Search for a command to run...
21 Oct 2005
సంపూర్ణంగా మరియు సంపన్నంగా అయ్యే డేట్‌ను ఫిక్స్ చేసుకుని సమయమనుసారంగా ఇప్పుడు ఎవరెడీగా అవ్వండి
21 October 2005 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క మూడు రూపాలను చూస్తున్నారు. ఏ విధంగానైతే బాబా యొక్క విశేషమైన మూడు సంబంధాలు గుర్తుంటాయో, అదే విధంగా పిల్లలవి కూడా మూడు రూపాలు చూసి హర్షిస్తున్నాము. మీ మూడు రూపాలూ తెలుసు కదా! ఈ సమయములో పిల్లలందరూ బ్రాహ్మణ రూపములో ఉన్నారు మరియు బ్రాహ్మణుల చివరి స్టేజ్ – బ్రాహ్మణ్ సో ఫరిశ్తా, ఆ తర్వాత ఫరిశ్తా సో దేవత. అన్నిటికంటే విశేషమైనది వర్తమానములోని బ్రాహ్మణ జీవితము. బ్రాహ్మణ జీవితము అమూల్యమైనది. బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత పవిత్రత. పవిత్రతయే బ్రాహ్మణ జీవితము యొక్క రియాలిటీ (వాస్తవికత). పవిత్రతయే బ్రాహ్మణ జీవితము యొక్క పర్సనాలిటీ (వ్యక్తిత్వము). పవిత్రతయే సుఖ-శాంతుల జనని. పవిత్రత ఎంతగా ఉంటుందో, అంతగానే సుఖము, శాంతి జీవితములో నేచురల్‌గా మరియు నేచర్‌గా (సహజంగా మరియు స్వభావంగా) ఉంటాయి. పవిత్ర ఆత్మల లక్ష్యము బ్రాహ్మణుల నుండి దేవతగా అవ్వటం కాదు, కానీ ముందుగా ఫరిశ్తాగా అవ్వాలి, ఫరిశ్తా నుండి దేవతగా అవ్వాలి. కనుక బ్రాహ్మణుల నుండి ఫరిశ్తా, ఫరిశ్తా నుండి దేవత – బాప్‌దాదా పిల్లలందరి ఈ మూడు రూపాలను చూస్తున్నారు. మీ అందరికీ మీ మూడు రూపాలు ఎదురుగా వచ్చాయా? వచ్చాయా? బ్రాహ్మణులుగా అయితే అయ్యారు, ఇప్పుడు ఫరిశ్తాగా అవ్వాలన్నది లక్ష్యము. ఇదే లక్ష్యం కదా! ఫరిశ్తాగా అవ్వాల్సిందే. ఫరిశ్తాతనము యొక్క విశేషతలు జీవితములో ఎన్ని కనిపిస్తున్నాయి అన్నదానిని చెక్ చేసుకోండి. ఫరిశ్తా అనగా పాత ప్రపంచము మరియు పాత సంస్కారాలతో ఎటువంటి సంబంధము లేనివారు. ఫరిశ్తా అనగా కేవలం సమస్య వచ్చిన సమయములోనే డబల్ లైట్‌గా ఉండటం కాదు, కానీ సదా మనసా-వాచ-సంబంధ-సంపర్కాలలో డబల్ లైట్‌గా, తేలికగా ఉండటం. తేలికైన వస్తువు మంచిగా అనిపిస్తుందా లేక బరువైన వస్తువు మంచిగా అనిపిస్తుందా, ఏది మంచిగా అనిపిస్తుంది? తేలికగా ఉన్నదంటే ఇష్టం కదా? ఫరిశ్తా అనగా సర్వులకు, కొద్దిమందికే కాదు, సర్వులకు ప్రియమైనవారిగా మరియు అతీతమైనవారిగా ఉంటారు. కేవలం ప్రియంగా ఉండటం కాదు, ఎంత ప్రియంగా ఉంటారో అంతే అతీతంగా ఉండాలి. ఫరిశ్తా యొక్క లక్షణము ఏమిటంటే - వారు సర్వులకు ప్రియమైనవారిగా ఉంటారు. వారిని ఎవరు చూసినా, ఎవరు కలిసినా, ఎవరు సంబంధములోకి వచ్చినా, ఎవరు సంపర్కములోకి వచ్చినా, వారు - వీరు నా వారు అని అనుభవం చేస్తారు. ఉదాహరణకు బాబా గురించి - ‘బాబా నా వారు’ అని అందరూ అనుభవం చేస్తారు. అనుభవం చేస్తారు కదా? అలాగే ఫరిశ్తా అనగా ‘వీరు నా వారు’ అని ప్రతి ఒక్కరూ అనుభవం చెయ్యాలి. వీరు నా వారు అన్న అనుభవం కలగాలి ఎందుకంటే వారు తేలికగా ఉంటారు కదా, ఆ తేలికతనమనేది అందరికీ ప్రియమైనవారిగా చేస్తుంది. వీరు నా వారు అని బ్రాహ్మణ పరివారమంతా అనుభవం చెయ్యాలి. భారీతనము ఉండకూడదు ఎందుకంటే ఫరిశ్తా అంటే అర్థమే డబల్ లైట్. ఫరిశ్తా అనగా సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ-సంపర్కాలలో అనంతములో ఉండటము. హద్దు ఉండకూడదు. అందరూ నా వారు మరియు నేను అందరివాడిని. ఎక్కడైతే ‘నా వారు’ అన్న అనుభవం ఎక్కువ ఉంటుందో అక్కడ తేలికతనము ఉంటుంది. సంస్కారాలలో కూడా తేలికతనము ఉంటుంది. కనుక చెక్ చేసుకోండి - ఫరిశ్తా స్థితి వరకు ఎంత శాతము చేరుకున్నాను? చెక్ చేసుకోవటం వస్తుందా? చెకర్ (చెక్ చేసుకునేవారు)గా కూడా అయ్యారు, మేకర్ (చేసేవారు)గా కూడా అయ్యారు. అభినందనలు.
