Search for a command to run...
30 Nov 2005
సమయము యొక్క సమీపత అనుసారముగా స్వయాన్ని హద్దు బంధనాల నుండి ముక్తులుగా చేసుకుని సంపన్నముగా మరియు సమానముగా అవ్వండి
30 November 2005 · తెలుగు
ఈరోజు నలువైపులా ఉన్న సంపూర్ణులైన సమానులైన పిల్లలను చూస్తున్నాము. సమానులైన పిల్లలే బాబా హృదయములో ఇమిడి ఉన్నారు. సమానులైన పిల్లల విశేషత ఏమిటంటే - వారు సదా నిర్విఘ్నముగా, నిర్వికల్పముగా, నిర్మానచిత్తముగా మరియు నిర్మలముగా ఉంటారు. ఇటువంటి ఆత్మలు సదా స్వతంత్రులుగా ఉంటారు, ఏ రకమైన హద్దు బంధనాలలో బంధింపబడి ఉండరు. కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - ఇటువంటి అనంతమైన స్వతంత్ర ఆత్మగా అయ్యారా! అన్నింటికన్నా మొదటి స్వతంత్రత - దేహభానము నుండి స్వతంత్రత. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ఆధారముగా తీసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహము నుండి అతీతముగా అవ్వాలి. దేహము యొక్క ఆకర్షణలోకి రాకూడదు. రెండవ విషయమేమిటంటే - స్వతంత్ర ఆత్మ ఎటువంటి పాత స్వభావ, సంస్కారాల బంధనాలలో ఉండరు, వారు పాత స్వభావ-సంస్కారాల నుండి ముక్తులుగా ఉంటారు. అంతేకాక ఏ దేహధారి ఆత్మ యొక్క సంబంధ-సంపర్కములో ఆకర్షితులవ్వరు. సంబంధ-సంపర్కములోకి వస్తూ అతీతముగా మరియు ప్రియముగా ఉంటారు. కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి - ఏ చిన్న కర్మేంద్రియమైనా బంధనములో బంధించటం లేదు కదా. మీ స్వమానాలను గుర్తు చేసుకోండి - మాస్టర్ సర్వశక్తిమంతులు, త్రికాలదర్శి, త్రినేత్రి, స్వదర్శన చక్రధారి... ఈ స్వమానాల ఆధారముగా సర్వశక్తిమంతుని పిల్లలను ఏ కర్మేంద్రియమైనా ఆకర్షితము చెయ్యగలదా? ఎందుకంటే సమయము యొక్క సమీపతను చూస్తూ మిమ్మల్ని మీరు చూసుకోండి - క్షణములో సర్వ బంధనాల నుండి ముక్తులవ్వగలరా? ఇటువంటి బంధనము ఏదీ ఉండిపోలేదు కదా? ఎందుకంటే అంతిమ పరీక్షలో నంబర్‌వన్ అయ్యేందుకు ప్రత్యక్ష ప్రమాణము - మనసు, బుద్ధిని క్షణములో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా పెట్టాలనుకున్నప్పుడు, అక్కడ క్షణములో అవి లగ్నమైపోవాలి, అలజడిలోకి రాకూడదు. ఎలా అయితే స్థూల శరీరము ద్వారా ఎక్కడకు వెళ్ళాలనుకుంటే అక్కడకు వెళ్ళగలరో, అలాగే బుద్ధి ద్వారా ఏ స్థితిలో స్థితులవ్వాలనుకుంటే ఆ స్థితిలో స్థితులవ్వగలరా? సైన్స్ వారు లైట్ హౌస్, మైట్ హౌస్‌ను తయారుచేసారు, ఒక్క క్షణములో స్విచ్ ఆన్ చెయ్యగానే లైట్ హౌస్ నలువైపులా లైట్ ఇవ్వటం మొదలుపెడుతుంది, మైట్ ఇవ్వటం మొదలుపెడుతుంది. అలాగే మీరు స్మృతి యొక్క సంకల్పము అనే స్విచ్‌ను ఆన్ చెయ్యటంతో లైట్ హౌస్, మైట్ హౌస్‌గా అయ్యి ఆత్మలకు లైట్, మైట్‌ను ఇవ్వగలరా? ఒక్క క్షణములో అశరీరిగా అవ్వండి అని ఆర్డర్ వస్తే, అప్పుడు అశరీరిగా అయిపోతారు కదా! లేక యుద్ధము చెయ్యాల్సి వస్తుందా? ఈ బహుకాలపు అభ్యాసమే అంతిమములో సహయోగిగా అవుతుంది. ఒకవేళ బహుకాలపు అభ్యాసము లేకపోతే ఆ సమయములో అశరీరిగా అవ్వటానికి కష్టపడాల్సి వస్తుంది, అందుకే బాప్‌దాదా ఇదే సూచన ఇస్తున్నారు - మొత్తము రోజంతటిలో పనులు చేస్తూ కూడా పదే-పదే ఈ అభ్యాసము చేస్తూ ఉండండి. దీని కొరకు మనసు యొక్క కంట్రోలింగ్ పవర్ (నియంత్రణ శక్తి) అవసరము ఉంది. ఒకవేళ మనసు కంట్రోల్లోకి వచ్చినట్లయితే ఇక ఏ కర్మేంద్రియము కూడా వశీభూతము చేసుకోలేదు.
