Search for a command to run...
17 Mar 2007
శ్రేష్ఠ వృత్తి ద్వారా శక్తిశాలీ వైబ్రేషన్లను మరియు వాయుమండలమును తయారుచేసే తీవ్ర పురుషార్థమును చెయ్యండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి మరియు ఆశీర్వాదాన్ని తీసుకోండి
17 March 2007 · తెలుగు
ఈరోజు ప్రేమ మరియు శక్తి సాగరుడైన బాప్‌దాదా తమ స్నేహీ, గారాబాల ముద్దు పిల్లలను కలిసేందుకు వచ్చారు. పిల్లలందరు కూడా చాలా దూరదూరాల నుండి స్నేహ ఆకర్షణతో మిలనాన్ని చేసుకునేందుకు చేరుకున్నారు. సమ్ముఖంలో కూర్చుని, దేశ విదేశాలలో కూర్చుని స్నేహ మిలనాన్ని జరుపుకుంటున్నారు. నలువైపుల ఉన్న స్నేహీ, సహయోగీ, సహచరులైన పిల్లలందరినీ చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు చాలా త్వరత్వరగా బాబాను ప్రత్యక్షము చెయ్యాలి అన్న ఒకే సంకల్పము మెజారిటీ పిల్లలలో ఉండటమును బాప్‌దాదా చూస్తున్నారు. పిల్లలందరిలో ఉల్లాసము చాలా మంచిగా ఉంది, కానీ ఎప్పుడైతే ముందు స్వయమును బాబా సమానంగా సంపన్నంగా, సంపూర్ణంగా ప్రత్యక్షము చేస్తారో అప్పుడే బాబాను ప్రత్యక్షము చెయ్యగలరు అని బాబా అంటారు. ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని పిల్లలే బాబాను అడుగుతారు. మీరు ఎప్పుడు స్వయమును బాబా సమానంగా ప్రత్యక్షము చేసుకుంటారు, మీరు సంపన్నంగా అయ్యే డేట్‌ను ఫిక్స్ చేసారా అని బాబా పిల్లలను అడుగుతారు. విదేశీయులైతే ఒక సంవత్సరానికి ముందే డేట్‌ను ఫిక్స్(నిర్ణయించటం) చెయ్యటం జరుగుతుంది అని అంటారు. మరి మీరు బాబా సమానంగా అయ్యేందుకు పరస్పరంలో మీటింగ్ చేసుకుని డేట్‌ను ఫిక్స్ చేసారా?
ఈరోజుల్లో ప్రతి వర్గంవారి మీటింగులు చాలా జరుగుతూ ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. డబల్ విదేశీయుల మీటింగు గురించి కూడా బాప్‌దాదా విని ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. అన్ని మీటింగులు బాప్‌దాదా వద్దకు తప్పకుండా చేరుకుంటుంటాయి. మరి దీని డేట్‌ను ఎప్పుడు ఫిక్స్ చేసారు? ఈ డేట్‌ను డ్రామా ఫిక్స్ చేస్తుందా లేక మీరు ఫిక్స్ చేస్తారా? ఎవరు చేస్తారు అని బాప్‌దాదా ప్రశ్నిస్తారు. లక్ష్యం అయితే మీరే పెట్టుకోవాలి కదా! లక్ష్యాన్నయితే చాలా చాలా మంచిదిగా, చాలా గొప్పదిగా పెట్టుకున్నారు, ఎటువంటి లక్ష్యమును పెట్టుకున్నారో దాని ప్రమాణంగా ఇప్పుడు కేవలము అటువంటి లక్షణాలను శ్రేష్ఠ లక్ష్యము సమానంగా తయారుచేసుకోవాలి. ఇప్పుడు లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉంది. లక్ష్యము మరియు లక్షణాలు సమానమైపోయినట్లయితే లక్ష్యము ప్రాక్టికల్లోకి వచ్చేస్తుంది. పిల్లలందరూ అమృతవేళలో మిలనాన్ని చేసుకునేటప్పుడు చాలా మంచి సంకల్పాలను చేస్తారు. నలువైపుల ఉన్న పిల్లల ప్రతి ఒక్కరి ఆత్మిక సంభాషణను బాప్‌దాదా వింటారు. చాలా సుందరమైన విషయాలను మాట్లాడ్తారు. పురుషార్థాన్ని కూడా చాలా మంచిగా చేస్తారు కానీ పురుషార్థంలో ఒక విషయంలో తీవ్రత రావాలి. పురుషార్థము ఉంది కానీ తీవ్ర పురుషార్థము కావాలి. తీవ్రతలో దృఢత అదనంగా చేరాలి.
బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ఈ ఆశయే ఉంది, సమయ ప్రమాణంగా ప్రతి ఒక్కరు తీవ్ర పురుషార్థులుగా అవ్వాలి. నంబరువారీగా ఉన్నారు అన్నది బాప్‌దాదాకు తెలుసు కానీ నంబరువారీగా ఉన్నవారిలో కూడా సదా తీవ్ర పురుషార్థము ఉండాలి. దాని ఆవశ్యకత ఉంది. సమయం సంపన్నంగా అయ్యేందుకు వేగంగా వెళ్తూ ఉంది, కనుక ఇప్పుడు పిల్లలు బాబా సమానంగా అవ్వాల్సిందే, ఇది కూడా నిశ్చితమయ్యే ఉంది, కానీ ఇందులో కేవలము తీవ్రత కావాలి. నేను సదా తీవ్ర పురుషార్థినా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయమును పరిశీలించుకోవాలి. ఎందుకంటే పురుషార్థంలో పరీక్షలైతే చాలా వస్తూనే ఉంటాయి, వచ్చేదే ఉంది, కానీ తీవ్ర పురుషార్థి పరీక్షలో పాస్ అవ్వటము ఎంత నిశ్చితమై ఉందంటే తీవ్ర పురుషార్థి పరీక్షలో తప్పకుండా పాస్ అయ్యేదే ఉంది. అవ్వాలి అని కాదు, పాస్ అయ్యేదే ఉంది, ఇది నిశ్చితము. అందరూ చాలా మంచి అభిరుచితో సేవను కూడా చేస్తున్నారు కానీ వర్తమాన సమయ అనుసారంగా ఒకే సమయంలో మనసా-వాచా-కర్మణల ద్వారా అనగా నడవడిక మరియు ముఖము ద్వారా మూడు రకాల సేవలు జరగాలి అని బాప్‌దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు. మనసు ద్వారా అనుభవము చేయించటము, వాణి ద్వారా జ్ఞాన ఖజానా యొక్క పరిచయాన్ని చేయించటము మరియు నడవడిక మరియు ముఖము ద్వారా సంపూర్ణ యోగీ జీవితము యొక్క ప్రాక్టికల్ రూపాన్ని అనుభవము చేయించటము, ఈ మూడు సేవలూ ఒకే సమయములో చెయ్యాలి. వేరు-వేరుగా చెయ్యటం కాదు, సమయము తక్కువగా ఉంది మరియు సేవ అయితే ఇప్పుడు కూడా చాలా చెయ్యాల్సి ఉంది. సేవకు అన్నిటికన్నా సహజ సాధనము - వృత్తి ద్వారా వైబ్రేషన్లను తయారుచెయ్యటము మరియు వైబ్రేషన్ల ద్వారా వాయుమండలము తయారుచెయ్యటము అన్నదానిని బాప్‌దాదా చూసారు, ఎందుకంటే వృత్తి అనేది చాలా తీవ్రమైన సాధనము. సైన్స్ సాధనమైన రాకెట్ ఎంత వేగంగా వెళ్తుందో అలా మీ ఆత్మిక శుభ భావన, శుభ కామనలకు చెందిన వృత్తి, దృష్టి మరియు సృష్టిని మార్చేస్తుంది. ఒక స్థానములో కూర్చుని కూడా వృత్తి ద్వారా సేవ చెయ్యగలరు. విన్న విషయాన్ని మర్చిపోవచ్చు కానీ వాయుమండలము ద్వారా కలిగిన అనుభవాన్ని మర్చిపోరు. మధువనములో ఇది బ్రహ్మా బాబా యొక్క కర్మభూమి, యోగ భూమి, చరిత్ర భూమి కల వాయుమండలము అని అనుభవము చేసారు. ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ వాయుమండలములో చేసిన అనుభవాన్ని మర్చిపోరు. వాయుమండలము యొక్క అనుభవము మనసులో ముద్రించుకుపోతుంది. వాణి ద్వారా పెద్ద పెద్ద ప్రోగ్రాములనైతే చేస్తూనే ఉంటారు కానీ ప్రతి ఒక్కరూ తమ శ్రేష్ఠ ఆత్మిక వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారుచెయ్యాలి. కానీ మనసులో, హృదయంలో ఎవరిపట్ల కూడా వ్యతిరేకమైన, చెడు వృత్తికి చెందిన వైబ్రేషన్లు లేనప్పుడే వృత్తి ఆత్మికమైనదిగా, శక్తిశాలిగా అవుతుంది. మనసు యొక్క వృత్తి సదా స్వచ్ఛంగా ఉండాలి ఎందుకంటే ఏ ఆత్మ పట్లనైనా ఒకవేళ ఏదైనా వ్యర్థ వృత్తిగానీ లేక జ్ఞానము లెక్కలో నెగటివ్ వృత్తిగానీ ఉన్నట్లయితే, నెగటివ్ అనగా చెత్త, ఒకవేళ మనసులో చెత్త ఉన్నట్లయితే శుభ వృత్తి ద్వారా సేవ జరగజాలదు. కనుక నా మనసు యొక్క వృత్తి శుభమైనదిగా, ఆత్మికమైనదిగా ఉందా అన్నదానిని ముందుగా మీకు మీరు చెక్ చేసుకోండి. నెగటివ్ వృత్తిని కూడా మీ శుభ భావన, శుభ కామనల ద్వారా నెగటివ్‌ను కూడా పాజిటివ్‌లోకి మార్చగలరు ఎందుకంటే నెగటివ్ వలన మీ మనసే అలజడి చెందుతుంది కదా! అనవసరమైన ఆలోచనలైతే వస్తుంటాయి కదా! నా మనసులో ఎటువంటి ఘర్షణ అయితే లేదు కదా అని ముందుగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నంబరువారీగా అయితే ఉన్నారు, మంచివారు కూడా ఉన్నారు, అలాగే ఘర్షణపడేవారు కూడా ఉన్నారు, వీరు ఇలాంటివారు అని తెలుసుకోవటము మంచిదే. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా అర్థం చేసుకోవాలి కానీ దానిని మనసులో పెట్టుకోకూడదు. అర్థం చేసుకోవటం వేరు, జ్ఞాన సంపన్నులుగా అవ్వటం మంచిదే, తప్పును తప్పనే అంటారు కదా! బాబా, వీళ్ళు ఎలాంటివాళ్ళో మీకు తెలియదు, చూస్తే మీకే తెలుస్తుంది అని కొంతమంది పిల్లలు అంటారు. దానిని బాబా ఒప్పుకుంటారు, మీరు చెప్పకముందే వారు అలాంటివారు అని బాబా ఒప్పుకుంటారు, కానీ అటువంటి విషయాలను మీ మనసులో, వృత్తిలో పెట్టుకుంటే స్వయము కూడా అలజడి చెందుతారు. చెడు విషయాలు ఒకవేళ మీ మనసులో, హృదయంలో ఉన్నట్లయితే, ఎవరిలో అయితే చెడు విషయాలు ఉంటాయో, అనవసరమైన ఆలోచనలు ఉంటాయో అటువంటివారు విశ్వ కళ్యాణకారులుగా ఎలా అవుతారు? మీ అందరి కర్తవ్యం ఏమిటి? మేము లండన్ కళ్యాణకారులము, ఢిల్లీ కళ్యాణకారులము, ఉత్తర ప్రదేశ్ కళ్యాణకారులము అని ఎవరైనా అంటారా? ఎక్కడ ఉన్నాగానీ, సరే, దేశం కాకపోతే సెంటరు కళ్యాణకారులా? విశ్వ కళ్యాణకారులము అనే అందరూ తమ కర్తవ్యమును గూర్చి తెలుపుతారు కదా. మరి అందరూ ఎవరు? విశ్వ కళ్యాణకారులేనా? విశ్వ కళ్యాణకారులైతే చేతులెత్తండి (అందరూ చేతులెత్తారు) విశ్వ కళ్యాణకారి! విశ్వ కళ్యాణకారి! మంచిది. అయితే మనసులో ఎటువంటి చెడు అయితే లేదు కదా? అర్థం చేసుకోవటం వేరే విషయం, ఇది ఒప్పు, ఇది తప్పు అని అర్థం చేసుకోండి, కానీ మనసులో కూర్చోబెట్టుకోకండి. మనసులో అటువంటి వృత్తిని పెట్టుకోవటం వలన దృష్టి, సృష్టి కూడా మారిపోతాయి.
బాప్‌దాదా హోమ్‌వర్క్ ఇచ్చారు - ఏమిచ్చారు? ఇది అన్నిటికన్నా సహజ పురుషార్థము, దీనిని అందరూ చెయ్యగలరు, మాతలు కూడా చెయ్యగలరు, ముసలివారు కూడా చెయ్యగలరు, యువత కూడా చెయ్యగలదు, పిల్లలు కూడా చెయ్యగలరు, దానికి విధి ఇదే, కేవలం ఒక్క పని చెయ్యండి, ఎవరి సంపర్కములోకి వచ్చినా - ‘‘ఆశీర్వాదాన్ని ఇవ్వండి మరియు ఆశీర్వాదాన్ని తీసుకోండి.’’ వారు శాపాన్ని ఇచ్చినాగానీ, మీరు కోర్సులో ఏమని చెప్తారు? నెగటివ్‌ను పాజిటివ్‌లోకి మార్చుకునే విషయం చెప్తారు, ఆ సమయంలో మీకు మీరే కోర్సు చేయించుకోండి. ఛాలెంజ్ ఏమిటి? ప్రకృతిని కూడా తమోగుణము నుండి సతోగుణం కలదిగా తయారుచెయ్యాల్సిందే అని మీరందరూ ఈ ఛాలెంజ్‌ను చేసారు కదా? ఈ ఛాలెంజ్ ఉంది కదా? ఉందా? ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేయాలి అని మీరందరూ ఛాలెంజ్ చేసారు. చెయ్యాలా? తల ఊపండి, చేతులూపండి, ఇతరులను చూసి ఊపకండి. మనస్ఫూర్తిగా ఊపాలి, ఎందుకంటే ఇప్పుడు సమయ ప్రమాణంగా వృత్తి ద్వారా వాయుమండలమును తయారుచేసే తీవ్ర పురుషార్థము యొక్క అవసరము ఉంది. కనుక ఒకవేళ వృత్తిలో ఏ కొంచెమైనా చెత్త ఉన్నట్లయితే వృత్తి ద్వారా వాయుమండలమును ఎలా తయారుచేస్తారు? ప్రకృతి వరకు మీ వైబ్రేషన్లే వెళ్తాయిగానీ వాణి(మాటలు) వెళ్ళదు. వైబ్రేషన్లు వెళ్తాయి, వృత్తి ద్వారా వైబ్రేషన్లు వెళ్తాయి మరియు వైబ్రేషన్ల ద్వారా వాయుమండలము తయారవుతుంది. మధువనములో కూడా అందరూ ఒకేవిధంగా అయితే ఉండరు. కానీ బ్రహ్మా బాబా మరియు అనన్య పిల్లల వృత్తి ద్వారా, తీవ్ర పురుషార్థము ద్వారా వాయుమండలము తయారైంది.
