తిగా మీతోనే పెట్టుకోవాలి. మేము యుగళ్, ఒంటరిగా లేము అని గుర్తుంచుకోండి. ఎలా అయితే స్థూల కార్యంలో హార్డ్ వర్కర్లు ఉంటారు కదా, అలాగే మనసు స్థితిలో ఎంత హార్డుగా ఉండాలంటే ఎటువంటి పరిస్థితిలోనూ కరగకూడదు. గట్టి వస్తువు కరగదు. అలాగే మీ స్థితి మరియు కర్మ రెండూ గట్టిగా ఉండాలి. ఎవరిపై అతి స్నేహము ఉంటుందో వారిని తోడుగా పెట్టుకోవడం జరుగుతుంది. కనుక, నేను యుగళమూర్తిని అని సదా భావించండి. ఒకవేళ యుగళ్ తోడుగా ఉంటే మాయ రాలేదు. యుగళ మూర్తిని అని భావించడమే పెద్ద యుక్తి. అడుగడుగులో తోడుగా ఉన్న కారణంగా సాహసం ఉంటుంది. శక్తి ఉంటుంది, అప్పుడు మాయ రాదు.
మీరు ఈశ్వరీయ విద్యార్థులు కదా? డబల్ స్టూడెంటుగా అయ్యి ఏ భవిష్య లక్ష్యాన్ని పెట్టుకున్నారు? దేనిని ఉన్నతమైన పదవిగా భావిస్తున్నారు? లక్ష్మీనారాయణులుగా అవుతారా? ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటారో, లక్ష్యంతో పాటు ఏమి ధారణ చేయాల్సి ఉంటుంది? లక్షణాలు అనగా దైవీగుణాలు. లక్ష్యమైతే ఉన్నతమైనది పెట్టుకున్నారు, మరి అంతే ఉన్నతమైన లక్షణాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. చిన్న కుమారి కూడా చాలా పెద్ద సేవ చేయగలదు. తన ప్రాక్టికల్ స్థితిలో స్థితి అయ్యి ఎవరికైనా వినిపిస్తే ఆ ప్రభావం పెద్దవారికన్నా ఎక్కువగా ఉంటుంది. చిన్నదానినైన నేను పెద్ద పెద్ద కర్తవ్యాలు చేసి చూపించాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దేహము చిన్నదైనా కానీ ఆత్మ శక్తి పెద్దది. ఎక్కువ సేవ చేయాలన్న కోరిక ఉన్నవారికి సహాయం కూడా బలంగా లభిస్తుంది. ఎవరు ఎంత కదిలించినా కానీ ఈ సంకల్పం మాత్రం పక్కాగా పెట్టుకోండి. సంకల్పం బలంగా ఉంటే సృష్టి కూడా అటువంటిదే తయారవుతుంది. భౌతిక సేవ (ఉద్యోగం) కూడా చేస్తూ ఉండండి. భౌతిక సేవ కూడా ఇందుకు ఒక సాధనము, ఈ సాధనముతో సేవ చేయవచ్చు. ఈ ఉద్యోగంలో ఏ ఆత్మలు వచ్చినా వారికి సందేశాన్ని ఇవ్వడానికి ఇది ఒక సాధనము. సేవలో అయితే అనేక ఆత్మలు పరిచయమవుతారు. ఎలా అయితే ఇక్కడ ఉన్నవారిని కూడా సేవ కోసం బంధువుల వద్దకు పంపించాము కదా, అలాగే సర్వీసు కోసం ఈ స్థూల సర్వీసు (ఉద్యోగం) చేస్తున్నాము అని భావించండి. అప్పుడు మనసు దానిపై ఉంటుంది మరియు సంపాదన కూడా ఉంటుంది. లౌకికాన్ని కూడా అలౌకికంగా భావించి చేయండి. అప్పుడు మరే ఇతర వాతావరణంలోకి వెళ్ళరు. ఎలా ఎలా అయితే అవ్యక్త స్థితి తయారవుతూ ఉంటుందో అలా అలా మాట్లాడటం కూడా తక్కువ అవుతూ ఉంటుంది. తక్కువ మాట్లాడటం వలన ఎక్కువ లాభాలున్నాయి. అప్పుడు ఈ యోగ శక్తితో సేవను చేస్తారు. యోగబలం మరియు జ్ఞాన బలం రెండూ కలిసి ఉండాలి. ఇప్పుడు జ్ఞాన బలంతో సేవ జరుగుతుంది. యోగ బలం గుప్తంగా ఉంది. కానీ ఎంతగా యోగబలం మరియు జ్ఞానబలం రెండింటినీ సమానంగా తీసుకువస్తారో అంతగా సఫలత లభిస్తుంది. రోజంతటిలో యోగ బలం ఎంత ఉంది, జ్ఞాన బలం ఎంత ఉంది అని పరిశీలించుకోండి. అప్పుడు తేడా తెలుస్తుంది. సేవలో బిజీ అయిపోతే విఘ్నాలు మొదలైనవి కూడా తొలగిపోతాయి. దృఢ నిశ్చయం ముందు ఏ ఆటంకాలు రాలేవు. సరిగ్గా నడుస్తున్నారు. నిర్విరామం మరియు ఏకరసం రెండూ గుణాలే. సదా ఫాలో ఫాదర్ చేయాలి. ఎలా అయితే సాకార రూపంలో కూడా అలసట లేకుండా ఏకరసంగా, ఉదాహరణగా అయ్యి చూపించారో అలాగే ఇతరుల ముందు ఉదాహరణగా అవ్వాలి. ఇదే సేవ. సేవ కోసం సమయం లభించకపోయినా కానీ, చరిత్ర కూడా సేవను చూపించగలదు. చరిత్రతో కూడా సేవ జరుగుతుంది. కేవలం వాణితో అవ్వదు. మీ చరిత్ర ఆ విచిత్రుడైన బాబాను గుర్తు తెప్పించాలి. ఇదైతే సహజమైన సర్వీసు కదా. కొందరు గురువు ఫోటోను లేద భార్య తమ భర్త ఫోటోను లాకెట్లో వేసుకుంటారు కదా. ఇది స్నేహానికి గుర్తు. మీ ఈ మస్తకం ఉంది కదా, ఇది కూడా ఆ విచిత్రుడైన బాబా చరిత్రను చూపించాలి. ఈ నయనాలు ఈ విచిత్రుడి చిత్రాన్ని చూపించాలి. ఇటువంటి అవినాశి లాకెట్‌ను ధరించండి. మీకు స్మృతి కూడా ఉంటుంది, సర్వీసు కూడా జరుగుతుంది.
మధుబన్కు వచ్చి ముఖ్యమైన ఏ కర్తవ్యాన్ని చేసారు? ఎవరైనా ఖజానా వద్దకు వెళ్తే అక్కడ ఏమి చేస్తారు? ఖజానా నుండి ఎంత తీసుకోగలరో అంత తీసుకుంటారు. కేవలం కొద్దిగా తీసుకోరు. అలాగే మధుబనము సర్వ ప్రాప్తుల ఖజానా. మరి మీరు ఖజానా వద్దకు వచ్చారు కదా. ఇతర సేవాకేంద్రాలు ఈ ఖజానా యొక్క శాఖలు. ఖజానా వద్దకు వెళ్తే ఎంత వీలైతే అంత తీసుకోవాలి అని గుర్తుంచుకుంటారు. అలాగే ఇక్కడ కూడా ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడి ప్రతి వస్తువు, ప్రతి బ్రాహ్మణ ఆత్మ అనేక శిక్షణలు మరియు శక్తిని ఇస్తారు. వచ్చిన వారు కొద్దిగా కాదు, అంతా తీసుకోవాలి అని బాప్‌దాదా ఆశిస్తున్నారు. బాప్‌దాదాకు పిల్లలపై స్నేహము ఉంది, కావున అందరినీ సంపన్నులుగా చేయాలనుకుంటున్నారు. ఎంతగా ఇక్కడ తీసుకోవడంలో సంపన్నంగా అవుతారో అంతగా భవిష్యత్తులో రాజ్యం పొందడంలో సంపన్నులుగా అవుతారు. కనుక ఒక్క సెకండు కూడా ఈ అమూల్య రోజులను ఊరికే అలా వృధా చేసుకోవద్దు. ఒక్కొక్క సెకండులో పదమాల సంపాదనను చేసుకోవచ్చు. పదమ్ సౌభాగ్యశాలి మీరు. అందుకే ఈ భూమికి చేరుకున్నారు. కానీ పదమా భాగ్యాన్ని సదా నిలుపుకోండి, ఇందుకోసం సదా సంపూర్ణత యొక్క పురుషార్థం చేయండి. బీజాన్నిబట్టి ఫలం వస్తుంది. మీరు బీజం వంటివారు, పునాది ఎంత గట్టిగా ఉంటుందో అంత బలంగా భవనం తయారవుతుంది. కనుక, నేను పునాది అని సదా భావించండి. మనపైనే పూర్తి భవనం యొక్క ఆధారం ఉంది.