ఇప్పుడు సర్వాత్మలకు మీ ద్వారా శక్తి యొక్క వరదానము కావాలి. ఆత్మలకు మాస్టర్ సర్వ శక్తిమాన్ ఆత్మలైన మీ పట్ల ఉన్న శుభమైన కోరిక ఇదే - ఏ కష్టము లేకుండా వరదానము ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా మమ్మల్ని ముక్తులుగా చెయ్యండి. కష్టపడి, కష్టపడి ఇప్పుడు అందరూ అలసిపోయారు. మీరందరూ అయితే శ్రమపడటము నుండి ముక్తులైపోయారు కదా! లేక ఇప్పుడు కూడా శ్రమించాల్సి వస్తుందా? ఇంతకుముందు వినిపించాము కదా - శ్రమ నుండి ముక్తులయ్యేందుకు సహజ సాధనము ఏమిటంటే - మనస్ఫూర్తిగా బాబాకు అతి స్నేహీలుగా అవ్వటము. బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఈ జన్మ లభించటంతోనే ప్రతిజ్ఞ చేసారు, ప్రతిజ్ఞ గుర్తుందా? బాబా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నప్పుడు, బ్రాహ్మణ జీవితము ఇచ్చినప్పుడు, మరి బ్రాహ్మణ జీవితానికి సంబంధించి మీరందరూ చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు. గుర్తుందా ప్రతిజ్ఞ? గుర్తుంటే తల ఊపండి. అచ్ఛా, చేతులు ఊపుతున్నారు. పక్కాగా గుర్తుందా లేక అప్పుడప్పుడు మర్చిపోతారా? చూడండి, 63 జన్మలైతే మర్చిపోయేవారిగా అయ్యారు, ఇప్పుడు ఈ ఒక్క జన్మ స్మృతి స్వరూపులుగా అయ్యారు. మరి బాబా పిల్లలను అడుగుతున్నారు - చిన్ననాటి ప్రతిజ్ఞ గుర్తుందా? ఎంత సహజం చేసి ఇచ్చారు - ఒక్క బాబాలోనే ప్రపంచమంతా ఉంది, ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలు ఉన్నాయి, ఒక్క బాబా ద్వారానే సర్వ ప్రాప్తులు ఉన్నాయి. చదివించేవారు కూడా ఒక్కరే మరియు పాలన చేసేవారు కూడా ఒక్కరే. అన్నింటిలోనూ ఒక్కరే. పరివారము ఉన్నా కూడా ఈశ్వరీయ పరివారము, ఈ పరివారము కూడా ఒక్క తండ్రికి చెందిన పరివారమే. వేరు-వేరు తండ్రుల పరివారము కాదు. ఒక్కటే పరివారము. పరివారములో కూడా ఒకరి పట్ల ఒకరికి ఆత్మిక స్నేహము ఉంది, కేవలము స్నేహము కాదు, ఆత్మిక స్నేహము. జన్మ లభించటంతోనే చేసిన ప్రతిజ్ఞలను బాప్‌దాదా గుర్తు తెప్పిస్తున్నారు. ఇంకేమి ప్రతిజ్ఞలు చేసారు? అందరూ చాలా