ఈరోజు మీ దాదీ గుర్తుకొస్తున్నారు, దాదీలో ఏ విశేషతను చూసారు? ఎలా కంట్రోల్ చేసారు? దాదీ ఎప్పుడూ ఎటువంటి వృత్తి కలిగినవారిలోని లోపాన్నీ తమ మనసులో పెట్టుకోలేదు. అందరికీ ఉల్లాసాన్ని కలిగించారు. మీ జగదంబ మాత వాయుమండలమును తయారుచేసారు. అన్నీ తెలిసికూడా తమ వృత్తిని సదా శుభమైనదిగా ఉంచుకున్నారు. ఆ వాయుమండలాన్ని మీరందరూ అనుభవము చేస్తున్నారు. ఫాలో ఫాదర్ చేసినాగానీ ప్రతి ఒక్కరిలోని విశేషతను తెలుసుకుని ఆ విశేషతను స్వయములో నింపుకోండి అని బాప్‌దాదా ఎల్లప్పుడు చెప్తుంటారు. పిల్లలు ప్రతి ఒక్కరిలోని విశేషతను నోట్ చేసుకోవాలి. బాప్‌దాదా సంతానంగా ఎవరైతే అయ్యారో, ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో, మూడవ నంబరులో ఉన్నవారైనాగానీ డ్రామా విశేషత ఏమిటంటే, బాప్‌దాదా వరదానము ఏమిటంటే, పిల్లలందరిలో, వారు 99 పొరపాట్లు చేసినాగానీ ఒక్క విశేషత అయినా తప్పకుండా ఉంటుంది. ఈ విశేషత ద్వారా నా బాబా అనేందుకు హక్కుదారులుగా అయ్యారు. పరవశులుగా ఉన్నాగానీ బాబాపై ప్రేమ అయితే తరగనంతగా ఉంది, కనుక బాప్‌దాదా ఇప్పుడు సమయ సమీపత అనుసారంగా, బాబా స్థానాలు ఏవైతే ఉన్నాయో, అది గ్రామంలో ఉన్నా, పెద్ద జోన్లో ఉన్నా, సెంటర్స్‌లో ఉన్నాగానీ ప్రతి ఒక్క స్థానంలో మరియు సహచరులలో శ్రేష్ఠ వృత్తితో కూడిన వాయుమండలము అవసరము అని చెప్తున్నారు. ఒక్క మాటను గుర్తుంచుకోండి, అంతే. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని శాపనార్ధాలు పెట్టినాగానీ, తీసుకునేవారు ఎవరు? ఇచ్చేవారు, తీసుకునేవారు ఒక్కరే అవుతారా లేక ఇద్దరవుతారా? ఒకవేళ ఎవరైనా మీకు ఏదైనా చెడిపోయిన వస్తువును ఇస్తే మీరేం చేస్తారు? మీవద్ద ఉంచుకుంటారా లేక తిరిగి ఇచ్చేస్తారా లేక విసిరేస్తారా లేక అలమారీలో జాగ్రత్తగా పెట్టుకుంటారా? కనుక ఆ చెడును మనసులో జాగ్రత్తగా పదిలపరుచుకోకండి ఎందుకంటే మీ మనసు బాప్‌దాదా హృదయ సింహాసనము, కనుక ఇప్పుడు ఒక్క మాటను మనసులో పక్కాగా గుర్తుంచుకోండి, నోటితో మాట్లడటం వరకు కాకుండా మనసులో గుర్తుంచుకోండి - ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఏ నెగటివ్ విషయాన్నీ మనసులో పెట్టుకోకండి. ఒక చెవితో వినటము, రెండో చెవితో వదిలేయటము మీ పనా లేక ఇతరుల పనా? అప్పుడే విశ్వములో, ఆత్మలలో తీవ్రగతితో కూడిన సేవ వృత్తి ద్వారా వాయుమండలమును తయారుచేసే సేవ చెయ్యగలరు. విశ్వ పరివర్తన చెయ్యాలి కదా! కనుక ఏం గుర్తుంచుకుంటారు? మనసులో గుర్తుంచుకున్నారా? ‘ఆశీర్వాదము’ అన్న మాటను గుర్తుంచుకోండి, అంతే. ఎందుకంటే మీ జడచిత్రాలు ఏమిస్తాయి? ఆశీర్వాదాన్ని ఇస్తాయి కదా! గుడికి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటారు? ఆశీర్వాదాన్ని కోరుకుంటారు కదా! ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టే ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. మీ జడచిత్రాలు చివరి జన్మలో కూడా ఆశీర్వాదాలను ఇస్తుంటాయి, వృత్తి ద్వారా వారి కోరికలను పూర్తి చేస్తాయి. మీరు పదే పదే అటువంటి ఆశీర్వాదాలను ఇచ్చేవారిగా అయ్యారు కనుకనే మీ చిత్రాలు కూడా ఇప్పటివరకు ఆశీర్వాదాలను ఇస్తుంటాయి. పరవశ ఆత్మలకు క్షమాసాగరుని పిల్లలు క్షమను ఇస్తే అది కూడా మంచిదే కదా! మరి మీరందరూ మాస్టర్ క్షమా సాగరులా? అవునా, కాదా? మాస్టర్ క్షమాసాగరులే కదా! ఇందులో ‘మొదట నేను’ అని అనండి. ఇందులో అర్జునులుగా అవ్వండి. ఎటువంటి వాయుమండలమును తయారుచెయ్యాలంటే మీ ఎదురుగా ఎవరు వచ్చినాగానీ వారు స్నేహాన్నిగానీ, సహయోగాన్నిగానీ ఏదో ఒకటి తీసుకునే వెళ్ళాలి. క్షమను అనుభవము చెయ్యాలి, ధైర్యాన్ని అనుభవము చెయ్యాలి, సహయోగాన్ని అనుభవము చెయ్యాలి, ఉల్లాస-ఉత్సాహాలను అనుభవము చెయ్యాలి. ఇలా వీలవుతుందా? వీలవుతుందా? మొదటి వరుసలోని వారికి వీలవుతుందా? చేతులెత్తండి. ముందు చెయ్యాల్సివస్తుంది. మరి అందరూ చేస్తారా? టీచర్లు చేస్తారా?
