Search for a command to run...
2 Feb 2007
పరమాత్మ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మ గుర్తు - హోలియస్ట్, హైయస్ట్ మరియు రిచెస్ట్
2 February 2007 · తెలుగు
ఈరోజు విశ్వ పరివర్తకుడైన బాప్‌దాదా తమ తోటి పిల్లలను కలుసుకోవటానికి వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై మూడు పరమాత్మ విశేష ప్రాప్తులను చూస్తున్నారు. ఒకటి హోలియస్ట్ (పవిత్రాతి పవిత్రులు), 2-హైయస్ట్ (ఉన్నతాతి ఉన్నతులు) మరియు 3- రిచెస్ట్ (అతి సంపన్నులు). ఈ జ్ఞానం యొక్క ఫౌండేషనే హోలీ అనగా పవిత్రంగా తయారుకావడం. కనుక, పిల్లలు ప్రతి ఒక్కరూ హోలియస్ట్ పిల్లలు, పవిత్రత అనగా కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, మనసా-వాచా- కర్మణ, సంబంధ -సంపర్కంలో పవిత్రత. మీరు చూడండి, పరమాత్మ బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఆది-మధ్య-అంతము మూడు కాలాలలోను హోలియస్ట్గా ఉన్నారు. మొట్టమొదట ఆత్మగా ఎప్పుడైతే పరంధామంలో ఉన్నారో, అక్కడ కూడా హోలియస్ట్గా ఉన్నారు. తరువాత ఆదికాలంలో కూడా దేవతా రూపంలో హోలియస్ట్ ఆత్మగా ఉన్నారు. హోలియస్ట్ అనగా పవిత్ర ఆత్మ యొక్క విశేషత - ప్రవృత్తిలో ఉంటూ కూడా సంపూర్ణ పవిత్రంగా ఉండటము. మిగతావారు కూడా పవిత్రంగా ఉంటారు కానీ మీ పవిత్రత యొక్క విశేషత - స్వప్నమాత్రంగా కూడా అపవిత్రత మనస్సు-బుద్ధిని టచ్ చేయకుండా ఉండటము. సత్యయుగంలో మీ ఆత్మకూడా పవిత్రముగా తయారవుతుంది మరియు మీ శరీరము కూడా పవిత్రముగా తయారవుతుంది. అత్మ మరియు శరీరము రెండింటి పవిత్రత ఏదైతే దేవాత్మ రూపంలో ఉంటుందో, అది శ్రేష్ఠ పవిత్రత. ఎంతగా హోలియస్ట్గా తయారవుతారో అంతగా హైయస్ట్‌గా కూడా తయారవుతారు. అందరికంటే ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ అత్మలుగా మరియు ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలుగా అయ్యారు. ఆదిలో పరంధామంలో కూడా హైయస్ట్ అనగా తండ్రితో పాటుగా ఉంటారు. మధ్యలో కూడా పూజ్య ఆత్మలుగా అవుతారు. ఎంత సుందరమైన మందిరాలు తయారవుతాయి, ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. ఎంతగా మీ దేవాత్మల మందిరములో విధి పూర్వకంగా పూజ జరుగుతుందో అంతగా వేరేవారి మందిరాలు తయారైనాకానీ విధిపూర్వకంగా పూజ మీ దేవతా రూపాలకే జరుగుతుంది. కనుక మీరు హాలియస్ట్ కూడా మరియు హైయస్ట్ కూడా, దానితో పాటు రిచెస్ట్ కూడా. రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ అని ప్రపంచంలో అంటారు కానీ శ్రేష్ఠ అత్మలైన మీరు రిచెస్ట్ ఇన్ ది కల్ప. పూర్తి కల్పము రిచెస్ట్ గా ఉంటారు. మీ ఖజానాలు స్మృతిలోకి వస్తున్నాయా, ఎన్ని ఖజానాలకు యజమానులు! ఈ ఒక్క జన్మలో పొందిన అవినాశి ఖజానాలు అనేక జన్మల వరకు ఉంటాయి. మిగతా ఎవరి ఖజానా అనేక జన్మల వరకు రాదు. కానీ మీ ఖజానాలు ఆధ్యాత్మికమైనవి. శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానా మరియు వర్తమాన సమయము యొక్క ఖజానా, ఈ సర్వ ఖజానాలు జన్మ జన్మల వరకు వస్తాయి. ఒక్క జన్మలో పొందిన ఖజానాలు తోడుగా ఉంటాయి ఎందుకంటే సర్వ ఖజానాల దాత అయిన పరమాత్మ తండ్రి ద్వారా ప్రాప్తిస్తాయి. మరి మా ఖజానాలు అవినాశి అయినవి అన్న నషా ఉందా?
ఈ ఆధ్యాత్మిక ఖజానాలను ప్రాప్తి చేసుకొనేందుకు సహజయోగులుగా అయ్యారు. స్మృతి యొక్క శక్తితో ఖజానాలను జమ చేసుకుంటారు. ఈ సమయములో కూడా మీరు ఈ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న నిశ్చింత చక్రవర్తులు, ఏదైనా చింత ఉందా? ఉందా ఏదైనా చింత ? ఎందుకంటే ఈ ఖజానాలు ఏవైతే ఉన్నాయో వీటిని దొంగలు దొంగిలించలేరు, రాజులు తినలేరు, నీళ్ళు ముంచేయలేవు, అందుకే నిశ్చింత చక్రవర్తులు. మరి ఈ ఖజానాలు సదా స్మృతిలో ఉంటాయి కదా! స్మృతి కూడా ఎందుకు సహజమైనది? ఎందుకంటే, అన్నింటికన్నా ఎక్కువగా స్మృతికి ఆధారమైనటువంటివి, ఒకటి సంబంధము, రెండవది ప్రాప్తి. ఎంతగా ప్రియమైన సంబంధము ఉంటుందో అంతగా స్మృతి స్వతహాగా వస్తుంది ఎందుకంటే సంబంధములో స్నేహము ఉంటుంది మరియు ఎక్కడైతే స్నేహముంటుందో అక్కడ స్నేహితుడిని గుర్తు చేయడం కష్టం కాదు కానీ మరిచిపోవడం కష్టమవుతుంది. మరి తండ్రి సర్వ సంబంధాల ఆధారాన్ని తయారు చేసారు. అందరూ తమనుతాము సహజయోగులుగా అనుభవం చేసుకుంటున్నారా? లేక కష్టమైన యోగులుగానా? సహజమేనా? లేక అప్పుడప్పుడు సహజము, అప్పుడప్పుడు కష్టమనిపిస్తుందా? ఎప్పుడైతే తండ్రిని సంబంధంతో మరియు స్నేహముతో స్మృతి చేస్తారో అప్పుడు స్మృతి కష్టమనిపించదు మరియు ప్రాప్తులను గుర్తుచేసుకోండి. సర్వ ప్రాప్తుల దాత సర్వ ప్రాప్తులను చేయించేసారు. మరి మిమ్మల్ని మీరు సర్వ ఖజానాలతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? ఖజానాలను జమ చేసుకునే సహజ విధిని కూడా బాప్‌దాదా వినిపించారు. అవినాశి ఖజానాలేవైతే ఉన్నాయో వాటన్నింటిని పొందేందుకు విధి - బిందువు. ఏ విధముగానేతే వినాశి ఖజానాలలో కూడా బిందువు పెడుతూ పోతే పెద్దగా అవుతూ ఉంటుంది కదా. అలాగే అవినాశి ఖజానాలను జమ చేసుకొనే విధి, బిందువు పెట్టడము. మూడు బిందువులు ఉన్నాయి. ఒకటి ఆత్మ బిందువు, తండ్రి బిందువు మరియు డ్రామాలో ఏదైతే జరిగిపోయిందో అది ఫుల్స్టాప్ అనగా బిందువు. మరి బిందువు పెట్టడం వస్తుందా? అన్నింటికన్నా ఎక్కువ సహజమైన పొల్లు ఏది ? బిందువు పెట్టడము కదా ! కనుక అత్మనైన నేను బిందువును, తండ్రి కూడా బిందువు, ఈ స్మృతితో స్వతహగానే ఖజానాలు జమ అయిపోతాయి. కనుక బిందువును సెకండులో గుర్తు చేస్తే ఎంత సంతోషము కలుగుతుంది! ఈ సర్వ ఖజానాలు మీ బ్రాహ్మణ జీవితానికి అధికారాలు ఎందుకంటే పిల్లలుగా కావడమంటే అధికారులుగా తయారుకావటం మరియు విశేషంగా మూడు సంబంధాల అధికారము ప్రాప్తమవుతుంది - పరమాత్ముడిని తండ్రిగా కూడా చేసుకున్నారు, శిక్షకునిగా కూడా చేసుకున్నారు మరియు సద్గురువుగా కూడా చేసుకున్నారు. ఈ మూడు సంబంధాలతో పాలన, చదువుతో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మరియు సద్గురువు ద్వారా వరదానము లభిస్తుంది. ఎంత సహజముగా వరదానము లభిస్తుంది? ఎందుకంటే తండ్రి నుండి వరదానము పొందడం, ఇది పిల్లల జన్మ సిద్ధ అధికారము.
బాప్‌దాదా ప్రతి పిల్లవాని జమ ఖాతాను చెక్ చేస్తున్నారు. మీరందరు కూడా మీ ప్రతి సమయము యొక్క జమ ఖాతాను చెక్ చేసుకోండి. జమ అయిందా లేక కాలేదా, దానికి విధి ఏమిటంటే, ఏ కర్మచేసినా ఆ కర్మలో స్వయం కూడా సంతుష్టంగా ఉండడం మరియు ఎవరితో కలసి కర్మ చేసారో వారు కూడా సంతుష్టంగా ఉండడం. ఒకవేళ ఇద్దరు కూడా సంతుష్టంగా ఉన్నట్లయితే ఆ కర్మ యొక్క ఖాతా జమ అయినట్లు అర్థము. ఒకవేళ స్వయంలో లేక సంబంధమున్న వారిలో సంతుష్టత రాలేదంటే జమ కాదు.
బాప్‌దాదా పిల్లలందరికీ సమయము యొక్క సూచనను కూడా ఇస్తూ ఉంటారు. ఈ వర్తమాన సంగమ సమయం పూర్తి కల్పంలో శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన సమయము ఎందుకంటే ఈ సంగమమే శ్రేష్ఠ కర్మల బీజమును నాటేందుకు సమయము. ప్రత్యక్ష ఫలము ప్రాప్తి చేసుకొనే సమయము. ఈ సంగమ సమయములో ఒక్కొక్క సెకండ్ శ్రేష్ఠాతిశ్రేష్ఠమైనది. అందరూ ఒక్క సెకండులో అశరీరి స్థితిలో స్థితులు కాగలరా? బాప్‌దాదా సహజ విధిని వినిపించి ఉన్నారు. నిరంతర స్మృతి కొరకు ఒక విధిని తయారుచేయండి. రోజంతటిలో, రెండు పదాలను అందరూ అంటారు మరియు అనేక సార్లు అంటారు. ఆ రెండు పదాలు “నేను” మరియు “నాది.” ఎప్పుడైతే నేను అనే పదాన్ని అంటారో నేను అత్మను అన్న పరిచయాన్ని తండ్రి ఇచ్చి ఉన్నారు. ఎప్పుడెప్పుడు నేను అన్న పదాన్ని అంటారో నేను అత్మను అని గుర్తు తెచ్చుకోండి. కేవలం నేను అని అనుకోవద్దు, నేను ఆత్మను అని అనుకోండి ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను శ్రేష్ఠ ఆత్మను అని, పరమాత్మ పాలనలో ఉన్న ఆత్మను అని మరియు ఎప్పుడైతే నాది అన్న పదాన్ని అంటారో, మరి నాది ఏది? నా తండ్రి అనగా తండ్రి పరమాత్మ. కాబట్టి ఎప్పుడైతే నేను మరియు నాది అన్న పదాన్ని అంటారో అప్పుడు వీటిని చూడండి, నేను ఆత్మను మరియు నా తండ్రి. ఎంతగా నాది అనే భావనను తండ్రిలో తీసుకువస్తారో అంతగా స్మృతి సహజముగా జరుగుతుంది ఎందుకంటే నాది అనేదానిని ఎప్పుడూ మరచిపోవడం జరగదు. రోజంతటిలో చూడండి నాది అనేదే గుర్తుకువస్తుంది. కాబట్టి ఈ విధానంతో సహజముగా నిరంతర యోగిగా కావచ్చు. బాప్‌దాదా, ప్రతి పిల్లవానిని స్వమానము యొక్క సీట్‌పై కూర్చోపెట్టారు. స్వమానాల లిస్టును స్మృతికి తీసుకువస్తే ఎంత పెద్దదిగా ఉంటుంది! ఎందుకంటే స్వమానములో స్థితులై ఉంటే దేహాభిమానము రాలేదు. దేహాభిమానమైనా ఉంటుంది లేదా స్వమానమైనా ఉంటుంది. స్వ మానము అనగా - స్వ అనగా ఆత్మ యొక్క శ్రేష్ఠ స్థితి యొక్క స్థానము. మరి అందరూ తమ స్వమానంలో స్థితి అయి ఉన్నారా? ఎంతగా స్వమానములో స్థితులవుతారో అంతగా ఇతరులకు సమ్మానం(గౌరవం) ఇవ్వడం స్వతహాగా జరిగిపోతుంది. కాబట్టి స్వమానములో స్థితులవ్వడం ఎంత సహజము!