స్మృతికి రెస్పాన్స్ లభిస్తుందా? బాప్‌దాదా అయితే ఇప్పుడు అందరితో ఉన్నారు. ఎందుకంటే సాకారంలో అయితే ఒక్క స్థానంలోనే తోడుగా ఉండగలరు. ఇఫ్పుడైతే సర్వులతో ఉండగలరు. ఒక్క మతంతో ఒక్క రిజల్టు వస్తుంది అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఈ గుణాన్ని పరివర్తన చేయాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినాగానీ స్వయం మాత్రం గట్టిగా ఉండాలి. ఇతరులకు మీ గుణాలను దానం చేయండి. దానం చేయడం వలన రిటర్నులో భవిష్యత్తులో లభిస్తుంది కదా. ఈ గుణాన్ని దానం చేయడం వలన కూడా పెద్ద ప్రాప్తి లభిస్తుంది. ఎవరైతే ఏకమతంతో ఉంటారో వారే ఒక్కరికి ప్రియంగా అవుతారు. బాప్‌దాదా ఇద్దరే అయినా కానీ ఒక్కరే కదా. ఎంతమంది ఉన్నప్పటికీ ఒక్కటిగా అయి నడుచుకోండి. బాబా ఇంటికి వచ్చి ఏ విశేష ఖజానాను తీసుకున్నారు? బాబా ఇంటిలో విశేషతలు నిండి ఉన్నాయి కదా. మీ ఇంటిలో మీ అసలైన స్వరూపంలో స్థితులవ్వడానికి వచ్చారు. మీ అసలైన స్వరూపము, అసలైన స్థితి ఏమిటి, అది గుర్తుందా? ఆత్మ యొక్క అసలైన స్థితి ఏమిటి? ఆరంభంలో ఆత్మ పరంధామ నివాసి, సర్వ గుణాల స్వరూపంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా అటువంటి స్థితినే అనుభవం చేసుకోవడానికి వచ్చారు. ఆ స్థితిని పరీక్షించుకోవడానికి మధుబనానికి వచ్చారు. పరీక్షించుకున్న తర్వాత సదా కోసం దానిని మీలో దాచుకోండి. దీని పేరు మధుబన్. మధు అనగా మధురత అనగా స్నేహము మరియు శక్తి రెండు వరదానాలు పూర్ణ రూపంలో ప్రాప్తి చేసుకోండి. ఇక్కడ మధుబన్‌లో రెండూ వరదాన రూపంలో లభిస్తాయి. బయటకు వెళితే ఈ రెండింటి కోసం పురుషార్థం చేయవలసి వస్తుంది. ఇక్కడ వరదానంగా లభిస్తున్న వాటిని ఎంతగా పొందాలంటే వాటిని అవినాశిగా చేసుకోండి. వరదానంగా లభిస్తున్నప్పుడు పురుషార్థం చేసి ఎందుకు తీసుకోవాలి? గురువు వరదానం ఇస్తే ఏమి చేయాలి? స్వయాన్ని ఎంతగా వారికి అర్పించుకుంటే అంతగా వరదానానికి యోగ్యులుగా అవుతారు. వరదానాలతో ఎంతగా మీ సంచిని నింపుకోవాలంటే నిండిన సంచి ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు. ఎంతగా, ఏది కావాలంటే వాటితో నింపుకోండి. ఇది గుర్తుంచుకుని ఈ కొద్ది రోజులలో నిర్విరామంగా అయ్యి లాభాన్ని పొందండి. ఒక్కొక్క సెకండు సఫలం చేసుకునే రోజులు ఇవి. ఇప్పటి ఒక్క సెకండు చాలా లాభం మరియు చాలా నష్టం కూడా తెస్తుంది. ఒక్క సెకండులో ఎన్నో సంవత్సరాల సంపాదనను నష్టపర్చుకుంటున్నారు కదా. మరి ఇక్కడి ఒక్క సెకండు అంత పెద్దది.