బాప్‌దాదా మీ అందరి హోమ్‌వర్క్ యొక్క రిజల్ట్‌ను చూసారు. అందరూ హోమ్‌వర్క్ యొక్క రిజల్ట్‌ను వ్రాసారు కదా! మరి రిజల్ట్‌లో ఏమి చూసాము? బాప్‌దాదా యొక్క శుభమైన ఆశ ఏమిటంటే, కనీసం వర్తమాన సమయంలో అన్ని విషయాలలో, ఏడు విషయాలు వ్రాసారు కదా, కనీసం వర్తమాన సమయ ప్రమాణంగా మెజారిటీ యొక్క రిజల్ట్ ఏడు విషయాలలోనూ 75 శాతం తప్పకుండా ఉండాలి. ఒకరు ఒకదానిలో తక్కువగా ఉంటే, మరొకరు మరొకదానిలో తక్కువగా ఉన్నారు. బాప్‌దాదాకు ఉన్న శుభమైన ఆశ ఇదే - ఇప్పుడు సమయాన్ని చూస్తుంటే, ఎవరైతే స్వయాన్ని మహారథిగా భావిస్తున్నారో, వారి స్థితి 95 శాతము ఉండాలి. ఉండాలి కదా! పాండవులు, ఉండాలి కదా? సరే, మరో నెబర్ చెప్పాలంటే 75 శాతం ఉండాలి కదా. దాదీలు ఏమనుకుంటున్నారు? 95 శాతం ఉన్నారా? ముందు లైన్లో ఉన్నవారంతా ఏమని భావిస్తున్నారు? 95 శాతం ఉన్నారా? మీ అందరికీ ఎంత శాతం ఉండాలి? 75 శాతమా? సరే, రేపే వినాశనం జరిగితే? 75 శాతంతో వెళ్తారా? 75 శాతం ఉంటే వన్ వన్ వన్‌లోకి రారు. మరి ఏమి చేస్తారు? సరే, బాప్‌దాదా ఈరోడు, ఈరోజు విశేషమైన రోజు కదా, మరి ఈరోజు గడిచినదేదో గడిచిపోయింది అనేస్తారు, సరేనా? అచ్ఛా, ఎవరైతే రేపటి నుండి, 75 అంటున్నారు కదా,సరే 95 కాకపోతే 85 శాతం వరకు వస్తారా? ఎల్లుండి ఒకవేళ వినాశం జరిగితే 85 వరకు వస్తారా? (ఎవరో 98 శాతం వరకు చేరుకుంటాము అని అన్నారు) అభినందనలు. మీ నోటిలో గులాబ్‌జామ్ తినండి, ఎందుకంటే - అలా ‘అవ్వాల్సిందే’ అన్నదానిని చూస్తున్నారు మరియు తెలుసుకున్నారు కూడా. అయిపోతాములే అని కాదు, అవ్వాల్సిందే. లే, లే అని అనవద్దు, అయిపోతాములే, చూస్తాములే... ప్రయత్నిస్తాములే... ఇప్పుడు ఈ భాషను పరివర్తన చేసుకోండి. ఏ సంకల్పము చేసినా, ఆ సంకల్పము ఎంత శాతము నిశ్చయంతో ఉంది మరియు సఫలతాపూర్వకంగా ఉంది అన్నదానిని చెక్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకునే వేగాన్ని తీవ్రతరం చేయండి. ముందు చెక్ చేసుకోండి, ఆ తర్వాత కర్మలోకి రండి. ఏ సంకల్పం వస్తే ఆ సంకల్పం చెయ్యటం, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం, సంబంధ-సంపర్కాలలో ఏముంటే అదే, ఇలా ఉండటం కాదు. వి.వి.ఐ.పి.లు ఎవరైతే ఉంటారో వారి విషయములో ఎంత చెకింగ్ జరుగుతుందో తెలుసు కదా. ప్రతీది మొదట చెక్ చేస్తారు, ఆ తర్వాత అడుగు వేస్తారు. కనుక ఇప్పుడు రెండు గంటలు, నాలుగు గంటలు తర్వాత చెక్ చేసుకుంటే అది నడవదు. మొదట చెకింగ్ చేసుకోవటము, ఆ తర్వాత అడుగు వెయ్యటము, ఎందుకంటే ఈ రోజుల్లోని వి.వి.ఐ.పి.లు ఎవరైతే ఉన్నారో, వారు ఒక్క జన్మకు వి.వి.ఐ.పి.లు. అది కూడా కొద్ది సమయము కొరకే అలా ఉంటారు, కానీ సృష్టి డ్రామాలో బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలుగా అయ్యే మీరు ఎన్ని వి.వి.(వెరీ, వెరీ)లైనా పెట్టుకోండి, మీరు అంత అలాంటి వారు. చూడండి, మీరు మీ ముందు ఎన్ని వి.వి.వి.లు అయినా పెట్టుకుంటూ వెళ్ళండి. మీరు పూజింపబడుతున్న మీ చిత్రాన్ని అయితే చూసారు కదా, దానిని చూసారు కదా. మందిరాన్ని చూడకపోయినా కానీ ఫోటోనైతే చూసారు, ఇప్పుడు కూడా వాటికి ఎంత విలువ ఉంది. మందిరాలు ఎంత పెద్ద-పెద్దవి తయారుచేస్తారు, కానీ ఆ మందిరములోని మీ చిత్రమైతే మూడు అడుగులే ఉంటుంది, అంటే మీకు ఎంత విలువ ఉంది! జడ చిత్రానికి కూడా విలువ ఉంది, విలువ ఉంది కదా! మీ జడ చిత్రాన్ని దర్శించుకోవటానికి ఎంత పెద్ద క్యూ ఉంటుంది మరియు చైతన్యములో కూడా మీరు ఎంత వి.వి.ఐ.పి.లు. అందుకే అడుగు వేసేకంటే ముందే చెక్ చేసుకోండి, అడుగు వేసేసిన తర్వాత చెక్ చేసుకుంటే అప్పుడు ఆ అడుగు వ్యర్థమైపోయినట్లు. వేసేసిన ఆ అడుగు మరలా మీ చేతికి రాదు. అజ్ఞానకాలములో కూడా అంటారు - బాగా ఆలోచించి, అర్థం చేసుకుని పని చెయ్యండి, పని చేసిన తర్వాత ఆలోచించటం కాదు. ముందు ఆలోచించండి, ఆ తర్వాత చేయండి. మీ స్వమానము అనే సీట్‌పై ఉండండి. ఎంతగా పొజిషన్లో ఉంటారో, అంతగా అపోజిషన్ ఉండదు. మాయ అపోజిషన్ (విరోధము) కూడా మీరు పొజిషన్లో లేనప్పుడే జరుగుతుంది. ఇప్పుడు బాప్‌దాదా అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే - అందరికీ సంపూర్ణంగా అవ్వాలి, సంపన్నంగా అవ్వాలి అన్న లక్ష్యమైతే ఉంది, లక్ష్యము ఉందా లేక కొద్దికొద్దిగానే అలా అవ్వాలా? లక్ష్యము ఉందా? అందరికీ లక్ష్యము ఉన్నట్లయితే చేతులెత్తండి. సంపూర్ణంగా అవ్వాలా? మంచిది. ఎప్పటికల్లా అవుతారు? మిమ్మల్ని ప్రశ్నిస్తుంటారు కదా, స్టూడెంట్స్‌ను కూడా టీచర్లు ప్రశ్నిస్తుంటారు కదా - మీ లక్ష్యము ఏమిటి అని? మరి ఈ రోజు బాప్‌దాదా విశేషంగా టీచర్లను అడుగుతున్నారు. 30 సంవత్సరాల నుండి ఉన్నవారు కూర్చుని ఉన్నారు కదా. 