మరి అందరూ సంతోషంగా ఉంటున్నారా? ఎందుకంటే సంతోషంగా ఉండేవారు ఇతరులను కూడా సంతోషంగా తయారు చేసేస్తారు. రోజంతటిలో సంతోషం పొగొట్టుకోకూడదని బాప్‌దాదా ఎల్లప్పుడు అంటారు. ఎందుకు? సంతోషము ఎటువంటిదంటే, ఒక్క సంతోషంలోనే ఆరోగ్యముంది, ఐశ్వర్యముంది మరియు ఆనందము ఉంది. సంతోషము లేకుంటే జీవితం నీరసంగా ఉంటుంది. సంతోషం గురించే అంటారు - సంతోషాన్ని మించిన ఖజానా లేదు అని. ఎన్ని ఖజానాలు ఉన్నాకానీ సంతోషము లేకుంటే ఖజానానుండి కూడా ప్రాప్తి పొందలేరు. సంతోషం లాంటి మందు వేరొక మందు లేదని సంతోషాన్ని గురించి అంటారు. కాబట్టి సంతోషము సంపద కూడా మరియు సంతోషము ఆరోగ్యము కూడా మరియు పేరే సంతోషం కాబట్టి ఆనందం కూడా దానిలో ఉండనే ఉంది. కాబట్టి సంతోషంలో మూడు విషయాలు ఉన్నాయి. తండ్రి అవినాశి సంతోషమనే ఖజానాను ఇచ్చారు. తండ్రి ఇచ్చిన ఖజానాను పొగొట్టుకోకూడదు. మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారా?
బాప్‌దాదా హోమ్‌వర్క్ ఇచ్చారు. సంతోషంగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి ఎందుకంటే సంతోషము ఎటువంటిదంటే ఎంతగా పంచుతారో అంతగా పెరుగుతుంది. అనుభవం చేసి చూసారు కదా! చేసారు కదా అనుభవం? సంతోషాన్ని పంచినట్లయితే పంచడానికి ముందే అది మీ దగ్గర పెరుగుతుంది. ఎవరిని సంతోష పెడ్తున్నారో వారి కంటే ముందే స్వయం సంతోషపడతారు. మరి అందరూ హోమ్‌వర్క్ చేసారా? చేసారా? ఎవరైతే చేసారో వారు చేతులెత్తండి. ఎవరైతే చేసారో సంతోషంగా ఉండాలి, కారణాలు కాదు నివారణ చేయాలి, సమాధాన స్వరూపంగా తయారుకావాలి, వారు చేతులెత్తండి. ఇది అయిపోయింది అని ఇప్పుడు అనరుకదా. బాప్‌దాదా వద్ద కొందరు పిల్లలు ఎంత శాతం ఓ.కేగా ఉన్నారో ఆ రిజల్టును వ్రాసారు. ఇంకొంచెం లక్ష్యం పెట్టుకుంటే లక్షణము కూడా స్వతహాగానే వచ్చేస్తుంది.