ఉల్లాస-ఉత్సాహాలతో బాబా ఎదురుగా మనస్ఫూర్తిగా అన్నారు - సర్వస్వము మీదే, తనువు-మనసు-ధనము అన్నీ మీవే. కనుక బాబాకు ఇచ్చేసిన వస్తువులను మీరు కార్యములో ఉపయోగించేందుకని బాబా తాకట్టు రూపములో మీకు ఇచ్చారు. మీరు బాబాకు ఇచ్చేసారు, ఇచ్చేసారు కదా? లేక కొద్ది-కొద్దిగా తిరిగి తీసుకుంటారా? తిరిగి తీసుకుంటే తాకట్టు పెట్టినవాటిలో మోసం జరిగిపోతుంది. (అమానత్తులో ఖయానత్తు అవుతుంది) ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, ఆ సమయములో కొంతమంది పిల్లలు - నా మనసు ఆందోళనగా ఉంది అని అంటుంటారు. కానీ ‘నా మనసు’ అనేది ఎక్కడి నుండి వచ్చింది? నాది అన్నదానిని నీకు అర్పించేసినప్పుడు, ఇక నా మనసు అనేది ఎక్కడి నుండి వచ్చింది? మీరందరూ అయితే చిల్లిగవ్వ లేకుండా చక్రవర్తులైపోయారు, ఇప్పుడు మీదంటూ ఏమీ లేదు, చిల్లిగవ్వ కూడా లేనివారైపోయారు కానీ చక్రవర్తులైపోయారు. ఎందుకని చక్రవర్తులయ్యారు? బాబా ఖజానా మీ ఖజానాగా అయిపోయింది, కనుక చక్రవర్తులైపోయారు కదా! పరమాత్మ ఖజానా అంటే అది పిల్లల ఖజానా. కనుక బాప్‌దాదా ప్రతిజ్ఞను గుర్తు తెప్పిస్తున్నారు. ‘నీది’ అన్నదానిని మళ్లీ ‘నాది’ అని అనకండి. బాబా అంటారు, బాబా మిమ్మల్నందరినీ పరమాత్మ ఖజానాలతో సుసంపన్నులుగా చేసారు, ఆ బాధ్యత బాబా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏ మాటలలో చెప్పారు? మీరు నన్ను గుర్తు చెయ్యండి, అప్పుడు సర్వ ప్రాప్తులకు అధికారులుగా అయిపోతారు, కేవలం గుర్తు చెయ్యండి అంతే. మీరు అన్నారు - మేము మీ వారిమి, మీరు మావారు. ఈ ప్రతిజ్ఞ చేసారు కదా! బాబా అంటారు, ఖజానాలను సదా స్వయము కోసము మరియు సర్వాత్మల కోసము కార్యములో వినియోగించండి. ఎంతగా కార్యములో వినియోగిస్తారో, అంతగానే ఖజానా పెరుగుతూ ఉంటుంది. సర్వ శక్తుల ఖజానా ఉంది, సర్వ శక్తులను కార్యములో వినియోగించండి. నేను సర్వశక్తిమంతుడిని అన్న జ్ఞానాన్ని కేవలం బుద్ధిలోనే పెట్టుకోవడం కాదు, కానీ సర్వ శక్తులను సమయమనుసారముగా కార్యములో పెట్టండి మరియు సేవలో పెట్టండి.