30 సంవత్సరాల వారు రేపే పరస్పరం కూర్చుని ప్రోగ్రామ్‌ను తయారుచేయాలి. మీటింగులైతే చాలా చేస్తారు. బాప్‌దాదా చూస్తుంటారు - మీటింగ్ సీటింగ్, మీటింగ్ సీటింగ్... కానీ ఇప్పుడు - ఎప్పటికల్లా సంపన్నంగా అవుతారు అన్నదాని గురించి మీటింగ్ చెయ్యండి. ఇతర ఫంక్షన్లు అన్నీ చేస్తారు, ఫలానా ప్రోగ్రామ్ ఫలానా డేట్లో చెయ్యాలి అని డేట్‌ను ఫిక్స్ చేస్తారు, మరి దీని డేట్‌ను ఫిక్స్ చెయ్యరా? ఎన్ని సంవత్సరాలు కావాలో చెప్పండి. ఎందుకు? బాబా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే, ఎప్పుడు వినాశనం చెయ్యాలి అని బాబాను ప్రకృతి అడుగుతుంది. మరి బాప్‌దాదా ఏమి జవాబు చెప్పాలి. బాప్‌దాదా పిల్లలనే అడుగుతారు కదా. ఎప్పటికల్లా? ఎప్పటికల్లా అన్నదే నేటి విశేష టాపిక్. డబల్ విదేశీయులు కూర్చుని ఉన్నారు కదా, మరి డబల్ పురుషార్థము జరుగుతుంది కదా. అద్భుతము చెయ్యండి. విదేశీయులు ఉదాహరణగా అవ్వండి - బ్రాహ్మణ పరివారం ఎదురుగా, విశ్వం ఎదురుగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వటంలో ఉదాహరణగా అవ్వండి, సర్వ శక్తులతో, సర్వ గుణాలతో సంపన్నంగా అనగా సంపూర్ణంగా అవ్వాలి, అన్నింటిలోనూ. మనసా, వాచా, సంబంధము, సంపర్కము - ఈ నాల్గింటిలో ఒకవేళ ఒక్కదానిలో అయినా బలహీనంగా ఉండిపోయినట్లయితే సంపన్నము అని అనరు. నాలుగు విషయాలు గుర్తున్నాయి కదా - మనసా, వాచ మరియు సంబంధ-సంపర్కము, ఇందులో కర్మ కూడా వచ్చేస్తుంది. ఈ నాలుగు విషయాలలోనూ. మనసా, వాచాలో మేము మంచిగా ఉన్నాము, కానీ సంబంధ-సంపర్కములో కొంచెం సరిగ్గా లేము అని ఇలా అనటం కాదు. మీరు ఎవరి ఎదురుగా వెళ్ళినా, ఎవరి సంపర్కములోకి వెళ్ళినా, ‘వీరు నా వారు’ అని వారు అనుభవం చెయ్యాలి అని వినిపించాము కదా! నా వారు అని అనుకున్నప్పుడు వారిపై అధికారము ఉంటుంది కదా. ఇతరులతో అంత తేలికతనము అనిపించదు, కాస్త భారీతనము అనిపిస్తుంది కానీ నా వారు అన్నవారితో తేలికతనము అనిపిస్తుంది. అందరితోనూ తేలికగా ఉండండి. కేవలం మా జోన్ వారితో తేలికగా ఉంటాను, మా సెంటర్ వారితో తేలికగా ఉంటాను అని కాదు. ఒకవేళ మీ జోన్ వారితో మాత్రమే లేక మీ సెంటర్ వారితో మాత్రమే తేలికగా ఉంటే మరి విశ్వ మహారాజులుగా ఎలా అవుతారు? అలా అయితే విశ్వ కళ్యాణకారులుగానూ అవ్వలేరు, విశ్వ మహారాజులుగానూ అవ్వలేరు. రాజు అంటే కేవలం సింహాసనంపై కూర్చోవటమే కాదు, రాజధానిలో రాయల్ ఫ్యామిలీ వారికి కూడా రాజ్యపు రాజ్యాధికారం ఉంటుంది. మరి ఏం చేస్తారు? ‘ఎప్పటి కల్లా’ అన్న ప్రశ్నకు జవాబు ఇస్తారు కదా! మీటింగ్ పెట్టుకుంటారా! మీటింగ్ పెట్టుకుని ఫైనల్ చెయ్యండి. సరేనా? అచ్ఛా!
అందరూ బాగున్నారా? చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే అన్న ఉల్లాసము వస్తుందా? బాప్‌దాదా ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పిస్తారు. వీరు ఉల్లాస-ఉత్సాహాలలో ఉన్నారు అన్నది మాయ చూసినప్పుడు అది ఏదో ఒకటి చేసేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాయకు కూడా అంతిమ కాలము సమీపంగా ఉంది కదా. కనుక అది తన అస్త్ర-శస్త్రాలేవైతే ఉన్నాయో, వాటినన్నింటినీ ఉపయోగిస్తుంది. అంతేకాక మాయ ఎలా పాలన ఇస్తుందంటే, ఇది మాయ పాలన అన్నది కూడా అర్థం చేసుకోలేకపోతారు, ఇది మాయ మతమా లేక బాబా మతమా అన్నది అర్థం చేసుకోలేకపోతారు, వాటిని కలిపేస్తారు. ఈ ఫరిశ్తాతనములో మరియు పురుషార్థములో ఏదైతే ఆటంకము కలుగుతుందో, దానికి కారణము కేవలం రెండు పదాలే - అవి సాధారణమైన పదాలే, అవి కష్టమైనవి కూడా కాదు మరియు అందరూ వాటిని అనేక సార్లు ఉపయోగిస్తారు కూడా. అవి ఏమిటి? నేను మరియు నాది. ఈ నేను మరియు నాది అనేవాటిని పరివర్తన చేసేందుకు బాప్‌దాదా చాలా సహజమైన విధిని ఇంతకుముందు కూడా తెలియజేసారు, గుర్తుందా? చూడండి, ఏ సమయములో అయితే మీరు ‘నేను’ అన్న మాటను ఉపయోగిస్తారో, ఆ సమయములో ‘నేను ఉన్నదే ఆత్మగా’ అన్న విషయము మీ ఎదురుగా రావాలి. ‘నేను’ అని అనగానే ఎదురుగా ఆత్మ రూపాన్ని తీసుకురండి. నేను అన్న పదం ఉపయోగించినప్పుడు ‘నేను ఆత్మను’ అన్న మాట ఊరికే అలా అనటం కాదు. దానిని న్యాచురల్‌గా స్మృతిలోకి తీసుకురండి. నేను అన్న పదం వెనుక ఆత్మ అని పెట్టండి. నేను ఆత్మను. ‘నాది’ అన్న పదం ఉపయోగించినప్పుడు ముందుగా ‘నా బాబా’ అని అనండి. నా రుమాలు, నా చీర... ఇది నాది... కానీ ముందుగా ‘నా బాబా’ అని అనాలి. నాది అన్న పదం పలకగానే బాబా ఎదురుగా రావాలి. నేను అన్న పదం పలకగానే ఆత్మ ఎదురుగా రావాలి. దీనిని నేచర్‌గా మరియు నేచురల్‌గా చేసుకోండి. సహజమే కదా లేక కష్టమా? నేను ఆత్మను అన్న విషయమైతే ఎలాగూ తెలుసు. కేవలం ఆ సమయంలో అది స్వీకరించరు. తెలుసుకోవటమైతే 100 శాతము తెలుసుకున్నారు, కానీ స్వీకరించటమనేది పర్సెంటేజ్లో ఉంది. దేహాభిమానము నేచురల్ అయిపోయింది కదా, నేను దేహాన్ని అన్నది ఏమైనా గుర్తు చేసుకోవాల్సి ఉంటుందా, న్యాచురల్‌గా గుర్తుంటుంది కదా. నేను అన్న పదం నోటితో పలికే కంటే ముందు సంకల్పములో వస్తుంది కదా. సంకల్పములో కూడా నేను అన్న పదం వచ్చినప్పుడు వెంటనే ఆత్మ స్వరూపము ఎదురుగా రావాలి. ఈ అభ్యాసం చెయ్యటం సహజం కాదా? కేవలం నేను అన్న పదాన్ని మాత్రమే పలకడం కాదు, కానీ దానితో పాటు ఆత్మను