సేవ టర్న్ కర్ణాటక వారిది:- కర్ణాటక వారు లేవండి. మంచిది, కర్ణాటక వారు సేవ యొక్క సువర్ణ అవకాశాన్ని తీసుకున్నారు ఎందుకంటే సంగమయుగంలో ప్రత్యక్ష ఫలం దొరుకుతుంది. జమ కూడా అవుతుంది కానీ అదే సమయంలో సంతోషము ప్రాప్తించే ప్రత్యక్ష ఫలం దొరుకుతుంది. మరి ఎన్ని రోజులైతే సేవ చేసారో, అంతగా ప్రత్యక్ష ఫలంగా తమలో సంతోషాన్ని అనుభవం చేసారా? సంతోషం కలిగిందా! చేతులెత్తండి. మాయ వచ్చిందా? రాలేదా? ఎవరికైతే మాయ రాలేదో వారు చేతులెత్తండి. పాండవులకు మాయ వచ్చిందా? కొంచెం కొంచెం వచ్చిందా? మంచిది. ఇక్కడి వాయుమండలము చాలా సహయోగం ఇస్తుంది. ఎలాగైతే సైన్స్ వారు సైన్స్ శక్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేస్తారు కదా. వేడిగా ఉన్నప్పుడు చల్లగా, గాలి యొక్క వాయుమండలాన్ని తయారు చేస్తారు కదా! చలిగా ఉన్నప్పుడు వేడి వాయుమండలాన్ని తయారు చేస్తారు, మరి సైలెన్స్ శక్తి ఆధ్యాత్మిక స్మృతి యొక్క వాయుమండలాన్ని తయారు చేస్తుంది ఎందుకంటే ఇక్కడ సేవ చేస్తూ వృత్తిలో ఏముంటుంది? యజ్ఞ సేవ అని, యజ్ఞము యొక్క పుణ్యము చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అవినాశి యజ్ఞములో సేవ చేసినట్లయితే వృత్తి శ్రేష్ఠంగా తయారవుతుంది. కాబట్టి వాయుమండలము కూడా శ్రేష్ఠంగా తయారైపోతుంది. ఇప్పుడు కర్ణాటక వారు ఏ విశేషత చూపిస్తారు? ఏదైనా క్రొత్త కార్యం చేసి చూపించండి. చూడండి, కర్ణాటకలో సంఖ్య ఎక్కువగా ఉంది మరియు ఏరియా కూడా చాలా ఉంది. సేవ యొక్క ఏరియా చాలా ఎక్కువ ఉంది. కర్ణాటక వారు చేయగలిగిన అతి పెద్ద సేవ - మా తండ్రి వచ్చారు కానీ మాకు సూచన ఇవ్వలేదు, సందేశం ఇవ్వలేదు అనే ఫిర్యాదు మీ మీద ఎవ్వరూ ఇవ్వలేని విధముగా కర్ణాటకలోని చిన్న పెద్ద ఏ స్థానము ఉండకూడదు. ఈ ఫిర్యాదు ఉండిపోకూడదు. ఆఫ్రికా వారు, వారి ఏరియాకు సందేశం ఇచ్చే కార్యాన్ని సఫలం చేసారు. బాప్‌దాదాకు ఈ కార్యము బాగా అనిపిస్తుంది, ఎవరి ఫిర్యాదు ఉండి పోకూడదు. సందేశము ఇవ్వడము మీ పని, వారు ఇప్పుడైనా రానివ్వండి లేదా తర్వాత అయినా రానివ్వండి కానీ మీ కార్యమైతే మీరు సంపన్నం చేసారు. మరి కర్ణాటక వారు వచ్చే సంవత్సరానికి ఏమి చేసి వస్తారు? ఏ ఏరియా ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే మీకైతే తెలుసుకదా తండ్రి పరిచయం లభించడం ద్వారా, తండ్రి సంబంధములోకి రావడం ద్వారా ఆత్మలు ఎంత సుఖ పడతాయో! ఇప్పుడైతే రోజురోజుకూ దుఃఖము మరియు అశాంతి పెరుగుతూ పోతుంది ఎందుకంటే రోజురోజుకూ భ్రష్టాచారము, పాపాచారము పెరుగుతోంది. అతిగా వెళ్తుంది. కానీ మీకైతే తెలుసు, అతి తర్వాత ఏమవుతుంది? అంతిమము వస్తుంది. అంతిమము దేనిని తీసుకువస్తుంది? ఆదిని. మరి ఎంతైనా మీ సోదరులకు కూడా తండ్రి ఒక్కరే కదా, తెలుసుకున్నా, నమ్మినా, నమ్మకపోయినా తండ్రి అయితే తండ్రే. కనుక మీ సోదరీసోదరులకు సందేశాన్ని తప్పక ఇవ్వండి. మరి ఏమి చేస్తారు? రికార్డ్ చేస్తారా, టీచర్లు? ఏ ఊరూ మిగిలిపోకూడదు. చేతులెత్తండి, ఎవరైతే చేస్తారో, ఊరికే చేతులెత్తకండి. చేస్తారా? రిజల్టును వెళ్ళిన తరువాత పంపించండి, ప్లాన్ తయారు చేయండి. విశేషమైతే చేసి చూపించాలి కదా, విశేషతను చెయ్యటంలో ఎంతగా నిమగ్నమైపోతారో, అంతగా చిన్న చిన్న విఘ్నాలు సమాప్తమైపోతాయి. చాలా మంచి అవకాశం దొరికింది, ఛాన్స్ తీసుకున్నారు మరియు ఛాన్స్ మూలంగా ఏ పనైతే దొరికిందో అది కూడా చేసి వస్తారు. చేస్తారు కదా? పాండవులు తప్పక చేస్తారు కదా? అలసి పోకూడదు. ఎంత పుణ్యము జమ అవుతుంది. పిల్లలు విభిన్న విధులద్వారా తమ పుణ్యఖాతాను పెంచుకోవటం, బాప్‌దాదాకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. బాప్‌దాదా వినిపించారు కదా - మూడు ఖాతాలను జమ చేసుకోవాలి, ఒకటి తమ పురుషార్థము ద్వారా జమ చేసుకున్న ఖాతా, రెండవది ఇతర ఆత్మలను సంతుష్టపరచిన పుణ్య ఖాతా. సంతుష్టత పుణ్యము యొక్క ఖాతాను జమ చేస్తుంది మరియు మూడవది మనసా-వాచా-స్నేహ సంబంధము ద్వారా సేవ యొక్క ఖాతా. కనుక మూడు ఖాతాలను పరిశీలించుకోవాలి. మూడూ తక్కువ కాకూడదు. మరి నంబర్ వన్ తీసుకుంటారా? జమ ఖాతాలో నెంబరు తీసుకోవాలి. కర్ణాటక, తక్కువేమీ కాదు. కర్ణాటక బాప్‌దాదా దృష్టిలో ఉంది. చాలా చేయగలుగుతారు అన్న దృష్టిలో ఉన్నారు. ముందు వరుసలో నిలబడిన వారు ఏమి చేస్తారు? విశేషత చేస్తారు కదా! విశేషత చేయండి, నెంబరు తీసుకోండి. స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి, రెండింటి బ్యాలెన్స్ పెట్టుకోండి. సరే కూర్చోండి. (బెంగుళూరు సేవను మమ్మా ప్రారంభించారు. దాదీ హృదయపుష్ప మరియు సుందరి అక్కయ్య చాలా ప్రేమగా సేవ చేసారు). హృదయపుష్ప బచ్చీ చాలా ప్రేమతో సేవ చేసారు. మరి ప్రేమకు రుజువును చూపించాలి. జగదంబ తల్లి చేసిన సేవకు రిటర్న్ ఇవ్వాలి. మరి ఎన్ని రోజులలో సమాచారాన్ని ఇస్తారు. ఇది చేస్తున్నాము, ఇది అయింది, ఇది చేయబోతున్నాము అని ప్రతి నెల సమాచారాన్ని ఇవ్వండి. బాప్‌దాదా ప్రతి జోన్‌కు చెపుతున్నారు కానీ ఎవరి టర్న్ ఉంటుందో వారు విశేషంగా అటెన్షన్ పెట్టాలి.