బాప్‌దాదా మెజారిటీ పిల్లల లెక్కాపత్రాన్ని చూసారు. రెండు శక్తులు ఒకవేళ సదా గుర్తున్నట్లయితే మరియు వాటిని అవసరమైన సమయములో కార్యములో వినియోగించినట్లయితే ఇక సదా నిర్విఘ్నముగా ఉంటారు. మీ ఎదురుగా వచ్చేందుకు విఘ్నానికి శక్తే ఉండదు. ఇది బాబా ఇస్తున్న గ్యారంటీ. మామూలుగా అయితే అన్ని శక్తులూ కావాలి, కానీ మెజారిటీ చూసినట్లయితే సహన శక్తి మరియు రియలైజేషన్ శక్తి, వీటిని రియలైజ్ అవుతారు కూడా, కానీ వీటిని ప్రాక్టికల్‌లో స్వరూపములోకి తీసుకురావటంలో అటెన్షన్ తక్కువగా ఉంది. అందుకే ఏ సమయములో రియలైజ్ అవుతారో, ఆ సమయములో నడవడిక, ముఖము మారిపోతాయి, చాలా మంచి ఉల్లాస-ఉత్సాహాలలోకి వస్తారు. అవును, రియలైజ్ అయ్యాము అని అనుకుంటారు, కానీ తర్వాత ఏమవుతుంది? అందరూ అనుభవజ్ఞులే కదా! తర్వాత ఏమైపోతుంది? వాటిని ప్రతి సమయము స్వరూపములోకి తీసుకురావటములో లోటు ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ స్వరూపులుగా అవ్వాలి. కేవలం బుద్ధి ద్వారా తెలుసుకోవటము వేరే విషయము, కానీ వాటిని స్వరూపములోకి తీసుకురావటము అవసరము. అప్పుడప్పుడు బాప్‌దాదాకు కొంతమంది పిల్లలపై దయ కూడా కలుగుతుంది. పిల్లలు కష్టపడలేకపోతున్నారు కనుక పిల్లలకు బదులుగా నేనే చేసేద్దాము అని బాబా అనుకుంటారు. కానీ డ్రామా రహస్యము ఏమిటంటే - ‘‘ఎవరు చేస్తే వారే పొందుతారు’’, అందుకే బాప్‌దాదా సహయోగాన్ని తప్పకుండా ఇస్తారు, కానీ చేయడమైతే పిల్లలే చెయ్యాల్సి ఉంటుంది కదా.
బాప్‌దాదా చూసారు - పిల్లలు చాలా మంచి-మంచి సంకల్పాలు చేస్తారు. అమృతవేళ బాప్‌దాదా వద్దకు - ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము... అని చాలా మంచి-మంచి సంకల్పాలతో కూడిన మాలలు చాలా-చాలా వస్తుంటాయి. వాహ్ పిల్లలూ, వాహ్ అని బాప్‌దాదా కూడా సంతోషిస్తారు. మరి ఇవి చెయ్యటంలో ఎందుకని బలహీనులుగా అవుతారు? దీనికి కారణము గమనించటం జరిగింది - బ్రాహ్మణ పరివారములో సంగఠన యొక్క వాయుమండలము. అక్కడక్కడ వాయుమండలము బలహీనముగా కూడా ఉంటుంది, దాని ప్రభావము త్వరగా పడుతుంది. అప్పుడు వారి భాష ఎలా ఉంటుందో చెప్పమంటారా? భాష చాలా మధురముగా ఉంటుంది. ఆ భాష ఎలా ఉంటుందంటే - ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది... అని అంటారు. అటువంటి సమయములో ఏ సంకల్పము చెయ్యాలి! ఇది జరుగుతుంది, ఇది నడుస్తుంది... అనుకుంటే ఈ మాటలు నిర్లక్ష్యాన్ని తీసుకువస్తాయి, అందుకే ఆ సమయములో ఇటువంటి భాషను పరివర్తన చెయ్యండి మరియు ఆలోచించండి - బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? బాబాకు ఏమి ఇష్టము? బాబా ఏ విషయాన్ని ఇష్టపడతారు? బాబా ఇలా అన్నారా? ఇలా చేసారా? ఒకవేళ బాబా గుర్తుకు వచ్చారంటే నిర్లక్ష్యము సమాప్తమై, ఉల్లాస-ఉత్సాహాలు వచ్చేస్తాయి. నిర్లక్ష్యము కూడా అనేక రకాలుగా వస్తుంది. మీరు పరస్పరంలో క్లాస్ చేసుకోండి మరియు లిస్ట్ తయారుచెయ్యండి - ఒకటేమో సాధారణ నిర్లక్ష్యము, ఇంకొకటి రాయల్ నిర్లక్ష్యము. నిర్లక్ష్యము అనేది సంకల్పములో దృఢతను తీసుకురానివ్వదు కానీ దృఢతయే సఫలతకు సాధనము. అందుకే సంకల్పము వరకే ఉండిపోతుంది, స్వరూపములోకి రావడం లేదు.