అని కూడా అనండి, అప్పుడు పక్కా అయిపోతుంది. శరీరానికి పెట్టిన పేరు పక్కా అయిపోయింది కదా. మీ పేరు గల వారినెవరినైనా పిలిచినా కూడా మీరు అటువైపు చూస్తారు. అలా నేను ఆత్మను. ఆత్మ యొక్క ప్రపంచము బాప్‌దాదా, ఆత్మ యొక్క సంస్కారము బ్రాహ్మణుల నుండి ఫరిశ్తా, ఫరిశ్తా నుండి దేవతగా అవ్వడము. మరి ఏం చేస్తారు? ఈ మనసు యొక్క డ్రిల్‌ను చెయ్యండి. డ్రిల్ చెయ్యండి, డ్రిల్ చెయ్యండి, ఎక్సర్సైజ్ చెయ్యండి అని ఈ రోజుల్లోని డాక్టర్లు కూడా చెప్తుంటారు. కనుక ఈ ఎక్సర్సైజ్ను చెయ్యండి. నేను ఆత్మను, నా బాబా. ఎందుకంటే సమయం యొక్క వేగాన్ని డ్రామానుసారంగా స్లో చేయాల్సి వస్తుంది. వాస్తవానికి రచయిత వేగంగా ఉండాలి, రచన కాదు. కానీ ఇప్పటి అనుసారంగా సమయం వేగంగా వెళ్తూ ఉంది. ప్రకృతి ఎవరెడీగా ఉంది, కేవలం ఆజ్ఞ కోసం ఆగి ఉంది. డ్రామాలోని సమయమే ఆజ్ఞాపిస్తుంది కదా. స్థాపన చేసేవారు ఒకవేళ ఎవరెడీగా లేకపోతే మరి వినాశనం తర్వాత ప్రళయం జరుగుతుందా? ప్రళయం జరిగేది ఉందా? లేక వినాశనం తర్వాత స్థాపన జరగాల్సిందేనా? కనుక స్థాపనకు నిమిత్తమైనవారు ఇప్పుడు సమయమనుసారంగా ఎవరెడీగా అవ్వాలి. బాప్‌దాదా ఇదే చూడాలని కోరుకుంటున్నారు. బ్రహ్మా బాబా అర్జునుడిగా అయ్యారు కదా, ఉదాహరణగా అయ్యారు కదా! ఇలా బ్రహ్మా బాబాను ఫాలో చేసేవారు ఎలా తయారవుతారు? స్వయాన్ని కూడా చూసుకోండి, సమయాన్ని కూడా చూడండి.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు, వర్తమాన సమయములో బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలుగా అయ్యే ఆత్మలైన మీరందరూ నిమిత్త భావము మరియు నిర్మాన భావము, ఈ రెండు పదాలను అండర్లైన్ చేసుకోవాలి. దీని వలన దేహాభిమానానికి చెందిన నేను అన్న భావము సమాప్తమైపోతుంది. నాది అన్న భావము కూడా సమాప్తమైపోతుంది. నిమిత్తుడిని మరియు నిర్మాన స్వభావము. ఎంత నిర్మానులుగా ఉంటారో అంతగా గౌరవము లభిస్తుంది ఎందుకంటే ఎవరైతే నిర్మానులుగా ఉంటారో వారు అందరికీ ప్రియమైనవారిగా అవుతారు. ఎప్పుడైతే ప్రియమైనవారిగా అవుతారో అప్పుడు గౌరవమనేది స్వతహాగానే లభిస్తుంది. కనుక నిమిత్తము, నిర్మాన భావము మరియు భావన, శుభ భావన. భావము మరియు భావన అనే రెండు విషయాలు ఉంటాయి. కనుక నిమిత్తము మరియు నిర్మాన భావము మరియు భావన, ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన, శుభ కామన. ఎవరు ఎలా ఉన్నా సరే, మీ నిమిత్త, నిర్మాన భావము మరియు శుభ భావన వాయుమండలాన్ని ఎలా తయారుచేస్తుందంటే, ఎదుటివారు కూడా ఆ వైబ్రేషన్లతో మారిపోతారు. కొందరు పిల్లలు ఆత్మిక సంభాషణ చేస్తుంటారు కదా, అప్పుడు ఏమంటారంటే, మేము ఒక నెల నుండి శుభ భావన పెట్టాము, కానీ వాళ్ళు మారడమే లేదు. అప్పుడు అలసిపోతారు, నిరాశపడతారు. ఇప్పుడు పాపం, ఆ అభాగ్యుని వృత్తి మరియు దృష్టి ఉండడమే రాయిలా ఉన్నాయి, అవి మారటానికి కాస్త సమయమైతే పడుతుంది కదా. సరే, పోనీ వారు మారలేదనుకోండి, మిమ్మల్ని మీరైతే మంచిగా ఉంచుకోండి కదా. మీరైతే మీ పొజిషన్ లో ఉండండి కదా. మీరెందుకు నిరాశపడతారు. నిరాశపడకండి. సరే, వారు మారకపోయినా కానీ నేనైతే వారితోపాటు మారిపోకూడదు. ఒకవేళ మీరు నిరాశపడుతున్నారంటే, వారు శక్తిశాలి అయినట్లు, ఎందుకంటే వారు మిమ్మల్ని మార్చేసారు. మీరు మీ స్వమానమనే సీట్‌ను ఎందుకు వదులుతారు? వ్యర్థ సంకల్పాలు కూడా తలెత్తకూడదు, ఎందుకని? ‘ఎందుకు’ అని అన్నారంటే వ్యర్థ సంకల్పాల ద్వారం తెరుచుకుంటుంది. ఆ ద్వారం చాలా కష్టం మీద మూసివేయబడుతుంది. అందుకే ‘ఎందుకు’ అని ఆలోచించకండి, దయార్ద్ర హృదయులుగా అయ్యి వైబ్రేషన్లు ఇస్తూ ఉండండి. మీరు మీ సీట్‌ను వదిలేసి ఎందుకు నిరాశకు లోనవుతారు? గుర్తు పెట్టుకోండి - పొజిషన్ నుండి కిందకు రాకండి, అలా వస్తే చాలా అపోజిషన్ (విరోధము) జరుగుతుంది. వ్యక్తికి-వ్యక్తికి మధ్యన అపోజిషన్ అయిపోతుంది, స్వభావ-సంస్కారాలలో అపోజిషన్ అయిపోతుంది, ఆలోచనలలో అపోజిషన్ అయిపోతుంది, అందుకే పొజిషన్లో ఉండండి. మరి రేపు ఏం చేస్తారు? గుర్తుందా? బాప్‌దాదాకు ప్రేమ ఉంది కదా, అందుకే అందరూ బ్రహ్మా బాబా సమానంగా అయిపోవాలి అని బాప్‌దాదా కోరుకుంటున్నారు. బాబా ఎదురుగా అపోజిషన్ రాలేదా, బ్రహ్మా బాబా ఎదురుగా అపోజిషన్ జరగలేదా? మాయ అపోజిషన్ కూడా వచ్చింది, ఆత్మల ద్వారా కూడా అపోజిషన్ వచ్చింది, ప్రకృతి ద్వారా కూడా అపోజిషన్ వచ్చింది, కానీ బ్రహ్మా బాబా తమ పొజిషన్‌ను వదిలారా? వదల్లేదు కదా! కనుకనే ఫరిశ్తాగా అయ్యారు కదా. కనుక ఇప్పుడు మీరు స్వయాన్ని అయితే ఫరిశ్తాగా భావిస్తూ నడుచుకోండి, నేను ఫరిశ్తాను... అంతేకాక ఇతరులను కూడా ఫరిశ్తా రూపములో చూడండి, అందరూ ఫరిశ్తాలే. నాకు ఈ పాత ప్రపంచముతోనూ సంబంధము లేదు, పాత సంస్కారాలతోనూ సంబంధము లేదు, అలాగే ఈ బ్రాహ్మణులెవరికీ కూడా వీటితో సంబంధము లేదు. అంతా సమాప్తము. వీరు కూడా ఫరిశ్తా, వారు కూడా ఫరిశ్తా - ఈ దృష్టితోనే చూడండి. వాయుమండలాన్ని వ్యాపింపజేయండి. అచ్ఛా!