మరి అందరూ సదా తమ మనసును బిజీగా పెట్టుకోండి ఎందుకంటే మనసే మోసపోతుంది. మనసులోనే టెన్షన్ వస్తుంది. మనసే అటూ ఇటూ పరిగెడుతుంది. కనుక మనసును బిజీగా పెట్టుకోవడము అంటే సంపన్న స్థితిలో త్వర త్వరగా స్థితి కావడము. స్థూల కర్మేంద్రియాలను నావి అని చెప్పుకుంటారు కదా, నా చేయి అని అంటారు కదా. మీ చేతిని మీ కంట్రోల్లో పెట్టుకోగలరు కదా! ఎప్పుడు ఎలా కావాలంటే అలా ఉపయోగిస్తారు కదా! మరి బాప్‌దాదా అంటారు, మనసు మీదా, లేక మీరు మనసుకు చెందినవారా? మనసుకు యజమానులు కూడా మీరే కదా! నేను మనసును అని అయితే అనరు కదా? మనసు రాజు అయితే కాదు, ఆత్మ రాజు. కనుక కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్‌ను ధారణ చేసినప్పుడు మనసు మీకు అతి మంచి నంబర్ వన్ సహయోగి సహచరునిగా అవుతుంది. చేసి చూడండి. కేవలం యజమానిగా కండి. రాజుగా కండి. ఈ ప్రపంచంలో మూడు శక్తులైతే నడుస్తున్నాయి, చూడండి, రాజనీతికి సంబంధించిన వీరు వచ్చారు కదా (రాజస్థాన్ యొక్క రాజ్యపాల్ మహామహిమ్ ప్రతిభా పాటిల్ గారు బాప్‌దాదాను కలుసుకోవటానికి వచ్చారు). మూడు సత్తాలు అయితే నడుస్తున్నాయి కదా, రాజ్య సత్తా కూడా నడుస్తుంది. ధర్మ సత్తా కూడా నడుస్తుంది మరియు సైన్సు సత్తా కూడా నడుస్తుంది. కానీ రిజల్టు ఏమిటి? మీలో ఎన్ని సత్తాలు ఉన్నాయి? మీలో నాలుగు సత్తాలు ఉన్నాయి, ఎందుకంటే విశ్వంలో ఆధ్యాత్మిక శక్తి లోపించింది. మీలో రాజ్య సత్తా ఉన్నదా? మీ కర్మేంద్రియాలకు రాజుగా అయ్యారు కదా! స్వరాజ్య అధికారులు కదా! అలాగే ధర్మ సత్తా కూడా ఉంది, ధర్మము అనగా దివ్య గుణాల ధారణ, శ్రేష్ఠ చరిత్ర యొక్క ధారణ, శ్రేష్ఠ కర్మల ధారణ. ఎక్కడ చరిత్ర ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. చరిత్ర లేకపోతే అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్లే లెక్క. అలాగే సైన్సు యొక్క సత్తా, వారి వద్ద సాధనాలు ఉంటే మీ వద్ద సైలెన్సు యొక్క సాధన ఉంది. మరి నాలుగు సత్తాలు ఎప్పుడైతే కలిసి ఉంటాయో అప్పుడు విశ్వ పరివర్తన జరుగుతుంది. అందుకే బాప్‌దాదా అంటారు. ఈ బచ్చీకు కూడా చెబుతున్నారు (ప్రతిభా పాటిల్ గారికి), ఇక్కడకు వచ్చి చాలా మంచి పని చేసారు. రాజ్య సత్తాలో ఉన్నారు కదా, ఇప్పుడు కనీసం రాజస్థాన్‌ను ఆధ్యాత్మిక శక్తితో నింపండి. రాజస్థాన్ ప్రతిజ్ఞ చెయ్యాలి, అప్పుడు విశ్వ పరివర్తన స్వతహాగానే జరిగిపోతుంది. ముందుగా రాజస్థాన్‌ను పరివర్తన చెయ్యండి. (బాబా, రాజస్థాన్ అయితే ఆధ్యాత్మిక గడ్డ, ఇక్కడ నుండి విశ్వానికి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది).
విశ్వానికైతే లభిస్తుంది, కానీ రాజస్థాన్‌లోని రాజ్య అధికారులు కూడా సహయోగిగా కావాలి. చూడండి, మీరు శక్తి రూపాలు. బాప్‌దాదా శక్తులను ముందుంచారు. మీరు కూడా శివశక్తులు. శక్తులు ఏమి తలుచుకుంటే అది చెయ్యగలరు. బాగుంది, వీరి ఉత్సాహం చాలా బాగా ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. రాజస్థాన్‌ను ఎంతో బాగా చేసారు, కానీ మీకు అందరూ సహయోగిగా ఉన్నారు, అందరూ కలిసి చేస్తే జరగని పని ఏదైనా ఉంటుందా? రాజస్థాన్ చరిత్ర యొక్క దీపాన్ని వెలిగిస్తుంది. ఈ దీపము నాలుగు వైపులా పరిగెడుతుంది. బాగా చేసారు. పిల్లలు ఈ కార్యంలో ఉల్లాస ఉత్సాహాలతో సహయోగమును అందించడము చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. మీతో పాటు మరికొంత మంది కూడా వచ్చారు కదా. తోడుగా వచ్చిన వారు చేతులెత్తండి. బాప్‌దాదాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఇప్పుడు మీరందరూ పరస్పరంలో మీటింగులు చేసుకోండి, ఏమేమి చెయ్యగలరో ప్లానును తయారు చెయ్యండి. ఇక్కడి వారందరూ మీకు సహయోగిగా ఉంటారు. ఉత్సాహం ఉంది కదా! బాగుంది! రాజస్థాన్ నిమిత్తంగా కావాలి. అచ్ఛా!