మరి ఈరోజు ఏం విన్నారు? ప్రతిజ్ఞలను గుర్తు తెప్పించాము కదా! ప్రతిజ్ఞలు ఎంతో మంచి-మంచివి చేస్తారు, బాప్‌దాదా ఆ ప్రతిజ్ఞలను విని సంతోషపడతారు. కానీ ఎన్ని ప్రతిజ్ఞలనైతే చేస్తున్నారో, అంతగా వాటి నుండి లాభాన్ని పొందటం లేదు. కనుక బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు. బాబా మా నుండి ఏం కోరుకుంటున్నారు అని అడుగుతుంటారు కదా? బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - సమయం కంటే ముందే అందరూ ఎవరెడీగా అవ్వండి. సమయము మీకు మాస్టర్‌గా అవ్వకూడదు. సమయానికి మీరు మాస్టర్లు, అందుకే బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - సమయముకంటే ముందే సంపన్నముగా అయ్యి విశ్వమనే స్టేజ్‌పై బాబాతోపాటు పిల్లలైన మీరు కూడా ప్రత్యక్షమవ్వాలి. అచ్ఛా!
మిలనము చేసుకునేందుకు క్రొత్త-క్రొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో వారు చేతులెత్తండి. చేతులు బాగా పైకి ఎత్తండి, పొడవుగా ఎత్తండి. అచ్ఛా - భాగ్యవంతులైన పిల్లలు తమ భాగ్యాన్ని తీసుకునేందుకు చేరుకున్నారు అని బాప్‌దాదా క్రొత్త-క్రొత్త పిల్లలను చూసి సంతోషిస్తారు, అందుకే అభినందనలు, అభినందనలు. ఇప్పుడు క్రొత్త పిల్లలు ఎవరెవరైతే వచ్చారో, వారిలో ఎవరు అద్భుతము చేసి చూపిస్తారో చూస్తాము. వెనక వచ్చినా కానీ ముందుకు వెళ్ళి చూపించండి. బాప్‌దాదా వద్దకైతే రిజల్టు అంతా చేరుకుంటుంది. అచ్ఛా!
సేవ టర్న్ ఢిల్లీ-ఆగ్రా వారిది:- అచ్ఛా, ఢిల్లీ వారు లేవండి, చేతులు ఊపండి. చాలా బాగా చేసారు, ఛాన్స్ తీసుకున్నారు. టీచర్లు కూడా చాలామంది వచ్చారు. బాగుంది. టీచర్లను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఎందుకని? బాబా గద్దె (సింహాసనం)కు అధికారులుగా అయ్యారు. బాప్‌దాదా టీచర్లను సదా భాయి అంటారు. బాబా సమానంగా సేవాధారులుగా అయ్యారు మరియు ప్రవృత్తిలో ఉండేవారందరూ, కుమారీలు కూడా వచ్చారు, కుమారులు కూడా వచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో ఏదైనా నవీనతను చేసి చూపించండి. మోగా ప్రోగ్రాములు జరిగిపోయాయి, కాన్ఫరెన్సులు కూడా చాలా జరిగాయి, వర్గాల ప్రోగ్రాములు కూడా చాలా జరిగాయి, ఇప్పుడు ఏ నవీనతను చేయాలి? ఢిల్లీవారు ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారు చేసారా? తయారు చేసారా? తయారు చేస్తున్నారా? బాప్‌దాదా వద్దకు వర్గాల సేవ యొక్క రిపోర్ట్ వస్తుంది. కానీ ప్రతి వర్గం వారు ఇన్ని సంవత్సరాలు ఏ సేవనైతే చేసారో, అందులో ఫాస్ట్ తీవ్ర పురుషార్థీ గ్రూప్ వారు ప్రతి వర్గం నుండి ఎంతమంది తయారయ్యారు అన్న సమాచారాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు పుష్పగుచ్ఛాన్ని తీసుకురాలేదు. సరే, పెద్ద మాలను విడిచిపెట్టండి, పుష్పగుచ్ఛాన్ని తీసుకురండి. ప్రతి వర్గం నుండి ఏదైనా ఉదాహరణ ఎలా ఉండాలంటే వారు మైక్‌గా కూడా ఉండాలి, మైట్‌గా కూడా ఉండాలి, కేవలం మైక్ కాదు. మైట్‌గా కూడా ఉండాలి మరియు మైక్‌గా కూడా ఉండాలి. వారి అనుభవం విని ఇతరులలో కూడా ఉల్లాసం రావాలి. బాప్‌దాదా ప్రతి వర్గం నుండి కోరుకుంటున్నారు, ఆ గ్రూప్ ప్రపంచంలో సేవా యోగ్యంగా అవ్వాలి. మంచిది, ఢిల్లీ వారు ఢిల్లీని రాజధానిగా తయారు చేయాలంటే ముందుగా ఢిల్లీలో అటువంటి వాయుమండలాన్ని తయారు చేయండి. ఢిల్లీ యొక్క ధ్వని అయితే నలువైపులకు సహజంగా వ్యాపిస్తుంది, ఇందులో విషయం ఉంది. మంచిగా చేసారు, ఛాన్స్‌ను తీసుకున్నారు. సగం క్లాసు ఢిల్లీ వారే కనిపిస్తున్నారు. ఇప్పుడు నవీనత, మరోసారి వచ్చినప్పుడు నవీనతను తీసుకునే రండి, ఈ మాటను కేవలం ఢిల్లీ వారికే చెప్పడం లేదు, ఏ జోన్ అయినా ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారు చేసి తీసుకురండి, అందుకు బాప్‌దాదా ఎక్స్ట్రా స్నేహమును, శక్తిని వరదానంగా ఇస్తారు. ఏదైతే చేస్తున్నారో, అదైతే చేస్తూనే ఉన్నారు, క్రొత్తగా ఏదైనా ప్లాన్ కావాలి. యాత్రలు చేయడం, ఫారమ్‌లు నింపించడం, ఇవి చాలా అయ్యాయి, ఇప్పుడు ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారు చేయండి. కాన్ఫరెన్సులు కూడా చాలా అయ్యాయి, ప్రోగ్రాములు కూడా చాలా జరిగాయి. ఆలోచించండి. ఢిల్లీ నంబర్‌వన్ అవ్వాలి ఎందుకంటే ఢిల్లీపై అందరి దృష్టి ఉంది. చూడండి, డ్రామానుసారంగా సేవ యొక్క ఆది స్థానము ఢిల్లీ అయింది. అది యమునా నదీ తీరమైనా కావచ్చు కానీ ఆరంభం అయితే అక్కడే అయింది కదా. యమునా తీరాన రాజ్యం చేయాలి, కావున యమునా తీరములోనే సేవ కూడా ఆరంభమయింది. ఇప్పుడు ఇందులో కూడా నంబర్‌వన్ అవ్వండి. ఉన్నారు, మంచి మంచి వారు ఉన్నారు, క్రొత్త క్రొత్త ప్లాన్లు తయారు చేసేవారు ఉన్నారు, బాప్‌దాదా చూస్తుంటారు, ఉన్నారు. చూస్తున్నారు. మరి ఢిల్లీవారికి అభినందనలు, కానీ క్రొత్త ప్లాన్ చేస్తే పదమారెట్ల అభినందనలు ఇస్తాము.