ఇప్పుడు చివరి టర్నుకు 15 రోజులు మిగిలి ఉన్నాయి, సరేనా! మధుబనంలో అయితే సహాయం ఉంది, మీరందరూ ఎంతమందైతే ఉన్నారో, ఎక్కడి వారైనా కావచ్చు, ఈ 15 రోజులు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి మరియు ఆశీర్వాదాన్ని తీసుకుకోవాలి అన్నది ప్రాక్టీస్ చెయ్యండి. సరేనా? ఈ హోమ్‌వర్కు బాగుందా? చేస్తారా? మంచిది. మధుబన్ వారికి సీట్ చాలా మంచిది లభించింది, సీట్ మంచిది తీసుకున్నారు, మధుబన్ వారు తెలివైనవారు, మంచి సీట్‌ను పట్టుకున్నారు. ఇప్పుడు నంబర్‌వన్ సీటును కూడా తీసుకోండి. మధుబన్ నివాసిగా అవ్వడము భాగ్యానికి గుర్తు. ఇప్పుడు అందరూ ఎక్కడివారు? లండన్ వారు కావచ్చు, అమెరికా వారు కావచ్చు, అందరూ మధుబన్ వారే. ఇప్పుడైతే మధుబన్ వారే కదా? ఎంత బాగుంది! ఇప్పుడు అందరూ మధుబన్ నివాసులు. మరి 15 రోజుల తర్వాత బాప్‌దాదా రిజల్టును తీసుకుంటారు, సరేనా? వెనుకవారు, సరేనా? పైన గ్యాలరీలో కూడా కూర్చున్నారు, గ్యాలరీలోని వారు, సరేనా? అచ్ఛా. ఇప్పుడు విశ్వానికి చాలా అవసరము. మీరు నివారణ మూర్తులుగా అవ్వండి. మీరు నివారణ మూర్తులుగా అయినప్పుడు ఆత్మలు నిర్వాణంలోకి వెళ్ళగలవు. ఒకవేళ మీరు నివారణమూర్తులుగా అవ్వకపోతే ఆత్మలు నిర్వాణంలోకి వెళ్ళలేవు. నిర్వాణ ద్వారాలు మీరే తెరవాలి. బాబాతో కలిసి గేటును తెరుస్తారు కదా! గేట్ సెరిమనీ (వేడుక)ను జరుపుతారు కదా? ఇప్పుడు పరస్పరం మాట్లాడుకుని డేట్ తయారు చేయండి. బాప్‌దాదా అన్ని మీటింగులను వింటూ ఉంటారు. బాప్‌దాదాకు ఏముంది, స్విచ్ ఆన్ చేస్తారు, వింటారు. వినాలనుకుంటే, ఒకేసారి, అన్ని జోన్లు, అన్ని దేశాల సమాచారాన్ని బాబా వినగలరు. ఇప్పుడు బేహద్దులోకి రండి. కొద్దిమంది పిల్లలు కొంచెం ఎక్కువగానే గంభీరంగా ఉంటారు, గంభీరత మంచిదే కానీ ఎక్కువ గంభీరంగా ఉంటే సీరియస్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. సీరియస్‌గా ఉండటం ఎవ్వరికీ నచ్చదు. గంభీరంగా ఉండండి కానీ లోపల గంభీరంగా ఉండండి, బయట ముఖము చిరునవ్వుతో ఉండాలి. చిరునవ్వుతో ఉన్న ముఖము అందరికీ నచ్చుతుంది. ఎక్కువ గంభీరంగా ఉన్న ముఖము పెట్టుకుని ఉంటే అలాంటివారిని చూసి అందరూ భయపడతారు, దూరంగా పారిపోతారు. సహయోగిగా అవ్వరు. బ్రహ్మా బాబా చిరునవ్వు, జగదాంబ చిరునవ్వు, మీ దాదీ చిరునవ్వు, గుర్తుంది కదా! డబల్ విదేశీయులకు కూడా చిరునవ్వుతో ఉన్న దాదీ అంటే చాలా ఇష్టము కదా! చేతులూపుతున్నారు. నవ్వడం కాదు, చిరునవ్వు. గట్టిగా నవ్వకండి, చిరునవ్వుతో ఉండండి ఎందుకంటే బాప్‌దాదాకు ఇప్పుడు తీవ్ర పురుషార్థము కావాలి. ఎందుకని? ఎందుకంటే బహుకాలపు అభ్యాసము ఆవశ్యకము అని బాప్‌దాదా చూసారు. ఒకవేళ అంతిమంలో తీవ్ర పురుషార్థము చేస్తే అది బహుకాలములో జమ అవ్వదు. ఒకవేళ బహుకాలములో మీది జమ అవ్వకపోతే 21 జన్మల బహుకాలపు మీ అధికారము కూడా తగ్గిపోతుంది. ఒక్కరి అధికారము కూడా తగ్గకూడదు అని బాప్‌దాదా ఆశిస్తున్నారు. నా బాబా అన్నప్పుడు, నా బాబా అని పలికే పిల్లల అధికారము తగ్గకూడదు ఎందుకంటే బాప్‌దాదాకు వారు చివరి సంతానం కావచ్చు చివరలో ఉన్నారని బాబాకు తెలుసు, కానీ వారిని బాబా ఎప్పుడూ చివరి సంతానము అని మురళిలో చెప్పలేదు. మధురాతి మధురమైన పిల్లలు అనే అంటారు. చేదు పిల్లలకు కాక మధురమైన పిల్లలకు మాత్రమే ప్రియస్మృతులు అని ఎప్పుడైనా బాబా చెప్పారా? వీరు చివరి సంతానము అని తెలుసు, అయినా కానీ మధురాతి మధురమైన పిల్లలు అనే అంటారు, చేదు పిల్లలు అనరు. మరి బాబా సమానంగా అవ్వాలి కదా! మీ లక్ష్యము ఏమిటి అని అడిగినప్పుడు, బాబా సమానంగా అవ్వాలి అని అంటారు, లాస్ట్ నంబరు వారు కూడా ఇదే చెప్తారు, ఇది విని బాప్‌దాదాకు సంతోషంగా ఉంటుంది. లక్ష్యమైతే ఉన్నతంగా పెట్టుకున్నారు కాబట్టి లక్షణాలు వస్తూ ఉంటాయి. బహుకాలాన్ని తప్పకుండా జమ చేసుకోవాలి. మాకైతే బహుకాలము అన్న మాట గుర్తుకు లేదు అని ఫిర్యాదు చేయకండి. 63 జన్మల బహుకాలపు ప్రభావాన్ని ఇప్పటికీ చూస్తున్నాము. అనుకోలేదు కానీ జరిగిపోయింది, ఇదేమిటి? బహుకాలము యొక్క ప్రభావము. అందుకని ప్రతి ఒక్క ప్రియాతి ప్రియమైన సంతానానికి బాప్‌దాదా ఇదే చెప్తున్నారు – తీవ్ర పురుషార్థీ భవ! హోమ్‌వర్కును గుర్తుంచుకోండి, 15 రోజుల తర్వాత రిజల్టును అడుగుతాము. 15 రోజులలో సంస్కారం తయారవుతుంది కదా! ఇక ముందు కూడా జరుగుతుంది. ఇక్కడైతే వాయుమండలం యొక్క సహకారం ఉంది. మధుబన్ వారందరూ డ్యూటీలో ఉన్నారా లేక ఏ జోన్ టర్ను ఉందో వారే డ్యూటీలో ఉండి మిగతా అందరూ ఫ్రీగా ఉన్నారా! మరి ఏమి చేస్తారు? దాదీ (దాదీ జానకి గారితో) చెప్పండి, ఏమి చేస్తారు? చేసి చూపిస్తారా? చేసి చూపించాల్సిందే. (బాబా, తప్పకుండా మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తాము) ముందు మిమ్మల్ని ప్రత్యక్షం చేసుకోండి అప్పుడు బాబా ప్రత్యక్షమవుతారు. ఎందుకంటే మీ ద్వారా జరుగనుంది కదా! మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రత్యక్షం చేసుకుంటారు అని బాబా అడుగుతున్నారు. మీ ద్వారా బాబా ప్రత్యక్షమైపోతారు. ఉల్లాసము ఉందా? ఎంత ఉల్లాసము ఉంది? చాలా ఉల్లాసము ఉందా? అందరికీ ఎంతెంత ఉల్లాసము ఉందో అంతగా బాప్‌దాదా పదమ పదమ పదమారెట్లు ఇన్ అడ్వాన్స్ అభినందనలు చెప్తున్నారు. అచ్ఛా!