డబల్ విదేశీయులు:- విదేశీయులు మీ ఒరిజినల్ విదేశాన్ని మర్చిపోవడం లేదు కదా. మీరు ఒరిజినల్‌గా ఏ దేశానికి చెందినవారు? అదైతే గుర్తుంటుంది కదా. అందుకే అందరూ మిమ్మల్ని డబల్ విదేశీయులు అంటారు. కేవలం విదేశీయులు కాదు, డబల్ విదేశీయులు. మరైతే మీరు మీ స్వీట్ హోమ్‌ను మర్చిపోరనుకుంటాను. అయితే ఎక్కడ ఉంటారు? బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులు. ఎప్పుడైనా చిన్న పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, సమస్య కాదు అది పేపరు, పేపరు ముందుకు తీసుకు వెళ్తుంది. బాప్‌దాదా హృదయ సింహాసనమైతే మీ అధికారము. హృదయ సింహాసనాధికారిగా అయిపోండి అప్పుడు సమస్య ఆట బొమ్మగా అయిపోతుంది. సమస్యను చూసి గాభరా పడరు, ఆడుకుంటారు. ఆటబొమ్మ. అందరూ ఎగరే కళ వారే కదా. ఎగిరే కళ ఉన్నదా? లేక నడుస్తున్నారా? ఎగిరేవారా లేక నడిచేవారా? ఎగిరేవారు చేతులెత్తండి. ఎగిరేవారు. సగం సగం చేతులెత్తుతున్నారు. ఎగిరేవారు. అచ్ఛా. అప్పుడప్పుడూ ఎగరకుండా ఉంటున్నారా? నడుస్తున్నాము, కాదు. బాబా, మేము చాలా బాగా నడుస్తున్నాము అని కొందరు బాప్‌దాదాకు చెప్తారు. మరి బాప్‌దాదా అడుగుతున్నారు – ఎగురుతున్నారా లేక నడుస్తున్నారా? ఇప్పుడు నడిచే సమయము కాదు, ఎగిరే సమయము. ఉల్లాస-ఉత్సాహాలు, ధైర్యము అనే రెక్కలు అందరికీ ఉన్నాయి. రెక్కలతో ఎగరాల్సి ఉంటుంది. కావున రోజూ చెక్ చేసుకోండి, ఎగిరే కళలో ఎగురుతున్నానా? మంచిది, సెంటర్లు విదేశాలలో పెరగడాన్ని రిజల్టులో బాప్‌దాదా చూసారు. పెరుగుతూనే ఉంటాయి. ఎలా అయితే డబల్ విదేశీయులో అలాగే డబల్ సేవ, అంటే, మనసు మరియు వాచ సేవలను కలిపి చేయండి. మనసా శక్తి ద్వారా ఆత్మల ఆత్మిక వృత్తిని తయారు చేయండి. వాయుమండలాన్ని తయారు చేయండి. ఇప్పుడు దుఃఖం పెరుగుతూ ఉండటాన్ని చూస్తుంటే దయ కలగడం లేదా? మీ జడ చిత్రాల వద్ద మొర పెట్టుకుంటున్నారు, మర్సీ ఇవ్వండి, మర్సీ చూపండి. ఇప్పుడు దయాళువుగా, కృపాళువుగా, దయాహృదయులుగా అవ్వండి. మీపై కూడా దయ మరియు ఇతర ఆత్మలపై కూడా దయ. మంచిది – ప్రతి సీజన్లో, ప్రతి టర్న్‌లో వస్తుంటారు. ఇది అందరికీ సంతోషంగా ఉంటుంది. కావున ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. మంచిది, ఇప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకోవడంలో ఫాస్టుగా వెళ్ళడాన్ని రిజల్టులో చూసాము. స్వ పరివర్తనా గతి విశ్వ పరివర్తనా గతిని పెంచుతుంది. అచ్ఛా.
మొదటిసారి వచ్చినవారు లేవండి:- మీ అందరికీ బ్రాహ్మణ జన్మకు అభినందనలు. మంచి మిఠాయి అయితే లభిస్తుంది కానీ బాప్‌దాదా అయితే దిల్ఖుష్ మిఠాయి తినిపిస్తున్నారు. మొదటిసారి మధుబన్కు వచ్చినందుకు లభించిన ఈ దిల్ఖుష్ మిఠాయిని సదా గుర్తుంచుకోండి. ఆ మిఠాయి అయితే నోటిలో వేసుకోగానే పూర్తయిపోతుంది, కానీ దిల్ఖుష్ మిఠాయి అయితే సదా మీతో ఉంటుంది. తప్పకుండా రండి, బాప్‌దాదా మరియు పూర్తి పరివారము దేశవిదేశాలలోని తమ సోదరసోదరీలను చూసి సంతోషిస్తున్నారు. అందరూ చూస్తున్నారు, అమెరికా కూడా చూస్తుంది, ఆఫ్రికా కూడా చూస్తుంది, రష్యావారు కూడా చూస్తున్నారు, లండన్ వారు కూడా చూస్తున్నారు, 5 ఖండాలు కూడా చూస్తున్నాయి. మీ అందరికీ మీ జన్మదినం కోసం అక్కడ కూర్చోబెట్టే అభినందనలను ఇస్తున్నాము. అచ్ఛా.