త్యాగముతోటే భాగ్యము తయారవుతుంది. కానీ త్యాగము చేసిన తర్వాత మనసులో కూడా త్యాగం చేసాను అన్న సంకల్పం రాకూడదు. బలి ఇచ్చేటప్పుడు కొద్దిగా అయినా అది అరిచినా లేక కన్నీళ్ళు పెట్టినా దానిని దేవీకి స్వీకరింపజేయరు. ఝాట్కూ అని విన్నారు కదా. ఒక్క దెబ్బకు ఏదైనా వస్తువును సమాప్తం చేయడానికి పదే పదే దెబ్బ వేయడానికి తేడా ఉంది కదా. ఝాట్కూ అంటే ఒక్క దెబ్బకు బలి అవ్వడం. బాప్‌దాదా వద్ద కూడా ఎటువంటి పిల్లలు స్వీకరింపబడతారు? ఎవరితైకే మనసులో కూడా సంకల్పం రాదో, వారినే మహాబలి అంటారు. ఇటువంటి మహాన్ బలికే మహాన్ బలం లభిస్తుంది. సర్వశక్తిమంతుని పిల్లలు మీరు, శక్తి లేదు అంటారా! బాబా వద్ద ఉన్న పూర్తి ఆస్తికి మీరే హక్కుదారులుగా అవ్వాలి. సర్వశక్తిమంతుడైన బాబా వద్ద ఉన్న సర్వ శక్తుల ఆస్తి, జన్మ సిద్ధ అధికారాన్ని సదా మీ ముందు పెట్టుకోండి. సర్వశక్తిమంతుని ఎదుట బలహీనత నిలవగలదా? ఈరోజు నుండి బలహీనత సమాప్తం. కేవలం ఒక్క శక్తి కాదు. పాండవులు కూడా శక్తి స్వరూపులు, ఒక్క దీపంతో అనేక దీపాలు వెలుగుతాయి.