అన్నిచోట్ల నుండి పిల్లల ఈ-మెయిల్స్, ఉత్తరాలు అయితే వస్తూనే ఉంటాయి. ఎవరైతే ఉత్తరాలు వ్రాయకుండా కేవలం సంకల్పము చేసారో అటువంటివారి ప్రియస్మృతులు కూడా బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. ఉత్తరాలనైతే చాలా మధురాతి మధురంగా వ్రాస్తారు. ఉత్తరాలు ఎలా వ్రాస్తారంటే వీరు ఉల్లాస-ఉత్సాహాలలో ఎగురుతూ ఉన్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. అయినాకూడా మంచిది, ఉత్తరం వ్రాయటం వలన స్వయమును బంధనములో బంధించుకుంటారు, ప్రమాణము చేస్తారు కదా! మరి నలువైపుల ఉన్న, చూస్తున్నవారు, వింటున్నవారు అందరికీ సమ్ముఖంలోని వారికంటే ముందుగానే ప్రియస్మృతులను ఇస్తున్నాము ఎందుకంటే ఒక్కోచోట ఒక్కో సమయము ఉంటుంది, అయినాగానీ అందరూ చాలా ఉత్సాహంతో కూర్చుని ఉన్నారు, బాబా స్మృతిలో వింటున్నారు కూడా, అచ్ఛా!
సేవ టర్ను – యు.పి మరియు ఇండోర్ జోన్ వారిది:- (ఎదురుగా టీచర్లు నిల్చుని ఉన్నారు) వీరంతా టీచర్లు. రెండు స్థానాల టీచర్లు ఉన్నారు. మంచిది. బాప్‌దాదాకు టీచర్లపై కూడా గర్వంగా ఉంటుంది ఎందుకంటే ధైర్యమును ఉంచి సరెండర్ అయ్యి పూర్తి జీవితాన్ని సేవ కోసమే జీవించాలని సంకల్పం చేసారు. టీచర్లు పక్కాగా ఉన్నారు కదా? పక్కాగా ఉన్నారా లేక కొంచెం కచ్చా కచ్చాగా ఉన్నారా? టీచర్లు కచ్చాగా ఉండకూడదు. టీచర్స్ అంటే తమ ఫీచర్ల ద్వారా ఫ్యూచర్‌ను చూపించేవారు. సంగమయుగ ఫ్యూచర్ – ఫరిశ్తా భవ. భవిష్య ఫీచర్లు – దేవతా భవ. ఏ సేవాధారి గ్రూపు అయితే వచ్చిందో, వారికి డబల్ నషా ఉంది, మేము ఫరిశ్తా సో దేవతగా అవ్వవలసిందే అని! అందరూ పక్కాగా ఉన్నారా? చూడండి, మీ ఫోటో తీస్తున్నారు, ఫోటోలో కనిపించకుండా ఉండటం కాదు, పక్కాగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కడన్నా కొంత అలజడి జరిగితే కొందరు చాలా త్వరగా గాభరా పడిపోతారు. గుహ్యతలోకి వెళ్ళడం లేదు, గాభరా పడుతున్నారు. ఒకవేళ గుహ్యతలోకి వెళితే, ఎప్పుడు ఎంత పెద్ద అలజడి తెచ్చే పేపరు అయినా కానీ లేక విషయమైనా కానీ గుహ్యతలోకి వెళ్ళేవారు, సముద్రం ఉంది కదా, సముద్ర గుహ్యతలోకి వెళ్ళేవారు చాలా సంపదను తీసుకు వస్తారు. పై పైన ఉండేవారు కాదు, పైపైన ఉండేవారికి చేపలు దొరుకుతాయి, లోతుల్లోకి వెళ్ళే వారు చాలా విలువైన వస్తువులను తీసుకు వస్తారు. అలాగే ఇక్కడ కూడా, ఏదైనా విషయం జరిగితే, విషయాలైతే వస్తాయి, విషయాలు రావు అని బాప్‌దాదా చెప్పడం లేదు – ఎంత ముందుకు వెళ్తారో అంతగా సూక్ష్మ విషయాలు వస్తాయి, ఎందుకంటే పాస్ విత్ ఆనర్‌గా అవ్వాలి కదా. టీచర్లు ఏమి ఆలోచించారు? పాస్ విత్ ఆనర్‌గా అవ్వాలా లేక 33 మార్కులతో పాస్ అవ్వాలా? పాస్ విత్ ఆనర్ అవ్వాలంటే చేయి ఎత్తండి. వీరి ఫోటో మంచిగా తీయండి. మంచిది. కావున అలజడిలో గాభరా పడకండి. బాప్‌దాదాను ఆ సమయంలో మర్చిపోతారు, ఒంటరిగా అయిపోతారు కదా అందుకని చిన్న విషయము కూడా పెద్దదిగా అనిపిస్తుంది. బాప్‌దాదా కంబైండ్‌గా ఉన్నారు, కంబైండ్‌గా పెట్టుకోండి, అనుభవం చేయండి, అప్పుడు చూడండి, పర్వతం కూడా దూది పింజలా అనిపిస్తుంది. ఏదీ పెద్ద విషయము కాదు. ఎన్ని సార్లు పాస్ అయ్యారు, ఎన్ని కల్పాలు పాస్ అయ్యారు, తెలుసా? నషా ఉందా? అనేక సార్లు నేనే పాస్ అయ్యాను, ఇప్పుడు రిపీట్ చెయ్యాలి. క్రొత్త విషయమేమీ కాదు, కేవలం రిపీట్ చెయ్యాలి అని స్మృతిలో పెట్టుకోండి. మరి ఇండోర్ మరియు యు.పికైతే సాకార మమ్మా బాబాల పాలన ఎంతో లభించింది. యు.పి అయితే అద్భుతం చేసి చూపించాలి. సాకార బాబా ప్రేరణతో సెంటరు తెరిచిన విశేషత ఇండోర్ది. అంతే కదా? ఇద్దరి విశేషత ఉంది, కనుక ఇద్దరూ అద్భుతాన్ని చేయండి. ఇటువంటి వాయుమండలాన్ని తయారు చేయండి. ఎవరికైనా పరిచయం ఇచ్చేటప్పుడు ఏమని చెప్తారు? మధుబన్కు వచ్చి చూడండి అని చెప్తారు కదా! ఇప్పుడు మీ జోన్‌ను, మీ స్థానాన్ని ఎలా తయారు చేయాలంటే, ఇండోర్‌కి వెళ్ళి చూడండి, యు.