బాప్‌దాదా చెప్పిన ఆత్మిక డ్రిల్ గుర్తుంది కదా! ఇప్పుడు బాప్‌దాదా పిల్లలందరితో, క్రొత్తవారు కావచ్చు పాతవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు, చిన్నవారు మరింత త్వరగా బాబా సమానంగా అవ్వగలరు. ఇప్పుడు సెకండులో మనసును ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ మనసును ఏకాగ్రం చేయండి. ఈ ఏకాగ్రత డ్రిల్‌ను సదా చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక్క సెకండులో మనసుకు యజమానిగా అయ్యి నేను మరియు నా బాబాయే ప్రపంచం, మరెవ్వరూ లేరు అన్న ఏకాగ్ర స్మృతిలో స్థితులవ్వండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న సర్వ తీవ్ర పురుషార్థీ పిల్లలకు, సదా ఉల్లాస ఉత్సాహాల రెక్కలతో ఎగిరే కళతో అనుభవీమూర్తులైన పిల్లలకు, సదా తమ స్వమానము అనే సీట్‌పై సెట్ అయి ఉండే పిల్లలకు, సదా దయాహృదయులై విశ్వాత్మలకు మనసా శక్తి ద్వారా ఎంతో కొంత సుఖశాంతుల దానమును ఇచ్చే దయాళువు, కృపాళు, సదా బాబా స్నేహంలో ఇమిడిపోయే హృదయ సింహాసనాధికారి పిల్లలకు, బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- బాగుంది - అందరూ ఆది రత్నాలు ఉన్నారు. ఆది రత్నాలలో విశేషత ఉంది, అన్ని రత్నాలను చూసి సంతోషిస్తున్నాము. దాదీని కూడా అందరూ గుర్తు చేస్తున్నారు. (దాదీజీకి విశేష ట్రీట్మెంట్ మరియు చెకింగ్ కోసం ముంబయి హాస్పిటల్‌కు 31 జనవరి నాడు తీసుకు వెళ్ళడం జరిగింది. మోహిని అక్కయ్య, మున్ని అక్కయ్య, నిర్వైర్ అన్నయ్య, యోగిని అక్కయ్య మొదలైన వారందరూ స్మృతిని పంపారు) పెద్దవారి ఎదుట ఏదో ఒక అనుభవం అయితే వస్తుంది కదా. అతీతము మరియు బాబాకు ప్రియము, అతీతంగా ఉంటూనే చిన్న చిన్న విషయాలలో అతీతంగా అయ్యేందుకు ఒక ఉదాహరణగా అవుతున్నారు. పూర్తిగా 100 శాతం సంపన్నంగా అవ్వాలి ఎందుకంటే నంబర్ వన్ వారిలో అంశములో అంశమాత్రం కూడా ఉండదు, అంతా ఇక్కడే సమాప్తమవ్వనున్నది ఎందుకంటే వీరి ఆధారంగానే క్రొత్త ప్రపంచ రాజ్యం స్థాపన అయ్యేది ఉంది మరియు రాజ్య వంశము కూడా తయారవుతుంది. అంశమాత్రాన్ని కూడా భస్మం చేసుకుంటున్నారు. అందుకే ఏమి జరిగినాగానీ అతీతతనం ఉంటుంది. సర్వగుణ సంపన్నము, సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తము ఇలా ప్రాక్టికల్‌గా సంపన్నంగా అవ్వడానికి కొద్దిగా ఈ ఆటను ఆడవలసి వస్తుంది. (బాబాకు ఇది ఆట అని దాదీ జానకి అన్నారు) మీకు కూడా ఆటే, ఇది కూడా పాత్ర. వేరే పాత్రలు పోషించినట్లుగా ఈ పాత్ర కూడా ఫిక్స్ అయి ఉంది. ఉన్న కొద్దిగా కూడా భస్మం అవుతుంది. పూర్తిగా ప్యూర్, అంశమాత్రం కూడా ఉండకూడదు. మరి అందరికీ ప్రేమ అయితే ఉంది, ప్రేమ దీవెనలు దాదీకి కూడా లభిస్తున్నాయి. మంచిది, మీరందరూ కలిసి, నిమిత్తంగా అయ్యి నడిపిస్తున్నారు, ఇది కూడా చాలా బాగుంది. (పర్దాదీ కూడా స్మృతిని అందించారు) అందరూ కలిసి ఒకేసారి ప్యూర్ అవ్వడం కూడా ఆటలో ఆట. వీరైతే (శాంతమణి దాదీ) ధైర్యాన్ని చూపించారు, చేసి చూపించారు. డాక్టర్లకు కూడా తమ ధైర్యాన్ని చూపించారు కదా. ప్రతి ఒక్కరిలో వారి వారి విశేషత ఉంది. బాగుంది, అందరూ కలిసి, తోడుగా ఉంటూ, యజ్ఞ కార్యమైతే ఆగేది లేదు, అమరమైనది, నడుస్తుంది, పెరుగుతుంది. అందరూ సాక్షిగా అయ్యి ఆటను చూస్తున్నారా లేక క్వెశ్చన్ మార్కు వస్తుందా? ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నలు రావడం లేదు కదా! ఏది జరిగినా, అందులో ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. అది బాబాకు తెలుసు, డ్రామాకు తెలుసు. అచ్ఛా. అందరూ మంచిగా ఉన్నారు కదా. మంచిది.