డబల్ విదేశీయులు కదా, అందుకే డబల్ నషాను ఎక్కిస్తున్నాము. ఈరోజు ఛాన్స్ లభించింది కదా! చూడండి, భారతవాసులకు మీ అందరిపై ఎంతో చింత ఉంది, అందుకే మీకు ఛాన్స్ ఇచ్చి వారు మాత్రం క్రింద (పాండవ్ భవన్, శాంతివన్, జ్ఞాన సరోవర్‌లో) కూర్చున్నారు. క్రింద కూర్చన్నవారికి బాప్‌దాదా త్యాగము యొక్క భాగ్యాన్ని జమ చేస్తున్నారు. అచ్ఛా. ఇప్పుడు ఏమి చేయాలి?
అందరూ ఇప్పుడు ఎలా అయితే మధురంగా చిరునవ్వును చిందిస్తున్నారో అలాగే ఎప్పుడూ ఉండండి. ఎపుడైనా ఎవరితోటైనా మాట్లాడినప్పుడు తప్పుకుండా చిరునవ్వుతో మాట్లాడండి. మీరు నవ్వితే వారి దుఃఖం సగం దూరమైపోతుంది. ఛారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ (ధర్మం ఇంటి నుండి ప్రారంభమవుతుంది). ఎవ్వరితో మాట్లాడుతున్నా, సహచరునితో కావచ్చు, బ్రాహ్మణ ఆత్మతో కావచ్చు, అజ్ఞానితో కావచ్చు, చిరునవ్వుతో ఉన్న ముఖము ఉండాలి. ఆత్మిక గులాబిగా ఉండాలి. సీరియస్‌గా ఉండి మాట్లాడకండి. ఏమి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు... వద్దు. నవ్వుతూ మాట్లాడండి. నవ్వేందుకు మీ వద్ద స్టాక్ ఉందా? స్టాక్ అయిపోలేదు కదా? నవ్వుతున్న ముఖము ఎంత మంచిగా అనిపిస్తుంది. కోపంతో ఉన్న ముఖము ఉంటే ఇతరులు మిమ్మల్ని చూసి అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటారు. నవ్వుతున్న ముఖము వద్దకు దగ్గరగా రావాలని అనిపిస్తుంది. మరి ఇప్పుడు మీరు నవ్వుతున్న ముఖం యొక్క ఫోటోను తీసి ఇవ్వాలి. ఆ ఫోటోను మీ వద్ద పెట్టుకోండి. కాగితం ఫోటో పెట్టుకుంటారా లేక మనసుదా? అచ్ఛా.
76 దేశాల నుండి వచ్చారు – చాలా గ్రూపులు వచ్చాయి.
సర్వ్ ఆఫ్రికా కోర్ గ్రూప్:- సేవ బాగా చేస్తున్నారు. నిర్విఘ్నంగా ఫాస్ట్ సేవ జరుగుతుందన్న సమాచారము బాప్‌దాదాకు లభించింది. సందేశం ఇచ్చే సేవను ఆఫ్రికా ఫాస్ట్‌గా చేసింది, అందుకు చప్పట్లు కొట్టండి. అభినందనలు. అలాగే అందరూ చేయడం తప్పనిసరి. ప్లాన్ తయారు చేయండి, సేవ ప్లాన్ ఆలోచించండి, కానీ సేవ చేస్తే భారంతో చేయకండి. కొంతమంది పిల్లలు సేవ చేసిన తర్వాత ఎంతగా అలసిపోతారంటే ఇక వారికి మాలిశ్, పాలిశ్ చేసేవారు కావాల్సి ఉంటుంది. యథార్థమైన సేవలో సంతోషం ఉంటుంది, తేలికతనము ఉంటుంది. ప్రాప్తి ఉంటుంది కదా. ప్రాప్తిలో అలసట ఉంటుందా? కొంతమంది పిల్లలు పురుషార్థం కూడా అలాగే చేస్తారు, భారీ పురుషార్థం, కష్టంగా పురుషార్థం చేస్తారు. ప్రేమ, స్నేహము పునాది. బాబా మరియు పిల్లల స్నేహము, సేవతో ఆత్మలకు బాబా నుండి స్నేహము యొక్క ఫలము లభిస్తుంది. కనుక సేవ చేసినా కూడా భారీ రూపంలో కాదు, తేలిక. సేవ భారంగా చేసేది కాదు, సేవ తేలికగా చేసేది. పురుషార్థం కూడా కష్టపడుతూ చేయకండి. బాప్‌దాదాకు శ్రమ మంచిగా అనిపించదు. మాస్టర్ సర్వశక్తిమంతులై కష్టపడుతున్నారా! మంచిగా అనిపిస్తుందా? పురుషార్థంలో వద్దు, సేవలో వద్దు, బాప్‌దాదా చూసారు, వీరి రిజల్ట్ యొక్క సమాచారాన్ని చూసాము, ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. విశేషత ఏమిటంటే పరస్పరంలోనే హ్యాండ్స్‌ను తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నారు. లేకపోతే, సేవ చాలా ఉంది కానీ హ్యాండ్స్ లేరు అని కొందరు అంటారు కదా. హ్యాండ్స్ ఉంటే సేవ పెరుగుతుంది కానీ వీరు హ్యాండ్స్ కావాలని అడగలేదు, ఇది వీరి విశేషత. తామే హ్యాండ్స్‌ను తయారు చేసుకున్నారు, ఎలా చేసినా తమ వద్ద ఉన్న హ్యాండ్స్ తోటే చేసారు మరియు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఫాస్ట్ వృద్ధిని చేసారు కదా? ఏ విశేషతను వినిపించాము, ఎంతగా జోన్లో సేవ జరగలేదో అంతగా ఇప్పుడు జరిగింది. ఫాస్ట్‌గా జరిగింది, అభినందనలు, మంచిగా చేస్తున్నారు.