పికి వెళ్ళి చూడండి అనాలి. సరేనా? ఇష్టమేనా? వీలవ్వనిది ఏమైనా ఉందా? మాస్టర్ సర్వశక్తిమంతులైన మీ సంకల్పాలలో ఎంతో శక్తి ఉంది, ఏది కావాలంటే అది చేయగలరు. కేవలం దృఢత కావాలి. దృఢత అనే తాళం చెవిని అప్పుడప్పుడు మాయ దొంగతనం చేసేస్తుంది. ఈ తాళం చెవిని సదా ఉపయోగిస్తూ ఉండండి. కేవలం సంభాళించి పెట్టుకున్నాను, బుద్ధిలో ఉంది, తాళం చెవి ఉంటే సరిపోదు, సమయానికి ఉపయోగించండి. సమయం గడిచిపోయిన తర్వాత ఏమని చెప్తారు, ఇలా చెయ్యాల్సింది, ఇలా చెయ్యాల్సింది అంటారు. ఇలా అనకండి. సమయానికి చేయండి. అప్పుడు జోన్ నంబర్‌వన్ అయిపోతుంది. నంబర్‌వన్‌గా అవ్వాల్సిందే అన్న అందరి లక్ష్యము మంచిగా ఉంది. అందరికీ ఇదే లక్ష్యము ఉంది కదా లేక ఏ నంబరు లభించినా ఫర్వాలేదా! బాప్‌దాదాకు ప్రతి జోన్‌పై ఎంతో ప్రేమ ఉంది, ఎందుకంటే ప్రతి జోన్లో ఏదో ఒక విశేషత ఉంది, కానీ ఇప్పుడు ఆ విశేషత ప్రత్యేకంగా ప్రత్యక్షం కాలేదు. అయ్యేదే ఉంది. అవ్వాలి అనకండి, జరిగే ఉంది, కేవలం రిపీట్ చెయ్యండి. అందరూ సంతోషంగా ఉన్నారా? అప్పుడప్పుడూ సంతోషాన్ని పోగొట్టుకోవడం లేదు కదా? సంతోషం పోతే జీవితం పోయినట్లే. నీరస జీవితంలో ఎటువంటి మజా లేదు. మంచిది, ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించండి. ఏదైనా నవీనతను తీసుకురండి అని బాప్‌దాదా అన్ని జోన్లకు చెప్పారు. ఇప్పుడింకా నవీనతను చూపించలేదు. పెద్ద ప్రోగ్రాములు చేయడం, వర్గీకరణ ప్రోగ్రాములు చేయడం, ఇవైతే జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా నవీనతను చేయండి. ఇందులో ఏ జోన్ ముందు ఉంటుందో చూస్తాము, విదేశం వెళ్తుందా లేక దేశం వెళ్తుందా చూస్తాము. అందరూ కాపీ చేసేలా నవీనతను చేయండి. ఎవరు చేస్తారో చూస్తాము. చేయవలసిందే. అచ్ఛా. చాలా మంచి ఛాన్సును తీసుకున్నారు. ఎవరైతే ప్రతి విశేషతలో ఛాన్సును తీసుకుంటారో వారు ఛాన్సలర్లుగా అవుతారు అని బాప్‌దాదా అంటారు. యజ్ఞ సేవ చేసినందుకు పుణ్యాన్ని జమ చేసుకున్నారు, ఇది చాలా పెద్ద పుణ్యము జమ అయింది ఎందుకంటే ఇక్కడ వాయుమండలం మరియు నిశ్చింత స్థితి యొక్క సహాయం ఉన్నాయి, ఎటువంటి బాధ్యతల చింత లేదు, ఏ డ్యూటీ లభిస్తుందో అదే చేయాలి, అంతే. మరి రెండు జోన్లు చాలా చాలా సంపాదనను జమ చేసుకున్నాయా? కొద్దిగా చేసుకోలేదు కదా? చాలా చేసుకున్నారా? అచ్ఛా!
96 దేశాల నుండి 900మంది విదేశీ సోదర సోదరీలు వచ్చారు:- విదేశీయులు తమ సంఖ్యను పెంచుకోవడంలో మంచి రికార్డును చూపిస్తున్నారు. ఒక వైపు సంఖ్యను పెంచుతున్నారు, మరో వైపు ఏరియాను సంపన్నంగా చేసే ఉల్లాసం కూడా బాగుంది. మెజారిటీ అన్ని వైపుల వారికి ఇప్పుడు ఉత్సాహంగా ఉందన్న విషయాన్ని బాప్‌దాదా విన్నారు, ప్రతి ఒక్కరూ తమ తమ ఏరియాను పరిశీలించి సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని తయారు చేస్తున్నారు. భిన్న భిన్న విధులతో చేస్తున్నారు కానీ ఏది చేసినా మంచిగా చేస్తున్నారు. మీకున్న ఫిర్యాదు తొలగించుకుంటున్నారు. ఈ ఉల్లాస ఉత్సాహాలు స్వయాన్ని కూడా ఎగిరేలా చేస్తాయి, ఇతరులకు కూడా సంతోషపు అలను వ్యాపింపజేస్తాయి. మునిగిపోతున్న వారికి ఆకు ఆధారం లభించినా, గడ్డిపరక ఆధారం లభించినా గట్టెక్కుతారు అంటారు కదా, అలా దుఃఖి ఆత్మలకు ఆధారం లభిస్తుంది. వారి మనసు నుండి వచ్చే ఆశీర్వాదాలు మీ పుణ్య ఖాతాలో జమ అవుతాయి. ఇది గుహ్యమైన లెక్క. ఎంతమందికి ఏ ప్రాప్తి అయితే లభిస్తుందో, మీ ఖాతాలో ఆ ప్రాప్తి జమ అవుతుంది. ఇకపోతే, మీటింగ్ సమాచారము కూడా మంచిగా విన్నాము, మంచి అటెన్షన్ ఇస్తున్నారు. మీ స్థితి కోసం కూడా మంచి అవకాశాన్ని తీసుకుంటున్నారు, సేవా ప్రోగ్రాములో కూడా భవిష్య ప్రోగ్రామును మంచిగా తయారు చేస్తున్నారు. స్నేహి మరియు సహయోగిగా ఎవరైతే ఉన్నారో వారిని సమీపంగా తీసుకురావాలన్న ఉత్సాహం మంచిగా ఉంది. ఇది భారత దేశం వారు కూడా చేస్తున్నారు, కానీ ఫారెన్ వారు కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు, మెజారిటీ, ఎక్కడెక్కడ అయితే సేవ చేసారో, వి.ఐ.పీలుగానీ, సాధారణమైనవారు కానీ, ఇక్కడ మంచిగా లభిస్తుంది అనైతే భావిస్తున్నారు. కొంత నవీనత ఉంది అంటున్నారు. ఈ వాతావరణంలో మునుపటికన్నా చాలా మార్పు వచ్చింది. మొదట్లో పిలిస్తే ఎంతో కష్టంగా వచ్చేవారు, ఇప్పుడైతే మాకు అవకాశం ఇవ్వండి అని వారే మీ వద్దకు వస్తున్నారు, తేడా వచ్చింది కదా. విదేశాల సేవను చూసి కూడా బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అయితే స్వ సేవ గురించి ఏమని వినిపించాము? తీవ్ర పురుషార్థి, అందరూ పురుషార్థులే, కానీ తీవ్ర పురుషార్థీగా అవ్వడము, ఏది ఆలోచిస్తే అది చేయడము, బాబా చెబితే వెంటనే పిల్లలు చేయాలి. ఇదే మీ జగదాంబ యొక్క యుక్తి, నంబర్‌వన్ అయిపోయారు. రాత్రి సమయంలో మరియు నడుస్తూ తిరుగుతూ కూడా పరిశీలించుకోండి – ఏది ఆలోచించమని, నడుచుకోమని, ఆలోచించమని బాబా చెప్పారో, నేను అదే చేస్తున్నానా? బాబా చెప్పింది చేయవలసిందే. ఇకపోతే వృద్ధి కూడా ఉంది, అటెన్షన్ కూడా ఉంది. ప్రోగ్రాములు కూడా మంచిగా ఉన్నాయి. డబల్ అభినందనలు. అచ్ఛా!