అవ్యక్త బాప్‌దాదాతో రాజస్థాన్ రాజ్యపాల్ మహామహిమ్ ప్రతిభా పాటిల్ గారు కలుస్తున్నారు:
మీరు మంచి ధైర్యాన్ని ఉంచారు, బాప్‌దాదాకు ఒక విషయంలో సంతోషంగా ఉంది – రాజస్థాన్‌లో ఇద్దరూ విశేషంగా మాతలే ఉన్నారు. త్రిమూర్తి. (చీఫ్ మినిస్టర్, రాజ్యపాల్ మరియు స్పీకర్ ముగ్గరూ సోదరీలే) బాప్‌దాదా ఇక్కడ కూడా మాతల ద్వారానే స్థాపన చేసారు. మరి ఇప్పుడు మీరు సహయోగిగా అయ్యి సేవను వృద్ధి చేయండి. రాజస్థాన్ నంబర్ వన్ ఉండాలి. (జరిగిపోతుంది, మీ ఆశీర్వాదము ఉంది) ఎందుకు ఉండదు, ఎక్కడ దృఢ సంకల్పము ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంది. సఫలతకు తాళం చెవి దృఢ సంకల్పం. ఈ తాళం చెవిని ఎప్పుడూ మీతోటే పెట్టుకోండి. ఇప్పుడు మీరు తోడుగా ఉన్నారు. ఆశీర్వాదాలైతే శుభ కార్యానికి, ధైర్యమున్న వారికి స్వతహాగా లభిస్తాయి. చెప్పినా చెప్పకపోయినా కానీ, ఎవరిలో అయితే ధైర్యము ఉంటుందో, ఉత్సాహం ఉంటుందో వారికి లభిస్తుంది. ధైర్యము యొక్క ఒక అడుగు మీది, వేయి అడుగుల సహాయాన్ని బాబా ఇస్తారు అని బాబా మాట ఇచ్చారు. వీరితో వారంతా కూడా సహయోగం చేయండి. చాలా మంచిది. ఏమి చేయలేరు! మనుష్యాత్మలు విశ్వ అకళ్యాణం చేస్తున్నప్పుడు కళ్యాణం ఎందుకు చేయలేరు! అకళ్యాణం యొక్క పాత్ర జరుగుతుంది. (ఇలా ఎందుకు జరుగుతుంది?) ఇదంతా అతిలోకి వెళ్ళేది ఉంది. చూడండి, 10 సంవత్సరాల క్రితం భ్రష్టాచారము, పాపాచారము గుప్తంగా ఉన్నాయి, ఈరోజు బాహాటంగా జరుగుతున్నాయి, అతి జరగవలసిందే. కలియుగం కదా. కలియుగం అతిలోకి వెళ్తుంది. (దీనిని సమాప్తం చేసేందుకు ఉపాయం ఏమిటి? ఇందుకు ఉపాయము – ఆధ్యాత్మిక శక్తిని పెంచడము. ఈ సందేశాన్ని ఇచ్చి వారిలో శ్రేష్ఠ కర్మల భావనను ఉత్పన్నం చేయండి. అచ్ఛా.
జయకుమార్ రావల్, ఎమ్.ఎల్.ఏ, దోఢాయిచా, మహారాష్ట్ర:- ఏది ఏమైనా కానీ బాబా కార్యంలో సహయోగిగా అవ్వండి.
రాజ్యపాల్తో:- వీరైతే ఇంటివారిగా అయ్యారు, చూడండి, దాదీలతో వచ్చారు. అచ్ఛా.
పాట్నా కమిషనర్ వచ్చారు:- ఏమి జరిగినా కానీ, ఇప్పుడైతే ఈశ్వరీయ కార్యంలో తోడుగా నిలవండి. చేయవలసిందే, తోడుగా నిలవాల్సిందే అన్న దృఢ సంకల్పం చేసి వెళ్ళండి. చలించకండి, దృఢంగా ఉండండి.
ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లాధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్:- ఏమి జరిగినా కానీ, ఏమి చేయాలి? ఇప్పుడు ఈశ్వరీయ కార్యంలో సహయోగిగా అవ్వండి. అచ్ఛా.
దాదీల సేవలో ఉండే సోదరీలతో:- మీరు సెంటరులో ఉండటం లేదు, మధుబన్‌లో ఉండటం లేదు, బ్రాహ్మణ పరివారం మధ్యలో ఉంటున్నారు. అందరి దృష్టి మీపై ఉంటుంది, పెద్ద బాధ్యత మీపై ఉంది. అలసిపోకండి, సాధారణం కాదు. ఫరిశ్తాలుగా నడుచుకోండి, దాదీలను సంభాళిస్తున్నారు, ఏ ఫిర్యాదు లేదు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
బాప్‌దాదా బాంబే హాస్పిటల్‌కు దాదీజీ సేవ కోసమై వెళ్ళిన సోదరసోదరీలకు విశేష స్మృతిని ఇచ్చారు:- బాప్‌దాదా, బాంబేలో, అందరికీ ప్రియమైన, అందరి హృదయాలకు ప్రియమైన దాదీజీ సేవ కోసమై ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారందరికీ ప్రియస్మృతులను ఇస్తున్నారు. దాదీది ఏదైతే డ్రామాలో చూస్తున్నారో, చూస్తూ కూడా సాక్షిగా, ఆశీర్వాదాలు, హృదయపూర్వక స్నేహాన్ని మరియు స్నేహ సకాశ్ను ఇచ్చే సేవను చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉండండి. ఆటలో ఆటను చూస్తూ ఉండండి. సాక్షిగా అయి చూస్తూ ఉండండి మరియు ఎగురుతూ ఉండండి. బాప్‌దాదా మనస్ఫూర్తిగా అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు, అందరూ ఎంతో ప్రేమగా సేవను చేస్తున్నారు. సేవకు అభినందనలు. (డాక్టర్లు కూడా చాలా సేవను చేస్తున్నారు అని దాదీ జానకి చెప్పారు) ఏమి జరిగినా అందులో సేవ మరియు కళ్యాణం నిండి ఉన్నాయి. అచ్ఛా.
అందరూ చాలా-చాలా-చాలా సంతోషంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారా? ఎంత ఎక్కువ? మరి సదా ఇలాగే ఉండండి. ఏమి జరిగినా కానీ, జరగనివ్వండి, ఇప్పుడు సంతోషంగా ఉండండి. మేము ఎగరాలి, ఎవ్వరూ క్రిందకు తీసుకురాలేరు. పక్కా! పక్కా ప్రతిజ్ఞ చేసారా? ఎంత పక్కా? సంతోషంగా ఉండండి, అందరికీ సంతోషాన్ని ఇవ్వండి. ఏదైనా విషయం మంచిగా అనిపించకపోయినా కానీ సంతోషాన్ని మాత్రం పోగొట్టుకోకండి. విషయాన్ని పోనివ్వండి, సంతోషాన్ని పోనివ్వకండి. విషయమైతే సమాప్తం అయ్యేదే ఉంది. కానీ సంతోషమైతే మీతోటే ఉంటుంది కదా! మీతోటే ఉండేదానిని విడిచిపెడ్తున్నారు, సమాప్తమయ్యేదాన్ని మీ వద్ద పెట్టుకుంటున్నారు. ఇలా చేయకండి. అమృతవేళ రోజూ ముందుగా మీకు మీరే సంతోషమనే ఔషధాన్ని తినిపించుకోండి. అచ్ఛా!
ఓంశాంతి