పీస్ ఆఫ్ మైండ్ గ్రూప్:- బాగా చేసారు. ఇప్పుడు ఏ గ్రూప్ అయితే వచ్చిందో దాని పాలన చేయండి. స్థాపన చేసినట్లుగా పాలన కూడా చేస్తూ ఉండండి. కనెక్షన్‌ను తెంచకండి, ఏదో ఒకటి వారికి పంపిస్తూ ఉండండి, కనెక్షన్ పెట్టుకోండి. సరేనా! మీరు ఏదైతే చేస్తున్నారో, కాల్ ఆఫ్ టైమ్, కాల్ ఆఫ్ టైమ్ వారు ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారన్న సమాచారాన్ని బాప్‌దాదా విన్నారు. కనెక్షన్ పెట్టుకుంటున్నారు కదా. అలాగే మీరు కూడా కనెక్షన్ పెట్టుకోండి. మొదట్లో సంపర్కంలోకి వచ్చినా, తర్వాత సంబంధంలోకి వస్తారు, సంబంధంలోకి వస్తూ-వస్తూ బ్రాహ్మణులుగా అయిపోతారు. తర్వాత సంబంధంలోకి వస్తూ-వస్తూ బ్రాహ్మణులుగా అయిపోతారు. కనుక వారిని ముందుకు తీసుకు వెళ్తూ ఉండండి. మధ్య-మధ్యలో వారిని పిలిచి, భిన్న భిన్న దేశాలలో అక్కడ పిలిచినా ఫర్వాలేదు, కానీ మీరు ఆ బాధ్యతను తీసుకోండి, పిలిచారు, దాని రిజల్ట్ ఏమి వచ్చింది? అప్పుడే ముందుకు వెళ్తారు. ప్రోగ్రామ్ అయితే బాగా చేస్తారు, కానీ పాలన తక్కువ జరుగుతుంది, పాలన లభించని కారణంగా ఏమి జరుగుతుందంటే, జన్మ అయితే తీసుకున్నారు కానీ ఎదగడం లేదు. పాపం వారి ఆయుష్షు అంతే ఉండిపోతుంది, ఆయుష్షు ముందుకు వెళ్ళడం లేదు, మరి పాలన ఇవ్వండి. ఇకపోతే ప్రోగ్రామ్ అయితే బాగా చేస్తున్నారు. బాప్‌దాదా అయితే వతనంలో కూర్చుని కూడా చూస్తారు. సమాచారాన్ని కూడా వింటారు. సమాచారము బాప్‌దాదాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అభినందనలు. సందేశం ఇచ్చే సందేశవాహకులుగా అయ్యారు, ఇందుకు అభినందనలు. చప్పట్లు కొట్టండి.
పీస్ ఆఫ్ మైండ్‌కు సంబంధించి కొంతమంది సాంపుల్‌గా కూర్చున్నారు, బాప్‌దాదా అందరినీ ముందుకు పిలిచారు – మొత్తం 6 మంది ఉన్నారు:- ఇది చూడండి, ఎంత మంచి ఉదాహరణగా ఉందో! మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ బ్రాహ్మణ ఆత్మలందరూ పీస్‌ఫుల్‌గా అయినందుకు అభినందనలు తెలుపుతున్నారు. పీస్‌ఫుల్‌గా అయినందుకు అభినందనలు. ఇప్పుడు క్రొత్త జన్మ జరిగింది కదా! అయితే ఈరోజు మీ పుట్టిన రోజు. మీకు పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అచ్ఛా, చూడండి, సేవ చేసారు, ఫలితం కూడా లభించింది.
ఇంటర్ఫెయిథ్ కోర్ గ్రూప్:- అచ్ఛా, వీరు ఇంటర్ఫెయిథ్ వారా! మంచిది. వీరు సేవాధారిగా వచ్చారు. బాగుంది, అందరికీ సందేశాన్ని ఇవ్వడంలో, వీరు కూడా ఎందుకు ఉండిపోవాలి? మంచిగా చేసారు. ఈ గ్రూప్‌ను కూడా పిలిచారు. విశేషంగా దీనిని అంతర్జాతీయంగా చేయడాన్ని బాప్‌దాదా చూసారు. దేశము మరియు విదేశము రెండూ కలిసి ఒకే సంకల్పం తీసుకుని చేసారు, ఇది చాలా బాగా చేసారు. సక్సెస్ కూడా అయింది. మరి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేసారు, ఇందుకు అభినందనలు. ఇక మీదట కూడా ఈ గ్రూప్‌ను పెంచుతూ ఉండండి ఎందుకంటే వీరైతే మీ సహచరులు కదా, ఆధ్యాత్మికమైనవారే కదా. వీరిలో ఒక్కరైనా పరివర్తన అయ్యి మైక్‌గా అయితే చాలా సేవ చేయగలరు. మంచిగా చేసారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అందరూ కూడా సంతోషిస్తున్నారు, అందుకే చప్పట్లు కొడ్తున్నారు. ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. వదిలిపెట్టకండి. ఎలా అయితే ఈ కాల్ ఆఫ్ టైమ్ చేస్తూ ఉంటారు కదా, అలాగే ఇది కూడా చేస్తూ ఉండండి. ముందుకు తీసుకు వెళ్తూ ఉండండి. అచ్ఛా.
జానకి ఫౌండేషన్ మరియు వాల్యూ ట్రైనింగ్ గ్రూప్:- చాలా బాగుంది, క్రొత్త-క్రొత్త విధుల ద్వారా సందేశాన్ని అందించే కార్యాన్ని బాగా చేస్తుండటాన్ని బాప్‌దాదా చూసారు. ఈరోజుల్లో హెల్త్ కాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. బాప్‌దాదాకు ఒక పుస్తకాన్ని కూడా చూపించారు. ఆ పుస్తకం కూడా సేవకు మంచిగా నిమిత్తంగా అవుతుంది. ఫౌండేషన్ అన్న పేరుకు తగ్గట్లుగా స్మృతి మరియు సేవ యొక్క ఫౌండేషన్ (పునాది) కంబైండ్‌గా చేస్తూ జానకి ఫౌండేషన్‌ను (జానకి స్వచ్ఛంద సంస్థ) ముందుకు తీసుకు వెళ్ళండి. సరేనా! ఎందుకంటే మీ సేవ విస్తారంగా చాలా పెరగవచ్చు. పెరుగుతుంది మరియు పెరుగుతూ ఉంటుంది. వాల్యూ (విలువలు) యొక్క పుస్తకాన్ని కూడా చూసాము. మంచి ఉల్లాస-ఉత్సాహాలతో సేవ చేసినందుకు ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా సమీపంగా వస్తూ ఉంటారు. ఇది అన్ని వైపులా చేసారు. ఏ ఏ వేర్వేరు ఫౌండేషన్లు(సంస్థలు) అయితే ఉన్నాయో అవి ఈ ఫౌండేషన్‌కు సమీపంగా వస్తూ ఉంటాయి. అలసిపోవడం లేదు కదా! డబల్ సేవను చేస్తున్నారు, జాబ్ కూడా చేస్తారు, డబల్ విదేశీయులు, ఇందుకు డబల్ అభినందనలు. చాలా మంచిది.