డబల్ సర్జరీ చేస్తారా? రెండు మార్గాలను చెప్పడానికి మంచి అవకాశం లభించింది. శరీరం మరియు మనసు గురించి. స్థూల సర్వీసు చేస్తే జీతం లభిస్తుంది, మరి ఈశ్వరీయ సేవ చేస్తే ఏ జీతం లభిస్తుంది? (స్వర్గ వారసత్వం లభిస్తుంది) అదైతే అక్కడ లభిస్తుంది కానీ ఇక్కడ ఏమి లభిస్తుంది? ప్రత్యక్ష ఫలం అనుభవమవుతుందా? భవిష్యత్తు ఎలాగూ తయారవుతుంది కానీ భవిష్యత్తుకన్నా ఎక్కువైనది ఇప్పటి ప్రాప్తి. ఇప్పుడు లభిస్తున్న ఈశ్వరీయ అతీంద్రియ సుఖము భవిష్యత్తులో లభించదు. ఈ అతీంద్రియ సుఖం పూర్తి కల్పంలో ఎప్పుడూ లభించదు. ఇటువంటి ఖజానా ఇప్పుడు బాబా ద్వారా లభిస్తుంది. అనేక జన్మలు ఇంద్రియాల సుఖము మరియు ఒక్క సెకండులో అతీంద్రియ సుఖము అనుభవం అవుతుందా? శివబాబాను యుగళ్ చేసుకున్నారా? ఆ దేహదారి యుగళ్ అయితే సుఖంలో తోడుగా ఉంటారు కానీ వీరైతే దుఃఖంలో తోడుగా ఉంటారు. ఇటువంటి యుగళ్నైతే ఒక్క సెకండు కూడా విడిచిపెట్టకూడదు. తోడుగా పెట్టుకోవడం అంటే శక్తి రూపంగా అవ్వడం. ఈ బ్రాహ్మణ పరివారాన్ని చూసారా? ఇంత పెద్ద పరివారం ఇంకెప్పుడైనా లభిస్తుందా? కేవలం ఈ సంగమంలోనే ఇంత పెద్ద పరివారం లభిస్తుంది. నేను ఇంత పెద్ద పరివారానికి చెందినవాడిని అన్న నషా ఉంటుందా? ఎంత పెద్ద పరివారానికి చెందినవారైతే అంత ఎక్కువ సంతోషం ఉంటుంది. మొత్తం ప్రపంచంలోకెల్లా కొద్దిమందైన మనకు మాత్రమే ఇంత పెద్ద పరివారం లభించింది. మరి ఈ నిశ్చయం మరియు నషా ఉండాలి. కోట్లలో కొద్ది మంది అయిన మేము మాత్రమే గాయనంలోకి వస్తాము అని మీ అందరికీ నషా ఉండాలి. ఇటువంటి సౌభాగ్యం లభిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? అకస్మాత్తుగా లాటరీ తగిలింది. లాటరీ లభించిందన్న సంతోషం ఉంటుంది కదా, పైగా ఇది అవినాశి లాటరీ. ఇది ఎప్పటికీ సమాప్తమవ్వదు. ఇటువంటి లాటరీ మనకు లభించింది. ఈ నషా ఉంటుందా? మూలమూలల నుండి బాప్‌దాదా ఎవర్ని ఎంచుకున్నారో చూడండి! ఎంచుకోబడ్డ రత్నాలలో మీరు విశేషమైనవారు. ఇది గుర్తుంటుందా! బాప్‌దాదాకు ఎటువంటి రత్నాలు ఇష్టము? సాధారణము. ఇటువంటి సంతోషం ఎప్పుడూ అవినాశిగా ఉండాలి. అదెలా ఉంటుంది? దీపం సదా వెలిగి ఉండాలని దానిపై శ్రద్ధ పెడతారు కదా. నూనె మరియు ఒత్తులు రెండింటిపై శ్రద్ధ ఉంచుతారు. మరి ఇక్కడ సంతోషమనే దీపము సదా వెలిగి ఉండాలంటే రెండు విషయాలపై శ్రద్ధ పెట్టండి. జ్ఞానము అనే నూనె మరియు యోగము అనే ఒత్తి. ఈ రెండూ సరిగ్గా ఉంటే సంతోషము అనే దీపము అవినాశిగా ఉంటుంది. ఎప్పుడూ ఆరిపోదు.
25 రోజులు కూడా ఈ సంగమయుగంలో ఎక్కవే. మేము కేవలం 25 రోజుల పిల్లలమని భావించకండి. సంగమ సమయమే ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. ఈ తక్కువ లెక్కతో చూస్తే ఈ 25 రోజులు ఎక్కువే, కనుక లాస్ట్ వచ్చినా ఫాస్టుగా వెళ్ళాలి అని భావించండి. తప్పిపోయినవారు తిరిగి వస్తే వారు రాగానే తీవ్ర పురుషార్థంలో మునిగిపోతారు. పిల్లలు ధైర్యమును ఉంచుతారు, సహాయం బాబా చేస్తారు. ఒక కుమారి 100 బ్రాహ్మణులకన్నా ఉత్తమమైనది అన్న గాయనం ఉంది. ఒక్కరిలో 100మంది యొక్క శక్తిని నింపితే వారు ఏమి చేయలేరు! కేవలం మీ పాదాలను పక్కాగా చేసుకోవాలి. ఎవరు ఎంత కదిలించినా కదలకూడదు. అచల్‌ఘర్ కూడా మీ స్మృతిచిహ్నమే. అచల్ అనగా ఎవ్వరూ కదిలించలేరు అని అర్థం. మూడు నెలలలో మూడు వారసత్వాలను తీసుకున్నారా? బాప్‌దాదా ఏ మూడు వారసత్వాలను ఇస్తారు? సుఖము, శాంతి మరియు శక్తి. ఎంతగా అధికారమును తీసుకుంటారో అంతగా అక్కడ రాజ్య అధికారులుగా అవుతారు. సంపూర్ణ అధికారాన్ని పొందాలన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎందుకంటే బాబా కూడా సంపూర్ణమైనవారు కదా.
యుగళ్ ఉన్నప్పటికీ ఒంటరిగా ఉంటున్నారా లేక యుగళ్ రూపంలో ఉంటున్నారా? ఒంటరి రూపం ఏమిటి? ఆత్మ ఒంటరిది కదా. ఒంటరిగా వస్తుంది, ఒంటరిగా వెళ్తుంది. మరి యుగళ్ రూపంలో పాత్రను పోషిస్తూ కూడా ఆత్మిక స్థితిలో ఉండండి అంటే ఒంటరిగా అవ్వండి ఆ తర్వాత ఆత్మిక యుగళ్ అవ్వండి. బాబా మరియు పిల్లలు. వారైతే దేహానికి యుగళ్. ఆత్మ మరియు పరమాత్మ కూడా యుగళులే. ఆత్మను ప్రియురాలు, సీత అని కూడా అంటాం కదా. పరమాత్మ ప్రియుడు, రాముడు. కావున ఆత్మిక యుగళమూర్తులుగా అవ్వండి. అంతే. దైహిక యుగళ్ రూపం కాదు. దేహధారి యుగళ్ రూపం సమాప్తమయింది. అనేక జన్మలు దేహధారుల యుగళ రూపాన్ని చూసారు. ఇప్పుడు ఆత్మ మరియు పరమాత్మల యుగళ రూపంగా అవ్వండి. ఇటువంటి స్థితిలో ఉంటున్నారా? ఈ అద్భుతమైన యుగళ రూపం ఎదుట ఆ యుగళ్ ఏముంది! అప్పుడు దేహ భావన సమాప్తమవుతుంది. అన్నిటికన్నా ప్రియమైనది ఏమిటి? ప్రియమైనది మంచిగా అనిపిస్తుంది కదా. మరి ఆ ప్రియమైనవారిని విడిచిపెట్టి వేరేవారిని ప్రియమైనవారిగా ఎలా చేసుకుంటారు? ఒంటరిగా కూడా అవ్వాలి, మళ్ళీ యుగళ్గా కూడా అవ్వాలి.
కొందరికి రాగానే లాటరీ లభిస్తుంది. కొందరికి ప్రయత్నిస్తే లాటరీ లభిస్తుంది. ఇటువంటి ఉన్నతమైన భాగ్యశాలిగా స్వయాన్ని భావిస్తున్నారా? కుమారులకు ఇది సరళమైన మార్గం. ఎందుకంటే వీరికి ఎక్కిన తప్పుడు మెట్లను దిగవలసి ఉంటుంది. అందుకే కుమార్-కుమారీలకు చాలా సహజం. బంధనముక్తులుగా ఉన్నవారు త్వరగా పరిగెత్తగలరు. కావున, అన్ని విషయాలలో నిర్బంధనులుగా అవ్వండి. ఎటువంటి పరిస్థితిలోనైనా స్వ స్థితిని గొప్పగా పెట్టుకోండి. జీవితం యొక్క ఉన్నతమైన లక్ష్యంనుండి దూరం అవ్వకండి.
అచ్ఛా.