భిన్న భిన్న వర్గాలవారు కూడా వచ్చారు, బాప్‌దాదాకు తెలుసు, తమ తమ మీటింగులు చేసుకుంటున్నారు. ఏ వర్గం వారైతే వచ్చారో, ప్లాన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఎప్పుడు మీటింగ్ చేసినా కానీ స్వ మరియు సేవ రెండింటి బ్యాలెన్సు పెట్టి ఒకరికొకరు సేవా ఉల్లాసాన్ని కూడా ఇవ్వడాన్ని జత చేయండి. సేవతోపాటు స్వ ఉన్నతి యొక్క ఉల్లాస ఉత్సాహాలను కూడా ఇవ్వండి. బ్యాలెన్సు ఉంచండి. డబల్ చేస్తే డబల్ బ్లెసింగ్స్ లభిస్తాయి. ఇలా చేస్తే ఆటోమేటిక్‌గా బ్లెసింగ్స్ లభిస్తాయి. ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్‌గా లభిస్తూ ఉంటాయి. స్వ ఉన్నతి యొక్క సమాచారాన్ని బాప్‌దాదా చూసారు (స్పార్క్ మీటింగ్ సమాచారాన్ని రమేష్ అన్నయ్య వ్రాసి సందేశి ద్వారా బాప్‌దాదా వద్దకు పంపారు) రమేష్ ఏదైతే చేస్తున్నారో, అందులో స్వ ఉన్నతి గురించి వ్రాసారు, దానిపై పదే పదే అటెన్షన్ ఇప్పించండి. ఎలా అయితే సేవలో ప్రాక్టికల్‌గా చేస్తున్నారో, అలా స్వ ఉన్నతిలో కూడా ప్రాక్టికల్‌గా చేసారా లేదా అన్నది చార్టు పెట్టండి. సమాచారము లభించింది, ఆలోచన బాగుంది. ఎవరెవరైతే మీటింగ్ చేసారో, వారందరి సమాచారము బాబా వద్దకు చేరుకుంది. ఇప్పటి వరకు వర్గంవారు బాప్‌దాదాకు ఒక విషయంలో రెస్పాంస్ ఇవ్వలేదు, గుర్తుందా? ఏ విషయంలో రెస్పాంస్ ఇవ్వలేదు? ప్రతి వర్గంలో విశేషంగా ఒక్కొక్క స్నేహి కూడా ఉన్నారు, సహయోగి కూడా ఉన్నారు, వి.ఐ.పీలు కూడా ఉన్నారు, మైక్ కూడా ఉన్నారు, సహజయోగంపై ఆసక్తి చూపేవారూ ఉన్నారు, ఇలా ప్రతి వర్గం నుండి ఒక్కొక్క గ్రూపు బాబా ముందుకు రావాలి, అన్ని వర్గాలు, ఒక్క వర్గం కాదు, ఒకసారి ఐ.పీలు వస్తారు, వి.ఐ.పీలు వస్తారు, వెల్కమ్. కానీ ఒకే సమయంలో ప్రతి వర్గం నుండి ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్న గ్రూపును బాప్‌దాదా చూడాలనుకుంటున్నారు. ఐ.పీల గ్రూపు వస్తూ ఉంటుంది, వర్గీకరణ నుండి విశేషమైన మైక్ రావాలి, మీరు సకాశ్ ఇవ్వండి, వారు స్పీకర్ అవుతారు. మీరు మైట్ అయితే వారు మైక్. ఇది కూడా చేసి చూపించండి. ఫారెన్ వారైతే ప్రోగ్రాము చేస్తారు, అందులో వస్తారు. కాల్ ఆఫ్ టైమ్ చేసారు, అందులో కూడా ఐ.పీలు వస్తారు. ఇది వర్గీకరణ ఆధారంగా మైక్ తీసుకురమ్మని బాబా చెప్తున్నారు. దీనిపై శ్రద్ధ పెట్టండి. (ఇలా ప్రతి వర్గంలో భారతదేశంలో తయారుగా ఉన్నారు, బాప్‌దాదా వారిని కలిసే డేట్‌ను ఇవ్వండి) ఇప్పుడు అన్ని వర్గాల నుండి మైక్ రావాలి, అటువంటి గ్రూపును తీసుకురండి, అందుకోసం సమయాన్ని ఇస్తాము. అచ్ఛా!
తీవ్ర పురుషార్థము చేసి నంబరువన్‌గా అవ్వాల్సిందే అని అందరూ సంకల్పము చేసారు. చేసారా? చేతులెత్తండి. అచ్ఛా, ఇప్పుడు టీచర్లు చేతులెత్తుతున్నారు. ముందు వరుసలోని వారైతే చేసే ఉన్నారు కదా. మంచిది. మొత్తము రోజంతటిలో మధ్య మధ్యలో 5 నిమిషాలు సమయము లభించినాగానీ ఆ సమయములో మనసు ఎక్సర్సైజ్ను చెయ్యండి అని బాప్‌దాదా ఈ డైరెక్షన్‌ను కూడా ఇచ్చి ఉన్నారు ఎందుకంటే ఇప్పటి ప్రపంచము ఎక్సర్సైజ్లు చేసే ప్రపంచము. కనుక 5 నిమిషాలలో మనసు ఎక్సర్సైజ్ను చెయ్యండి, మనసును పరంధామము వరకు తీసుకువెళ్ళండి, సూక్ష్మవతనములో ఫరిశ్తాతనాన్ని గుర్తు చేసుకోండి, తరువాత మరల మీ పూజ్యరూపాన్ని గుర్తు చేసుకోండి, తరువాత బ్రాహ్మణ రూపాన్ని గుర్తు చేసుకోండి, తరువాత దేవతా రూపాన్ని గుర్తు చేసుకోండి. ఎన్నయ్యాయి? ఐదు. 5 నిమిషాలలో 5 రూపాలు, ఈ ఎక్సర్సైజ్ను చెయ్యండి. మొత్తము రోజంతటిలో నడుస్తూ, తిరుగుతూ కూడా దీనిని చెయ్యగలరు. ఇందుకొరకు మైదానమేమీ అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు, కుర్చీ అవసరం లేదు, సీట్ అవసరం లేదు, మెషిన్ అవసరం లేదు. శరీరానికి అవసరమైన ఎక్సర్సైజ్లనయితే చెయ్యండి, వాటిని వద్దనటం లేదు. కానీ ఈ మనసు డ్రిల్, ఎక్సర్సైజ్ మనసును సదా సంతోషంలో ఉంచుతుంది. ఉల్లాస-ఉత్సాహాలలో ఉంచుతుంది, ఎగిరే కళను అనుభవము చేయిస్తుంది. కనుక ఇప్పుడిప్పుడే ఈ డ్రిల్‌ను అందరూ ప్రారంభించండి - పరంధామము నుండి దేవత వరకు (బాప్‌దాదా డ్రిల్ చేయించారు) అచ్ఛా!