ట్రైనింగ్‌కు వచ్చిన యువతతో:- అచ్ఛా, పెద్ద గ్రూప్ వచ్చింది. బాప్‌దాదా అయితే సమాచారాన్ని విన్నారు. యాత్ర యొక్క ప్లాన్‌ను తయారు చేస్తున్నారు. కానీ బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారంటే ఏ ఏ జోన్లు, సబ్జోన్లు ఉన్నాయో, పూర్తి బ్రాహ్మణ పరివారంలో ఎంతమంది యూథ్ ఉన్నారు, వారిలో ఏ ఏ పరివర్తన వచ్చింది? వారి పేరు, స్థానము మరియు పరివర్తన, ఈ వివరాలు ప్రాక్టికల్‌గా లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి ఇచ్చేలా ఉండాలి. ప్రభుత్వమే స్వయంగా యూథ్ను పిలుస్తుంది కానీ ముందుగా నలువైపుల ఉన్న యూథ్ యొక్క పేరు, స్థానము మరియు పరివర్తన షార్ట్‌లో రావాలి. విస్తారంగా కాదు, ఏ పరివర్తన వచ్చింది, పేరు, స్థానమును వ్రాసే బుక్ ఉండాలి, అది వారికి చూపించేలా ఉండాలి. అప్పుడు యూథ్ను వారే ఆహ్వానిస్తారు. మరి ఇటువంటి ప్లాన్‌ను తయారు చేయండి. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? (950) అంటే కొద్దిమందే వచ్చారు కదా! యూథ్ అయితే వేల సంఖ్యలో ఉండి ఉండవచ్చు. వారి గురించిన వివరాలతో, పరివర్తన సహితంగా, ఒక మంచి పుస్తకాన్ని తయారు చేయండి ఎందుకంటే వ్యక్తులు కేవలం పరివర్తన మాత్రమే చూడరు, ఆ పరివర్తనలో ఎంత పరిపక్వత వచ్చింది అని కూడా చూస్తారు? ఈ రిజల్ట్ కావాలి, ఎందుకంటే ప్రభుత్వం యూథ్ వెనుక ఎంతో ఖర్చు కూడా చేస్తుంది. పరివర్తనకు సంబంధించి ఏదైనా అద్భుతాన్ని చూపించండి. బాగుంది, యువ వర్గంవారు ఏదో ఒక కార్యాన్ని చేస్తూ ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. సేవపై అటెన్షన్ ఉంది. అందుకే పరివర్తన చేసి చూపించండి. ట్రైనింగ్ చేసారు కదా! వీరంతా ట్రైనింగ్‌కు వచ్చారు కదా! మరి ట్రైనింగ్‌ను ప్రాక్టికల్ రిజల్ట్‌లో చూపించండి, అప్పుడు పూర్తి పరివారం మీకు అభినందనలు ఇస్తుంది. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- బాగుంది, డబల్ విదేశీయులు స్వయముపై మరియు సేవపై మంచి అటెన్షన్ పెడుతున్నారు. కానీ ఇందులో కేవలం ఒక చిహ్నాన్ని పెట్టాలి, అండర్లైన్ చెయ్యాలి, పరివర్తనకు సంబంధించి ఏ సంకల్పాన్ని అయితే తీసుకుంటారో, దానిని మంచి ఉల్లాస-ఉత్సాహాలతో మరియు ధైర్యముతో తీసుకుంటారు, కేవలం దానిని అండర్లైన్ చేస్తూ వెళ్ళండి - చెయ్యాల్సిందే, మారాల్సిందే. మారి విశ్వాన్ని మార్చాలి. ఇలా దృఢతతో పదే-పదే అండర్లైన్ చేస్తూ వెళ్ళండి. ఇకపోతే బాప్‌దాదా సంతోషిస్తున్నారు ఎందుకంటే వృద్ధిని కూడా చేస్తున్నారు మరియు సేవ మరియు స్వయముపై అటెన్షన్ కూడా ఉంది. కానీ పూర్తి టెన్షన్ పోలేదు. అటెన్షన్ ఉంది కానీ మధ్యమధ్యలో కాస్త టెన్షన్ కూడా ఉంటుంది, దానిని సమాప్తము చేయవలసిందే. ఇకపోతే ధైర్యము బాగుంది, ధైర్యము ఉంచినందుకు అభినందనలు, ఎవరెవరైతే కూర్చుని ఉన్నారో బాబా సహితముగా వారందరూ మీ ధైర్యానికి అభినందనలను ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి. అచ్ఛా!
మీరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారు కానీ బాప్‌దాదాకు దూరములో కూర్చుని ఉన్న చాలామంది పిల్లల నుండి ప్రియస్మృతులు లభించాయి మరియు బాప్‌దాదా ఒక్కొక్క బిడ్డను తమ నయనాలలో ఇముడ్చుకుని చాలా-చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు. భారత్ నుండి కావచ్చు, విదేశాల నుండి కావచ్చు, చాలామంది పిల్లల స్మృతులు చేరుకుంటున్నాయి. ఉత్తరాలు వస్తాయి, ఈ-మెయిల్స్ వస్తాయి, అవన్నీ బాబా వద్దకు చేరుకున్నాయి. అచ్ఛా!