ఐ.టి గ్రూప్:- అచ్ఛా, దేశవిదేశాలు కలిసి ఉన్నారు! ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారు చేసారా? (క్రొత్త వెబ్‌సైట్‌ను తయారు చేసాము, మురళికి క్రొత్త సిస్టమ్‌ను ప్రారంభించాము, ఇవి కాకుండా ఈమెయిల్స్‌కు కూడా క్రొత్త సిస్టమ్‌ను తయారు చేసాము ) ఎందుకంటే దీనితో ధ్వని అయితే నలువైపులకు వెళ్తుంది. ఇందులో ఏకాగ్రులై క్రొత్త-క్రొత్త ప్లాన్లను తయారు చేస్తూ ఉండండి మరియు ముందుకు వెళ్తూ ఉండండి ఎందుకంటే దేశము మరియు విదేశము రెండింటి కనెక్షన్ ఉంది కదా! ఎంతగా ఈ డిపార్ట్మెంట్ను ముందుకు తీసుకు వెళ్తుంటారో అంతగా ఒక స్థానంలో కూర్చునే అనేకులకు సందేశాన్ని ఇవ్వగలరు. ఇది చాలా మంచి సాధనము లభించింది. సాధనాల ద్వారా సందేశాన్ని ఇచ్చే కార్యము – ఇదే మీ డిపార్ట్మెంట్ యొక్క సాధన అవుతుంది. బాగా చేసారు. ఈ మోహిని (న్యూయార్క్) హ్యాండిల్ చేస్తున్నారు, బాగుంది. చూడండి, వారు పీస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, వారు కాల్ ఆఫ్ టైమ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు... అందరూ మంచి సీట్‌ను తీసుకున్నారు. బాప్‌దాదా డబల్ విదేశీయులకు భిన్న-భిన్న సేవలకు అభినందనలతో పాటు ఆశీర్వాదాలను కూడా ఇస్తున్నారు, ఆశీర్వాదాలు. (దాదీలు కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నారు)
ట్రావలర్ ఫిల్మ్ గ్రూప్:- వీరు ఫిల్మ్ తయారు చేస్తున్నారు. బాగుంది ఎందుకంటే ఈరోజుల్లో కల్చర్ ప్రోగ్రామ్ కూడా అందరికీ నచ్చుతుంది. పూర్తి కోర్సును చేయించేస్తున్నారు, కల్చరల్లోనే పూర్తి కోర్స్ అయిపోతుంది, ఇది చాలా బాగుంది. బాప్‌దాదాకు నచ్చింది. చూసారు కూడా. బాగా చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తాము అని మీరంటారు, కానీ బాప్‌దాదా చూసేసారు. ఈ సాధనాల ద్వారా కూడా మళ్ళీ చూస్తాము కానీ బాప్‌దాదా వద్ద మీ వద్దకన్నా చాలా పెద్ద మెషినరీ ఉంది, అందులో చూసేసారు. బాగా చేస్తున్నారు, చేస్తూ ఉంటారు, బాబాను ప్రత్యక్షం చేస్తూనే ఉంటారు. చాలా మంచిది, అభినందనలు.
మిడిల్ ఈస్ట్ సేవలో చాలా ముందుకు వెళ్తుంది:- చాలా మంచి-మంచి రత్నాలు. ఒక్కొక్కరి విశేషత వారివారిది. చేయించేవారు చేయిస్తున్నారు, పిల్లలైన మీరు నిమిత్తంగా అయ్యి అందరూ చాలా మంచి ఉల్లాస-ఉత్సాహాలతో చేస్తున్నారు. దాదీల ద్వారా సర్టిఫికేట్ లభించింది, ఇందుకు చాలా-చాలా అభినందనలు. కానీ దీనికి కారణం ఏమిటి? ఏ సేవా స్థానం యొక్క, సేవ యొక్క వృద్ధి జరిగినా, అది కూడా నిర్విఘ్నంగా జరిగినా, అందుకు కారణం ఏమిటి? తెలుసా? (పాలన) చాలా సెంటర్లలో వి.ఐ.పీల సేవ చాలా బాగా చేస్తారు కానీ స్టూడెంట్ల పాలన తక్కువ చేస్తారు అందుకే స్టూడెంట్ల వృద్ధి జరగదు. స్టూడెంట్లు రెగ్యులర్‌గా సేవా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండరు. క్లాసుకు వస్తారు, ఏది చెబితే అది చేస్తారు కానీ తమ స్వంత ఉల్లాస-ఉత్సాహాలతో చేయరు. మరి ఇది పాలన యొక్క రిజల్ట్. అభినందనలు.
అందరూ ఎవరైతే నిమిత్తమైన టీచర్లు కూర్చుని ఉన్నారో, ఎంతగా వి.ఐ.పీలపై అటెన్షన్ ఉంచుతారో, అంతగా స్టూడెంట్ల పాలనపై కూడా ఉంచండి. స్టూడెంట్లలో నవీనతను తీసుకురండి, ఏదో ఒక నవీనతను తీసుకువచ్చినప్పుడు ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతాయి. సేవలో బిజీ అయిపోతారు, అలసిపోతారు, కనుక పాలనను అంత ఆసక్తిగా చేయరు. ముందైతే రాజధానిని తయారు చేయండి. అదైతే స్టూడెంట్లతోటే జరుగుతుంది కదా. మనసుతో పాలన ఇవ్వండి. ఒక్కొక్కరి బలహీనతను తొలగించేందుకు కష్టపడండి. సంతోషంతో కూడిన శ్రమను చేయండి, భారంతో కూడినది కాదు ఎందుకంటే క్లాసులో స్టూడెంట్లు ఎంతగా పెరుగుతారో అంతగా రాజధాని త్వరగా తయారవుతుంది. ఎవరైతే సహయోగిగా ఉన్నారో, వారిని సంబంధంలోకి తీసుకురండి. స్టూడెంట్లుగా తయారు చేయండి. ఇకపోతే అంతా బాగుంది. టీచర్లు చాలా బాగా సేవ చేస్తున్నారని టీచర్ల మహిమను విన్నాము, మంచిగా ప్లాన్‌ను తయారు చేస్తున్నారు. టీచర్లు చేతులెత్తండి. అచ్ఛా, మీకు లక్ష రెట్లు అభినందనలు.
ఇప్పుడు ఒక్క నిమిషము సర్వ శక్తులతో సంపన్నమై విశ్వములోని ఆత్మలకు ఎటువంటి శక్తిశాలి కిరణాలను ఇవ్వండంటే, ఇక నలువైపులా మీ శక్తుల వైబ్రేషన్లు విశ్వములో వ్యాపించాలి. (పూర్తి నిశ్శబ్దము). అచ్ఛా!
నలువైపులా ఉన్న బ్రాహ్మణ్ సో ఫరిశ్తాలుగా అయ్యే పిల్లలకు, సదా స్వదర్శనము ద్వారా స్వయాన్ని చెక్ చేసుకుని ఛేంజ్ చేసుకునేవారికి, బ్రహ్మా బాబాను ఫాలో చేసే ఆజ్ఞాకారి పిల్లలకు, సదా డబల్ లైట్‌గా ఉంటూ సేవ మరియు పురుషార్థము చేసే ఫరిశ్తా ఆత్మలకు, సదా మీ పొజిషన్ అనే సీట్‌పై సెట్ అయ్యి అపోజిషన్‌ను సమాప్తము చేసే మాస్టర్ సర్వ శక్తిమంతులైన పిల్లలకు, సంగమయుగ ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసే బాబాకు సమీపమైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- దాదీలను చూసి సంతోషిస్తారు కదా. కేవలం దాదీ యొక్క చిరునవ్వుతో ఉన్న ముఖము మరియు దృష్టి చాలా సుఖాన్ని ఇస్తాయి. మీరు ఎప్పుడైతే నవ్వుతూ అందరినీ కలుస్తారో, దృష్టినిస్తారో అప్పుడు అందరూ చాలా సంతోషిస్తారు. నవ్వుతున్నారు. అందరి ముఖము నవ్వుతూ ఉండాలి అని బాప్‌దాదా అయితే చెప్పారు. నవ్వకుండా ఎప్పుడూ ముఖము ఉండకూడదు. చూడండి, దాదీ చెప్తున్నారు – నవ్వుతూ ఉండకపోతే కష్టాలు ఉంటాయి అని అంటున్నారు. (దాదీ కేవలం సంకేతం ఇస్తున్నారు) దాదీ ఫరిశ్తాగా అవుతున్నారు కదా, ఫరిశ్తాతనము యొక్క స్థితి వస్తుంది. నవ్వడంలోనే అంతా వచ్చేస్తుంది. చాలా భాషణ ఇచ్చారు కదా, జన్మ తీసుకున్నప్పటి నుండి భాషణ ఇచ్చారు, క్లాసులు చేయించారు, ఇప్పుడు స్లోగన్ వలె మాట్లాడుతున్నారు. ఫరిశ్తాగా అయ్యి డ్యాన్స్ చేస్తారు. ఫరిశ్తా ఇంకేమి చేస్తుంది? ఎగురుతుంది మరియు డ్యాన్స్ చేస్తుంది. అచ్ఛా.