నలు వైపుల తమ వృత్తి ద్వారా ఆత్మిక శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేసే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా తమ స్థానాన్ని మరియు స్థితిని శక్తిశాలి వైబ్రేషన్లలో అనుభవం చేయించే దృఢ సంకల్పం కల శ్రేష్ఠాత్మలకు, సదా ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే దయా హృదయ ఆత్మలకు, సదా స్వయం ఎగిరే కళను అనుభవం చేసుకునే డబల్ లైట్ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- మీ సంగఠన అందరికీ సకాశ్ను ఇస్తుంది. ఇస్తుంది కదా? ఎందుకంటే ఎంతైనా అనుభవీలు కదా! అనుభవీల ప్రభావం ఎక్కువ పడుతుంది. ఆది నుండి మీ అందరి ఆత్మలలో బాబా మరియు మమ్మా అనుభవీమూర్తులుగా అయ్యే సంస్కారాన్ని నింపారు. నింపారు కదా? బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు. బాగుంది, బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉన్నాగానీ యజ్ఞానికి అలంకారము మీరు. (దాదీ శాంతమణిని చూస్తూ) పరుగులు పెట్టే సేవలు చేయకపోయినా కానీ మీ అందరినీ చూసి, మీ హాజరు కూడా అందరికీ బలాన్ని ఇస్తుంది.ఆది రత్నాలు కదా! ఆది సంస్కారాలు పవర్ఫుల్, ఆది భట్టీ అందరికీ గుర్తుంది కదా! ఆ సాకార పాలనను అందరూ గుర్తు చేసుకుంటారు. అచ్ఛా!
మోహిని అక్కయ్య దాదీగారి స్మృతిని బాప్‌దాదాకు అందించారు:- బాప్‌దాదా కూడా చాలా చాలా స్మృతిని ఇస్తున్నారు. కేవలం బాబాకే కాదు, అందరికీ స్మృతి ఉంది. బాబా కూడా స్మృతి చేస్తారు. ఎలా అయితే బ్రహ్మా బాబా ఒక ఉదాహరణగా నిలిచారో, అలాగే దాదీ కూడా ఒక ఉదాహరణగా ఉన్నారు. అకస్మాత్తు పాఠాన్ని చాలా సహజం చేసేసారు. బ్రహ్మా బాబా యజ్ఞాన్ని రచించారు, కానీ దాదీ అయితే బ్రహ్మా బాబా కన్నా ఎక్కువ సమయం యజ్ఞాన్ని సంభాళించారు. అందుకే అందరి మనసులలో దాదీ స్మృతి ఉంది. ఎందుకంటే వారి గుణాలు, వారి ముఖము, వారి నడవడిక విశేషమైనవి, అందుకే అందరి మనసులలో విశేష స్మృతి ఉండనే ఉంది. ఇప్పుడు అందరూ యోగం చేసారు కదా, ఇది ప్రేమకు గుర్తు. ఇప్పుడు ఇంకా బాగా గుర్తు చేస్తే దాదీ మధుబన్కు వచ్చేస్తారు. వారు ఆక్సిజన్ ఇస్తారు కదా, వెంటిలేటరుపై ఉంచుతారు కదా, వారిది సైన్సు శక్తి, మీది సైలెన్సు శక్తి, ఇది తక్కువేమీ కాదు. ఇంకా యోగం చేయండి, పవర్ఫుల్ యోగము. చూడండి, మీ యోగంతో డాక్టర్లకు టచింగ్ వచ్చింది, ఏదో ఒక విధినైతే మార్చారు కదా. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా చేస్తున్నారు, మీ అందరి దృఢ సంకల్పంతో విధి కూడా వెలువడుతుంది. సరేనా! ఇంకా యోగం చేయండి, యోగాన్ని తగ్గించకండి. అచ్ఛా! సేవాధారులు ఎవరైతే ఉన్నారో, మున్ని, యోగిని, గుప్తా మరియు కుమారీలు అందరూ మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నారు, బాప్‌దాదా మనస్ఫూర్తిగా వీరు చేస్తున్న శ్రమను చూసి సంతోషిస్తున్నారు, మీ శ్రమ తప్పకుండా తన రూపాన్ని చూపిస్తుంది.
నిర్వైర్ అన్నయ్య అందరి స్మృతిని అందించారు:- అందరి మనసు ఇక్కడ ఉంది, తనువు అక్కడ ఉంది. (దాదీ లేచి నడవాలి, తిరగాలి అన్నదే అందరి సంకల్పము) జరగాల్సిందే. మంచిది.
బృజ్ మోహన్ అన్నయ్యతో:- ఢిల్లీలో ఏదైనా క్రొత్త సేవా ఆవిష్కరణ చేయండి, అది చిన్నవారు పెద్దవారు అందరూ చేసే విధంగా ఉండాలి.
విదేశీ ముఖ్య సోదరీలతో:- చాలా బాగుంది, విదేశాలకు అనుభవీ ఆత్మలు ఉన్న కారణంగా మంచిగా వృద్ధి జరుగుతుంది ఎందుకంటే మీలో బాబా యొక్క డైరెక్టు పాలనా బీజము ఏదైతే ఉందో, ఆ బీజము ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు సేవా వృద్ధి మరియు ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతున్నాయి. మొదట్లో ఏదైతే నాజూకుతనము ఉండిందో ఇప్పుడు ఆ నాజూకుతనము లేదు. ఆ కల్చర్ సమాప్తమైపోయింది. ఎందుకంటే మీరు ఉదాహరణగా ఉన్నారు కదా, మీ ఉదాహరణను చూసి ఏమి చెయ్యాలి అన్నది అర్థం చేసుకున్నారు. ప్లాన్ అయితే బాగా తయారు చేసారు. గ్రూపులుగా తయారు చేసి వారి అనుసారంగా ట్రైనింగ్ ఏదైతే ఇస్తున్నారో, ఇది చాలా బాగుంది. టీచర్లు కూడా రిఫ్రెష్ అవుతారు, వచ్చేవారు కూడా రిఫ్రెష్ అవుతారు. ఏ డిపార్టుమెంటుకు ఏమి కావాలో అది లభిస్తుంది, ఇది బాగుంది. అటెన్షన్ ఇప్పించడం కూడా చాలా అవసరము. బాగా చేసారు. యజ్ఞంలో కూడా అటెన్షన్ ఇప్పించారు, ఇది కూడా మంచిగా చేసారు ఎందుకంటే మీరు కూడా యజ్ఞంవారే కదా. కేవలం సేవ కోసం బయటకు వెళ్ళారు. మీరు ఇచ్చే కొద్దిపాటి సూచన కూడా మంచిగా అనిపిస్తుంది, దీనిని మరో విధంగా చూడాల్సిన అవసరం లేదు, మంచిది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇంత సమయం ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా ఒకరి ఆలోచనలకు మరొకరు సమీపంగా రండి, వీరంతా ఒక్కటే అని అందరూ భావించాలి. వీరు 6మంది కాదు, ఒక్కరే అనుకునేలా పరస్పర ఆలోచనలు సమీపంగా రావాలి. జరుగుతుంది, చేస్తుండటాన్ని బాప్‌దాదా చూసారు, ఇక ముందు కూడా చేస్తూ ఉంటారు. (మనస్ఫూర్తిగా ధ్యాంక్స్) చాలా ధ్యాంక్స్. అచ్ఛా!
ఓంశాంతి