బాప్‌దాదా ఒక్క క్షణములో అశరీరి భవ యొక్క డ్రిల్‌ను చూడాలనుకుంటున్నారు. ఒకవేళ అంతిమములో పాస్ అవ్వాలంటే ఈ డ్రిల్ చాలా అవసరము, అందుకే ఇప్పుడు ఇంత పెద్ద సంగఠనలో కూర్చుని ఒక్క క్షణములో దేహభానము నుండి అతీతమైన స్థితిలో స్థితులవ్వండి. ఎటువంటి ఆకర్షణా ఆకర్షించకూడదు. (డ్రిల్). అచ్ఛా!
నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థీ పిల్లలు, సదా స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క సేవలో తత్పరులై ఉండే విశేష ఆత్మలు, సదా బ్రహ్మా బాబా సమానముగా కర్మయోగులు, కర్మ మరియు కర్మేంద్రియాల ఆకర్షణ నుండి ముక్తులయ్యే ఆత్మలు, సదా దృఢతను ప్రతి సంకల్పములో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో స్వరూపములోకి తీసుకువచ్చే బాబాకు సమీపమైన మరియు సమానులైన పిల్లలు, బాప్‌దాదా యొక్క హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను మరియు హృదయపూర్వకమైన ప్రియస్మృతులను స్వీకరించండి మరియు నమస్తే.
దాదీజీతో:- ఆరోగ్యంగా అయ్యారు. ఇప్పుడు అనారోగ్యము దూరమైపోయింది. అనారోగ్యాలు మహారథుల నుండి వీడ్కోలు తీసుకోవటానికి వస్తాయి. లోలోపలే కర్మాతీతముగా అయ్యే రిహార్సల్స్ చేస్తున్నారు. (దాదీజీ నిశ్చింత చక్రవర్తి అని జానకి దాదీ అన్నారు).
మీకు ఏమైనా చింత ఉందా? మీరు కూడా నిశ్చింతులే. ఇరువురూ మంచి పాత్రను పోషిస్తున్నారు. చూడండి, అన్నింటికన్నా అతి పెద్దదైన బాధ్యతా కిరీటాన్ని ధరించేందుకు నిమిత్తము అయ్యారు కదా! వీరందరూ సహచరులు. మిమ్మల్ని చూస్తే ఉల్లాస-ఉత్సాహాలు వస్తాయి కదా. (ఇప్పుడు క్రొత్తగా ఏం చెయ్యాలి? బాబానే ప్రేరణ ఇవ్వాలి). బాప్‌దాదా వినిపించారు కదా - ప్రతి వర్గానికి చెందిన పుష్పగుచ్ఛము రావాలి, వారు మైక్గానూ ఉండాలి మరియు మైట్గానూ ఉండాలి. కేవలం మైక్‌గా ఉంటూ సంపర్కములో ఉండటమే కాదు, సంబంధములో కూడా సమీపముగా ఉండాలి, అటువంటి పుష్పగుచ్ఛాన్ని తయారుచెయ్యండి. అప్పుడు సేవ చేయడానికి ఆ గ్రూప్ నిమిత్తము అవుతుంది. వారు మైక్ అవుతారు మరియు మీరు మైట్ అవుతారు. వారి హృదయములో నుండి ఎంతో ప్రేమతో బాబా అని వెలువడాలి, అప్పుడే ప్రభావము పడుతుంది. వారిని సంబంధములో సమీపముగా తీసుకురండి. అప్పుడప్పుడూ వస్తుంటారు కదా, అందుకని నషా కాస్త తగ్గిపోతుంటుంది. ఎక్కడ సంబంధ-సంపర్కములోకి వచ్చినా, అక్కడ ఆ సంబంధము మరియు సంపర్కము ఉన్నట్లయితే బాగైపోతారు. అచ్ఛా!
(మోహిని అక్కయ్యకు మోకాళ్ళ ఆపరేషన్ చాలా బాగా జరిగింది, మీకు చాలా-చాలా హృదయపూర్వక స్మృతిని ఇచ్చారు) బాప్‌దాదా కూడా వారి ధైర్యానికి చాలా-చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులను ఇచ్చారు అని వారికి చెప్పండి. అందరి ప్రేమ కూడా ఉంది. అచ్ఛా!
ఓంశాంతి