డబల్ విదేశీయులు రేపటి నుండి 85 శాతం అయిపోతాము అని అంటున్నారు. దాదీ అయితే 95 శాతం ఉన్నారు. కాపీ చేయండి, అంతే. ఎవరైనా సీరియస్‌గా ఉంటే వారికి టైటిల్ ఇవ్వండి – గ్యాస్ బుడగ. గ్యాస్‌తో నింపబడ్డ బెలూన్ ఉంది కదా, గంభీరంగా అయినప్పుడు వ్యర్థ సంకల్పాల గ్యాస్ నిండుతుంది. ఎవ్వరినీ బెలూన్ అని అనకండి, అంటే వారిలో గ్యాస్ నిండిపోతుంది, శుభ భావన పెట్టండి. వీరే అవ్వాలి కదా, ఇంకెవరు అవుతారు.
ముగ్గరు పెద్దన్నయ్యలతో:- ముగ్గురూ పరస్పరంలో ఒకే సంకల్పంతో నడుచుకుంటున్నారు, ముగ్గురుదీ ఒకే సంకల్పం – హా జీ, హా జీ, అందరి ఆశీర్వాదాలు మీకు లభిస్తున్నాయి. బాగుంది, పాండవులలో కూడా ఉదాహరణగా అయితే ఉన్నారు కదా. చాలా మంచిది.
రమేష్ అన్నయ్య సోమనాథ్ వారి స్మృతిని అందించారు:- అక్కడ కూడా సేవ బాగా జరుగుతుంది. వారికి కూడా సేవ యొక్క స్మృతికి అభినందనలు.
(ప్రెజిడెంట్ ఎప్పుడూ బాబా ఏ సందేశాన్ని ఇచ్చారు అని బాబా సందేశం గురించి అడుగుతూ ఉంటారు) సందేశం వచ్చింది అని వారికి గుర్తుంటుంది. ఈ ఒక్క ప్రెజిడెంట్లోనే మూడు సత్తాలు ఉన్నాయి – సైంటిస్ట్ కూడా, రాజకీయ నాయకుడు కూడా మరియు ధర్మముపై కూడా ఆసక్తి ఉంది. ఎంతమంది ప్రెజిడెంట్లు వచ్చినాగానీ, వేరే ఏ ప్రెజిడెంట్ వీరిలా లేరు. వీరి పాత్ర కూడా ఉంది. ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉంది అందుకే ఆధ్యాత్మిక మార్గంలో సహచరుడయ్యారు.
విదేశాల పెద్దక్కయ్యలతో:- అచ్ఛా – వీరు డబల్ సేవాధారుల సేవ కోసమై నిమిత్తమై ఉన్నారు. బాగుంది, బాప్‌దాదా వద్దకు సమాచారమైతే వస్తూనే ఉంటుంది. మిగతా అందరూ కూడా చాలా బాగా సంభాళిస్తున్నారు కూడా. తిరుగుతూ ఉంటారు. బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది, పరస్పరంలో ఎప్పుడైతే కలుస్తారో, ప్లాన్ తయారు చేస్తారో, అప్పుడు సంగఠన శక్తిని ప్రయోగిస్తారు, ఇది చాలా బాగుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి విశేషత వారివారిది. ఒక్కోసారి ఒక్కొక్కరి ఆలోచనలు చాలా బాగా ఉంటాయి, కావున కలుస్తూ ఉంటారు, మీటింగ్ చేస్తారు, ఇది బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఫరిశ్తాతనముకు సమీపంగా రావాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు సాకార రూపంలో ఉదాహరణగా ఉన్నారు. సాకారంలో ఇప్పుడు మీరే ఉదాహరణ, నిమిత్తము. మీ వేగం ఎలా ఉంటుందో అలా ఇతరులకు కూడా ధైర్యము లభిస్తుంది. ఉల్లాసము వస్తుంది. అందరూ పాతవారు. సాకార బాబా పాలనకు రిటర్న్ – ఫాలో బ్రహ్మా బాబా. అన్నింటిలో నంబర్ వన్, అందుకే అవ్వల్ నంబర్ (నంబర్ వన్) అయ్యారు కదా. పూర్తి డ్రామాలో అవ్వల్ నంబర్ ఆత్మ. మరి ఫాలో బ్రహ్మా బాబా. అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఎంత లభిస్తున్నాయి. తమ పురుషార్థమైతే ఉంది కానీ ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఎవరికి నిమిత్తంగా అవుతారో వారి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి, ఇది కూడా లిఫ్ట్, మీకు లభించిన ఈశ్వరీయ గిఫ్ట్. (మారిషస్‌లో రిట్రీట్ సెంటర్ తయారవుతుంది) మంచిగా తయారవుతుంది, సేవ చాలా బాగా జరుగుతుంది. అచ్ఛా.
డబల్ విదేశీ సోదరసోదరీలు బాప్‌దాదా వద్దకు ఈ క్రింద ఇవ్వబడ్డ 7 విషయాల చార్ట్‌ను సందేశి ద్వారా పంపారు, వీటి రిజల్ట్ ఆధారంగా భవిష్య పురుషార్థం గురించి సూచనను ఇచ్చారు)
1. స్వ పరివర్తన యొక్క వేగం ఎంత ఉంది?
2. నా స్వమానంలో నిరంతరం స్థితి అయి ఉండి ఇతరులకు గౌరవాన్ని ఇస్తున్నానా?
3. సర్వుల నుండి ఆశీర్వాదాలు తీసుకున్నానా మరియు ఇచ్చానా?
4. సర్వ ఖజానాల స్టాక్‌ను ఎంత జమ చేసుకున్నాను?
5. నా మనసును సెకండులో ఏకాగ్రం చేసి నిరంతరం ఏకరసంగా ఉండగలుగుతున్నానా?
6. బిందువుగా అయ్యి, బిందువును గుర్తు చేసి సెకండులో ఫుల్స్టాప్ పెట్టగలుగుతున్నానా?
7. గత 6 నెలల నుండి సంతోషం, శాంతి మరియు శక్తుల కిరణాలను వ్యాప్తి చేసి జ్ఞాన సూర్యుడిగా అయ్యానా?
ఓంశాంతి